
నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు
పాలకోడేరు : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో రూ.10.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫ్లాటెడ్ కాంప్లెక్స్ (ఇండస్ట్రియల్ పార్క్) నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ చర్యలతో దూదేకుల ముస్లింలకు అన్యాయం
తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల దూదేకుల ముస్లిం మైనార్టీలు నష్టపోతున్నారని నూర్ భాషా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ హుస్సేన్ బీబీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల పైబడి జనాభా ఉన్నటువంటి నూర్ భాషా ముస్లిం మైనారిటీల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్‌లో బీసీ–బి దూదేకుల ఆప్షన్ లేని కారణంగా మైనార్టీ సబ్సిడీ రుణాలు, మైనార్టీ కోటాలో వచ్చే ఇతర ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నూర్ బాషా ముస్లింలపై కేవలం ఓట్లు కోసమే ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు.
కొల్లేరు సరస్సు పరిరక్షణపై సమీక్ష
ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేపట్టిన లిడార్ సర్వే ఆధారంగా అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు వేగవంతం చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో కొల్లేరు సరస్సు పరిసరాలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, డ్రెయిన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. కొల్లేరులో 67 మినీ డ్రెయిన్ చానల్స్ ఉన్నాయని, అందువల్ల ముంపు బారిన పడకుండా వాటి పూడికతీత పనుల ప్రతిపాదనలు తయారు చేసి అటవీశాఖ ద్వారా ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని కోరారు. సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ బి.విజయ, డ్రెయిన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు

నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు