
కార్టూనిస్టుకు విశిష్ట బహుమతి
పెనుగొండ : కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్టూన్ల పోటీలో పెనుగొండకు చెందిన కార్టూనిస్టు వేండ్ర గోపాలకృష్ణ కార్టూన్‌కి విశిష్ట బహుమతి లభించింది. గోపాలకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు తలిశెట్టి రామారావు జయంతి పురస్కరించుకొని నిర్వహించిన పోటీలో ఈ బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. ఈ నెల 20న రవీంద్రభారతీలో పురస్కారాన్ని అందుకోనున్నట్లు తెలిపారు.
రైలు నుంచి జారి యువకుడి మృతి
భీమడోలు: ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. భీమడోలు రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం సహస్ర జిల్లా శౌర్య గ్రామానికి చెందిన రాహుల్‌కుమార్(23) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని పనిచేస్తున్నాడు. ఈ నెల 14న స్వగ్రామానికి వెళ్లే క్రమంలో బెంగళూరులో రైలెక్కాడు. జనరల్ బోగిలో ప్రయాణిస్తున్న సమయంలో శుక్రవారం రైలు భీమడోలు రైల్వే స్టేషన్‌కు వచ్చే సరికి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.