కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ కార్యవర్గం ఎన్ని
తణుకు అర్బన్: కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం తణుకులో నిర్వహించారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు టి.రాము ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఏలూరు డివిజన్ అధ్యక్షుడిగా పి.రాజేష్‌బాబు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా వై.నాగేంద్రప్రసాద్, కోశాధికారిగా బీవీ బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్‌కుమార్, ఆఫీస్ సెక్రటరీగా వై.జయశ్రీ, ఉపాధ్యక్షులుగా జి.సతీష్‌కుమార్, సీహెచ్ నరేష్, సహాయ కార్యదర్శులుగా కేఎన్‌ఎస్ యాదవ్, ఎం.రాజేష్‌ను ఎన్నుకున్నారు.


