
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు గడువు పెంచాలి
ఏలూరు (టూటౌన్): ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొందడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు గడువు పొడిగించాలంటూ కలెక్టర్‌కు ఎస్సీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ని కలిసి రుణాలు పొందటానికి దరఖాస్తు గడువు పొడిగించాలని.. సర్వర్ పనిచేయని కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోలేక పోయారన్నారు. విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని.. తక్షణం స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందకు మరో పది రోజులు గడువు పొడిగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ నాయకులు నేతల రమేష్ బాబు, డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, దాసరి నాగేంద్ర కుమార్, నూకపెయ్యి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 2138 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం ప్రథమ సంవత్సరం తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ పరీక్షలకు 1708 మంది హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. 125 మంది ఒకేషనల్ విద్యార్థులకు 97 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షకు 306 మంది జనరల్ విద్యార్థులకు 273 మంది హాజరయ్యారు. 77 మంది ఒకేషనల్ విద్యార్థులకు 60 మంది హాజరయ్యారు.
వంటా వార్పుతో నిరసన
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల 28 నుంచి సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌ఓ)లు సమ్మెలో భాగంగా సోమవారం వంటా వార్పు కార్యక్రమంతో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికై న రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.
ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు చర్యలు
ఏలూరు (మెట్రో): నాటుసారా తయారీ, అమ్మకాలు సంపూర్ణంగా వదిలిన వారికి వారికి ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించే చర్యలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎకై ్సజ్, వివిధ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా గుర్తించిన అర్హులైన వారికి ప్రత్యమ్నాయంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు చర్చించి వారంలోగా తుది జాబితా తయారుచేసి నాటుసారా తయారీకి స్వస్తిపలికిన కుటుంబాలకు జీవనోపాధి మార్గం చూపించాలని ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారి ఎ.ఆవులయ్య, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
ధ్రువీకరణ పత్రాల కోసం ధర్నా
ఏలూరు (టూటౌన్): తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటూ మండవల్లికి చెందిన హిందూ మాస్టిన్ కుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆమె ఆర్డీవోకి ఆదేశాలు జారీ చేశారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు గడువు పెంచాలి