
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి విజయరాజు
చింతలపూడి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం న డుస్తోందని వైఎస్సార్ సీపీ చింతలపూడి ని యోజకవర్గ సమన్వయ కర్త కంభం విజయరా జు అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత విడదల రజిని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయి లో దిగజారాయో అర్థమవుతుందని, మాజీ మంత్రి రజినీ విషయంలో చిలకలూరిపేట సీఐ సుబ్బారాయుడు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం అన్నారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభు త్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంద ని విమర్శించారు. మాజీ సీఎం జగన్ చుట్టూ ఉన్న నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి కక్ష రాజకీయాలకు తెరలేపారన్నా రు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. కూట మి ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచినా ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ప్రజాన్యాయస్థానంలో జవాబు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. చి లకలూరిపేట సీఐపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కూటమి పాలనలో మహిళల కు రక్షణ కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రజలన్నీ గమనిస్తున్నారని చంద్రబాబు రాక్షస పాలనకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని విజయరాజు హెచ్చరించారు.