
పీజీఆర్‌ఎస్‌లో అర్జీల వెల్లువ
ఏలూరు(మెట్రో): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి 248 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
45 ఫిర్యాదులు
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ 45 ఫిర్యా దులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ త గాదాలు, మోసపూరిత లావాదేవీలు, పోలీసు వి చారణకు సంబంధించిన సమస్యలు మొదలైన వా టిపై ప్రజలు అర్జీలు అందించారు. చొదిమెళ్ల నుంచి వచ్చిన ఓ వృద్ధుడు నడవలేని స్థితిలో ఉండగా ఆయన వద్దకు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కారానికి ఎస్పీ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.