నరసాపురం రూరల్: మొగల్తూరు మండల పరిధిలో దారితిప్ప 216 జాతీయ రహదారి మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వై నాగలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోనసీమ అంబేడ్కర్ జిల్లా అంతర్వేదిలో నివాసం ఉంటున్న రామాని దుర్గా ప్రసాద్ (32) తన అత్తవారి ఇంటికి కలవపూడి వద్ద మోడి గ్రామానికి వెళుతున్నాడు.
జాతీయ రహదారి మలుపు వద్ద చేపలలోడు వ్యాన్ దుర్గాప్రసాద్ బైక్‌ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్‌కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.