
గూడుకట్టుకున్న నిర్లక్ష్యం
సాక్షి, భీమవరం : పేదల సొంతింటి కలను సాకా రం చేసే పక్కా ఇళ్ల నిర్మాణం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడా ది కాలంలో 9,107 ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 3,434 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, ప్రభుత్వ సాయం చాలక ఇళ్ల నిర్మాణానికి పేదవర్గాల వారు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
లక్ష్యం ఆమడ దూరం
గత ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూ టమి ప్రభుత్వం ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పునాది, లింటల్ తదితర దశల్లోని 9,107 ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. రూ.1.80 లక్షలకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అ దనంగా రూ.50 వేలు సాయాన్ని ప్రకటించింది. కా గా సిమెంట్, ఐరెన్, ఇటుక తదితర నిర్మాణ సా మగ్రి ధరలు పెరిగిపోవడంతో రూ.5 లక్షలు ఉంటేనే గాని ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ప్రభుత్వ సాయం చాలడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో పేదల దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలని హౌసింగ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో చాలామంది లబ్ధిదారులు ముందుకురాక ఇప్పటివరకు కేవలం 3,434 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. నిర్ణీత లక్ష్యంలో అత్యధికంగా భీమవరంలో 60 శాతం పూర్తి కాగా తాడేపల్లిగూడెం అర్బన్, పోడూరు, పాలకోడేరు, పెంటపాడులో 30 శాతంలోపే పూర్తయ్యాయి.
నెలాఖరుకు పూర్తి చేయాలి
రెండు రోజుల క్రితం ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన 5,721 ఇళ్లను నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
గత ప్రభుత్వంలో ఉద్యమంలా..
సొంతిల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలోని 626 లేఅవుట్లలో 47,362 మందికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. సొంతంగా స్థలం ఉన్న పేదలకు 22,757 మందితో మొత్తం 70,119 మందికి ఇళ్లను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు సాయం అందించడంతో పాటు ఇంటి నిర్మాణంలో వారికి అండగా నిలిచింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35,000 రుణ సాయాన్ని అందించింది. సబ్సిడీపై ఐరెన్, సిమెంట్, ఉచితంగా ఇసుకను అందజేసింది. పేదలపై రవాణా చార్జీల భారం పడకుండా లే అవుట్ల సమీపంలోనే వీటి స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేసింది. పనుల వేగవంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసింది. అప్పట్లో దాదాపు 28 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి.
పడకేసిన ఇళ్ల నిర్మాణం
పెరిగిన వ్యయం.. చాలని సాయం
ముందుకు సాగని పనులు
మే నెలాఖరుకు 9,107 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం
ఏడాదిలో పూర్తయినవి కేవలం 3,434 గృహాలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భారీగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
జిల్లాలో 626 లేఅవుట్లలో 47,362 మందికి స్థలాల అందజేత
జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప్రగతి
మండలం లక్ష్యం నిర్మించినవి నిర్మించాల్సినవి
భీమవరం 274 165 109
కాళ్ల 177 105 72
పెనుగొండ 429 224 205
ఇరగవరం 254 127 127
మొగల్తూరు 282 134 148
ఆచంట 379 175 204
తాడేపల్లిగూడెం 628 287 341
తణుకు అర్బన్ 273 119 154
అత్తిలి 187 80 107
ఆకివీడు అర్బన్ 272 114 158
తణుకు 581 227 354
ఉండి 399 155 244
గణపవరం 300 112 188
నరసాపురం 412 149 263
యలమంచిలి 359 124 235
ఆకివీడు 314 108 206
వీరవాసరం 260 89 171
పాలకొల్లు అర్బన్ 94 31 63
పాలకొల్లు 200 64 136
నర్సాపురం అర్బన్ 172 55 117
పెనుమంట్ర 512 161 351
పాలకోడేరు 376 113 263
భీమవరం అర్బన్ 332 99 233
పెంటపాడు 443 117 326
పోడూరు 549 138 411
తాడేపల్లిగూడెం
అర్బన్ 649 162 487