breaking news
Bapatla
-
మధ్యవర్తిత్వంపై ముగిసిన 40 గంటల శిక్షణ
గుంటూరు లీగల్: సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన ప్లాపస్ చైర్మన్న్లు, మెంబెర్స్కు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, ఒకటో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ 40 గంటల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్లాపస్ చైర్మన్ జి.రజిని మాట్లాడుతూ శిక్షకులు మీడియేషన్‌పై అవగాహన కల్పించారని, ఓర్పు, నైపుణ్యంతో అన్ని అనుమానాలను నివృత్తి చేశారని కృత/్ఞతలు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చైన్నె నుంచి శిక్షణ కోసం నియమించిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ రత్నతార, న్యాయవాది, సీనియర్ ట్రైనర్ సత్యారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్. సత్యవతి, గురజాల పదో అదనపు జిల్లా జడ్జి జి.ప్రియదర్శిని సత్కరించారు. -
రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కార దరఖాస్తుల స్వీకరణకు గడువు
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు దాఖలు చేసిన ప్రతిపాదనలను డివిజినల్ స్థాయిలో ఉప విద్యాశాఖాధికారి చైర్మన్‌గా నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాస్థాయి కమిటీకి ఈనెల 12వ తేదీలోపు విధిగా సమర్పించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఉపాధ్యాయుల తుది జాబితాను రాష్ట్రస్థాయి కమిటీకి ఈనెల 16లోపు సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈనెల 8వ తేదీ తరువాత సమర్పించే దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని స్పష్టం చేశారు. హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష గుంటూరు లీగల్: భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వై.నాగరాజా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు.. అగతవరప్పాడుకు చెందిన తోట ఏడుకొండలు కుమార్తె శారద(26)ను అదే గ్రామానికి చెందిన గవిరిబోయిన శివశంకర్‌తో 2009 మే 6న వివాహం జరిపించారు. శివశంకర్, ఆర్మీలో పనిచేస్తున్నాడు. శివశంకర్ సెలవులో ఇంటికి వచ్చిన సమయంలో, అతడి కుటుంబ సభ్యుల ప్రభావంతో భార్య శారదపై అనుచిత ఆరోపణలు చేయడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పెద్దల మధ్య రాజీ కుదిరినా, ఆ తరువాత శారద తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అప్పట్లో నెలకి శివశంకర్ రూ.3000 చెల్లించడానికి అంగీకరించగా, శారద రూ.6,000 అడిగిన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. 2015 జూలై 26 న శివశంకర్ తన భార్య శారదపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లేశ్వరి అనే మహిళ గాయపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారించిన రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి మొదటి నిందితుడు గవిరిబోయిన శివశంకర్‌ను యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధించారు. రెండో నిందితురాలు గవిరిబోయిన సుబ్బమ్మ మృతి చెందడంతో కేసు ముగించారు. రెండు లారీలు ఢీకొని డ్రైవర్లకు గాయాలు వినుకొండ: వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనగా ఇద్దరు లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు మొదట ఢీకొన్నాయి. వాటిని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు 108కి సమాచారం తెలపడంతో గాయపడిన ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రమాదానికి గురైన వాహనాలను సంఘటనా స్థలం నుంచి పక్కకు జరిపించారు. డ్రైవర్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దార్యప్తు చేస్తున్నారు. కేవలం రూపాయికే బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ నరసరావుపేట: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఫ్రీడం ప్లాన్, కేవలం రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబి డేటా, రోజుకు 100 మెసేజ్‌లు, ఉచిత సిమ్‌కార్డు ఇవ్వబడుతుందని గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పరపు శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఎం.యన్.పి. వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించవలసినదిగా కోరారు. -
స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి
జె.పంగులూరు: స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ చార్జీల నిలువు దోపిడీ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ చేశారు. ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పంగులూరు ప్రధాన కూడలిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీలు కరెంటు చార్టీలపై బాదుడే, బాదుడు కార్యక్రమం చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత సార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజలను బాదుతున్నారన్నారు. సంవత్సర కాలంలో కరెంట్ బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నా, కూటమి ప్రభుత్వం కరెంటు చార్టీలు పెంచలేదంటూ మోసగిస్తోందన్నారు. ఆదాయం పెరగక, కరెంటు బిల్లులు కట్టలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదనపు లోడు పేరుతో డెవలప్మెంట్ చార్టీలు, వినియోగదారుల డిపాజిట్ల సాకుతో వేల రూపాయలు దొడ్డిదారిని వసూలు చేస్తూనే ఉన్నారన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ పాటికే ప్రభుత్వ కార్యాలయాల్లో, దుకాణాలలో స్మార్ట్ మీటర్లు బిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాయిని వినోద్‌బాబు, తలపనేని రామారావు, ఆదుమ్ సాహేబ్, సుధాకర్, పి. ఏలియా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ -
బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తే తెగుళ్లు దూరం
నరసరావుపేట రూరల్: బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు వరి నారుమళ్లకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మంచి విత్తనం నాటితే మంచి దిగుబడి వస్తుందని ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేసి నాటడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు. రైతులకు బీజామృతంతో విత్తన శుద్ధి వలన కలిగే లాభాలను వివరించాలని తెలిపారు. వరి, కూరగాయలు, మిరపతోపాటు ఏ రకమైన విత్తనాలైనా సరే బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు స్వయంగా విత్తన శుద్ధి చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్, ఎన్ఎఫ్ఏ నందకుమార్, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల బాధలు పట్టవా ?
గుంటూరు వెస్ట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యనభ్యసిస్తున్న దళిత, బహుజన విద్యార్థులను కూటమి ప్రభుత్వం దారుణంగా అవమానిస్తుందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి క్షేత్ర స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్‌ను సందర్శించామన్నారు. మంచినీరు అపరిశుభ్రంగా ఉందన్నారు. మరుగుదొడ్లు దుర్వాసనగా ఉన్నా పిల్లలు అలానే నెట్టుకొస్తున్నారన్నారు. అన్నంలో బొద్దింకలు వస్తున్నాయని తెలిపారు. రుచిశుచీ లేని ఆహారాన్ని పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. మౌలిక వసతులపై స్పదించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ కోసం ఖర్చు చేయడం లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకంలో రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు రవీంద్ర నాయుడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అజయ్, సాజిద్, పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గోపి, జిల్లా నాయకులు భాను, కిరణ్‌లు పాల్గొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలతో డెంగీ నివారణ
సత్తెనపల్లి: ముందస్తు జాగ్రత్తలతో దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, చికున్ గున్యా, మలేరియా, బోద , మెదడువాపు వ్యాధులను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి అన్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ తో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ దోమల నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు దోమలు పుట్టకుండా అలాగే కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మురుగునీరు ప్రవహించేటట్లు చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు సూచించారు. క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను పరిశీలించి సూచనలు చేశారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ దోమలను నివారించాలంటే నీటి నిల్వలు లేకుండా చేయాలన్నారు. వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి ఆరబెట్టి మళ్లీ నీరు పట్టుకోవాలని, (ఫ్రైడే డ్రై డే పాటించాలని), పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ దోమ తెరలు వాడుకోవాలన్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ పి గౌతమి ఆధ్వర్యంలో బావులలో, నీటి కుంటల్లో దోమ లార్వాలను తినే గంబుషియా చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ సబ్ యూనిట్ ఆఫీసర్ షేక్ సుభాన్ బేగ్, ఆరోగ్య విస్తరణాధికారి పిట్టల శ్రీనివాస రావు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎండీ రెహమాన్, ఎమ్ఎల్హెచ్పీ వైశాలి, ఆరోగ్య కార్యకర్తలు పి.సౌరితేజ, జి నరసింహారావు, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి -
కృష్ణా నదిలో వరద తగ్గుముఖం
కొల్లూరు: కృష్ణా నదికి నీటి విడుదలను తగ్గిస్తుండటంతో వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద విడుదల తగ్గుతుండటంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలే నీటి పరిమాణం సైతం తగ్గుతూ వస్తుంది. గురువారం 2.61 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసిన అధికారులు క్రమక్రమంగా ఎగువ నుంచి వచ్చి చేరే నీరు ఆధారంగా సముద్రంలోకి నీటి విడుదలను తగ్గించుకుంటూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి కృష్ణా నదికి వరద నీటి విడుదల 1.90 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండుతున్న వరి నారుమడులునగరం: ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు సాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. వరుణుడుపై భారం వేసి పోసిన నారును రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తొలుత వర్షాల రాకతో నగరం, ఆరేపల్లి, సజ్జావారిపాలెం గ్రామాలలో వరి నారు మడులు పోశారు. తర్వాత వాతావరణంలో మార్పులతో మొలకలు వచ్చిన నారుమళ్లకు నీరు కరువైంది. గాలులు వీయడంతో వడ బడుతున్నాయి. రైతులు ఇంజిన్ల సాయంతో నారు మడులకు నీరు అందిస్తున్నారు. -
గుర్రపు డెక్క తొలగించకపోతే నిరాహార దీక్ష
వేమూరు: భట్టిప్రోలు నుంచి రేపల్లె డ్రైన్ వరకు గుర్రపు డెక్క పూర్తిగా తొలగించక పోతే నిరాహార దీక్ష చేస్తానని వైఎస్సార్సీపీ వేమూరు నియోజక వర్గం ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలం అద్దేపల్లి వెళ్లు మురుగు కాలువల్లో ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్క తొలగింపు పనులు శుక్ర వారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగు కాలువల్లో గుర్రపు డెక్క వల్ల మురుగు నీరు పారుదల కాక పోవడంతో అధిక వర్షాలు వల్ల గతేడాది 2500 ఎకరాలు దెబ్బతినడం జరిగిందన్నారు. కనగాల ప్రాంతంలో పెరవలి, పెరవలి పాలెం గ్రామాలకు చెందిన 1500 ఎకరాలు మునిగి పోవడం జరిగిందన్నారు. గత నెలల్లో కురిసిన వర్షాలు వల్ల వెద సాగు పద్ధతి పూర్తిగా మునిగి పోవడం జరిగిందన్నారు. గత నెల 19న మురుగు కాలువల్లో దిగి ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్క తొలగించాలని నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. గురువారం మురుగు కాలువల్లో గర్రపు డెక్క తొలగించాలని జల దీక్ష చేయడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు సక్రమంగా స్పందించక పోవడంతో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేయడంతో ఇరిగేషన్ డి ఈ వచ్చి మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తొలగించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించు కోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పడమటి శ్రీనివాసరరావు, నియోజ వర్గం రైతు విభాగం అధ్యక్షులు గోపాల రాము, సయ్యద్ సిరాజ్, పసుపులేటి శివరామ ప్రసాద్, జంగం వాసు, వేల్పూరి నాగేశ్వరరావు, వేల్పూరి చిన్నారి, సయ్యద్ నవీ, జల్లి జోషి కాంత్, కౌతవరపు పద్మావతి, కౌతవరపు శ్రీనివాసరరావు, యన్నం సురేష్, దాసరి కిరణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు -
హైర్ బస్సు డ్రైవర్ల నిరసన
చీరాల అర్బన్: ఆర్టీసీ డిపోలో ఆన్‌కాల్ రిక్రూట్మెంట్లో హైర్ బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం డిపోలోని హైర్ బస్సుల డ్రైవర్లు నిరసన తెలిపారు. హైర్ బస్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు నిలిపివేసి నిరసన చేపట్టారు. సీఐటీయూ కార్యదర్శి ఎం.వసంతరావు మాట్లాడుతూ చీరాల డిపోలో 40 హైర్ బస్సులు నడుస్తున్నాయని, వీటిని నమ్ముకొని 90 మంది డ్రైవర్లు గత 15 సంవత్సరాలుగా ఆన్‌కాల్ విధుల్లో కొనసాగుతున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన ఆన్‌కాల్ రిక్రూట్మెంట్లో హైర్ బస్సుల డ్రైవర్ల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త వ్యక్తులను ఎంపిక చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర డిపోల్లో హైర్ బస్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే చీరాలలో మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కరించకుంటే సమ్మె చేస్తామన్నారు. డ్రైవర్ల మెరుపు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ డెల్టాకు 6,830 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శుక్రవారం 6,830 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 290 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,725, తూర్పు కాలువ 688, పశ్చివ కాలువ266, నిజాంపట్నం కాలువ 490, కొమ్మూరు కాలువకు 2,640 క్యూసెక్కులు విడుదల చేశారు. 1,89,625 క్యూసెక్కులు సముద్రంలోకి పంపుతున్నారు. బస్సులు నిలిపివేసి నినాదాలు -
ఉపాధిలో అవినీతి మస్టర్లు
ఉపాధి హామీ పనుల్లో తవ్వేకొద్దీ అవినీతి బయటకు వస్తోంది. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమ సొమ్ములో వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పచ్చనేతలూ అందిన కాడికి మింగేస్తున్నారు. రూ.కోట్ల మేరకు ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: బల్లికురవ మండలం మల్లాయిపాలెంకు చెందిన సర్వలత ముండ్లమూరు మండలంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఉపాధి పనికి వెళుతున్నట్లు (జాబ్ కార్డు నంబరు 50136) మస్టర్ వేశారు. ఆమె ఖాతాకు డబ్బులు మళ్లించారు. ఇదే గ్రామానికి చెందిన మార్క్ రెండు సంవత్సరాలుగా చైన్నెలో ఉంటున్నా (జాబ్ కార్డు నంబరు 50192) ఉపాధి పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు. దివ్యాంగురాలు నాగిపోగు సైదమ్మ, (జాబ్‌కార్డు నంబర్ 040 653), అంగన్వాడీ టీచర్ సత్యవతి (జాబ్ కార్డు నంబర్ 040 566) వంటి సంబంధం లేని పేర్ల మీద మస్టర్లు వేస్తున్నారు. 80 సంవత్సరాల బండి జయమ్మ, (జాబ్‌కార్డ్ నంబర్ 040 431), దివ్యాంగుడు బండి నాగరాజు (జాబ్‌కార్డ్ నంబర్ 50118)లు సైతం ఉపాధి పనులకు వెళుతున్నట్లు చూపారు. వారి పేరున డబ్బులు డ్రా చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటున్న గాయత్రి (జాబ్‌కార్డు నంబర్ 50 131), సాఫ్ట్వేర్ ఉద్యోగి మణికంఠ (జాబ్‌కార్డు నంబర్ 50 148), లాయర్ ప్రసాద్ (జాబ్‌కార్డు నంబర్ 040 369).. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంది. సగానికిపైగా అవినీతే... ఒక్క మల్లాయిపాలెం మాత్రమే కాదు... జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఈ గ్రామంలోనే 70 మందికి పైగా ఫేక్ మస్టర్లు వేస్తున్నట్లు మాజీ సర్పంచ్ అబ్బారెడ్డి బాలకృష్ణ ఉన్నతాధికారులకు స్వయంగా ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం. ఇదే మండలంలోని కొప్పరప్పాడు, వైదన, ఎస్ఎల్ గుడిపాడు, కూకట్లపల్లి, కొమ్మినేనివారి పాలెం, మల్లాయిపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో రూ. 12 కోట్ల విలువచేసే 645 పనులు జరిగాయి. సగానికిపైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొప్పరప్పాడు గ్రామసభలో అక్రమాలు వెలుగు చూడగా, మూడు రోజుల క్రితం జిల్లా సంయుక్త కలెక్టర్ నాగిరెడ్డి కొమ్మినేనివారిపాలెం, వైదన, ఎస్ఎల్ గుడిపాడుల్లో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేసిన కాలువ, చెరువు, కుంటల పూడికతీత పనులను కొత్తగా రికార్డు చేసి బిల్లులు స్వాహా చేసినట్లు ఆయన విచారణలో బయటపడింది. ఆగ్రహించిన సంయుక్త కలెక్టర్.. మండలంలో జరిగిన మొత్తం పనులపై నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. ఒక్క బల్లికురవ మండలమే కాదు అద్దంకి నియోజకవర్గంతోపాటు వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ అక్రమాలు జరిగాయి. కృష్ణా సాగునీటి కాలువలు ఉన్న రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సమాచారం. అద్దంకి, రేపల్లె, వేమూరు, బాపట్లలో అక్రమాలు పర్చూరు, చీరాలల్లోనూ పథకంలో అదే తీరు పాత పనులకు రికార్డుల సృష్టి కుప్పలు తెప్పలుగా ఫేక్ మస్టర్లు ఇప్పటికే కృష్ణా, సాగర్ కాలువలకు నీళ్లు పనుల తనిఖీ లేదు.. అక్రమం బయటకు రాదు వాటాల కోసం డ్వామా పీడీ వెంపర్లాట కనీసం పట్టించుకోని ఉన్నతాధికారులు చేసిన పనులు చూపితేనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బిల్లులు అన్ని స్థాయిల వారికి వాటాలు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీఆర్‌ఏఈలు, ఏపీవో, డ్వామా జిల్లా అధికారి వరకూ అవినీతిలో వాటాలు తీసుకుంటున్నారు. స్థానిక పచ్చనేతకు కూడా వాటాలు వెళుతున్నాయి. ఫిర్యాదులు చేసినా డ్వామా జిల్లా అధికారి స్పందించడం లేదు. పైగా అక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు డ్వామా అధికార వర్గాల్లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన పని మేరకు కొలతలు చూసి డబ్బులు ఇస్తే వాస్తవంగా పనిచేసిన కూలీలకు గిట్టుబాటు అవుతుంది. కానీ ఫేక్మస్టర్లకు డబ్బులు ఇస్తుండడంతో నిజంగా పనిచేసిన పేదలు నామమాత్రపు కూలీతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.పచ్చ నేతలకు ఇవ్వాల్సిందే... వాస్తవానికి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కొత్త వారిని నియమించుకోవాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. జిల్లాలోని చాలా పంచాయతీల్లో వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్‌లు ఉండటంతో పచ్చ నేతలు ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు తీసుకొని దందా చేస్తున్నారు. ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి సీనియర్ మేట్ల పేరుతో కొత్తవారిని నియమించుకున్నారు. ఈ మేరకు ఫేక్ మస్టర్ల డబ్బుల్లో సగం స్థానిక పచ్చ నేతకు ఫీల్డ్ అసిస్టెంట్లు చెల్లిస్తున్నారు. అక్రమాలు వెలుగుచూసినా.. ఉన్నతాధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రూ. లక్ష వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. -
9 నుంచి శంకర్‌విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శంకర్‌విలాస్ బ్రిడ్జిపై ఈ నెల 9 నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి కూల్చివేత పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, అధికారులతో కలిసి నగరంలో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ● ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2 పిల్లర్స్ కాంక్రీట్ పూర్తి అయ్యాయని, 9 నుంచి కూల్చివేత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 135 స్ట్రక్చర్లు ఉండగా వాటిలో 74 మంది అంగీకారం తెలిపారని, వారికి నష్ట పరిహారం ఇచ్చి నిర్మాణాలు తొలగించామన్నారు. ● నందివెలుగు రోడ్‌లోని ఆర్ఓబీ పనులు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని, 8 నెలల్లో పూర్తి చేసేలా చూస్తామన్నారు. ● మణిహోటల్ సెంటర్లో కల్వర్ట్ నిర్మాణం చేయాల్సినందున ఆర్ అండ్ బీ అధికారులు రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ● ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు 7న టెండర్లు ఓపెన్ అవుతాయని, అనంతరం పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. ● శారదాకాలనీ రోడ్, బ్రాడీపేట, నెహ్రూనగర్ రోడ్ల విస్తరణకు, ఎల్సీ నం.3 గేటు దగ్గర ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆటో నగర్, అగతవరప్పాడులను కనెక్ట్ చేసేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ● పీవీకే నాయుడు మార్కెట్‌కు గతంలో చేసిన డిజైన్లు ఎవరికి నచ్చలేదు కనుక రివైజ్డ్ డిజైన్లను నిర్ణయించాలన్నారు. ● నల్లపాడు చెరువు, బొంగరాలబీడు కార్మిక శాఖ స్థలాలను నగరపాలక సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం జరిగిందన్నారు. త్వరలో పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక కార్యాచరణ చేపడతామన్నారు. ● అసంపూర్తిగా ఉన్న గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ కాంట్రాక్టర్‌ని తొలగించి, నూతన కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో మరమ్మతులకు గురైన రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ● శిథిలావస్థకు చేరిన బీఆర్ స్టేడియం రిజర్వాయర్ స్థానంలో రూ.2 కోట్లతో నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ● రెడ్డిపాలెం రోడ్ విస్తరణ గతంలో మాస్టర్ ప్లాన్‌కి భిన్నంగా జరిగినందున, సరిచేయాల్సి ఉందని, 3 వంతెనల వద్ద వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్నందున, శాశ్వత పరిష్కారం కోసం సుమారు 2 వందల ఆక్రమణలు తొలగించి, వారికి పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ● శారదా కాలనీ రోడ్ విస్తరణలో ప్రభావిత 22 మంది భవన యజమానులకు రూ.50.22 లక్షల నష్ట పరిహార చెక్కులను అందించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కూల్చివేత పనులు ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
ఆన్లైన్ గోల్మాల్!
●వేటపాలెం: స్మార్ట్‌ఫోన్ డబ్బు లాగేస్తోంది. ఎంతో విజ్ఞానాన్ని పంచే ఆన్లైన్ యువతను ఆత్మహత్యల వైపు నడిపిస్తోంది. చీరాల నియోజవర్గం పరిధిలో పేద , మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు. ఎక్కువ మంది యువత వ్యసనాల బారిన పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రధానంగా 15 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఆన్లైన్ జూదాలకు బానిసలు అవుతున్నారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు వారి పిల్లలకు అందుబాటులో ఉంచడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటగా మొబైల్లో సాధారణ ఆన్‌లైన గేమ్స్‌కు బానిసలవుతున్నారు. ఆ తరువాత క్రమేపీ ఆన్లైన్ జూదాలకు అలవాటు పడుతూ తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. చీరాల ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బ్లాక్మెయిల్ చేస్తూ.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. చేతిలో ఫోన్, నెట్ అందుబాటులో ఉండటంతో ఆన్లైన్లో ఆటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రూ.వందలతో మొదలై రూ.వేలు, రూ.లక్షలు చేతులు మారిపోతున్నాయి. ఫోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుంటే.. వారికి సంబంధించిన బంధువులు, మిత్రులకు సదరు కంపెనీల నిర్వాహకులు అసభ్యంగా ఉండే చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపుతున్నారు. పలువురు పరువు కాపాడుకునేందుకు ఆప్పు చేసి రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. మరికొందరు బలవన్మరణాలకు యత్నిస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలని.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు ఆన్లైన్ బెట్టింగ్‌లు, రమ్మీ, లోడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. మొదట సరదాగా మొదలు పెట్టి చివరకు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికి తోడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు చాలానే ఉన్నాయి. వీటితో సింగిల్ నెంబర్ గేమ్‌కు బానిసలవుతున్నారు. సైబర్ నేరగాళ్లు వీరి ఖాతాలను హ్యాక్ చేసి భారీగా డబ్బంతా లాగేస్తున్నారు. బాధితులు ఎందరో.. తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి పిల్లలు, యువకులపై వారి తల్లిదండ్రులు నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. వారికి అనవసరంగా డబ్బు, సెల్ ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. ఆన్లైన్లో వివిధ రకాల మోసపూరిత గేమ్స్ ఉంటాయి. వాటికి అలవాటు పడి బెట్టింగ్‌లపై దృష్టి సారిస్తున్నారు. సరదాగా జూదం అంటూ ఆ తర్వాత వ్యసనంగా మార్చుకుంటున్నారు. అలాంటి వారిని మాకు అప్పగిస్తే కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకొస్తాం. సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆన్లైన్ జాదగాళ్ల ఆట కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నాం. – జనార్దన్, ఎస్సై, వేటపాలెం ఇంటర్నెట్లో గేమ్‌లకు బానిసలవుతున్న యువత చీరాల నియోజకవర్గంలో జోరుగా బెట్టింగ్‌లు రూ.లక్షలు పోగొట్టుకుంటున్న యువత డబ్బు ఎర వేస్తున్న ప్రైవేట్ రుణ యాప్‌లు నగదు తిరిగి చెల్లించకుంటే బాధితులకు టార్చర్ అప్పులపాలై ఆస్తులు విక్రయించాల్సిన దుస్థితి ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తూ.. ఆన్లైన్ జూదానికి ఆలవాటు పడి దాదాపు రూ.5 లక్షలు పోగొట్టుకున్నారు. వేటపాలేనికి చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తె ఇంజినీరింగ్ చదువుతూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 50 వేలు పోగొట్టుకుంది. వేటపాలెం గడియార స్తంభం సెంటర్లో బడ్డీ కొట్టు నడుపుకొనే వ్యక్తి సింగిల్ నెంబర్ జూదం వ్యసనంగా మారడంతో అప్పుల పాలయ్యాడు. మోసపోయిన వారిలో పోలీసులకు ఫిర్యాదు చేసేవారు తక్కువగా ఉంటున్నారు. విషయం చెప్పుకొంటే పరువు పోతుందని.. లోలోన బాధ అనుభవించేవారే ఎక్కువగా ఉంటున్నారు. -
ఐటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా సుబ్బరామయ్య
పర్చూరు(చినగంజాం): పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ రాయని సుబ్బ రామయ్య వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఐటీ విభాగంలో స్థానం పొందారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం విడుదలైన ఐటీ రాష్ట్ర కమిటీలో ఆయనకు రాష్ట్ర ఐటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా స్థానం దక్కింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలుతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు సుదర్శన స్వామికి అభిషేకం, దృష్టి దోష నివారణ, దుష్ట గ్రహ దోష నివారణ, ఆయురారోగ్యాభివృద్ధికి సర్వరక్షాకర హోమం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో సుదర్శన పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.ఎయిమ్స్‌లో ఆన్లైన్ సేవలకు అంతరాయం45 నిమిషాల తర్వాత పునరుద్ధరణతాడేపల్లి రూరల్: మంగళగిరి ఎయిమ్స్‌లో గురువారం ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఓపీ దగ్గర భారీగా రోగులు నిలబడి ఆందోళన చేశారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది మాన్యువల్‌గా సేవలను అందించారు. 45 నిమిషాల అనంతరం ఆన్లైన్ సేవలను పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతిరోజు వేల మంది వస్తున్నారు. నెలకు రెండు, మూడు సార్లు ఇదే పరిస్థితి ఏర్పడుతోందని అక్కడి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్ సేవలు నిలిచిపోయిన వెంటనే మాన్యువల్ సేవలు అందజేశామని తెలిపారు. ఎక్కువ మంది రావడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ సేవలను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.జిల్లా అథ్లెటిక్ క్రీడాకారుల జట్ల ఎంపికగుంటూరు వెస్ట్ (క్రీడలు): చీరాలలో ఈ నెల 9, 10 వ తేదీల్లో జరగనున్న అండర్–18, 20 యువతీ యువకుల అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేసినట్లు అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డుతో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు సభ్యులు 9వ తేదీ ఉదయం 6 గంటలకు చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలోని క్రీడా మైదానంలో రిపోర్ట్ చేయాలన్నారు. -
కృష్ణమ్మకు పోటెత్తిన వరద
కొల్లూరు : కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు సముద్రంలోకి నీటిని విడుదల చేయడంతో మండలంలోని కృష్ణా నది జలకళను సంతరించుకొంది. బుధవారం 87 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా... పైనుంచి వరద నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో గురువారం మధ్యాహ్నానికి క్రమంగా నీటి విడుదల స్థాయిని పెంచుతూ 2.61 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో నీటిని సముద్రంలోకి వదిలారు. నదిలో నీటి ఉద్ధృతి పెరగడంతో మండలంలోని పెసర్లంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి ద్వారా వరద నీరు లోతట్టు ప్రాంతాలలోకి పరవళ్లు తొక్కుతూ చొచ్చుకొని పోతోంది. నీటి ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా నక్కపాయ ప్రాంతంలో కొల్లూరు కరకట్ట దిగువున ఉన్న లోతట్టు పంట పొలాలతోపాటు ఇటుక బట్టీలలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. అయితే ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వస్తున్న వరద నీరు క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఆర్సీ అధికారులు శుక్రవారం సాయంత్రానికి నీటి విడుదల పరిమాణాన్ని తగ్గించి 2.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వరదల కారణంగా ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో నదీ తీర ప్రాంత ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరదల తీవ్రత అధికమైతే పంటలను కోల్పోతామన్న ఆందోళనకు గురైన రైతాంగంలో నీటి విడుదల తగ్గుతుండటంతో ఆనందం వ్యక్తం అవుతోంది. లోతట్టు ప్రాంతాలలోకి చేరుతున్న నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.61 లక్షల క్యూసెక్కులు విడుదల క్రమంగా తగ్గుతున్న వరద నీటి విడుదల -
చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
చీరాలలో కార్మికుల ర్యాలీ చీరాల: అధికారికంగా జులై 31ను చేనేత దినోత్సవంగా ప్రకటించాలని జాతీయ చేనేత నాయకులు, చేనేత ఉద్యమకారులు మాచర్ల మోహనరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని జాండ్రపేటలోని శ్రీచౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపంలో గురువారం చేనేత సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తీవ్ర మార్కెట్ సంక్షోభం ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జీఎస్టీని వచ్చే సెప్టెంబర్ నుంచి 12 శాతానికి పెంచుతున్నట్లు కౌన్సిల్ ప్రకటించడం దారుణం అన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించడంతోపాటు చేనేత కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేత పరిశ్రమపై ఉన్న జీఎస్టీ రద్దు చేయకపోవడం వలన మూలాధారమైన నూలు ధరలు అసాధారణంగా పెరగడంతో చేనేత ఉత్పత్తి మందగించి కార్మికుల పనిదినాలు తగ్గిపోవడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. అనంతరం దేశాయిపేట నుంచి జాండ్రపేట వరకు రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని, చేనేత వృత్తి భద్రత కల్పించాలని, చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని కార్మికులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, సీపీఐ నాయకులు బత్తుల శామ్యూల్, బిసి ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ చుండూరు వాసు, చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి నాయకులు శీలం రవికుమార్, దేవన హేమసుందరరావు, గుంటూరు మల్లికార్జున్, సజ్జా శ్రీనివాసరావు, వావిలాల దాశరఽథి, మునగాల వెంకటేశ్వర్లు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ సమితి నాయకులు మేడిబోయిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేత ‘వరికూటి’ జలదీక్ష
వేమూరు: మురుగు కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి పారుదల కావడం లేదని, వర్షాలు కురిస్తే 3,000 ఎకరాలు మునిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. గుర్రపు డెక్క తొలగించాలని కోరుతూ భట్టిప్రోలులోని మురుగు కాలువల్లో గురువారం ఆయన జలదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోయిందన్నారు. గత నెలల్లో కురిసిన వర్షాలకు నీటి పారుదల లేక రైతులు వెద సాగు పద్ధతిలో చేసిన పంట మునిగిపోయిందని తెలిపారు. వేమూరు మండలం పోతుమర్రులోని రేపల్లె డ్రెయిన్‌లో గుర్రపు డెక్కలోకి దిగి నాలుగు గేదెలు మునిగి పోయి మృతి చెందాయని తెలిపారు. జూలై 19న మురుగు కాలువల్లో దిగి గుర్రపు డెక్క తొలగించాలని నిరసన వ్యక్తం చేశామని గుర్తు చేశారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో మరోసారి జల దీక్ష చేపట్టినట్లు తెలిపారు. మట్టిని బొక్కుతున్న కూటమి నాయకులు కూటమి నాయకులు నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఇసుకను హైదరాబాద్ వరకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుర్రపు డెక్క తొలగించే వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జలదీక్ష చేస్తున్న ప్రాంతానికి డ్రెయినేజీ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ కల్యాణబాబు వచ్చి అశోక్‌బాబుతో మాట్లాడారు. గుర్రపు డెక్క తొలగించేందుకు, మురుగు కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి రూ.20 లక్షలకు అంచనాలు పంపామని తెలిపారు. గుర్రపు డెక్క మందు కూడా పిచికారీ చేసినట్లు చెప్పారు. పది గంటల్లోపు తొలగిస్తామని ఆయన అశోక్‌బాబుకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తే రైతులు చందాలు వేసుకొని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భట్టిప్రోలు నుంచి రేపల్లె డ్రెయిన్ వరకు గుర్రపు డెక్క తొలగిస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పటమటి శ్రీనివాసరరావు, దాది సుబ్బారావు, గొట్టిపాటి శ్రీనివాసరావు, అనపురెడ్డి రఘురామిరెడ్డి, రైతు విభాగం నాయకులు గాదె శివరామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఈద శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, నియోజకవర్గం అధ్యక్షులు గోపాలం రాము, భట్టిప్రోలు ఎంపీపీ లలితకుమారి, దాట్ల మోహన్‌రెడ్డి, పెరికల పద్మారావు, షేక్ హుస్సేన్, బొల్లెదు ప్రతాప్, జల్లి జోషి కాంత్, పెద్దబుజ్జి, సిరాజ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్ -
శాసనాల ఖిల్లా.. మన జిల్లా
అద్దంకి: నూతనంగా ఏర్పడిన బాపట్లజిల్లా శాసనాలకు ఖిల్లాగా నిలుస్తోంది. క్రీస్తు పూర్వం నుంచి, వివిధ రాజవంశాల వారు బాపట్ల ప్రాంతాన్ని ఏలినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఆయా కాలాల్లో వేసిన రాతి శాసనాలు బయట పడటం వలన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా శాసనాలను బట్టి ఈ ప్రాంతాన్ని చోళులు, పల్లవులు, గజపతులు, కాకతీయులు, చాళుక్యులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఏలినట్లు తెలుస్తోంది. ఆ నిలువెత్తు సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. బౌద్ధ, జైన మతాలకు సైతం ఈ ప్రాంతంలో పరిఢవిల్లినట్లు ధర్మవరం, భట్టిప్రోలు ప్రాంతాల్లోని ఆనవాళ్లు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం నుంచే.. బాపట్ల ప్రాతంలోని పట్టణాలు, గ్రామాలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచే ఉన్నట్లుగా చిన్నగంజాం, పెద్దగంజాం, భట్టిప్రోలులోని బౌద్ధ స్థూపం చెబుతోంది. ధర్మవరం, అద్దంకి, ధేనువకొండ, మణికేశ్వరం, పేరాయిపాలెం ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం 9 నుంచి 5వ శతాబ్దం నాటి రాతి సమాధులు (రాక్షసగూళ్లు) లభించాయి. అద్దంకి మండలంలోని నాగులపాడు గ్రామంలోని చెరువులో 7వ శతాబ్దంలో అయ్యమాపయ్య వేయించిన దాన శాసనం, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లిలో 12వ శతాబ్దం నాటి చోళుల శాసనం, పర్చూరు మండలంలోని ఉప్పుటూరు, నూతలపాడు, చెరుకూరులోని త్రివిక్రమ దేవాలయంలోని దాన శాసనం, బాపట్లలోని భావన్నారాయణ స్వామి ఆలయంలోని చోళుల శాసనాల ద్వారా లభించింది. అద్దంకిలో తొలి తెలుగు పద్యశాసనం అద్దంకిలో పండరంగడు క్రీస్తుశకం 848లో తన గురువుకు 8 పుట్ల అట్ల పట్టు నేల దానం చేసిన సమయంలో వేయించిన తొలి తెలుగు పద్య శాసనం ఉంది. కొణిదెనలో 11, 12, 13వ శతాబ్దం నాటి మూడు శాసనాలు, కుమార సంభవం కర్త చోళ మహారాజు నన్నే చోళుడు వేయించిన 11వ శతాబ్దం నాటి శాసనం శివాలయంలో లభించింది. దేశంలోనే తొలిసారిగా చిన్నగంజాం మోటుపల్లి రేవు నుంచి సమగ్ర వర్తక వ్యాపారం కోసం వేయించిన అభయ శాసనం, ఓడల ద్వారా సుగంధద్రవ్యాలు, గుర్రాలు, వజ్రాల ఎగుమతి, దిగుమతులు చేసే వ్యాపారంపై 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని శాసనంలో రకరకాలైన వస్తువులపై రాయితీ కల్పిస్తూ వేసిన శాసనం, 14వ శాతాబ్దంలో వేయించిన అనపోతారెడ్డి వేయించిన శాసనం ఇలాంటివే. ఇవి తెలుగు, తమిళభాషల్లో ఉన్నాయి. ఈ రేవు నుంచి సన్నని నూలు వస్త్రాలు, రవెల్లాలు(నేత) దిగుమతి చేసుకునే వారు. అద్దంకి, రావూరులో గజపతుల 16వ శతాబ్దం నాటివి, మోటుపల్లి, పమిడిపాడులో విజయనగర రాజులు, తక్కెళ్లపాడు, పోతవరంలో పంట మల్లారెడ్డి, కుందుర్రులో కృష్ణదేవరాయలు, చుండూరులో అచ్యుత రాయలు, బొల్లాపల్లి, మణికేశ్వరంలో సదాశివరాయుడు, ధర్మవరంలో గొల్కొండ నవాబు వేయించిన శాసనాల ద్వారా ఆయా కాలాల్లో రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని ఏలినట్లు ధ్రువపడుతోంది. ఎన్నో రాజవంశాలు పాలించిన పురాతన ప్రాంతంగా ప్రసిద్ధి నిదర్శనంగా నిలుస్తున్న పలు ఆనవాళ్లు బౌద్ధ, జైన మతాలకు ఆలవాలం మ్యూజియం ఏర్పాటు చేయాలి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బయటపడిన శాసనాల ప్రతులను, వివిధ రకాల వస్తువులను భావితరాలకు తెలిసేలా ఏర్పాట్లు అవసరం. సందర్శకుల కోసమైనా పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పుడు మన పూర్వ చరిత్ర పదిలంగా ఉంటుంది. – జ్యోతి చంద్రమౌళి, శాసనాల పరిశోధకుడు -
పప్పు లేదు.. బియ్యంతోనే సరి !
● ఆగస్టులో కూడా అందని కందిపప్పు ● లబోదిబోమంటున్న కార్డుదారులు ● పండుగల నెలలో కూడా కనికరం లేని కూటమి సర్కార్ చీరాల టౌన్: ఆగస్టులో పండుగలు ఎక్కువగా ఉన్నాయి. వినాయకచవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మీ వ్రతం తదితర ముఖ్యమైన పండుగలు ఉన్నా పేదలపై కూటమి సర్కార్‌కు కనికరం కూడా లేదు. పండుగ రోజు పప్పు వండుకునేందుకు కూడా అవకాశం లేదు. కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పును కూడా అందించలేకపోతోంది. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి బియ్యం, పంచదారతో పంపిణీతోనే మమ అనిపిస్తోంది. తూతూమంత్రంగా రేషన్ పంపిణీ కూటమి ప్రభుత్వం అనేక హామీలతో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం కందిపప్పును కూడా అందించలేక పోతోంది. ఆగస్టులో కూడా కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెట్టనుంది. జిల్లాలో 4,88,000 రేషన్ కార్డులు బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 4,88,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లు నుంచి జిల్లాలోని 1,123 రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తారు. జిల్లావ్యాప్తంగా 7000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమ పిండి కూడా అందించాలి. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యంతోనే సరిపెట్టింది. పండుగలు అధికంగా ఉన్న ఆగస్టులో కూడా కూటమి ప్రభుత్వం బియ్యం, పంచదారతోనే సరిపెట్టనుంది. వైఎస్సార్ సీపీ పాలనలో ఇంటి దగ్గరకే సరుకులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారుల ఇంటి దగ్గరకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేశారు. ఇంటి ముందుకే రేషన్ సరుకులు రావడంతోనే వృద్ధులు, దివ్యాంగులు ఆనందించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకులు అన్నీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత కందిపప్పు, గోధుమ పిండికి కోత విధించింది. కంటి తుడుపు చర్యగా జిల్లాలోని కార్డుదారులకు అరకిలో చొప్పున 2300 టన్నుల పంచదారతోనే సరిపెడుతోంది. ప్రభుత్వం విడుదల చేయలేదు ప్రభుత్వం ప్రస్తుతానికి బియ్యం, పంచదారనే అందిస్తోంది. కందిపప్పు ఇవ్వడం లేదు. ఈ నెలకు సరిపడా ఎంఎస్ఎల్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదారను రేషన్ దుకాణాలకు పంపించాం. కందిపప్పు వస్తే కార్డుదారులకు అందిస్తాం. –బాషా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, బాపట్ల -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
అవనిగడ్డ: పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆలయంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఆరో వార్డుకు చెందిన చింతలపూడి నాగవర్ధన్, బాపట్ల జిల్లా రేపల్లె ఏడో వార్డుకు చెందిన తోట సాయి మౌనిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మౌనిక తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో గురువారం మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమజంట స్థానిక ఎస్ఐ శ్రీనివాస్‌ని ఆశ్రయించడంతో ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కోసం సమాచారం ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు రాకపోవడంతో నాగవర్ధన్ తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి వేమూరు: జంపని గ్రామానికి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన గుంటూరు ధనబాబు(25) కరెంట్ పని చేస్తాడు. బుధవారం సాయంత్రం చిలకా సుబ్బారావు ఇంటిలో పని చేస్తుండగా షాక్ కొట్టింది. దీంతో తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యసేవలు అందిస్తుండగా ధనబాబుమృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 6 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో మిల్లీమీటరు వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు పశ్చిమలో 3.2 మి.మీ., తాడికొండ 3.2, దుగ్గిరాల 2.8, గుంటూరు తూర్పు 2.4, తుళ్లూరు మండలంలో 2.2 మి.మీ చొప్పున వర్షం పడింది. నేడు భ్రమరాంబకు పసుపు కొమ్ములతో అలంకరణ పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు పసుప కొమ్ములు ప్రత్యేక అలంకారంలో శుక్రవారం భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రావణమాసంలో రానున్న శుక్రవారాల్లో భ్రమరాంబ అమ్మవారిని చీరలు, గాజుల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. -
సాగర్ సొగసు చూడతరమా..!
విజయపురిసౌత్: నాగార్జున సాగర్‌కు కొత్తనీరు వచ్చి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గత మూడు రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. అంతేకాకుండా నిండుకుండలా కనపడుతున్న సాగర్‌లో జలాశయం మీదుగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లటం పర్యాటకులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దీంతో నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ నేపఽథ్యంలో సాగర్ చుట్టుపక్కల సందర్శినీయ స్థలాలపై ప్రత్యేక కథనం.. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఇది సాగర్ ప్రధాన డ్యాం దిగువ ప్రాంతంలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని సాగర్ జెన్కో ఎస్ఈ అనుమతి తీసుకొని సందర్శించాల్సి ఉంటుంది. భక్తుల కోర్కెలు తీర్చే సాగర్మాత నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్ నుంచి 14 కి.మీ.దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, పిల్లలకు రూ 150, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, మ్యూజియం సందర్శనకు 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. విజ్ఞాన విహార యాత్రకు గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీ టిక్కెట్‌పై 15 శాతం రాయితీ పర్యాటకశాఖ ఇస్తుంది. అలాగే పార్టీలకు, పంక్షన్లకు శాంతిసిరి గంటకు రూ.10,000లు, అగస్త్య లాంచీ గంటకు రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్‌ను సంప్రదించవచ్చు. గత ఆనవాళ్లకు చిరునామా అనుపు నాగార్జునసాగర్ 7కి.మీ. దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ ఆనాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఇక్ష్వాకుల కాలం నాటి యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణానది లోయలో లభించిన రంగనాథస్వామి దేవాలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణానది తీరంలో నిర్మించటం విశేషం. నిండుకుండలా సాగర్ జలాశయం చరిత్రకు సాక్ష్యం నాగార్జున కొండ మనసుదోచే ఎత్తిపోతల చరిత్రకు ప్రతిరూపం నాగార్జునకొండ చూపరుల మనస్సుదోచే ఎత్తిపోతల ఇది సాగర్ నుంచి మాచర్లకు వవెళ్ళే రహదారిలో 14కిలో మీటర్ల దూరంలో ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. 7 0అడుగుల పై నుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. జలపాతం చూసేందుకు పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20 టికెట్ ధరను టూరిజంశాఖ వసూలు చేస్తుంది. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్ధం రాత్రి బస చేసేందకు 8 రూములు ఉన్నాయి. 5 ఏసీరూమ్లు, 3 నాన్ఏసీ రూములు ఉన్నాయి. ఏసీ రూమ్ ధర రూ.1,600, నాన్ఏసీ రూ.వెయ్యి. ఇతర వివరాలకు ఎత్తిపోతల మేనేజర్ దత్తకుమార్ ఫోన్‌నెంబర్ 94414 53115 నెంంబరులో సంప్రదించవచ్చు. విజయపురిసౌత్‌లోని కృష్ణానది తీరంలో వేంచేసియున్న సాగర్మాత దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే చల్లనితల్లిగా సాగర్‌మాతకు విశిష్టమైన పేరు ఉంది. ఇక్కడ నెలకొల్సిన జపమాల క్షేత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకతను నెలకొంది. -
యంత్రాంగానికి అప్రమత్తత ముఖ్యం
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● రెవెన్యూ అధికారులతో సమావేశం బాపట్ల: వరదలు వస్తే తక్షణమే నివారణ, సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. విపత్తు నిర్వహణ, నిర్మూలన, ముందస్తు ప్రణాళిక అంశాలపై ఆర్డీవోలతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణపై సూక్ష్మ స్థాయిలో సమగ్ర ప్రణాళిక ఉండాలని కలెక్టర్ చెప్పారు. కృష్ణానది వరద అకస్మాత్తుగా వస్తే ముంపు, ప్రభావిత ప్రాంతాల వివరాలు, జనాభా వంటివి సేకరించాలన్నారు. తీర ప్రాంతంలో ఉన్న బాపట్ల జిల్లాకు తుపాను హెచ్చరికలు వస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలన్నారు. దెబ్బతినే గృహాలు, ప్రాంతాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే గృహాల వివరాలు ముందస్తుగా గుర్తించాలన్నారు. వరద, తుపాను, భారీ వర్షాలకు నష్టాలు, ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై వేరువేరుగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. లంక గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు కృష్ణానది ఎగువ ప్రాంతాలలో వర్షాలు అధికంగా కురవడం, డ్యాములలోకి వరద నీరు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నందున్న లంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. 14 నివాస ప్రాంతాలు మునిగే అవకాశం ఉందన్నారు. కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలలో ఇసుక బస్తాలతో బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆ ప్రాంతాలలో గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులను గుర్తించి వివరాలు పంపాలన్నారు. మర బోట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాలు ముందుస్తుగా గుర్తించాలన్నారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, పది రోజులు భోజన సదుపాయాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఉద్యోగి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నివాస ప్రాంతానికి ఒక మండల అధికారిని నియమించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, సీపీఓ షాలెంరాజు, సంబంధిత విభాగం పర్యవేక్షకుడు షేక్ షఫీ, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి వినూత్న శిక్ష
మూడు రోజులు కోర్టు పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి చీరాల రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 10 మందికి బాపట్ల జిల్లా చీరాల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జె.కాత్యాయని వినూత్నమైన శిక్ష విధించారు. మూడు రోజులపాటు కోర్టు పరిసరాలను పరిశుభ్రం చేయాలని గురువారం ఆదేశించారు. చీరాల వన్‌టౌన్ సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు... చీరాల పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి కాత్యాయని నిందితులు ఒక్కొక్కరు రూ.10,000 జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష అనుభవించాలని తీర్పుచెప్పారు. అయితే, ఈ కేసులోని నిందితులందరూ కూలి పనులు చేసుకునేవారిమని, తమ వద్ద డబ్బులు కట్టేంత ఆర్థిక స్థోమత లేదని న్యాయమూర్తిని వేడుకోవడంతో స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి నిందితులందరూ మూడు రోజుల పాటు కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. వారిలో పరివర్తన రావాలనే ఉద్దేశంతోనే కోర్టు పరిసరాలను శుభ్రం చేయిస్తున్నామని, కోర్టుకు వచ్చే కక్షిదారులు కూడా వారిని చూసి మార్పు చెందుతారని న్యాయమూర్తి అన్నారు. అయితే, ఇటువంటి కేసులలో పట్టుబడి మళ్లీ కోర్టుకు వస్తే ఈసారి కచ్చితంగా జైలుకు పంపిస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలపాలై జీవితాలను పాడుచేసుకోవద్దని న్యాయమూర్తి హితవు పలికారు. -
రక్తదానం ప్రాణ దానంతో సమానం
లక్ష్మీపురం: ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే అని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ట సేన్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయ సిబ్బందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా చిన్నతనం నుంచి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని చెప్పారు. యువతీ, యువకులంతా క్లిష్టమైన వైద్య, అత్యవరసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న గొప్ప లక్ష్యంలో చేరాలని కోరారు. గుంటూరు రైల్వే డివిజన్ అభివృద్ధితో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యాక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం డివిజన్ పరిధిలో 74 మంది సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్‌కుమార్, సీనియర్ డివిజనల్ పర్సన్ ఆఫీసర్ షహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యా బి. రాజ్, సీనియర్ డివిజనల్ మెటీరియల్స్ మేనేజర్ కార్తికేయ గాడఖ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్‌బాబు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయ కార్తి, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శైలేష్‌కుమార్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి డాక్టర్ మేడూరి భాస్కరరావు, జిల్లా సమన్వయకర్త రసూల్ పాల్గొన్నారు. రక్తదానం చేసిన డీఆర్ఎం సుధేష్ట సేన్ -
సైబర్ నేరాల కట్టడికి బ్యాంకర్లు సహకరించాలి
చీరాల అర్బన్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికను సైబర్ నేరగాళ్లు నిరంతరం ఉపయోగించుకుంటూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని డీఎస్పీ ఎండీ మొయిన్ ఆందోళన వ్య్తం చేశారు. నేరాల నియంత్రణకు బ్యాంకు మేనేజర్లు వారి బ్యాంకుల్లో భద్రతా నియమాలను సక్రమంగా పాటిస్తే చోరీలను కొంత వరకు అరికట్టవచ్చన్నారు. బుధవారం స్థానిక బాపనమ్మ కల్యాణ మండపంలో డీఎస్పీ అధ్యక్షతన సైబర్ నేరాల, దొంగతనాల నియంత్రణపై బ్యాంకు మేనేజర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నకిలీ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం పొందుతున్నారన్నారు. వ్యక్తిగత వివరాలు వారి చేతిలోకి వెళ్లగానే ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే వాటిని విశ్వసించ వద్దన్నారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి వారితో మాట్లాడాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలను, ఏటీఎం పిన్ నంబర్లు, సీవీవీ నెంబర్లు ఇతరులకు చెప్పవద్దని సూచించారు. వీటిని అరికట్టేందుకు బ్యాంకులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా, వీడియో రికార్డింగ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయా, అలారం, ఎమర్జెన్సీ బటన్లు స్థిరంగా పనిచేస్తున్నాయనే అంశాలపై ప్రశ్నించారు. బ్యాంకుల్లో 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాలు తప్పకుండా ఉండాలన్నారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్లు, సీఐలు నాగభూషణం, శేషగిరిరావు, ఎస్సైలు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, జనార్దన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో రైల్వే డివిజన్ అభివృద్ధికి కృషి
లక్ష్మీపురం: ఆర్టిఫీషియల్ ఇంటల్జెన్స్ (ఏఐ)తో రైల్వే డివిజన్‌ను మరింత ఆధునాత పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ట సేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఏఐపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. సిబ్బంది అంతా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా పని చేయాలని తెలిపారు. నూతన హంగులు, అధునాతన పద్ధతులు, కొత్త దనంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయా విభాగాధిపతులు సమర్థమైన పనితీరుతో డివిజన్ మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం రమేష్‌కుమార్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.డీఆర్ఎం సుథేష్ట సేన్ -
3న బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జూనియర్ , సబ్ జూనియర్, సీనియర్ పురుషులు, మహిళల జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు ఈ.శివశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్లో పోటీలు జరుగుతాయన్నారు. పోటీలకు వచ్చే వారు ఆధార్ కార్డుతో పాటు వయస్సు ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలన్నారు. వివరాలకు 93477 85888 నెంబర్లో సంప్రదించాలన్నారు. జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు నరసరావుపేట టౌన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులను నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఈనెల 23న పట్టణంలోని కోర్టు భవనాల ఎదుట శ్రీనిధి గ్రాండ్ హోటల్ వద్ద బెంగళూరుకు చెందిన తండ్రి కొడుకులు కె.వీరస్వామిరెడ్డి, కె.వి.ప్రశాంతరెడ్డిలను కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద అనిల్ రెడ్డి, బాదం మాధవరావు, గడ్డం రఘురాంరెడ్డి తదితరులు హతమార్చినట్లు కేసు నమోదయింది. కిడ్నాప్ జరిగిన ప్రదేశం నరసరావుపేట, హత్య జరిగిన ప్రదేశం బాపట్ల జిల్లా పాతమాగులూరు కావడంతో, దర్యాప్తు ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు రెండు కేసులను నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఐలు ఎం.వి.చరణ్, హైమారావు, బి.సుబ్బానాయుడు, పి.రామకృష్ణల నేతృత్వంలో ఎస్ఐలు హరిబాబు, వంశీకృష్ణలు ప్రత్యేక బృందాలుగా ముంబయి వెళ్లి మూడు రోజుల వ్యవధిలోనే ప్రధాన నిందితులైన బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన బాదం మాధవరెడ్డి, గడ్డం రఘురాంరెడ్డి, గడ్డం నాగిరెడ్డి, గడ్డం గోపిరెడ్డి, గడ్డం ఇంద్రసేనారెడ్డిలను ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టణానికి తెచ్చి బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. గతంలో అనిల్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన అవసరం నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంటర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జె.పద్మ తెలిపారు. పల్నాడుజిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతి వారాంతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలనీ, ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు అందిస్తుందన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం మొబైల్ ఫోన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో హాజరు నమోదు చేయాలని తెలిపారు. అధ్యాపకులు డ్రెస్‌కోడ్ పాటించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ప్రతినెలా రెండు కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గుంటూరు ఆర్ఐఓ సునీత మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరగటంతో ప్రవేశాలు సైతం పెరిగాయని తెలిపారు. అధ్యాపకులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని కోరారు. డీఐఈఓ ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ, అధ్యాపకులు ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతిపై చర్చించాలని కోరారు. -
‘సీనియర్ సిటిజన్ల’ చట్టంపై అవగాహన అవసరం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు నరసరావుపేట: తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007పై విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్‌జెండర్ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007, ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 అమలుపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఏడీ దుర్గా భాయ్, వరలక్ష్మి, లాయర్ శిరీష పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత లేని కారణంగా వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. అన్నివర్గాల కుటుంబాల్లోనూ ఇటువంటి పరిస్థితి చూస్తున్నామన్నారు. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణలో ఆయా కుటుంబ సభ్యుల బాధ్యత వహించాల్సి ఉందని, తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన సొంత సంపాదన నుంచి లేదా అతని సొంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్డీఓ అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆర్డీఓ ద్వారా నోటీసులు అందించి విచారణ చేసి సమస్యను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు, తల్లిదండ్రులను, నిర్లక్ష్యం వహించే కుమారులు, కుమార్తెలపైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 ద్వారా ట్రాన్స్ జెండర్లకు హక్కులు కల్పించడం జరిగిందన్నారు. లాయర్ శిరీష పలు సూచనలు, సలహాలు అందించారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నరసరావుపేట టౌన్: మానవ అక్రమ రవాణాపై పట్టణంలోని పెద్ద చెరువు 9వ లైన్లో గల బాలుర సంక్షేమ వసతి గృహంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాన సీనియర్ సివిల్ అధికారి కె. మధుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చిన్నపిల్లలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. వెట్టి చాకిరి, యాచకత్వం, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం బాలురను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరిచితులను నమ్మ వద్దన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు. -
భర్త చిత్రహింసలపై ఫిర్యాదు
నగరంపాలెం: ఎమ్మెల్యే వద్ద ఉంటున్న భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన పేర్ల వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి నంబూరు లక్ష్మి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో మళ్లీ ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వెంకటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిందట పౌల్రాజుతో ప్రేమ వివాహామైంది. భర్త పంచాయతీరాజ్‌లో పనులకెళ్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే వద్ద ఉంటున్నాడు. పాండ్రపాడులోని రెండెకరాల పొలంలో ఎకరాన్ని ఆరేళ్ల కిందట రూ.19 లక్షలకు విక్రయించాడు. మిగతా ఎకరం కూడా విక్రయించేందుకు నాపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై హింసకు గురిచేస్తున్నాడు. ఈనెల 11న మరణాయుధంతో దాడికి పాల్పడగా, ప్రాణాలతో బయటపడ్డాను. కుమార్తె సేవిత భర్త వద్దనే ఉంటుంది. ప్రస్తుతం నా భర్త, మరో రౌడీషీటర్‌తో కలసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెల్లో డీపీఓ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అతనిపై ఫిర్యాదిచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో చేసేది లేక మరలా ఫిర్యాదు చేసేందుకు వచ్చామని బాధితురాలు వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి లక్ష్మి వాపోయారు. పాపను నాకు అప్పగించాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని భార్య వెంకటేశ్వరమ్మ మీడియా ఎదుట వేడుకుంది. -
ఉచిత బస్సు తరువాత జాతర వాతావరణం
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు అంశంపై నెల్లూరు జోన్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల అధికారులతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్యాలయంలో బుధవారం ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల ప్రయాణం ఏర్పాలయ్యాక కొద్ది రోజులు జాతర వాతావరణం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ పరిధిలో ఉచిత బస్సుల సౌకర్యం కల్పించేందుకు విధి విధానాలు, సంసిద్ధత, సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో ఆపరేషన్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని తెలిపారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని, వారు ఆధార్, పాన్‌కార్డు వంటి గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆర్టీసీ ఎండీ నుంచి డీఎం వరకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 1050 బస్సులు రానున్నట్లు తెలిపారు. అధికారికంగా ఆదేశాలు రానప్పటికీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, డీలక్స్, సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అవకాశం ఉన్న వరకు ఎక్కడ నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు తిరిగే అవకాశం ఇస్తున్నామని, సిబ్బందికి కూడా కొద్దిగా పని పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జోన్ పరిధిలో ఈడీలు, ఆర్ఎం, డీఎంలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
జెడ్పీ సీఈవో జ్యోతిబసు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు మండలానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి పీఏఐ పోర్టల్‌పై సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 వెర్షన్ (పీఏఐ పోర్టల్)కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, తెన్నులపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఎం డి. రవీంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు. -
అసంపూర్తి పనులపై అసంతృప్తి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల తీరుపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు, దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను బుధవారం ఆయన పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్‌కు చేరుకున్న రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనానాయక్, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు వెలివేటెడ్ క్యూకాంప్లెక్స్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్‌లో చూపిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అనంతరం మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన, ప్రసాదాల పోటు పనులను పరిశీలించారు. ఇంజినీరింగ్ పనుల్లో అర్చకుల జోక్యం తగదు ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను కమిషనర్ పరిశీలించారు. యాగశాల పక్కనే నిర్మిస్తున్న పూజా మండపాల పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణాలు, అభివృద్ధి పనుల్లో కొంతమంది అర్చకులు జోక్యం చేసుకుంటున్నారని, ఇంజినీరింగ్ పనులలో వారి సలహాలు అవసరం లేదని, ఎవరి పనులు వారు చేసుకుంటే బాగుంటుందని సున్నితంగా మందలించారు. ఆలయంలో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఈవో శీనానాయక్‌కు సూచించారు. మహా మండపం 7వ అంతస్తులోని చైర్మన్ చాంబర్లో దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు.దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ -
నేషనల్ తైక్వాండోలో పతకాలు
వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు నేషనల్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని బుధవారం తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విజవాడలో తైక్వాండో నేషనల్ ఓపెన్ పోటీలు జరిగాయి. హైస్కూల్లో చదువుతున్న అక్కాచెల్లెళ్లు యార్లగడ్డ లక్ష్మీప్రియ, లాస్యప్రియ విజేతలుగా నిలిచి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు జె. దేవభిక్షం ఉపాధ్యాయిని జె. శ్రావణి అభినందించారు. -
ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి
చీరాల: డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ నవ్యాంధ్ర వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా బుధవారం డీఎస్పీ ఎండీ మొయిన్‌కు వినతిపత్రం అందించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేదన్నారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఇది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమేష్, జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, పి.అనిల్‌నాయుడు, జి.రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్పర్సన్ అమెరికా పయనం
వైస్ చైర్మన్‌కు అప్పగించని బాధ్యతలు గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జెడ్పీ చైర్పర్సన్ స్థానికంగా అందుబాటులో లేని సమయంలో వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, హెనీ క్రిస్టినా బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించ లేదు. దీనిపై అధికారులను వివరణ కోరగా చైర్పర్సన్ విదేశాలకు వెళ్లిన విషయం వాస్తవమేనని తెలిపారు. వైభవంగా నరనారాయణ జయంతి తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై నరనారాయణ జయంతిని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళా శాసనాలతో నరనారాయణ జయంతి సందర్భంగా ఉదయం 7 గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం, శ్రీకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులను బుధవారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉందని తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 246, బ్యాంక్ కెనాల్ 1356, తూర్పు కాలువకు 650, పశ్చివ కాలువకు 227, నిజాంపట్నం కాలువకు 450, కొమ్మూరు కాలువకు 1780 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 71,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లారీ ఢీకొని విద్యార్థి మృతి పట్నంబజారు: ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీ ఢీకొని తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేటకు చెందిన షేక్ షాహిద్ అహ్మద్ (13) కొత్తపేటలోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కు వెళుతున్న క్రమంలో పెన్ను కోసం తండ్రి ద్విచక్ర వాహనంపై ఒక్కడే బయటకు వచ్చాడు. ఈ సమయంలో గుంటూరు నుంచి తెనాలి వెళుతున్న రేషన్ బియ్యం ఢీకొట్టింది. దీంతో షాహిద్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం–2020ని పొడిగించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో రాష్ట్రంలో జూన్ 30, 2025 వరకు వేసిన అనధికార లే ఔట్లను, ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు ద్వారా అనధికార లే ఔట్లో ఉన్న స్థలానికి ప్లాను తయారు చేసుకొని, అపరాధ రుసుములో 50 శాతం (లేదా కనిష్టంగా రూ.10 వేలు) చెల్లించి, జూలై 26 నుంచి 90 రోజులలోపు (అక్టోబర్ 24లోపు) ఆన్లైన్లో http://rrdtcp.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకంలో 45 రోజులలోపు పూర్తి రుసుం చెల్లించిన వారికి 10 శాతం, 45 నుంచి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. గడువు అనంతరం మిగిలిన లేఔట్లు/ప్లాట్లకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, డ్రైయినేజీ అనుమతించబడవని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ యొక్క నిషేధ ఆస్తుల రిజిస్టర్లో నమోదు చేస్తారని చెప్పారు. లావాదేవీలు అనుమతించబడవని ఆయన స్పష్టం చేశారు. -
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద నీరు
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు వాగులు నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు అధిక మొత్తంలో వచ్చి చేరింది. జేఈ రమేష్ వరద నీటిని బుధవారం దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి నీరు విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 50 గేట్లకు ఒక అడుగు మేర, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 60,270 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశామని తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా, తూర్పు డెల్టా, రైవస్, బందరు కాలువలకు 16,729 క్యూసెక్కులు విడుదల చేశామని పేర్కొన్నారు.మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు బాపట్ల: మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ గంగాధర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ (సిఫార్డ్) స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి అధ్యక్షత వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సిఫార్డ్ సంస్థ డైరెక్టర్ కె.రవి ప్రదీప్, బాపట్ల మండల పరిషత్ అధికారి బాబురావు, ఆర్పీఎఫ్ సీఐ చంద్రశేఖర్, డీసీపీఓ పి.పురుషోత్తమరావు, బాలల సంరక్షణ అధికారి జి.కృష్ణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయి జ్యోతి పాల్గొన్నారు. -
‘ఉపాధి హామీ’ అక్రమాలపై విచారణ
బల్లికురవ: బోగస్ మస్టర్లలో చేసిన పనులను పదే పదే చూపిస్తూ ఉపాధి హామీ సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మండలంలో రూ.12 కోట్లతో నిర్వహించిన 645 పనులకు సంబంఽధించి సామాజిక తనిఖీలో అవినీతి బహిర్గతమైంది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ బుధవారం మండలంలో విచారణ నిర్వహించారు. కొమ్మినేనివారిపాలెంలో నిర్వహించిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ పూర్తయినా ఒక్క పనినీ అధికారులు చూపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైదన, ఎస్ఎల్ గుడిపాడులో నిర్వహించిన పనుల్లో అక్రమాలపై ప్రశ్నించారు. చేసిన పనులనే పదే పదే చూపుతున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అయ్యారా? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల వద్దనున్న బోగస్ మస్టర్ల వివరాలను తెలుసుకున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులు, 80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు మస్టర్లు వేసి సొమ్ము స్వాహా చేసినట్లుగా గుర్తించారు. మండలంలోని 21 పంచాయతీల్లో నిర్వహించిన పనులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి పంపాలని తహసీల్దార్ రవి నాయక్‌ను ఆదేశించారు. రికవరీ చేయాలని తెలిపారు. ఎంపీడీఓ పాండురంగస్వామి, ఏపీవో రమాదేవి పాల్గొన్నారు. కేజీబీవీల తనిఖీ విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కస్తూర్బా గాంఽధీ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. బాలికల వద్దనన్న ట్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం వారిని వివిధ ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి ప్రిన్సిపాల్ కె. సరళకుమారిని అడిగి తెలుసుకున్నారు. అదనపు గదుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటే బెడ్లు, మంచాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. -
అవినీతికి పాల్పడిన మెప్మా సిబ్బందిపై చర్యలు
రేపల్లె: నకిలీ గ్రూపులు సృష్టించి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలను మోసం చేసిన మెప్మా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలోని 21వ వార్డులో 2023 సంవత్సరంలో పలువురు ఆర్పీలు నకిలీ గ్రూపులను సృష్టించి, వివిధ బ్యాంకుల ద్వారా రూ.2 కోట్ల రుణాలను తీసుకుని గ్రూపు సభ్యులను మోసగించిన ఘటనపై విచారణ చేసి సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల బాపట్లలో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ వెంకట మురళీకి సీపీఎం, ఐద్వాల ఆధ్వర్యంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ బుధవారం రేపల్లె పట్టణానికి విచ్చేసి 21వవార్డులో బాధిత మహిళలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అవినీతికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను వివరించారు. తమ ప్రమేయం లేకుండా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్పీలు రుణాలు పొందటం వల్ల చెల్లింపులు కోరుతూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని వాపోయారు. తాము పొందని రుణాలను ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. తమ పేర్లపై వివిధ బ్యాంకులలో రుణాలు పొందినట్లు నమోదై ఉండటంతో గ్రూపు రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతోపాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల లబ్ధి బ్యాంకు అకౌంట్లో జమ అయినప్పటికీ రికవరీ పేరుతో మేనేజర్లు జమ చేసుకుంటున్నారన్నారు. కూలీనాలీ చేసుకుని జీవించే తమకు బ్యాంకు రుణాలు ఇప్పించి సమస్యను పరిష్కరించాలని పలువురు మహిళలు వాపోయారు. దీంతో స్పందించిన పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమస్యపై బ్యాంకర్లతో మాట్లాడి సంక్షేమ పథకాల లబ్ధి ఖాతాదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత మహిళలకు డ్వాక్రా సేవలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ మాట్లాడుతూ పేద మహిళల ప్రమేయం లేకుండా అవినీతికి పాల్పడిన మెప్మా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి సాధ్యమైన త్వరలో రుణాలు మంజూరు చేయటంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు నాంచారమ్మ, ధనమ్మ, ఎస్కే ఆశ, జహీరా, షబానా, బాధిత మహిళలు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ -
అనధికార లేఔట్లు క్రమబద్ధీకరణ చేసుకోవాలి
బాపట్లఅర్బన్: బావుడా పరిధిలో ఉన్న అనధి కార లే ఔట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి శోభన్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం 30 జూన్ 2025లోపు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే ఔట్లను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. అనధికారిక లేఔట్లపై స్పందిస్తూ పైన తెలిపిన తేదీ ప్రకారం ఒక ప్లాట్ అయినా అమ్మకం జరిగి ఉండాలన్నారు. జూలై 26వ తేదీ నుంచి 90 రోజుల్లోగా క్రమబద్ధీకరణకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రధానంగా ఎల్ఆర్ఎస్ 2020లో దరఖాస్తు చేయని వారితోపాటు, అనధికారిక లేఔట్లలో ప్లాట్ ఉన్నవారు, లేఔట్లను అభివృద్ధి చేసిన వారు అర్హులవుతారని పేర్కొన్నారు. సంబంధిత లేఔట్లలో ఓపెన్ స్పేస్ లేకపోతే సాధారణ రుసుముతోపాటుపాటు 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు కూడా చెల్లించాలన్నారు. అక్టోబరు 24వ తేదీలోపు దరఖాస్తు చేయకపోతే లేఔట్లలో, ప్లాట్లలో భవిష్యత్తులో భవన నిర్మాణాలు అనుమతులు ఇవ్వబోమన్నారు. ఇలాంటి స్థలాల క్రయవిక్రయాలకు వీల్లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిషేధిత భూముల జాబితాలో నమోదు చేస్తామని వివరించారు. రేపల్లె, బాపట్ల పురపాలక సంఘం, బావుడా ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. -
ముంపు ప్రాంత వాసులను ఆదుకుంటాం
కొల్లూరు: కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు వస్తున్న తరుణంలో పరివాహక ప్రాంత వాసులను అన్నివిధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి బుధవారం 87 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఆయన కొల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపల్లె ఆర్డీఓ రామ లక్ష్మితో కలసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తలపై యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. గురువారం మధ్యాహ్నం సమయానికి 3 లక్షల నుంచి 3.50 లక్షల క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందన్నారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో 67 కిలోమీటర్ల పొడవున ఉన్న కృష్ణా కుడి కరకట్టకు యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్సీ యంత్రాంగాన్ని ఆదేశించారు. గతేడాది చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 11.47 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో కరకట్ట రక్షణ విషయంలో త్రుటిలో గండం నుంచి గట్టెక్కగలిగామని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఒకటి లేదా రెండు కిలోమీటర్లకు ఓ పర్యవేక్షణ అధికారిని నియమించి కట్ట పటిష్టత విషయంలో స్థానికులతో కలిసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు నెలలకు అవసరమైన నిత్యావసర సరకులను ఆయా గ్రామాలకు తరలించాలని ఆదేశించారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో 30 గ్రామాల వారికి సరకుల కోసం బోట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న డ్యామ్‌ల నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రజల రక్షణకు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కె.నరసింహారావు, వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, ఆర్సీ ఏఈలు విజయ్‌రాజు, నాగేశ్వర నాయక్, వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రస్తుత నీటి విడుదలతో ముప్పు లేదు సంబంధిత యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి కృష్ణా కరకట్ట బలోపేతం చేయాలని యంత్రాంగానికి ఆదేశం -
సక్రమంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఏపీఎస్‌డబ్ల్యూసీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ సునీత పేర్కొన్నారు. బాపట్ల, చీరాల, పర్చూరు మండలాలలో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో గోదామును ఆమె పరిశీలించారు. చీరాల మార్కెట్ యార్డు గోదాము, కొనుగోలు కేంద్రం, పర్చూరు మండలంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రం, మార్కెట్ యార్డు గోదాము, ఎస్‌డబ్ల్యూసీ గోదాములను కూడా పరిశీలించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు, గోదాములలో నిల్వ చేసిన పొగాకు వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న బ్లాక్ బర్లీ పొగాకును భద్రంగా నిల్వ చేయాలని ఎండీ సునీత తెలిపారు. రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసే సమయంలో అధికారులు తేమ శాతాన్ని కచ్చితంగా పరిశీలించాలన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పొగాకును ఎప్పటికప్పుడు గోదాములలో భద్రపరచాలని తెలిపారు. గోదాముల నిల్వ సామర్థ్యం ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. నిల్వ పెరిగితే పొరుగు జిల్లాలకు తరలించాలని పేర్కొన్నారు. ముందస్తుగానే గోదాములను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ కరుణశ్రీ , జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, తదితరులు ఉన్నారు. -
పెండింగ్ మెస్ బిల్లులు విడుదల చేయాలి
బాపట్లఅర్బన్: ప్రభుత్వ హాస్టళ్లలో పెండింగ్‌లో ఉన్న మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు యల్లావుల సోహిత్ డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీసేందుకు మంగళవారం హాస్టళ్లను పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు సోహిత్ మాట్లాడుతూ పట్టణంలో విద్యార్థులతో కలిసి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నామన్నారు. హా స్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్య లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో చాలా హాస్టళ్ల భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చాలా హాస్టల్లో విద్యార్థులకు సరిప డా గదులు లేక ఒక్కొక్క గదిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉంటున్న పరిస్థితిని గమనించామని తెలిపారు. హాస్టల్స్‌కు పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని తెలిపారు. హాస్టల్స్‌ను తనిఖీ చేసిన వారిలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ పర్వేజ్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సోహిత్ బీసీ హాస్టల్ సందర్శన భోజనం నాణ్యత పరిశీలన -
తీర భూములపై పచ్చ గద్దలు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీరప్రాంతంలో చీరాలకు చెందిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కబ్జాచేసి వాటికి పట్టాలు పుట్టించడమేకాక సదరు భూములను గుంటూరులోని మరో పచ్చ ప్రజాప్రతినిధికి చెందిన భ్రమర ఇన్ఫ్రాకు ధారాదత్తం చేసి కోట్లు ఆర్జించినట్లు తొమ్మిది గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు. పచ్చనేత భూ దాహం కారణంగా రెండు వేలబోట్లు సముద్రంలోకి వెళ్లే దారిలేదని, దానివల్ల భృతి కోల్పోయి పస్తులుండాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన చెందారు. న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామంటూ ఆక్రమిత భూముల వద్ద భైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్ వెంకట మురళి చొరవతో మత్స్యకారుల గొడవ తాత్కాలికంగా సర్దుమణిగినా తీరంలో పచ్చనేతల భూ ఆక్రమణల వ్యవహారం మరో మారు వెలుగు చూసింది. ఒక్క బుర్ల వెంకట్రావు ఎపీసోడే కాదు బాపట్ల మండల పరిధిలో పలువురు పచ్చనేతలు వారి అనుమాయుల భూకబ్జాల వ్యవహారం శృతిమించింది. కూటమి అధికారంలోకి రావడంతో పచ్చ కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తీర ప్రాతంలో టూరిజం పెరిగి ఎకరం రూ.మూడు నుంచి రూ.5కోట్లు పలుకుతుండడంతో కనిపించిన స్థలాన్నల్లా పచ్చనేతలు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూములతోపాటు అసైన్డ్ భూములను వదలి పెట్టడంలేదు. తొలుత కబ్జాచేసి గతంలో వేరొకరి వద్ద కొన్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. వాటిని చూపి కబ్జా స్థలాలను అమ్మే స్తున్నారు. కొన్నింటిని ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. అధికారులకు డబ్బులు ముట్టజెప్పి ఆన్లైన్ చేసుకుంటున్నారు. ఫేక్ పట్టాలను ఇతర ప్రాంతాల నుంచి భూములు, స్థలాలను కొనేవారికి చూపి ఆక్రమిత భూములను అమ్మకానికి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. మండలంలోని సూర్యలంక మొదలుకొని రామచంద్రాపురం, దాన్వాయిపేట, కృపానగన్, పాండురంగాపురం, ఓడరేవు ప్రాంతాల వరకూ తీరంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జాలకు అంతులేకుండా పోయింది. రామచంద్రాపురం ప్రాంతంలో చీరాల మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు ఏకంగా సముద్రం అలల వరకూ తీరాన్ని ఆక్రమించి కంచె నిర్మించారు. మత్స్యకారులు చేపలు ఆరబోసేందుకు వేసుకున్న ప్లాట్ఫారంను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన మత్స్యకారులను బెదిరించారు. అలల వరకూ తమదేనని హెచ్చరించారు. బోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియడంలేదని మత్స్యకారులు సాక్షితో వాపోయారు. తీరంలో పచ్చనేతల దౌర్జన్యాలు కోకొల్లలు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరం భక్షక దళం సీఆర్‌జెడ్ తీరంలో సీఆర్‌జెడ్ కీలకమైన వ్యవస్థ. తీర ప్రాంతంలో ఎంత దూరం వరకూ ఉంటుందో వారే చెప్పాలి. ఒకరకంగా వారు తీరం రక్షణదళం. కానీ ఇక్కడ సీఆర్‌జెడ్ తీరం భక్షక దళంలా మారిందన్న ఆరోపణలున్నాయి. తీర ప్రాంతాన్ని అలల వరకూ కబ్జా చేస్తున్నా వారు కన్నెత్తి చూడడంలేదు. వాస్తవానికి సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం సముద్రం ఎంతవరకు ఉంటుందో వారు స్పష్టత నివ్వడంలేదు. తీరంలో ఒక్కో దగ్గర ఒక్కోలా నిబంధనలు ఉంటాయని మాత్రమే చెప్పి తప్పించుకుంటున్నారు. తీరం అలల దాకా దాకా పచ్చనేతలు భూములు ఆక్రమించినా సీఆర్‌జెడ్ పట్టించుకోవడంలేదు. బాపట్ల జిల్లాలో తీరం మొత్తాన్ని కబ్జాల మయంగా మార్చడం వెనుక సీఆర్‌జెడ్ అధికారుల పాత్రవుందని, అందిన కాడికి దండుకొని కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే బాపట్ల మండలం సూర్యలంక మొదలు వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం ప్రాంతం వరకూ తీరప్రాతం కబ్జాకు గురైంది. సీఆర్‌జెడ్ నిబంధనలకు పాతరేసి రోడ్లు ఇతర దుకాణాలు నిర్మించారు. ఆక్రమిత స్థలాల్లో రిసార్ట్లు వెలిశాయి. సీవ్యూ కోసం రిసార్ట్లవారు తీరం రక్షణ కోసం పెంచిన మడ, సర్వి, ఇతర మొక్కలను తొలగించి వేశారు. అయినా సీఆర్‌జెడ్ స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. బాపట్ల తీరంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు టూరిజం పెరగడంతో పెరిగిన భూముల విలువ కూటమి అధికారంలోకి రావడంతో తీరం భూములపై పచ్చనేతల కన్ను ఇప్పటికే అడవి పంచాయతీలో భూములను స్వాధీనం చేసుకున్న పచ్చనేతలు నకిలీ పట్టాలు పుట్టించి ఆక్రమణలు కొందరు ఫేక్ అగ్రిమెంట్లతో భూముల కబ్జా మరికొందరు వేరే సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనం కిందిస్థాయి రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాలు ఆక్రమిత భూములను విక్రయిస్తున్న పచ్చముఠాకలెక్టర్ గారూ..తీరప్రాంతంలో భూ కబ్జాలకు కొందరు రెవెన్యూ అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమాల ఆరోపణలు శృతిమించడంతో వేటపాలెం తహసీల్దారు పార్వతిని కలెక్టర్ సరెండర్ చేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ఘటన మిగిలిన రెవెన్యూ అధికారుల్లో కొంత భయం కలిగించింది. అదే తరహాలో అక్రమాలకు తెగబడుతున్న మిగిలిన అధికారులపైనా చర్యలకు దిగితే తీరం కబ్జా కాకుండా ఆగే అవకాశముంది. బాపట్ల మండలం మొదలు చినగంజాం వరకూ తీరంలో ఆక్రమణలు శృతిమించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు దిగితే తీరాన్ని కాపాడవచ్చు. తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి వైపు నడిపించవచ్చు. అలా కాకుండా పచ్చనేతల కబ్జాలను చూస్తూ పోతే తీరం మొత్తం కబ్జా కోరల్లో చిక్కుకునే అవకాశముంది. సమర్దులైన అధికారుల కమిటీతో తీరంపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
యోగా పోటీల్లో సత్తా చాటాలి
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జాతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీల్లో పతకాల సాధనే లక్ష్యంగా క్రీడాకారులు కృషి చేయాలని చిలకలూరిపేట పురపాలక కమిషనర్ పి.శ్రీహరిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం యోగా క్రీడాకారులతో కళకళ లాడింది. జేఎన్వీ పరిధిలో జరిగే ప్రాంతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీలకు మద్దిరాల నవోదయ విద్యాలయం వేదికగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇటీవల జరిగిన క్లస్టర్ స్థాయి యోగా పోటీల్లో విజేతలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తరలివచ్చిన 278 మంది విద్యార్థులు 29వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 278 మంది క్రీడాకారులు, తమ పీఈటీలు, ఎస్కార్ట్‌లతో తరలివచ్చారు. మున్సిపల్ కమిషనర్ ిపి.శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా ప్రదర్శన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్.నరసింహారావు స్వాగతోపన్యాసం చేశారు. ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ లింగయ్య చౌదరి, నవోదయ విశ్రాంత సహాయ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జేఎన్వీల విద్యార్థులు యోగా ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో జేఎన్వీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీలో దక్షిణ భారత యోగా ప్రదర్శన పోటీలు ప్రారంభం ఐదు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు -
ఉన్నపళంగా పొమ్మంటే ఎలాగయ్యా!
నెహ్రూనగర్: అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని.. ఇప్పుడు ఉన్న ఫళంగా నోటీసులు ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజమని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలను చూపించి.. మా ఇళ్లను పడగొట్టండి అంటూ నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆందోళన నిర్వహించారు. తమ గోడు విన్నవించుకునేందుకు వస్తే అధికారులు తమపై మండిపడుతూ, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూకుమ్మడి ఆత్మహత్యలే గతి 18 సంవత్సరాలకు పైబడి ఊరికి దూరంగా కనీస మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, రూ.వేల అద్దెలు చెల్లించే స్థోమత లేక చిన్న ఇళ్లు నిర్మించుకుని కూలీ పనులు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని, ఆ ఇళ్లను ఖాళీ చేయాలంటూ జీఎంసీ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారని వాపోయారు. ఇళ్లు ఖాళీ చేయడంలో తమకు అభ్యంతరం లేదని.. కానీ గత ప్రభుత్వ హయాంలో కొర్నెపాడు దగ్గర ఇచ్చిన స్థలాలను తమకు చూపించి ఇళ్లు తొలగించాలని వారు ప్రాధేయపడ్డారు. ఉన్న ఫలంగా మమ్మల్ని ఖాళీ చేయాలని ఆదేశిస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను తొలగించాలని చూస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు గత్యంతరం లేదని వాపోయారు. టిడ్కో ఇళ్లల్లో నివాసం కల్పించాలి ప్రస్తుతం కొర్నెపాడులో తమకు ఇచ్చిన స్థలాల్లో రైతులు పంట పండిస్తున్నారని.. అవి తమకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని.. అడవి తక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లల్లో తమకు నివాసం ఉండేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. స్థలాలు చూపించి మా ఇళ్లు పడగొట్టండి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నల్లపాడు చెరువు కట్ట నివాసితుల ఆందోళన -
నల్లబర్లీ కొనుగోలులో జాప్యం తగదు
ఇంకొల్లు(చినగంజాం): నల్లబర్లీ పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో రాష్ట్ర రైతు సంఘం, జిల్లా రైతు సంఘం నాయకులు మంగళవారం పర్యటించారు. అనంతరం ఇంకొల్లు యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. పొగాకు సాగు చేసిన రైతుల వద్ద నుంచి 40 రోజులుగా పొగాకు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 35 శాతం మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేశారన్నారు. రైతులు వద్ద 65 శాతం పొగాకు నిల్వలు ఇంకా మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు నెమ్మదిగా కొనసాగించడం వలన షెడ్యూల్ పేరుతో జాప్యం జరగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ఆగస్టు 20వ తేదీ నాటికి నల్లబర్లీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలని ప్రకటించిందని దాంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ ప్రకటనలను అవకాశంగా తీసుకున్న పొగాకు కంపెనీలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఉప్పుటూరు గ్రామంలో దక్కన్ కంపెనీ రైతుల వద్ద రూ.6500కి కొనుగోలు చేసి అనంతరం నాణ్యత లేదని క్వింటాకు రూ. వెయ్యి తగ్గించారన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా 25 మిలియన్లు పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి కేవలం 5 మిలియన్ కేజీలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. అదేవిధంగా పొగాకు కొనుగోలు చేసిన 48 గంటలలో రైతుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు 40 రోజులు పూర్తి అయినా జమకాలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చివరి వరకు పొగాకు కొనుగోలు చేయకుంటే ఆందోళన తీవ్ర తరం చేస్తామన్నారు. జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను క్వింటాల రూపంలో రూపకల్పన చేశారని అలా కాకుండా 500 చెక్కులను రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి పి.కొండయ్య, నాయకులు వరికోటి శ్రీనివాసరెడ్డి, డేవిడ్, భానుస్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వి.కృష్ణయ్య 65 శాతం పొగాకు నిల్వలు రైతులు వద్ద పేరుకుపోయాయంటూ ఆవేదన 48 గంటల్లో రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తామనే హామీ ఏమైంది? రైతుల వద్ద చివరి కాడ వరకు పొగాకు కొనుగోలు చేయకుంటే ఆందోళన -
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కృషి
గుంటూరు వెస్ట్: జిల్లాలో పర్యావరణ పరిరక్షణ పెంపొందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి నాణ్యతను మరింతగా పెంపొందించేందుకు జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మిని సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను జిల్లా స్థాయి అమలు కమిటీలు నిర్వహించాలన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు నగరానికి 2011–15 మధ్య గాలి నాణ్యతా డేటా ఆధారంగా నాన్ అసైన్మెంట్ నగరాల్లో ఒకటిగా గుర్తించిందన్నారు. జాతీయ కాలుష్యాన్ని గుర్తించేందుకు జాతీయ క్లీన్ఎయిర్ ప్రోగ్రామ్‌ను రూపొందించారని పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో గాలిలో కాలుష్యాన్ని 70 నుంచి 80 శాతం తగ్గించే లక్ష్యంతో పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. దీనిలో భాగంగా 2019–20, 2024–25 వరకు గుంటూరు నగరానికి మొత్తం ఎన్సీ ఏపీ కింద రూ. 20.51 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి క్లీన్ సిటీ రూ.2.73 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన పనులను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సకాలంలో పూర్తి చేయాలన్నారు. గాలి నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూ ల్చడం, నూతన బ్రిడ్జి నిర్మాణ క్రమంలో జీజీహెచ్, ట్రావెల్స్ బంగ్లాలో వద్ద ఉన్న నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఏర్పాటు చేసిన స్టేషన్లను ప్రత్యామ్నాయ ప్రాంతాలకు మార్చాలన్నారు. సమావేశంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్వీరాన్మెంట్ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, డీఎస్ ఆర్.చంద్రమౌళి పాల్గొన్నారు. రైల్వే సిగ్నల్ కంట్రోలు కార్యాలయం ప్రారంభం దుగ్గిరాల: నూతన కార్యాలయంలో మంగళవారం రైల్వే సిగ్నల్ కంట్రోలు వ్యవస్థను రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించారు. సూమారు మూడు సంవత్సరాలు నుంచి ఆధునికీకరణ పనులతో పాటు మూడో లైను నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. పనులు పూర్తి కావడంతో అత్యంత ఆధునిక సాంకేతిక విధానం కలిగిన కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి -
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో అవసరమైన డేటా ను రూ పొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కార్యాచరణ ప్రణాళిక 2025–26 రూపకల్పనలో భాగంగా ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్, ప్రగతి పోర్టల్‌పై మండల స్థాయిలోని సాంకేతిక సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ టీఎంపీ, ప్రగతి పోర్టల్, ప్రగతి యాప్ వినియోగించే పద్ధతి, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణకు సంబంధించిన అంశాలను పోర్టల్‌లో నమో దు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడంలో సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోస్ట్, ప్రీ అసెస్మెంట్, ఆధార్ ఆథెంటిఫికేషన్, ఈ–సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి అంశాలను పూర్తి చేసేందుకు ప్రతి ఉద్యోగికి శిక్షణ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు రవీంద్రబాబు, కె.నాగేశ్వరరావు, కరీముద్దీన్, అనురాధ, ఏవో ప్రతాప్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో మద్యం అమ్మకం దారులు తాడికొండ: ‘మద్యం మత్తులో యువకుల ఘర్ష ణ’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. తాడికొండలోని మద్యం దుకాణంలో రాత్రి వేళ అమ్మకా లు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 80కి పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఉద్యోగుల ప్రయోజనాలు సాధించేందుకు రాజీపడం
గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను సాధించేందుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం గుంటూరులో గుంటూరు వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఏపీ ఎన్జీజీవో సంఘ సాంస్కృతిక సమావేశ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యా సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, సరండర్ లీవ్ బకాయిలు కొంత మేరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. మిగిలిన వాటిని చెల్లించేందుకు రాష్ట్ర నాయకులతో కృషి చేస్తుందని తెలిపారు. గుంటూరులో ఎన్జీవో ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని అభినందించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎన్జీవో ప్రాంగణాలను ఉద్యోగులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు గుంటూరు జిల్లా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగ నాయకుల సమష్టి కృషితో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు సాధించుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి, రామ్‌ప్రసాద్, రంజిత్‌నాయుడు, తదితరులు మాట్లాడారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో నూతన సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ గుంటూరు నగర అధ్యక్షుడు సూరి, కార్యదర్శి కళ్యాణ్‌కుమార్, సంఘ నేతలు సత్యనారాయణరెడ్డి, శరత్‌బాబు, కృష్ణారెడ్డి, రామకృష్ణ, రాంబాబు, జానీబాషా, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, సుకుమార్, శ్రీవాణి, విజయలక్ష్మి, శివజ్యోతి, రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రసన్నతబాబుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పురస్కారం
రేపల్లె: చేతి రాతతో బైబిల్‌ను రచించిన రేపల్లె పట్టణానికి చెందిన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ గంజిదేవ వరప్రసన్నత బాబు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి పురస్కారం పొందారు. పట్టణంలోని 20వవార్డుకు చెందిన వరప్రసన్నత బాబు ఆంధ్ర బ్యాంక్‌లో విధులు నిర్వహిస్తు ఖాళీ సమయాలలో చేతి రాత ద్వారా బైబిలును రచించారు. బైబిలును ప్రచురించారు. ఈ బైబిలు గ్రంథంను ఏఈఎల్సీ సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించి పలు చర్చిలకు బహూకరించారు. విషయం గుర్తించిన వరల్డ్ రికార్డ్స్ సంస్థ అవార్డుతో వరప్రసన్నతబాబును ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. -
రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న కూటమి ప్రభుత్వం
బాపట్ల: రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోదుగుల మాట్లాడారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికి సంక్షేమం అనే మాట ఏనోటా వినిపించటం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం..అభివృద్ధి రెండు కళ్ళులా చూశారన్నారు. నేడు ప్రజలు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను తట్టుకోలేక పోతున్నారన్నారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహరెడ్డికి, నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, కోన రఘుపతికి కృత్తజ్ఞతలు తెలిపారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల -
బీభత్సం సృష్టించిన కారు
నరసరావుపేట టౌన్: అతివేగంగా వచ్చిన కారు ఢీకొని ద్విచక్ర వాహనదారులతో పాటు నడిచి వెళ్తున్న బాలికకు తీవ్రగాయాలైన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంద గ్రామానికి చెందిన ఎ. మరియదాసు, బూదాల బాబురావులు ద్విచక్ర వాహనంపై ప్రకాష్‌నగర్ సెయింట్ జోసఫ్ స్కూల్ వైపు నుంచి 60 అడుగుల రోడ్డుకు వెళ్తున్నారు. పక్కనే మరో ద్విచక్ర వాహనంపై నవీన్ అనే వ్యక్తి వస్తున్నాడు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఏపీ 11 ఏఎస్ 1638 నంబర్ గల కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కారును వెంబడించటంతో కారు అతివేగంగా రివర్స్ చేస్తూ అప్పుడే ట్యూషన్ నుంచి వస్తున్న బాలిక షేక్ ఆయేషాను ఢీకొట్టింది. సంఘటనలో బాలిక ఎడమ చేయి విరిగింది. క్షతగాత్రులు నలుగురిని ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారును స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.వి. చరణ్ మంగళవారం తెలిపారు. కారు నడిపిన నిందితుడు పట్టణానికి చెందిన మైనర్ బాలుడు షేక్ సుభానిగా గుర్తించారు. మైనర్‌కు కారు నడిపేందుకు ఇచ్చిన ఓనర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులపైకి దూసుకెళ్లి.. బాలికను ఢీకొట్టి నలుగురికి గాయాలు కారు డ్రైవర్ మైనర్ బాలుడిగా గుర్తింపు -
వెయిట్ లిఫ్టింగ్‌లో అంగలకుదురు విద్యార్థుల సత్తా
తెనాలిరూరల్: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని అంగలకుదురు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 60 కిలోల విభాగంలో బి.దివ్య, 70 కిలోల విభాగంలో జి.అఖిల, 105 కిలోల విభాగంలో ఎం.బాలాజీ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. అలానే 83 కిలోల విభాగంలో టి.హేమచంద్, 90 కిలోల విభాగంలో వై. శ్రీశశాంక్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వ్యాయామోపాధ్యాయులు వేమూరి శరత్‌బాబు, పులివర్తి రాజులను పాఠశాల హెచ్ఎం ఎన్.అనురాధ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మంగళవారం అభినందించారు. -
సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాల నివారణ
నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలైన రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశానికి కలెక్టర్ చైర్మన్ హోదాలో హాజరై, ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్టుమెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని కోరారు. యూ టర్న్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రొంపిచర్ల వద్ద హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ ప్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం నోడల్ అధికారి ఈ–డార్ యాప్ పై అవగాహన కల్పించారు. ఆర్టీఓ వి.సంజీవ కుమార్, ఆర్అండ్బీ ఈఈ, ఆర్టీసీ ఆర్.ఎం, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. గంజాయి హాట్స్పాట్లపై నిఘా పెట్టండి.. నరసరావుపేట: జిల్లావ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్స్పాట్లపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో ఉన్న అనుమానితుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించిన భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, గంజాయి సరఫరా చేస్తూ, అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లస్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డీ–అడిక్షన్ సెంటర్లు పునరావాస సహాయం కోసం అవుట్‌రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయా లన్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కలువ రవీంద్ర, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.ప్రసూన, సైకియాట్రిస్ట్ డీజీపీఎస్ రాజు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి, డీపీఓ ఎస్వి.నాగేశ్వర నాయక్, డీసీజీఎస్డబ్ల్యూఎస్ ఏపీ గోపిరెడ్డి, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట కలెక్టర్ పి.అరుణ్‌బాబు జిల్లా ఎస్పీతో కలిసి ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశం నిర్వహణ -
మద్యం షాపు వద్ద వ్యక్తి మృతి
పోలీసుల చొరవతో ప్రాణం పదిలంకారంచేడు: మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మంగళవారం కారంచేడులో జరిగింది. ఎస్ఐ షేక్ ఖాదర్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన వాసుమళ్ల అనిల్ (42) తన భార్య కృపారాణితో కలసి కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో తమ బంధువు అంత్యక్రియల కు హాజరయ్యారు. అనంతరం బంధువులతో కలసి మద్యం తాగేందుకు వైన్ షాపునకు వచ్చాడు. మద్యం కొనుగోలు సమయంలో ఒక్కసారిగా ముందుకు పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అక్కడికి చేరుకున్న భార్య కృపారాణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం చీరాలకు పంపించామన్నారు. మృతునికి భార్యతోపాటు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి మరణ వార్త విన్న కుమార్తె మానస ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను కారంచేడు పీహెచ్సీ వైద్య సిబ్బంది పరీక్షించి మెరుగైన వైద్యం కోసం చీరాల ఆస్పత్రికి తరలించారు. -
ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన
గుంటూరు మెడికల్: టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరులోని జిల్లా జైలులో 250 మంది ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, దగ్గినప్పుడు కళ్లెతోపాటు రక్తం పడడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా భావించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, నిర్ణీత కాల వ్యవధి ఉన్న మందుల కోర్సు వాడడం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అన్నారు. క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుందని, దగ్గే సమయంలో నోటికి కర్చీఫ్ పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి.శాంతరాజు, వైద్య అధికారిణి డాక్టర్ లక్ష్మీసుధ, సిబ్బంది నాగజ్యోతి, స్వరూప, రాంబాబు, సాంబశివరావు, నాగమణి, సంధ్యారాణి పాల్గొన్నారు. -
సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రమణ్యేశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజేష్‌శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రమణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుబ్రమణ్యేశ్వరుని పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొ న్నారు. విజయకీలాద్రిపై ఘనంగా గరుడ పంచమి తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం గరుడ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు గరుత్మంతునికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు సంతాన ప్రాప్తి కోసం గరుడ హోమం ఘనంగా నిర్వహించామని అన్నారు. పద్మావతి అమ్మవారి మాస తిరునక్షత్ర సందర్భంగా పద్మావతి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 75 త్యాళ్లూరు పీఎంశ్రీ ఉన్నత పాఠశాల జాతికి అంకితం పెదకూరపాడు: జాతీయ స్థాయిలో పల్నాడు జిల్లాలో ఉత్తమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ‘జాతీయ విద్యా విధానం’ ఎన్ఈపీ–2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా భారత్ మండపం న్యూ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేయగా స్థానికంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్, ఏఎంవో పూర్ణచంద్ర రావు అంకితం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 75 త్యాళ్లూరు హైస్కూల్ ఉండటం విశేషం. డీఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మకమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంశ్రీ పథకం ఎంతగానో దోహదపడుతుందని, ఇది పాఠశాలలకు ఒక వరం లాంటిదని అన్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రసారమైన వివిధ కార్యక్రమాలను విద్యార్థులు, అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్పర్సన్ బి.చంద్రకుమారి, మండల విద్యాశాఖ అధికారి టి.సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఈ అనుముల శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ సీఆర్ఎంటి శివ తదితరులు పాల్గొన్నారు. నేడు శివాలయంలో హుండీ కానుకల లెక్కింపు పెదకాకాని: శివాలయంలో హుండీ కానుకలు లెక్కింపు కార్యక్రమం బుధవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు నియమించిన అధికారి సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరిచి కానుకలు లెక్కించడం జరుగుతుందన్నారు. ఆలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. కానుకల లెక్కింపులో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. -
ఉద్దేశపూర్వకంగానే నాపై అభియోగాలు
పట్నంబజారు: ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై అభియోగాలు మోపడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థనగర్‌లోని ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాపట్ల జిల్లా ఎస్పీకి వేముల మల్లికార్జునరావు తనపై ఫిర్యాదు చేశాడని, వ్యాపారంలో లావాదేవీల విషయంలో తానేదో ద్రోహం చేశానని చెప్పడం సబబు కాదని తెలిపారు. 2023 జులైలో గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి మల్లికార్జునరావుతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. తమ కంటే ముందే మల్లికార్జునరావు, ప్రేమ రాజు అనే వ్యక్తికి అగ్రిమెంట్ చేసి రూ. 60లక్షల వరకు తీసుకున్నాడని, ఆ తర్వాతే తన కుమారుడు మల్లికార్జునరావు వద్ద ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్నట్లు ఏసురత్నం వివరించారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి సంబంధించి వివాదం తన వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్యా సఖ్యత కుదిర్చి రూ 2.40కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. దానిలో భాగంగానే ప్రేమరాజుకు సుమారు 60లక్షల వరకు అప్పు ఉంటే, చాలా వరకు చెల్లించినట్లు వివరించారు. అప్పులు చెల్లించే క్రమంలో అగ్రిమెంట్లో స్పష్టంగా అనుకున్న గడువులోగా ఫ్యాక్టరీని అప్పగించాలని, లేనిపక్షంలో చెల్లించిన డబ్బులకు రూ. 2వడ్డీ ఇవ్వాలని స్పష్టంగా రాసుకున్నట్లు చెప్పారు. అనుకున్న సమయానికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన మల్లికార్జునరావు తనపై అభియోగాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని చెప్పారు. నాలుగు నెలల నుంచి పట్టాభిపురం పోలీసులు ఫోన్ చేస్తున్నా రావడం లేదని, ఒక్కసారిగా బయటకు వచ్చి తనపై ఫిర్యాదు చేయటం ఏంటని ఏసురత్నం ప్రశ్నించారు. తమ వద్ద అన్ని విధాలుగా రికార్డెడ్ ఎవిడెన్స్‌లు ఉన్నాయని, దీనిపై తాను కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన ఆరోపణలు రుజువు చేయాలని ఆగ్రహం -
పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ తరగతులు
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం నందున్న కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం గ్రామీణ యువతకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల ప్రారంభానికి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎం.యుగంధర్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చి, వారి ఉన్నతికి కృషిచే స్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోర్స్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త ఎం. గంగాదేవి పాలపుట్ట, ఆయిస్టర్, వరిగడ్డి, బటన్ పుట్టగొడుగుల సాగు, వాటి జీవిత చక్రాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఎన్ఎం పుణ్యవతి, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో పంచ్ జ్యోతిర్లింగ్ యాత్ర ●ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహణ ●వివరాలు వెల్లడించిన ఏరియా మేనేజర్ ఎం.రాజా లక్ష్మీపురం: ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి పంచ్ జ్యోతిర్లింగ్ దర్శన్‌తో అంబేడ్కర్ యాత్రను నిర్వహించనున్నట్లు ఏరియా మేనేజర్ ఎం.రాజా సోమవారం తెలిపారు. యాత్ర ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జ్యోతిర్లింగ దర్శనాలలో ప్రధానంగా నాగపూర్‌లో అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్తూపం, శ్రీ స్వామినారాయణ మందిరం, ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, అంబేడ్కర్ జన్మస్థలం, నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, పూణేలో భీమ శంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లో గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శన ఉంటుందని వివరించారు. యాత్ర సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా సాగుతుందని తెలిపారు. ఒక్కో వ్యక్తికి స్లీపర్ క్లాస్ పెద్దలయితే నాన్ ఏసీ గద్దుల్లో హోటల్ వసతి, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.14,700, త్రీ ఏసీ అయితే ఏసీ గది, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.22,900 ఉంటుందని వివరించారు. టూ ఏసీ అయితే ఏసీ గది, ఏసీ వాహనంతో కలిపి రూ.29,900, పిల్లలు 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు వారికి స్లీపర్ క్లాస్ రూ.13,700, త్రీ ఏసీ రూ.21,700, టూ ఏసీ రూ.28,400 ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రతి రోజు ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే), ప్రయాణ బీమా, వృత్తిపరమైన, స్నేహపూర్వక పర్యటన ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రత, అవసరమైన సహాయం కోసం ఐఆర్సీటీసీ మేనేజర్లు టూర్ అంతటా ప్రయాణిస్తారని తెలియజేశారు. అన్ని రకాల పన్నులు వర్తిస్తాయని తెలిపారు. యాత్ర కోసం ఐఆర్సీటీసీ రైల్వే రిటైరింగ్ రూమ్, విజయవాడ రైల్వే స్టేషన్, ఫోన్ నంబర్ 9281495848ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయల విత్తనాలు పంపిణీ
రేపల్లె: చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ట్ ట్రస్ట్ సహకారంతో బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు న్యూట్రి కిచెన్ గార్డెన్ కార్యక్రమంలో భాగంగా పలు రకాల కూరగాయల విత్తనాలను ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత సోమవారం పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో విత్తనాలు నాటడంతో కేంద్రాలకు అవసరమైన కూరగాయలు పండించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ఫౌండేషన్ వారు అందించటం అభినందనీయమన్నారు. మండలంలోని చోడాయపాలెం, బొబ్బర్లంక, పెనుమూడి, విశ్వేశ్వరం, పిరాట్లంక, తుమ్మల, కారుమూరు, నల్లూరుపాలెం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలకు న్యూట్రీ కిచెన్ గార్డెన్ విత్తనాలు పంపిణీ చేశారు. ప్రోగ్రామ్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
తెనాలి రూరల్: పట్టణంలో గంజాయిను విక్రయిస్తున్న ముఠాని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది నుంచి రూ. 3.15 లక్షల విలువైన 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో రూరల్ సీఐ ఆర్. ఉమేష్ సిబ్బందితో కలిసి అంగలకుదురు గ్రామ శివారు ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని నిమ్మ తోటలలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా జల్సాలకు అలవాటు పడి ఒడిశా నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతోంది. సంగం జాగర్లమూడికి చెందిన అబ్దుల్ రషీద్, పట్టణంలోని సీఎం కాలనీకి చెందిన షేక్ నాగూర్, ముత్తెంశెట్టివారిపాలేనికి చెందిన రాహుత్ సాల్మన్ అలియాస్ కాటరాజు, పట్టణ పినపాడు గేట్ సమీపంలో నివసించే బలసాని ప్రభాస్ అలియాస్ పండు (మైనర్), ప్రత్తిపాడుకు చెందిన షేక్ గౌస్, ఒడిశాకి చెందిన (ప్రస్తుతం గుంటూరు మండలం దాసరిపాలెంలో ఉంటున్న) బసంతి నాయక్ అలియాస్ సమీర్ నాయక్, విజయవాడ గొల్లపూడికి చెందిన గొర్ల వెంకటేష్, తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన షేక్ నసీరుద్దీన్, పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన నూనె విజ్ఞమణికుమార్ సాయి అలియాస్ గని, అయితానగర్‌కు చెందిన గుంజి నాగమల్లేశ్వరరావు, జొన్నాల సాయిసిద్ధు(మైనర్), పట్టణంలోని ప్యాడిసన్పేటకు చెందిన పల్లె సిద్ధు(మైనర్), గంగానమ్మపేటకు చెందిన కనపర్తి రాజా(మైనర్)లు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ముఠాలో కొందరిపై ఇప్పటికే రౌడీ షీట్లు, సస్పెక్ట్ సీట్లు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. గంజాయి గురించి తెలిస్తే వెంటనే 1972 ఈగల్ నంబర్‌కి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజల్ని కోరారు. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహాలను జిల్లా ఎస్పీ సతీష్ అందజేశారు. సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు, రూరల్ సీఐ ఉమేష్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 21 కిలోల సరకు స్వాధీనం 13 మంది అరెస్ట్ నిందితుల్లో నలుగురు మైనర్లు -
గంజాయి కేసులో ముగ్గురికి జైలు
తీర్పు వెల్లడించిన గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి బాపట్లటౌన్: గంజాయి క్రయ, విక్రయాలకు పాల్పడిన ముగ్గురికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... కర్లపాలెం మండల పరిధిలోని చేపల మార్కెట్ సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన దాసరి శ్రీనివాసరావు, ఏలూరు పట్టణానికి చెందిన గాలం పాపారావు, విశాఖపట్నం జిల్లా రొల్లగుంట మండలం చెన్నగోపాలపట్టణం గ్రామానికి చెందిన అప్పలనాయుడు పోతురాజులకు జైలు శిక్ష విధించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామంలోని రాజీవ్ నగర్ రోడ్డులోని చేపల మార్కెట్ సమీపంలో ఒక ఇంటిలో దాసరి శ్రీనివాసరావు, తోకల పిచ్చయ్య(మృతుడు)లు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో 2014 డిసెంబర్ 30న అప్పటి బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ వి.మల్లికార్జునరావు దాడి చేశారు. ఇరువురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గంజాయి సరఫరా చేస్తున్న ఏలూరు పట్టణానికి చెందిన గాలం పాపారావు, విశాఖపట్నం జిల్లా రోల్లగుంట మండలం చెన్నగోపాలపట్నం గ్రామానికి చెందిన పోతురాజు అప్పలనాయుడులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ప్రథమ అదనపు జిల్లా న్యాయస్థానంలో కేసు విచారణకు రావడంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్సై రవీంద్రలు కేసు ట్రైల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ, సరైన రీతిలో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులకు తర్ఫీదు ఇచ్చారు. కోర్టు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కె.శివాజీ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి విఎల్ఏ సత్యవతి ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి 4 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కురగల్లులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తాడేపల్లి రూరల్ : మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో సోమవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివిసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపాడు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: జిల్లాలోని వివిధ లే అవుట్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరం నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. పూర్తయిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న వాటిని ప్రతి వారం లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఆప్షన్–1, 2లో ఆర్థిక సాయం పొందిన వారు వీలైనంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. పేదలను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పీ–4 కార్యక్రమంపై గ్రామ సభలు, దాతల మ్యాపింగ్, నీడ్ అసిస్మెంట్ సర్వే సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుర్తించిన బంగారు కుటుంబాలను విశ్లేషించిన లక్ష్యాల మేరకు దాతలతో మ్యాపింగ్‌ను ఆగస్టు 10లోపు పూర్తి చేయాలని ఆమె చెప్పారు. తల్లికి వందనం పథకంలో నగదు పొందని లబ్ధిదారులు ఇచ్చిన అర్జీల సర్వే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాకల నిర్మాణం, దాణా సాగు, ఉద్యాన పంటల సాగుకు గ్రామాల వారీగా ఎంపీడీవోలు వెంటనే ప్రతిపాదనలు తెలపాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో సీపీఓ శేషశ్రీ , హౌసింగ్ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ శంకర్ పాల్గొన్నారు. ధర్మస్థల ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయాలి లక్ష్మీపురం: కర్ణాటకలోని మంజునాథ దేవాలయం ధర్మస్థలలో వందలాది మంది యువతులు, మహిళలపై అత్యాచారం, హత్యోదంత ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి అన్నారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగంభవన్ నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాల పరంపర మనసును కలిచి వేస్తోందని తెలిపారు. ఆశ్రమాలు, ఆలయాలు ఆధ్యాత్మిక చింతన, భక్తి పేరుతో మహిళలను వంచిస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో పలువురు పెద్ద మనుషులుగా, మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ బీజేపీ నాయకులే మంజునాథ్ దేవాలయం ట్రస్టీలుగా ఉన్నారని, వారి కనుసన్నల్లోనే ఈ అరాచకాలన్నీ జరిగాయని తెలుస్తోందన్నారు. ధర్మస్థల ఉదంతంపై దర్యాప్తును వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. -
అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి
ఎస్పీ తుషార్ డూడీ బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 60 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు, పీజీఆర్ఎస్ సెల్ సీఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దళిత సర్పంచ్‌పై సీఐ దాడి దుర్మార్గం
పర్చూరు(చినగంజాం): కారంచేడు మండలం దగ్గుబాడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, దళితుడు గేరా రవీంద్రనాథ్ ఠాగూర్‌పై సీఐ దాడి దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు పేర్కొన్నారు. సీఐ తీరుని నిరసిస్తూ సోమవారం దళిత నాయకులు సమావేశమయ్యారు. రాంబాబు మాట్లాడుతూ కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్న కారణంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈనెల 19వ తేదీ శనివారం పోలీస్ నిబంధనలకు అనుగుణంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కూర్చొనే గదిలో ఆయన కుర్చీ వెనుక ఉన్న అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించి సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలను పెట్టాలని సీఐ హెచ్చరించినట్లు తెలిపారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు పెట్టే విషయంలో ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఒక ప్రజాప్రతినిధికి అతని ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని, అప్పటికే సదరు చిత్రపటాలను తన గదిలో ఎదురుగా పెట్టుకున్నాడని ఆ విషయాన్ని ఉద్దేశించి అతనిపై చేయిచేసుకోవడం సమంజసం కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించ లేదని, లా అండ్ ఆర్డర్‌ను అతిక్రమించిన వారిపై పోలీస్‌లు చేయిచేసుకోవడం సమర్థనీయం కాదన్నారు. ఈ విధంగా చిత్రపటాలను పెట్టే అంశాలను రాజకీయం చేయడం తగదని, రాజకీయ ప్రలోభాలకు, స్థానిక నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు. సమావేశంలో దగ్గుబాడు సర్పంచ్ గేరా రవీంద్రనాథ్ ఠాగూర్, గేరా స్వరాజ్ కుమార్, కూరాకుల ఇస్సాక్, గుజ్జనగుండ్ల చిన్న తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు -
గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదు!
తాడేపల్లి రూరల్ : గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదని, జిల్లాలోని ఏ గోశాలలోనూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రబాలెంలోని శ్రీ కృష్ణానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోశాల నిర్వహణపై పలువురు సామాజిక మాద్యమాల ద్వారా ఫిర్యాదుతో ఆయన మంగళగిరి కమిషనర్ అలీమ్ బాషా, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్రలతో కలసి గోశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ గోశాల నిర్వాహకులు సతీష్‌ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలసి గోశాల ఆవరణను పరిశీలించారు. ఓ షెడ్డులో గో మూత్రం, పేడతో నిండిపోయి దుర్వాసన రావడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మృత్యువాత పడిన గోవులపై ఆరా తీశారు. ప్రస్తుత వర్షాకాలంలో గోవులు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని తెలిపారు. ఎండా కాలంలోనూ మృత్యువాత పడే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గోశాల అస్తవ్యస్త నిర్వహణపై నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వానికి పంపనున్నట్లు జేడీ సత్యనారాయణ తెలిపారు. యర్రబాలెం గోశాలను తనిఖీ చేసిన జేడీ అపరిశుభ్రతపై ఆగ్రహం -
బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు వేగం పెంచాలి
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై అధికారులు, బయ్యర్లతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 13 పొగాకు కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. గడిచిన వారంలో 1,765 టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ 325 మంది రైతుల నుంచి 650 టన్నులకు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు కంపెనీలు విస్తృతంగా కొనుగోలు ప్రక్రియలో పాల్గొనాలన్నారు. కంపెనీల నిర్ణయాలు, లక్ష్యాలు అధికంగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 24 కంపెనీలు పొగాకును కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. అన్ని కంపెనీలు కలిపి మొత్తం 32 వేల మెట్రిక్ టన్నుల పొగాకును రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు 4.40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరో 2.0 లక్షల మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వ చేయడానికి పొరుగు జిల్లాల్లో గోదాములను పరిశీలిస్తున్నామన్నారు. పొగాకు కొనుగోలు ప్రక్రియకు రెండు నెలలు గడువు ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆగస్టు 31వ తేదీ వరకు 2,500 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడానికి షెడ్యూల్ ఇచ్చామన్నారు. బాపట్ల జిల్లాలో 13,777 మంది రైతుల పేర్లు యాప్‌లో నిక్షిప్తం చేశామన్నారు. ముందుగా చిన్న, సన్న కారు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నామన్నారు. నాలుగు రోజుల్లో ఆయా కొనుగోలు కేంద్రాలలో కంపెనీలు కొనుగోలు వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. పొగాకు కొనుగోలు లక్ష్యాలు మరింత పెంచేలా నిర్ణయాలు ప్రకటించాలన్నారు. పొగాకు కొనుగోలు చేసే సమయంలో అధికారులు తేమ శాతాన్ని 20 కంటే మించకుండా పరిశీలించాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లవన్న, పొగాకు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ టీబీ వ్యాధిగ్రస్తులు సంపూర్ణ ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్‌ను సోమవారం అందించారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ జిల్లాలో 1056 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు రెండు నెలలకు సరిపడే 11 రకాల పౌష్టికాహార కిట్స్‌ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ షేక్ మొహమ్మద్ సాదిక్, జాతీయ క్షయ నిర్మూలన సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక సరఫరాకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఐవీఆర్ఎస్లో ప్రజాభిప్రాయ సేకరణపై వచ్చిన ప్రతికూలతపై జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఇసుకను ఇంటికి వద్దకు చేర్చడంలో టన్నుకు ఎంత వసూలు చేస్తున్నారో సంబంధిత వివరాలను ఇసుక కొనుగోలు చేసిన వ్యక్తులతో జిల్లా కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు వారు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో గాజుల్లంక బీచ్ నుంచి మాత్రమే ఇసుకను సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతం అక్కడ లారీలు వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వలన ఇతర ప్రాంతాల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నందున ధరలో మార్పు వచ్చిందని కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. గాజుల్లంక బీచ్ నుంచి ఇసుక సరఫరాకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాజుల్లంక బీచ్‌లో 20 వేల టన్నులు మాత్రమే ఇసుక నిల్వ ఉందని, ఈ నిల్వలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇసుక కొరతను అధిగమించేందుకు ఇతర జిల్లాల నుంచి ఇసుకను బాపట్లకు తరలించి నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్, గనుల శాఖ ఏడీ డి.రామచంద్ర, రవాణా శాఖ అధికారి పరంథామరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అరుదైన కళతో భారత్‌కు శుభాకాంక్షలు
3 గ్రాముల చెస్‌బోర్డు తయారు చేసిన చీరాల స్వర్ణకారుడు చీరాల అర్బన్: ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌కు సోమవారం ఓ స్వర్ణ కళాకారుడు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనకున్న అరుదైన కళతో వెండి, బంగారాన్ని ఉపయోగించి మూడు గ్రాముల బరువు, 3.3 సెంటీమీటర్లతో అతి సూక్ష్మమైన చెస్ బోర్డు తయారు చేశా రు. ఇక బియ్యం గింజ సైజులో రాజు, రాణిలు, అదే విధంగా ఆవగింజ సైజులో భటులు, గుర్రాలు, ఏనుగులను తయారు చేసి దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.ఈ చదరంగం కిట్ అంతా కేవలం రెండు రూపాయల కాయిన్ సైజులో ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ ఇద్దరు భారతీయ మహిళలు తలపడడంతో ఇక చాంపియన్ షిప్ ఇప్పటికే ఇండియా ఖాతాలో పడిపోయిందని, తాను తయారు చేసిన సూక్ష్మ చెస్ బోర్డును ఫైనల్లో తలపడిన ఇరువురు క్రీడాకారులకు అంకితం చేస్తానని వెంకటేష్ చెప్పారు. గతంలో కూడా జాతీయ పతాకాలు, అమరవీరుల స్థూపాలు, ఆలయాలు, వరల్డ్‌కప్ ఇలా అనేక సూక్ష్మ కళారూపాలను తయారు చేశానని తెలిపారు. -
వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు
గుంటూరుమెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులు– 20, ల్యాబ్ టెక్నీషియన్లు–3, డేటా ఎంట్రీ ఆపరేటర్లు–16, ఎల్‌జీఎస్‌లు–47 పోస్టులకు సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రా ల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు నిరంతరంగా అందించాలని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లామ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, పరిపాలనా అధికారి లక్ష్మీకుమారి, ఆఫీస్ సూపరింటెండెంట్ భక్తవత్సలం, అకౌంట్ ఆఫీసర్ కృష్ణకుమారి, డీపీఓ సైమన్ రాజు పాల్గొన్నారు. నేడు జీజీహెచ్‌లో ఓపీ ఆన్లైన్ సేవలకు అంతరాయం గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఏబీడీఎం ఈ– హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఓపీ, లేబరేటరీ, ఇన్ పేషంట్ సేవలను డిజిటల్ విధానంలో చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న ఏబీడీఎం వర్షన్ నెక్ట్స్‌జెన్ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మైగ్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. దీని వల్ల సాయంత్రం 9 గంటల వరకు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సిబ్బంది, రోగులు గమనించి ఆసుపత్రి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కురగల్లులో ఘర్షణ తాడేపల్లిరూరల్: మంగళగిరి మండల పరిధిలో ని కురగల్లులో సోమ వారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయి మ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు గాయమైంది. -
విద్యార్థుల మెదడుకు పదును
● శాసీ్త్రయ పరిశోధనల దిశగా ప్రోత్సాహం ● విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష ద్వారా ఎంపిక ● పరిశోధనలు, ప్రయోగాలపై ఆసక్తి కనబర్చే విద్యార్థులకు పుష్కల అవకాశాలు ● పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ● హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఆన్లైన్లో మొదలైన రిజిస్ట్రేషన్లు గుంటూరు ఎడ్యుకేషన్/సత్తెనపల్లి: విద్యార్థుల మెదడుకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా వారిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయస్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వీవీఎం 2025–26 ముఖ్యాంశాలు జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఆర్టీ) జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వీవీఎం సైన్స్ ప్రతిభా పరీక్షకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షను ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ భాషల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులను పరిశోధన, ప్రయోగాల వైపు ప్రోత్సహించడం దీని లక్ష్యం. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ఉన్నత చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. శాస్త్ర, పరిశోధనలకు ప్రోత్సాహం విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం, సంప్రదాయ యుగం నుంచి ఆధునిక యుగం వరకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన సహకారాల గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించడం వీవీఎం ముఖ్య ఉద్దేశం. వర్క్‌షాప్‌లు, కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందించి, శాసీ్త్రయ దృక్పథం ఉన్న విద్యార్థులను గుర్తించడానికి పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. శాసీ్త్రయ రంగంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధనల దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు మార్గదర్శకులను అందించడం లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవంతమైన విద్యార్థులను గుర్తించి, వారిని సత్కరించడం, దేశంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థలకు విజేతల కోసం ఎక్స్పోజర్ సందర్శనలను నిర్వహించడం ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. పరీక్షకు రిజిస్ట్రేషన్ అక్టోబర్‌లో జరగనున్న ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విద్యార్థుల తాము చదువుతున్న పాఠశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థులు వ్యక్తిగతంగానూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివిధ దశల్లో జరగనున్న వీవీఎం ప్రతిభా పరీక్ష సిలబస్, సబ్జెక్టు పరమైన సందేహాలు నివృత్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలకు vvm. org. in సైట్లో బ్రోచర్, నోటిఫికేషన్ పరిశీలించాలి. -
ప్రజా సమస్యలపై స్పందించకుంటే చర్యలు
● అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ● పీజీఆర్ఎస్లో వచ్చే వినతులు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ జె.వెంకటమురళి బాపట్ల: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం అలసత్వం చూపినా సహించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి హెచ్చరించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు నేరుగా స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిపత్రాన్ని తక్షణమే పరిష్కరించేలా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. మొత్తం 200 వినతులు అందగా, పలు సమస్యలకు తన సమక్షంలోనే పరిష్కారం చూపారు. మిగిలిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కారానికి సంబంధించిన విషయాలను రాష్ట్రానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్షలో బాపట్ల జిల్లా 19వ స్థానంలో నిలవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే సమీక్షలో జిల్లా స్థానం మెరుగుపడకపోతే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించబోమని, తగిన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ గ్లోరియ, డీఆర్డిఏ పీడీ శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. -
బాపట్ల
అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు సత్తెనపల్లి: వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీ గోదాదేవి, శ్రీలక్ష్మీ అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు నిర్వహించారు.గోవాడలో శ్రావణ పూజలు అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో కొలువైన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రావణ పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోదాదేవి జన్మదిన వేడుకలు మాచర్ల: మాచర్ల శ్రీ కోదండరామాలయంలో సోమవారం గోదాదేవి అమ్మవారి జన్మది న వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 20257 -
డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
పెదకాకాని(ఏఎన్యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్– మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల రెండో సెమిష్టర్ పరీక్ష ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీఈ ఏ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరీక్షలకు అన్ని కోర్సుల నుంచి 9991 మంది హాజరు కాగా, 5642 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత 56.47 శాతంగా ఉందన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ల ద్వారా పొందవచ్చని సూచించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీలకు ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫీజు వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచామని చెప్పారు. వెబ్‌సైట్‌ను పరిశీలించి సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య కృష్ణారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఎ. శివప్రసాదరావు, పరీక్షల విభాగం నోడెల్ ఆఫీసర్ ఆర్. ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
పల్నాట నెత్తుటి తూటా
ఒకప్పుడు కక్షలతో రగిలిన పల్నాడు గడ్డపై గత ఐదేళ్లలో శాంతి, సామరస్యం వెల్లివిరిశాయి. సంక్షేమ పథకాలు చేతికంది, పిల్లలు ఉన్నత చదువులవైపు మళ్లడంతో అక్షర చైతన్యం పెరిగింది. పల్లె సీమలలో ఆరోగ్యకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పురివిప్పాయి. తాజాగా రియల్టర్ల మర్డర్లతో కిడ్నాపింగ్, రివాల్వర్ సంస్కృతి ప్రవేశించింది. పల్నాడును భయం గుప్పెట్లోకి నెట్టేసింది. జంట హత్యల కేసులో పోలీసుల తీరు అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తడంతో తమకు న్యాయం జరిగేనా అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు.నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన జంట హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జరిగిన ఈ హత్యల వెనుక కూటమి ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కే వీరాస్వామిరెడ్డి, కేవీ ప్రశాంత్‌రెడ్డి తండ్రీకొడుకులు. గత బుధవారం చెల్లని చెక్కు కేసులో నరసరావుపేట కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన వారిని కోర్టు ఎదుట కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా పాతమాగులూరు వద్ద హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితులు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో కిడ్నాప్ చేసేందుకు సాహసించిన తీరు, హత్యలు చేసిన వైనాన్ని పరిశీలిస్తే ప్రభుత్వంలోని పెద్దల అండ చూసుకొని బరితెగించినట్టు తెలుస్తోంది. కేసు నమోదులో కూడా పోలీసుల నిర్లక్ష్యం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన దుండగులు 20 నిమిషాల వ్యవధిలోనే ఇద్దర్నీ హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతుల తరఫు న్యాయవాది నాగభూషణ్ ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మృతదేహాలు పాతమాగులూరులో లభ్యమైన కారణంగా సంతమాగులూరు పోలీసులు అక్కడ మర్డర్ కేసు నమోదు చేశారు.సాధారణంగా కంటిన్యూషన్ అఫెన్స్ జరిగినప్పుడు సంఘటన ప్రారంభమైన స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేయాలి. కానీ జంట హత్యల కేసులో మాత్రం గత కేసులకు భిన్నంగా రెండు జిల్లాల పరిధిలోని పోలీసులు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇద్దరు స్టేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపిస్తే కేసు నీరుగారే ప్రమాదం ఉంది. జంట హత్యల కేసులో ప్రభుత్వం ప్రారంభంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మృతుల తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసుల తప్పిదాన్ని ఎత్తిచూపుతూ కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేయాలని హైకోర్టును ఆశ్రయించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మాధవరెడ్డి టీడీపీ నాయకుడే.. పట్టపగలు కోర్టు ప్రాంగణం ఎదుట ఇద్దర్ని అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై వస్తున్న విమర్శలను మరుగునపెట్టి.. ఎప్పటిలాగే ఈ ఘటనను కూడా వైఎస్సార్సీపీ నెత్తిన రుద్దేందుకు కుట్ర జరుగుతోంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాదం మాధవరెడ్డి గతంలో కొంత కాలం వైఎస్సార్సీపీలో ఉన్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే మాధవరెడ్డి ప్రస్తుతం ఏ పారీ్టలో ఉన్నాడు? గత సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కోసం పని చేశాడు? ఎవరి అండదండలతో ఇంత దారుణానికి ఒడిగట్టాడనే అంశాలను పరిశీలిస్తే అన్ని వేళ్లూ కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు 2023 సెపె్టంబర్ 10వ తేదీన అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబును కలసి మద్దతిచ్చిన ఫొటోలను ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.దీంతోపాటు యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ కు స్వాగతం పలుకుతూ మాధవరెడ్డి ఫొటోలతో అతని అనుచరులు వేసిన ఫ్లెక్సీలు ఏ పార్టీ వాడో చెప్పకనే చెబుతున్నాయి. ఈ వాస్తవాలను మరుగున పరిచేందుకు కొన్ని పచ్చ పత్రికలు పదేళ్ల క్రితం మాధవరెడ్డి ఉన్న పార్టీ ప్రస్తావన తీసుకువచ్చి ప్రభుత్వానికి మచ్చ లేకుండా చేసేందుకు తెగ ప్రయతి్నస్తున్నాయి. టీడీపీ నేతల అండ చూసుకుని మాధవరెడ్డే స్వయంగా కిడ్నాప్, హత్యల ఘటనలో పాల్గొన్నట్టు అర్థమవుతోంది. తండ్రీకొడుకులను మాధవరెడ్డి బలవంతంగా కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలలో నిక్షిప్తమయ్యాయి.టీడీపీ నేతలతో సంబంధాలు.. నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు పరి«ధిలో హత్య చేయడం వెనుక ముందస్తు వ్యుహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సంతమాగులూరు గ్రామానికి చెందిన నిందితుడు బాదం మాధవరెడ్డికి బాపట్ల, ప్రకాశం జిల్లాలలో అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా పరిధి దాటగానే బాపట్ల జిల్లా ప్రారంభమైన 200 మీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ వెంచర్లో హత్యలు చేశారు. ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి పరారయ్యారు. -
ప్లేట్లెట్లపై అపోహలు వీడండి
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గటం సహజం. అంతమాత్రానికే ఊరికే రోగులు కంగారు పడకూడదు. సాధారణంగా రక్తంలో 2 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదం లేదు. డెంగీ మొదటి దశలో జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారతాయి. రెండో దశలో ప్లేట్లెట్స్ తగ్గటం, జ్వరం, వాంతులు, కాళ్ల వాపులు వస్తాయి. మూడో దశలో బీపీ తక్కువగా ఉండటం, ప్లేట్లెట్స్ తగ్గటం, శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. నాలుగో దశలో రోగికి కామెర్లతోపాటుగా షాక్‌లోకి వెళతాడు. బీపీ తగ్గడంతోపాటు కిడ్నీల పనితీరు కూడా తగ్గిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. అవి పగిలి రక్తం బయటకు వస్తుంది. మూత్రంలో, దగ్గు తున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. నాలుగో దశను డెంగీ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ అంటారు. మొదటి మూడు దశలలో ఎలాంటి భయాందోనలు చెందాల్సిన పనిలేదు. – డాక్టర్ కోగంటి కల్యాణ్ చక్రవర్తి, జ్వరాల స్పెషలిస్ట్, గుంటూరు. -
అప్రమత్తతతో డెంగీకి చెక్
గుంటూరు మెడికల్: డెంగీ జ్వరం... ఈ మాట వినగానే జిల్లా ప్రజల్లో వణుకు పుడుతుంది. గతంలో అధికంగా కేసులు జిల్లాలోనే నమోదవ్వడంతో హెల్త్ ఎమర్జన్సీ సైతం ప్రకటించారు. డెంగీ జ్వరంతో మరణాలు కూడా సంభవించాయి. సాధారణంగా కొన్ని జ్వరాలు వచ్చిన కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో జ్వరాలు వస్తుంటాయి. కానీ మండుటెండల్లోనూ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట జ్వర బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డెంగీపై కొద్దిపాటి అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండొచ్చు. ఇవీ.. లక్షణాలు పగటి పూట కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. వాంతులు, తలనొప్పి, కంటి గుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అయినట్లు భ్రాంతి కల్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఒంటిపై ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. ఎలీసా పద్ధతిలో రక్త పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అపోహలతో ప్రాణాల మీదకు.. డెంగీపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంత మంది బొప్పాయి రసం తాగితే, బొప్పాయి తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డెంగీపై అవగాహనతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం బారిన పడకుండా ఉండొచ్చు. పట్టణాల్లో కేసులు అధికం గ్రామీణ ప్రాంతాల్లో కంటే మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది గుంటూరు నగరంలో 31 కేసులు నమోదయ్యాయి. నగరంలోని భాగ్యనగర్, బొంగరాలబీడు , బృందావన్ గార్డెన్స్, గోరంట్ల, కోబాల్డ్‌పేట, గుండారావుపేట, గుంటూరువారితోట, శారదాకాలనీ, ఆర్.అగ్రహారం, వసంతరాయ పురం, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, ఎన్జీఓ కాలనీ, మంగళదాస్ నగర్, లాంచెస్టర్రోడ్, ఐపీడీకాలనీ, గుంటూరువారితోట, లాలాపేట, తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల వివరాలు సంవత్సరం బాధితుల సంఖ్య 2021 447 2022 168 2023 375 2024 432 2025 50 (జూన్ వరకు) జిల్లాలో 50 కేసులు నమోదు అపోహలతో ప్రాణాలు పోయే ప్రమాదం కొద్ది జాగ్రత్తలతో జ్వరానికి అడ్డుకట్ట డెంగీ పేరుతో ప్రైవేటు వైద్యుల దోపిడీ దోమలు పెరిగే ప్రదేశాలివీ.. మంచినీటిని నిల్వ చేసే ప్రదేశంలో, వాడి పారేసిన వస్తువులు, నిలువ ఉండే నీటిలో దోమ పిల్లలు పురుగుల మాదిరి కదులుతూ ఉంటాయి. నీటిని నిల్వచేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బురోళ్లు, వాడి పారేసిన టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, కొబ్బరి చిప్పలు, బొండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్ల వెనుక భాగాల్లో, పూల కుండీలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో ఈ దోమ లార్వాలు పెరుగుతాయి. -
కలిసికట్టుగా సమస్యలపై పోరాటం
అద్దంకి: నూర్బాషాలందరూ కలిసికట్టుగా ఉంటే సమస్యలపై పోరాటంతో విజయాలు సాధించవచ్చని రాష్ట్ర నూర్ బాషా యువజన సంఘం అధ్యక్షుడు దూదేకుల పెద మస్తాన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని షాదీఖానాలో సమావేశం నిర్వహించారు. పట్టణ నూర్ బాషా దూదేకుల కమిటీ అధ్యక్షుడిగా షేక్ మదీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో మస్తాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూర్ బాషా దూదేకుల ఆర్థిక సంస్థ ఏర్పాటు చేయడం సంతోషమని చెప్పారు. రానున్న రోజుల్లో ఏకతాటిపై ఉండి సమస్యల పరిష్కారం చేయాలన్నారు. రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ దూదేకుల దావూద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పిల్లలకు సర్టిఫికెట్లో లోపాలు జరుగుతున్నాయని వివరించారు. నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా కొటికలపూడి శ్రీనును, అద్దంకి యూత్ అధ్యక్షుడిగా ఎలిల్ సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా షైక్ సైదా వలి, కె.మీరావలి, ఉపాధ్యక్షులుగా అహమ్మద్, షేక్ అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా వేల్పూరి మస్తాన్ వలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ అజిజ్, ఎంప్లాయీస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సర్పరాజ్, రాష్ట్ర కార్యదర్శి అహ్మద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాని, సంఘ పెద్దలు పాల్గొన్నారు. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం
తాడేపల్లి రూరల్ : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ప్లాజాలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కూడారి తిరుపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వినియోగదారులు పడుతున్న సమస్యలకు పరిష్కారం, హక్కులపై ఫోరం అవగాహన కల్పిస్తోందని తెలిపారు. వినియోగదారులు తమకు జరిగిన నష్టంపై మంగళగిరిలో నూతనంగా ప్రారంభించిన జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు బొమ్ము జస్వంత్‌రెడ్డి, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు టి.రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రియారెడ్డి, యూత్ జిల్లా ఇన్చార్జి షేక్ రిజ్వాన్, యూత్ వింగ్ ప్రతినిధి రాజ్‌కుమార్ పాల్గొన్నారు. యోగాలో లిమిట్లెస్ సెంటర్ విద్యార్థులకు పతకాలుగుంటూరు వెస్ట్ (క్రీడలు): యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని సుమేధ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగసన పోటీల్లో తమ విద్యార్థులు పతకాలు సాధించారని యోగా టీచర్ వంగా వెంకటేష్ తెలిపారు. 10–14 ఏళ్ల వయస్సు విభాగంలో గోహితకు కాంస్యం, 18–28 ఏళ్ల విభాగంలో పి.భార్గవికి స్వర్ణం, కాంస్యం, 28–35 ఏళ్ల విభాగంలో వి.వెంకటేష్‌కు రెండు స్వర్ణాలు, 35–45 ఏళ్ల విభాగంలో రేణుక రెండు బంగారు పతకాలు సాధించారన్నారు. యోగాసనాలతోపాటు ఆహార అలవాట్లు మార్పు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతం అవుతుందని తెలిపారు. విజేతలకు, పోటీల్లో పాల్గొన్న వారికి లిమిటెస్ ఫిట్నెస్ సెంటర్ అధినేత నీలిమ అభినందనలు తెలిపారు. వైభవంగా గిరిజా కల్యాణం నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారంలోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం గిరిజా కల్యాణం వైభవంగా నిర్వహించారు. వామనాశ్రమ స్వామిజీ మాట్లాడుతూ గిరిజా కల్యాణం నిర్వహించడం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని అన్నారు. త్వరగా పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో త్వరగా పెళ్లిళ్లు కావాలని ఆశీర్వదించారు. గిరిజా కల్యాణాన్ని వేద పండితులు (శ్రీకాళహస్తి) శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దాదాపు 200 మంది యువతీ, యువకులకు తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్ఎస్ఆర్ ఆంజనేయులు, గుడివాడ రవీంద్ర, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరు సురేష్, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. సుబ్బారాయుడి సన్నిధిలో భక్తుల రద్దీ మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఆలయం లోపల, వెలుపల కూడా క్యూలైనులో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. భక్తుల వాహనాలతో పార్కింగ్ ప్రదేశం, ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆలయలో నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
మంత్రి గారూ... సమస్యలు పరిష్కరించండి !
జె.పంగులూరు: మండలంలోని చందలూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికీ వెళ్లి సుపరిపాలన కరపత్రాలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టారు. బీసీ కాలనీలో కొంత మంది మహిళలు తాగునీరు సక్రమంగా రావడం లేదని మంత్రి రవికుమార్‌కు తెలిపారు. ఇదే కాలనీలో యనమల అంజమ్మ గ్యాస్ డబ్బులు తనకు రావడం లేదని, రూ.20 మాత్రమే ఖాతాలో జమవుతున్నాయని తెలిపింది. కొనుగోలు కేంద్రానికి పొగాకు చెక్కులు తీసుకొని పొతే నాణ్యత పేరుతో వెనక్కి కొడుతున్నారని రైతు కర్రి బ్రహ్మయ్య మంత్రి ముందు వాపోయాడు. అనంతరం చందలూరులో నూతనంగా నిర్మించిన ఎన్టీర్ కళావేదిక వద్ద జరిగిన సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ చందలూరు గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఇప్పటికే రూ.30 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వెల్లడించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం 10 మంది వికలాంగులకు మూడు చక్రాల స్కూటీలు అందించారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. చందలూరు సీఏసీఎస్ అధ్యక్షులుగా బెల్లంకొండ శ్రీధర్‌బాబు, సభ్యులుగా వట్టెం శేషయ్య, మాగులూరు సుబ్బారావు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రి వెంకట సుబ్బారావు, పెంట్యాల రాధాకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు వాసవి, మురకొండ సుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, చింత సహాదేవుడు, పార్టీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్ బాబు, గరిమిడి జగన్మోహనరావు పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు గ్రామస్తుల విన్నపం -
టైప్‌రైటింగ్ పరీక్షలకు 54 మంది హాజరు
రేపల్లె: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైప్ రైటింగ్ పరీక్షలు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇంగ్లిష్ లోయర్‌కు 30 మంది, హయ్యర్ పరీక్షకు 15 మంది, జూనియర్ గ్రేడ్‌కు ఏడుగురు, తెలుగు హయ్యర్‌కు ఒకరు, లోయర్‌కు ఒకరు చొప్పున మొత్తం 54 మంది హాజరైనట్లు పరీక్షల చీప్ సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా ఫ్లోర్ బాల్ ఎంపిక పోటీలు వినుకొండ: పల్నాడు జిల్లా ఫ్లోర్‌బాల్ అండర్ –14, 19 బాలబాలికల ఎంపిక పోటీలు పట్టణంలోని లయోలా పాఠశాలలో నిర్వహించినట్లు పల్నాడు జిల్లా ఫ్లోర్ బాల్ ప్రధాన కార్యదర్శి ఎం.కిశోర్‌బాబు తెలిపారు. పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 3న నరసరావుపేటలోని కె–రిజ్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో లయోలా స్కూల్ హెచ్ఎం అభినా ష్, జిల్లా కార్యదర్శి కిశోర్, పీఈటీలు ఏడుకొండలు, కోటేశ్వరమ్మ, రవితేజ, వివిధ పాఠశాలల నుండి 100మంది బాలబాలికలు పాల్గొన్నారు. తైక్వాండో పోటీల్లో 15 మందికి బంగారు పతకాలు తెనాలి అర్బన్: గుంటూరు జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెనాలి కేఎస్ఆర్ అకాడమి విద్యార్థులు 15 మందికి బంగారు, ఆరుగురికి వెండి, ఇద్దరికి కాంస్య పతకాలు లభించినట్లు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. పోటీలను రేపల్లెలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. వీరందరూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఆదివారం అకాడమి ఆవరణలో క్రీడాకారులకు పతకాలు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, వీరవల్లి మురళి, కుర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటు అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. బుచ్చిరాజు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలోని విశ్రాంత ఉద్యోగులు, ఇంజినీరింగ్ అధికారుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు పెన్షన్, మెడికల్ రీ–యింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో వేతన విభజన చట్టాల ముసుగులో జరుగుతున్న వర్గీకరణ కారణంగా ఇబ్బందులు పడుతూ, నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గానూ అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపుతో ప్రధానికి ఒక వినతి పత్రాన్ని పంపనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ పంచాయతీరాజ్ ఉద్యోగుల ఇంజినీర్ల వేతన సవరణ, బకాయిలు, డీఏలు, మెడికల్ రీ–యింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని వివరించారు. 12వ వేతన సవరణ పూర్తి స్థాయిలోఅమలు చేయడంతో పాటు 35 శాతం ఐఆర్ మంజూరు చేయాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీలో చట్టబద్ధత కల్పించి, 11 పీఆర్సీలో అమలు చేసిన విధంగా అదనపు పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 315ను సవరించి, భార్యాభర్తలకు కుటుంబ పెన్షన్ వర్తించేలా మార్పులు చేయాలని సూచించారు. యూజీసీ స్కేల్స్ పరిధిలోకి వచ్చే పెన్షన్‌దారులకు అదనపు పింఛన్, 10వ పీఆర్సీ తరహాలో రిఫండ్ డెత్ రిలీఫ్ అమలు పర్చాలని కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు ఉద్యోగుల హెల్త్ స్కీం క్లెయిమ్స్‌ను చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ రీ–యింబర్స్‌మెంట్ పూర్తిగా ఈహెచ్ఎస్ కింద చెల్లించాలని, ఆరోగ్య బీమా కార్డులను పరిమితులు లేకుండా అందరికీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్‌దారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు అమరావతిలో భవనం నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులను కలుస్తామని తెలిపారు. సమావేశంలో సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు, కోశాధికారి బి.శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసరావు, ఎం.వి.రంగాచారి, వి.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్ర సంఘ నాయకులు పాల్గొన్నారు. పీఆర్ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆగస్టు 5న ధర్నా
బాపట్ల: ప్రభుత్వ భూములను బడా కంపెనీలకు కట్టబెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి అన్నారు. ఆదివారం బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్‌మీటర్లు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వచ్చే నెల 5న విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నల్లబర్లీ పొగాకు కొనుగోలులో పేద రైతు కౌలు రైతులకు ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కూటమి ప్రభుత్వ పని తీరును పరిశీలిస్తే మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారని విమర్శించారు. ప్రభుత్వంలోని ప్రతి స్థాయిలో అవినీతి అడుగడుగునా రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక చర్యలు, పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీల మోత, స్మార్ట్‌మీటర్ల ప్రమాదం వంటి సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాల్యాద్రి, పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, టి కృష్ణమోహన్, సీహెచ్ మజుందర్, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్, కొండయ్య పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి -
బుల్లెట్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద బైపాస్ రహదారిపై ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తెలిపిన వివరాలు.. మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన దొప్పలపూడి హనుమానాశాస్త్రి, దండా గోపి, మరొక వ్యక్తి కలిసి బుల్లెట్‌పై చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు ఆదివారం వెళ్తున్నారు. తిమ్మాపురం వంతెనపైనా మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం కూడా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనంపై కూర్చున్న వారిలో మధ్యలో ఉన్న వ్యక్తి బుల్లెట్ హ్యాండిల్ పట్టుకున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు మంత్రి అభినందనలు తాడేపల్లి రూరల్: మంగళగిరికి చెందిన యువ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని ఆయన కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో జెస్సీ రాజ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించి, దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించినట్లు ప్రకటనలో వారు పేర్కొన్నారు. -
వేతనాలు అందక ఉపాధ్యాయులకు అవస్థలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు వద్ద ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ–అపోర్షన్మెంట్ గురైన ఉపాధ్యాయులతో పాటు అప్ గ్రేడ్, డీ–గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోని వేలాది మంది ఉపాధ్యాయులకు మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా బ్యాంకు, వ్యక్తిగత రుణ చెల్లింపులు, కుటుంబ ఖర్చులు భారంగా మారాయని పేర్కొన్నారు. విధులకు డెడ్‌లైన్ విధించి, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యాశాఖాధికారులు వేతనాల చెల్లింపుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉపాధ్యాయ ఖాళీల్లో డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరారు. ఇంటర్మీడియట్ తరగతులు బోధిస్తున్న ప్లస్ టూ పాఠశాలల్లోని సబ్జెక్ట్ టీచర్స్ ఖాళీల్లో పీజీ అర్హత గల ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించి, విద్యా ప్రమాణాలు పడిపోకుండా చూడాలని తెలిపారు. గతంతో పోల్చితే యాప్స్ భారం పెరిగిందని, తక్షణమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కటీ ఆన్లైన్లో నమోదు చేయమంటూ, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం తగదని ఖండించారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు రూ.25వేల కోట్ల మేరకు పేరుకుపోయాయని, మూడేళ్లుగా చెల్లింపులు లేక సరెండర్ లీవ్ బిల్స్ మూలన పడ్డాయని తెలిపారు. తక్షణమే ఆయా బకాయిలను చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత గల ఎస్జీటీ, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. ఎంఈవోల బదిలీలు చేపట్టి, కామన్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నాడు–నేడు పనులను పూర్తి చేయాలని కోరారు. పలు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు సరిపడా విద్యార్థులకు అందలేదని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జి.దాస్, ఎస్.ఎస్.ఎన్ మూర్తి, బి.సాయి లక్ష్మి, పి.నాగశివన్నారాయణ, జిల్లా కౌన్సిలర్లు గురుమూర్తి, ముని నాయక్, షేక్ షూకూర్, సుబ్బారావు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు -
ఆట్యా– పాట్యా జిల్లా జట్టు ఎంపిక
నకరికల్లు: పల్నాడు జిల్లా ఆట్యా– పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని పలు ఉన్నతపాఠశాలల నుంచి క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. న్యాయనిర్ణేతలు 15 మంది బాలికలు, 15 మంది బాలురను పల్నాడు జిల్లా జట్టులో ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాణించి రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటాలని ఆట్యా–పాట్యా అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఆగస్ట్ 9, 10వ తేదీలలో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్ కాసా మల్లికార్జునరావు, ఫిజికల్ డైరెక్టర్లు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీరాణి, తిరుమలబాయి, పి.తిరుపతిరావు, పెద్ద వెంకటేశ్వర్లు, అశోక్, పి.ఆంజనేయులు, షేక్.నాగూర్వలి, దరియావలి, వెంకటరమణ పాల్గొన్నారు. బాలికల జట్టులో.. బి.సౌజన్య(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ నజ్మ(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ సుహానా మస్తాని(శ్రీ చైతన్య కళాశాల), కె.వైష్ణవి(జెడ్పీ హెచ్ఎస్, ఎస్.బి.పురం), డి.రంగ మహాలక్ష్మి(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), సీహెచ్ విజయ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), ఎం.స్నేహ(శ్రీచైతన్య), ఎం.దివ్యసన్నిధి(జెడ్పీహెచ్ఎస్, కావూరు), షేక్.జి.సాధిక(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), టి.లిఖిత(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), బి.మేఘన(ఏపీ మోడల్‌స్కూల్, దేచవరం), కె.బుజ్జి(ఏపీ మోడల్ కాలేజ్, దేచవరం), బి.ప్రమీల(జెడ్పీహెచ్ఎస్, కావూరు), పి.దీక్షిత(సింధూ స్కూల్), బి.స్వాతి ప్రియ(సింధూ స్కూల్) ఎంపికయ్యారు. బాలుర జట్టులో.. షేక్ ఇస్మాయిల్(ఏపీ మోడల్ స్కూల్, దేచవరం), పి.వరప్రసాద్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎం.వి.సాయిప్రదీప్(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), కె.శ్రీనివాస్(వాగ్దేవి జూనియర్ కళాశాల, నరసరావుపేట), టి.మణిదీప్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), షేక్ జాన్‌సైదా(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), ఆర్.లక్ష్మీనారాయణ(తిరుమల ఆక్స్ఫర్డ్), జి.లక్ష్మీప్రశాంత్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎస్.సాయితేజ(ఆక్స్ఫర్డ్ విట్), బి.మణికంఠ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), షేక్ నబిరసూల్(జడ్పీహెచ్ఎస్,నకరికల్లు), డి.కోటేశ్వరరావు(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), వై.అఖిల్(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), డి.శ్రీవెంకట అతులిత్(సింధూ స్కూల్), డి.ప్రసూన్(జెడ్పీహెచ్ఎస్, కావూరు) ఎంపికయ్యారు. ప్రతిజట్టులో అదనంగా స్టాండ్బైలో ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. -
కూటమి మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ప్రజలను హామీలతో నమ్మించి మోసం చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు అన్నారు. సుబ్బారెడ్డిపాలెంలో ఆదివారం మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను ప్రతి వ్యక్తి చూపించి, దాని ద్వారా సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నాయకులతో కలిసి క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక విభాగం అధ్యక్షుడు తన్నీరు సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, మైనార్టీ సెల్ విభాగం అయేషా బుడే, లతీఫ్, షంషుద్దీన్, సుభాని, కోటి, శ్రీరాములు, గుంటూరు శ్రీను, కరుణాకర్, చిట్టిబాబు, జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, హరేరామిరెడ్డి, ప్రసంగి, సర్పంచ్ సురేష్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, పోలిరెడ్డి, సురేష్, ప్రభాకరరెడ్డి, శివనాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శివఫణీంద్రరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు -
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జిల్లా వ్యాప్తంగా 210 మందిక్రీడాకారులు హాజరు చినగంజాం: మండలంలోని కడవకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికల కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీ అరుణ్‌కుమార్ ప్రారంభించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలురు, బాలికలకు సంబంధించి ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని చీరాల, బాపట్ల, కడవకుదురు, ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం, చెరుకుపల్లి, చినగంజాం, వేటపాలెం, పందిళ్లపల్లి ప్రాంతాల నుంచి సుమారు 210 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, షాట్‌పుట్, పరుగు, నడక వంటి పలు క్రీడలకు సంబంధించిన ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ కోమట్ల స్వామిరెడ్డి, కార్యదర్శి ఎం.వెంకటరెడ్డి, అథ్లెటిక్ కోచ్ కె. అనంత కుమార్‌రెడ్డి, పీడీ శ్రీనివాసరెడ్డి, బి.లలిత, లక్ష్మీ నారాయణ, మారుతి, మాలతి, సాంబశివరావు, ఉదయభాస్కర్, పలువురు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నుంచి మొగల్ జాన్‌ను సస్పెండ్ చేయాలి
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రైతులు నష్టపోయిన బంగారాన్ని ఇప్పించాలంటూ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కౌలు రైతు సంఘం నాయకుడు హనుమంతరావుపై దాడి చేయటాన్ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య ఖండించారు. అధికార పార్టీకి చెందిన క్రోసూరు మండల అధ్యక్షుడు మొగల్ జాన్ దాడి చేయటం చూస్తుంటే అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందా లేక దొంగల పక్షాన పనిచేస్తుందా అని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులపై దాడులు చేస్తే వెన్నుచూపరని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతర పోరాటం సాగిస్తారన్నారు. ఆదివారం దొడ్లేరు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ దొడ్లేరు గ్రామస్తులు అనంతవరం మీదగా క్రోసూరు వెళ్లడానికి, ఆవులువారిపాలెం మీదుగా బెల్లకొండ వెళ్లడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ అధికారులను కలిసి గ్రామ ప్రజల సమస్యలను విన్నవించామన్నారు. సాగర్ కాలవ నీళ్లు చివరి ఆయకట్టు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు షరతులు లేకుండా రుణాలు కల్పించాలని, అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై. రాధాకృష్ణ, వై.గోపాలరావు గద్దె చలమయ్య, ఆంజనేయులు నాయక్, జి మల్లేశ్వరి, డి విమల. పి మహేష్, అచ్చంపేట క్రోసూరు మండలాల రైతు సంఘం నాయకులు, హనుమంతరావు ఆవుల ఆంజనేయులు, ఆర్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య డిమాండ్ దొడ్లేరులో ప్రదర్శన, రాస్తారోకో -
ఉచితంగా నిర్ధారణ పరీక్షలు
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు కిట్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నాం. కేసులు నిర్ధారణ జరిగితే సమాచారం ఇవ్వాలని, ప్లేట్లెట్స్ పేరుతో భయపెట్టవద్దని ప్రైవేటు వైద్యులందరికీ ఆదేశాలు జారీ చేశాం. ప్రతిరోజూ వైద్య సిబ్బందిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి వివరాలు సేకరిస్తున్నాం. దోమల నివారణ చర్యల్లో భాగంగా గంబూషియా చేప పిల్లలను నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వదిలాం. కేసులు నమోదైన ప్రాంతంలో యాంటీ లార్వా పద్ధతులు, ఫాగింగ్ చేస్తున్నాం. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే ముఖ్య కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు, వర్షపునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నుంచి రక్షణకు ఉదయం, సాయంత్రం సమయాల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమ తెరలు వాడటం చాలా మంచిది. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి, గుంటూరు. -
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీఓ హోంలో చైర్పర్సన్ వి.నిర్మల కుమారి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఎన్జీఓలో ఉన్న వివిధ శాఖల ఉద్యోగుల సంఘాలలో మహిళా ఉద్యోగ సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించి, స్పష్టత కలిగించే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, కోశాధికారి శివలీల, కో కన్వీనర్ వి.వి.లలితాంబ, రాష్ట్ర కార్యదర్శి బి.తులసిరత్నం, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. 582 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 582.90 అడుగులకు చేరింది. ఇది 291.3795 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,151, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
క్రైస్తవుల రక్షణ కోసం పటిష్ట చట్టం తేవాలి
నరసరావుపేట: భారత రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యాంగం మేరకు క్రైస్తవ మైనార్టీల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం రూపొందించి వారిని ఆదుకోవాలని సామాజికవేత్త, జాతీయ క్రైస్తవ, దళిత నాయకుడు డాక్టర్ గోళ్ళమూడి రాజ సుందరబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక బాపనయ్యనగర్ బేతేలు చర్చిలో యూపీఎఫ్ జిల్లా కార్యవర్గం, నేషనల్ క్రిస్టియన్ బోర్డు జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. దీనిలో ముఖ్యవక్తగా గోళ్లమూడి పాల్గొని ప్రసంగిస్తూ 2023లో మణిపూర్‌లో 65వేల కుటుంబాలను మారణ హోమానికి గురిచేసిన సంఘటనపై క్రైస్తవులు దేశంవ్యాప్తంగా భయాందోళనకు గురయ్యారన్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో ప్రపంచ సువార్తికుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు, పాస్టర్లపై దాడులు పెరిగాయన్నారు. పాస్టర్లు స్వేచ్ఛగా సువార్త ప్రకటించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. సమావేశానికి సత్తెనపల్లికి చెందిన షాలోమ్ చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ సుధీర్ కుమార్ అధ్యక్షత వహించారు. యూపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్సీ రావు, మాజీ అధ్యక్షుడు జీవరత్నం, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జిల్లా అధ్యక్షుడు పి.సుబ్బారావు(జోసఫ్) మాట్లాడారు. వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు. పలు క్రైస్తవ సంఘాల డిమాండ్ -
రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శనివారం జూలై నెలకు సంబంధించిన శిక్షణ, సందర్శన వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి లాంఫాం ఏడీఆర్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఏడీఏలు వ్యవసాయ స్థితిగతులు వివరించారు. శాస్త్రవేత్తలు పత్తి, కంది పంటల కట్ ఆఫ్ డేట్స్, వివిధ ప్రాతాలకు అనువైన వరి రకాలు, నేరుగా విత్తన వరిలో కలుపు యాజమాన్యం, జీవన ఎరువుల వినియోగం, ఎండు తెగులును తట్టుకునే కంది రకాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు వంటివి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో పంట వేయకుండా ఖాళీగా ఉంచి అనంతరం శనగ వేయదలచిన రైతులు స్వల్పకాలిక అపరాలు సాగు చేపట్టవచ్చని తెలిపారు. డీఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏటీఎంఏ సహకారంతో వ్యవసాయశాఖ, యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీజన్ ప్రారంభమైన సందర్భంగా విస్తరణ కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు చేపట్టాలన్నారు. నానో ఎరువులు వినియోగం, డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారి, జీవన ఎరువుల పనితీరు, మెషీన్ హార్వెస్ట్‌ను అనుకూలమైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులు రైతులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా డీఏవో శివకుమారి, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్ల ఏడీఏలు, కేవీకే, డాట్, ఉద్యాన, పరిశోధన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలతో జీవితం అంధకారం
– జిల్లా ఎకై ్సజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఖాజీపాలెం(కర్లపాలెం): మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితమే అంధకారం అవుతుందని బాపట్ల జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనర్థాలపై పిట్టలవానిపాలెం మండలంలోని ఖాజీపాలెం కేవీఆర్, ఎంకేఆర్ కాలేజీలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యక్తులతోపాటు సమాజంపై కూడా డ్రగ్స్ వల్ల తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని చెప్పారు. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ పి.గీతిక మాట్లాడుతూ ఆల్కహాల్, డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవని చెప్పారు. డ్రగ్స్‌ను తరిమేద్దాం –ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అని విద్యార్థులతో నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సాదిక్, దేబోరా, సైక్రియాట్రిస్ట్ సందీప్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎరుకల జాతి జిల్లా అధ్యక్షుడి నియామకం వేమూరు: రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు ఎరుకల జాతి బాపట్ల జిల్లా అధ్యక్షులు బాలిక శిమన్నారాయణ ఎంపిక చేసినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చిరంజీవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేమూరు మండల గ్రామానికి చెందిన శిమన్నారాయణ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు. హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ రేపల్లె: మండలంలోని పేటేరు గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేటేరులోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం తాగే విషయంలో గొడవలో నిజాంపట్నం మండలం కూచినపూడి గ్రామానికి చెందిన గున్నం వెంకటేశ్వర్లు, గున్నం వరదయ్యలు కలిసి శ్రీను అనే వ్యక్తిని సీసా గాజుతో హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. వరదయ్య, వెంకటేశ్వర్లు ప్రస్తుతం తెనాలిలో ఉంటుందన్నారని పేర్కొన్నారు. శ్రీను వివరాలు తెలియరావాల్సి ఉందన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా, 15 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. -
పెండింగ్ కేసుల్లో అరెస్ట్‌లు త్వరితగతిన చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల్లో అరెస్ట్‌లను త్వరితగతిన చేయాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో శనివారం అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో పోలీసుల చర్యలు వేగవంతంగా ఉండాలని తెలిపారు. తద్వారా న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షలు ఖరారవుతాయని అన్నారు. ఎప్పటికప్పుడు కేసులకు సంబంధించి సమాచారం సీసీటీఎన్ఎస్లో నమోదు చేయాలన్నారు. గడువులోగా చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేయాలని చెప్పారు. జిల్లాలో 170 మంది రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. వారిలో పీడీ యాక్ట్ పెట్టాల్సిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అన్నారు. డ్రోన్ల సాయంతో నగర, శివారు ప్రాంతాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, ముళ్లపొదలపై నిఘా ఉంచాలన్నారు. తద్వారా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలని చెప్పారు. విధుల్లో పోలీస్ అధికార, సిబ్బంది విధిగా బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బర్కత్ అలీ మాట్లాడుతూ పోక్సో, ఇతర కేసుల్లో చార్జిషీట్లల్లో తప్పులు దొర్లకుండా దాఖలు చేయాలని అన్నారు. న్యాయ సలహాలకై తమను సంప్రదించాలని చెప్పారు. న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్, న్యాయశాఖ ఐక్యంగా పనిచేయాలన్నారు. నిందితులకు శిక్షల ఖరారులో ప్రముఖంగా వాదించిన ఎండీ బర్కత్‌అలీ, ఏపీపీ కె.రమేష్, డీసీఆర్బీ సీఐ బి.నరసింహారావు, పలు కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించిన అప్పటి డీఎస్పీలు కె.రవికుమార్, వై.జెస్సీ ప్రశాంతి, సీఐలు పి.సుధాకర్‌రావు, నారాయణస్వామి, వీరయ్యచౌదరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, జి.సంధ్యారాణి, పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఇంటర్ సంస్కరణలపై అవగాహన అవసరం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలను అమలు చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యా సంస్కరణలపై శనివారం హార్డ్ కళాశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు. పల్నాడుజిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో నీలావతిదేవి మాట్లాడుతూ, విద్యార్థులను జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సిలబస్ రూపకల్పన జరిగిందని తెలిపారు. అలాగే అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా సిలబస్ ఉంటుందని తెలిపారు. జాతీయస్థాయిలో మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల సూచనల మేరకు సంస్కరణల అమలుకు కార్యాచరణ తీసుకవస్తున్నట్టు వివరించారు. దుర్గి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు ఇంటర్ బోర్డు ప్రవేశ పెట్టిన నూతన సిలబస్, నూతన సబ్జెక్స్ కాంబినేషన్‌పై అవగాహన కల్పించారు. సమావేశంలో దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టి.జె.చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి -
పేదరిక నిర్మూలనకు చేయూత
చీరాల: పీ 4 ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా ఆర్థిక చేయూత ఇవ్వాలని కలెక్టర్ వెంకటమురళి అన్నారు. పీ 4, సూర్య ఘర్, చేనేతల అభివృద్ధి అంశాలపై శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదరికంలో జన్మించిన అంబేడ్కర్‌కు సహాయం అందించడంతోనే ఆయన ఉన్నత విద్యనభ్యసించి, మహనీయుడిగా ఎదిగి రాజ్యాంగాన్ని రచించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శిలు సహాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెరుకుపల్లిలో నిరుపేదలైన 10 యానాది కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. చీరాల నియోజకవర్గంలో 8405 బంగారు కుటుంబాలు ఉండగా 4400 కుటుంబాలకు 402 మార్గదర్శిలను అనుసంధానించామని వివరించారు. మిగిలిన వారికి మార్గదర్శిలను గుర్తించాలన్నారు. చేనేతల ఆర్థిక అభివృద్ధికి విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మానవతా దృక్పథంతో చేనేతలందరికీ ముద్ర రుణాలు మంజూరు చేయాలని తద్వారా చేనేతల జీవనోపాధి పెరుగుతుందన్నారు. అలానే పర్యావరణానికి ఎలాంటి నష్టం లేని సౌర విద్యుత్ కోసం రుణాలు ఇవ్వాలన్నారు. 1695 దరఖాస్తులు రాగా 327 యూనిట్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కుప్పడం పట్టుచీరలకు జాతీయ గుర్తింపు అవార్డు లభించడంతో చేనేత రంగం మరింత అభివృద్ధి కానుందన్నారు. ఈ గుర్తింపును చేనేతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుప్పడం చీరాల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు బాపట్ల, చీరాల, వాడరేవు, సూర్యలంక బీచ్‌ల వద్ద ఓడీపీఓ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్కానర్ ఏర్పాటు ద్వారా చీరాల కుప్పడం చీరల చరిత్ర తెలుసుకునేలా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తామన్నారు. చీరాల మండలం దేవాంగపురిలో 26 ఎకరాల విస్తీర్ణంలోని హ్యాండ్లూమ్ పార్కును హ్యాండ్లూమ్ ఎంఎస్ఎంఏగా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అంగీకరించిందని తెలిపారు. జిల్లా ప్రజలకు గర్వకారణం చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ కుప్పడం చీరలకు జాతీయ అవార్డు రావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా ఉందన్నారు. అలాంటి చేనేతల వృత్తికి అవసరమైన రుణాలు విరివిగా అందించాలన్నారు. సూర్యఘర్ పథకం కింద ఆగస్టు 15లోగా వెయ్యి గృహాలకు సౌర విద్యుత్ అందించాలన్నారు. అనంతరం స్థానిక చేనేత కళాకారులను సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్‌ను చీరాల ఎమ్మెల్యే, చేనేత కార్మికులు కలిసి సత్కరించారు. మెప్మా పరిధిలోని 30 డ్వాక్రా సంఘాలకు రూ.6 కోట్లు రుణాల, వెలుగులోని 40 డ్వాక్రా సంఘాలకు రూ.7 కోట్లను చెక్కుల రూపంలో కలెక్టర్ పంపిణీ చేశారు. ముందుగా చేనేతరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో చీరాల ఆర్డీఓ టి.చంద్రశేఖర్‌నాయుడు, మున్సిపల్ చైర్మన్ ఎం.సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సీపీఓ షాలెంరాజు, చేనేత జౌళి శాఖ ఏడీ రఘునంద, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. కుప్పడం పట్టుచీరకు దక్కిన అవార్డు చేనేత కళాకారులకు అంకితం చీరాల, బాపట్ల తీర ప్రాంతంలో ఓడీపీఓ స్టాల్స్ ఏర్పాటు హ్యాండ్లూమ్ పార్కుతో చేనేతలకు ప్రోత్సాహం కలెక్టర్ వెంకటమురళి -
మిషన్ గ్రీన్ గుంటూరు లోగో డిజైన్లకు ఆహ్వానం
నెహ్రూనగర్: స్వచ్ఛ గుంటూరు – క్లీన్ గుంటూరు కాన్సెప్ట్‌లో మిషన్ గ్రీన్ గుంటూరు నినాదంతో లోగో కోసం డిజైన్లను ఆహ్వానిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ డిజైన్‌గా ఎంపికై న డిజైనర్‌కు నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తామని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సీజన్లో దశలవారీగా 5 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో వార్డులవారీగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణహిత గుంటూరే లక్ష్యంగా పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య పనులలో మెరుగుదల, వ్యర్థాలను తడిపొడిగా వేరు చేసి తీసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేధం, నగరంలోకి వచ్చే ప్రధాన మార్గాలు, జంక్షన్లు, ఐలాండ్స్, పార్క్‌లు, డివైడర్లపై పచ్చదనం పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ మోడ్‌లో క్షేత్రస్థాయి నుంచి అమలుకు కృషి చేస్తామని తెలిపారు. అందులో భాగంగా చేపట్టిన మిషన్ గ్రీన్ గుంటూరుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా డిజైన్లు ఆహ్వానిస్తున్నామన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్, పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలతో ఆగస్ట్ 15వ తేదీలోపు నగరపాలక సంస్థ వాట్సాప్ నంబర్ 98499 08391కు పంపవచ్చని తెలిపారు. ఆగస్ట్ 15 అనంతరం ఉత్తమ డిజైన్ ఎంపిక ఉంటుందన్నారు. ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్‌లు అన్నారు. వేతన చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాల విషయంలో తాత్సారం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. రోజూ రకరకాల అప్లోడ్ పనులతో టీచర్లను బోధనకు దూరం చేస్తున్నారని, ఇది పరోక్షంగా ప్రభుత్వ విద్యను కాలరాయడమే అన్నారు. అనంతరం డీవైఈవో ఏసురత్నంకు వినతి పత్రం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్ కుమార్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం. చిన్నయ్య, మండల శాఖ నాయకులతోపాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
కర్లపాలెం: మండల పరిధిలోని దమ్మనవారి పాలెంలో బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 141 గ్రాముల బంగారం, అర కేజీ వెండి, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర చాకచక్యంగా దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేశారని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం కర్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. దమ్మనవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు పెద వెంకటరెడ్డి కుటుంబం ఈ నెల 17వ తేదీన ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లినట్లు తెలిపారు. 21వ తేదీన వారి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉన్నట్లు ఆయన తమ్ముడు గమనించి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. 22వ తేదీన వెంకటరెడ్డి వచ్చి చూడగా బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ అయినట్లు గుర్తించారన్నారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలుసుకున్నారని చెప్పారు. నిందితులు బాపట్ల మార్కెట్ యార్డ్ సమీపంలో సంచరిస్తుండగా అరెస్ట్ చేశారని తెలిపారు. రాజమహేంద్రవరం పరిధి కొల్లమూరు గ్రామానికి చెందిన జనదివ్యశేఖర్, పురంపుల్లతి వీధికి చెందిన లంక హర్షవర్ధన్, బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంకు చెందిన మరుప్రోలు నాగేంద్రరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరు పాత నేరస్తులని, జైలులో పరిచయాల మేరకు బయటకు వచ్చిన తరువాత చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. చోరీ సొత్తు పూర్తిగా రికవరీ చేసినట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారని వివరించారు. వారికి వ్యక్తిగత రివార్డులు అందిస్తామని తెలిపారు. 141 గ్రాముల బంగారు, అర కేజీ వెండి నగలు స్వాధీనం -
కొరవడిన సంతోషం
సంక్షేమంలోసంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సమస్యల స్వాగతంరాష్ట్రంలో పేదరికం ఉండకూడదు..అందుకోసమే పీ–4 తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండే వసతి గృహాల గురించి పట్టించుకోవడం లేదు. కప్పుకునేందుకు దుప్పట్లు లేక చలికి గజగజలాడుతున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేక కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. కడుపునిండా తిండి తిందామంటే కంచంలో భోజనం ఉండదు. చివరకు తాగేందుకు నీరు లేక అవస్థలు పడుతున్నారు. ఏళ్ల కిందట నిర్మించిన హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. ‘సాక్షి’ బృందం శనివారం జిల్లాలోని పలు హాస్టల్స్‌ను విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ మొత్తం 27 ఉండాల్సి ఉండగా వాటిల్లో విద్యార్థులు లేక రెండు వసతి గృహాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న 25 వసతిగృహాల్లో 1475 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఎస్టీ ఇంటిగ్రేటెడ్ వసతిగృహం 01, ఆశ్రమ పాఠశాల 01, గురుకుల పాఠశాలలు 06, కళాశాల వసతిగృహాలు 2 చొప్పున మొత్తం 10 వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 850 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 42 వసతి గృహాలు ఉండగా వాటిల్లో 15 వసతి గృహాల్లో విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రస్తుతం 27 వసతి గృహాల్లో 915 మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వాటిల్లో 8 కళాశాల వసతిగృహాలు, 19 పాఠశాలల వసతిగృహాలు ఉన్నాయి. పత్తాలేని డీపీసీ ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఏడాదికి ఒకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డీపీసీ (డిస్ట్రిక్ పర్చేజ్ కమిటీ) సమావేశం జరగాలి. ఈ సమావేశంలో ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకొని వాటి ఆధారంగా వసతిగృహాలకు సరఫరా చేసే నిత్యావసర వస్తువులకు ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా డీపీసీ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.గత ప్రభుత్వంలో ఉన్న పాతధరల ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో చాలీచాలనీ బిల్లులతో వార్డెన్లు మెనూను సక్రమంగా పాటించడకుండా వారికిష్టమొచ్చినట్లు వంటలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు వసతిగృహాల్లోని భోజనం తినటం మానేసి వారే భోజనం తయారుచేసుకొని తినే దుర్భర పరిస్థితి జిల్లాలో నెలకొంది. చాలాచోట్ల పిల్లలు సాయంత్రం సమయంలో బయటనుంచి భోజనం, కూరలు తెచ్చుకొని తింటుంటుంగా మరికొన్ని చోట్ల సమీపంలోని అన్న క్యాంటీన్, భోజనం హోటళ్లకు వెళ్లి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. సమస్యలు కేరాఫ్... బాపట్ల గిరిజన కళాశాల వసతిగృహం పట్టణంలోని గిరిజన కళాశాల వసతి గృహం సమస్యలకు కేరాఫ్‌గా మారింది. కళాశాలలో 33 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో రాసుకున్నారు. వాస్తవంగా అక్కడ 12 మంది మాత్రమే ఉన్నారు. వసతిగృహంలోని కిటికీలకు ఒక్కదానికి కూడా మెస్‌లు లేవు. దీంతో దోమలు విద్యార్థుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాచ్మెన్, స్వీపర్, వంట మనిషి ఒకే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు పడుకునే గదిని కనీసం ఊడిచే నాథుడులేరు. అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు పడుకుంటున్నారు. వంటగదిలో చెత్త పేరుకుపోయింది. గ్రైండర్ నెలల తరబడి కడిగిన దాఖలాలు లేవు. దుర్ఘంధం వెదజల్లుతుంది. వసతిగృహం చుట్టూ ముళ్ల చెట్లు పెరిగి విషసర్పాలకు అవాస కేంద్రంగా మారింది. మురుగునీరు వసతిగృహం చుట్టూ నిలిచి దోమలకు అవాస కేంద్రాలుగా మారాయి. వసతిగృహంలో మొత్తం 10 మరుగుదొడ్లు ఉండగా వాటిల్లో ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయటం లేదు. దీంతో విద్యార్థులు కిలోమీటర్ల మేర సైకిళ్లపై బహిర్బూమికి వెళ్తున్నారు. వంట ఉచికరంగా లేక విద్యార్థులు ప్రతి రోజూ ప్రైవేట్ హోటల్స్, వంట వచ్చిన విద్యార్థులు ఇక్కడే వంటచేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. స్నానాల గదిలో ఒక్కగదికి కూడా డోర్ సక్రమంగా లేదు.అద్దంకి : గురుకుల, సాంఘిక సంక్షేమ, కేజీబీవీ, వసతి గృహాల్లో విద్యార్థులు అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నారు. వసతి గృహాల్లో సరైన వసతులు లేకవంటూ ప్రభుత్వానికి, ఆ శాఖల అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో శనివారం ‘సాక్షి’ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని వసతి గృహాల్లో విజిట్ చేసింది. నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరుగలోని ఏల్చూరు గ్రామాల్లో కేజీబీవీలున్నాయి. వాటిలో బల్లికురవ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే 270 మంది విద్యార్థులున్నారు. బెడ్లు, డార్మిటరీలు లేవు. ఏల్చూరు కేజీబీవీని గదుల కొరత వేధిస్తోంది. పడుకునేందుకు, చదువుకునేందుకు ఒకే గుదులు వినియోగించుకోవాల్సి వస్తుంది. కేజీబీవీలకు మెయిటెనెంన్స్ నిధులు ఇవ్వడం లేదు. దాంతో ఏదైనా రిపేర్ వస్తే ప్రిన్సిపాల్స్ సొంత నిధులతో చేయించుకునే దుస్థితి ఉంది. అద్దంకి పట్టణంలో రెండు ఎస్సీ, ఒకటి పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఒక హాస్టల్ ఉంది. ఇందులోనూ కిటికీలకు డోర్లు లేవు. కళాశాల ఇచ్చిన మంచాలు ఉన్నా, బెడ్లు లేవు. మరుగుదొడ్లు మరమ్మతుల్లో ఉన్నందున కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకే వెళ్తున్నారు. ఒక ఎస్సీ బాలుర వసతి గృహానికి సొంత భవనం లేదు. కేఆర్కే మినహా మిగిలిన అన్ని వసతి గృహాల్లో టాయిలెట్స్ సరిపడా ఉన్నాయి. జె. పంగులూరు మండలంలోని ముప్పవరంలో రెండు వసతి గృహాలున్నాయి. ఒకటి అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ వసతులు బాగానే ఉన్నా, బెడ్లు మంచాలు లేవు. వసతి గృహాల్లో పిల్లలకు సరిపడా దుప్పట్లు ఇవ్వలేదు. కొరిశపాడు మండలంలోని మేదరమెట్లలో ఒక వసతి గృహం ఉంది. ఇక్కడ పిల్లలకు ఒకే దుప్పటి ఇచ్చారు. బెడ్లు, మంచాలు లేవు. మరమ్మతులకు నోచని వాటర్ ప్లాంట్ రేపల్లె నియోజకవర్గంలోని గురుకులంలో వాటర్‌ప్లాంట్ మరమ్మతులకు గురికావడంతో తాగునీటి కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరుకుపల్లి మండలం కావూరు, నిజాంపట్నం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నేలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం భవనం మరమ్మతులకు గురైంది. శ్లాబ్ పెచ్చులూడి చువ్వలు బయటపడ్డాయి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధ్వానంగా మరుగుదొడ్లు వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, వెల్లటూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో గతంలో ప్రభుత్వ వసతిగృహాలు ఉండేవి. వాటిల్లో కొల్లూరు, వెల్లటూరు హాస్టల్ తొలగించారు. వేమూరు బీసీ బాలికల హాస్టల్, భట్టిప్రోలు బీసీ హాస్టల్లో చదువుతున్న పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో పిల్లలు పడుకునేందుకు సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. వసతిగృహానేల మీదేనే నిద్ర ఖర్చులు కొండంత...ఇచ్చేది గోరంత ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నా వసతి గృహాల్లోని వార్డెన్లకు మాత్రం గతంలో వలే పాత రేట్లు ప్రకారం బిల్లులు నమోదు చేస్తున్నారు. ఇచ్చేది అరకొర అయినా సకాలంలో అందించకపోవడంతో వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. ఒక్కొ విద్యార్థికి సగటున రోజుకు రూ.46 నుంచి రూ.50లోపు చెల్లిస్తున్నారు. వీటిల్లో ప్రతి రోజూ ఒక్కో విద్యార్థికి పాలు, మజ్జిగ, టిఫిన్ కింద ఇడ్లీ, చట్నీ, పల్లీ చిక్కీ, సాయంత్రం స్నాక్స్‌గా బఠానీ గుగ్గిళ్లు, రాగి జావ, రాత్రి భోజనంలో కూర, సాంబారు, వారంలో మూడురోజులపాటు చికెన్, రోజుకోక రకం పండ్లు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.80 నుంచి రూ.100 ఖర్చు అవుతుంది. ప్రభుత్వం చాలీచాలనీ బిల్లులు చెల్లించడంతో వార్డెన్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 62 వసతిగృహాలు హాస్టల్స్‌లో 3240 మంది విద్యార్థులకు వసతి అప్పుల ఊబిలో వార్డెన్లు వసతిగృహాల్లో విద్యార్థులే వంట మాస్టర్లు, స్వీపర్లు కనీస వసతులు కరువు అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు మల,మూత్రాలకు బహిర్భూమికి వెళ్తున్న విద్యార్థులు -
విలువైన కార్డులు అప్పగింత
బల్లికురవ: విలువైన ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ ప్యానెళ్లు పొగొట్టుకున్న వ్యక్తి వివరాలు తెలుసుకుని అప్పగించడంతో శనివారం ఎస్సై వై. నాగరాజు అభినందించారు. పల్నాడు జిల్లా పిట్టంబండ గ్రామానికి చెందిన ఆర్. బాలాజీసింగ్ వృత్తి రీత్యా డిజిటల్ పేమెంట్ ప్యానెళ్ల వ్యాపారంచేస్తున్నాడు. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో బైక్‌పై తిరుగుతుంటాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం మేదరమెట్ల – నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని కొప్పరపాడు గ్రామం మీదుగా వరపల్ల వెళుతుండగా మార్గ మధ్యంలో విలువైన బుక్స్, కార్డులు, ప్యానెళ్లు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్కుల బ్యాగ్ బైకుపై నుంచి కిందపడింది. కొప్పరపాడు గ్రామానికి చెందిన దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు దమ్ము అంజయ్య బైక్‌పై బల్లికురవ వెళుతూ బ్యాగ్ గమనించి.. దానిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైకి అప్పగించారు. వివరాలు సేకరించి.. బాధితుడిని పిలిపించి అప్పగించారు. ఎంతో విలువైన తన బ్యాగ్‌ను అప్పగింటం పట్ల బాలాజీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో వ్యక్తి మృతి మార్టూరు: పిచ్చికుక్క దాడిలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని కోలల పూడి గ్రామంలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోలల పూడి గ్రామంలో ఈనెల మొదటి వారంలో ఓ పిచ్చికుక్క 12 మంది వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాడిలో గాయపడిన వారిలో కొందరు మార్టూరు, మరికొందరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వారిలో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన గాలి యేసులు (65) చికిత్స చేయించుకున్నప్పటికీ గత నాలుగు రోజులుగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యేసులు శుక్రవారం రాత్రి మృతి చెందగా.. శనివారం మృతదేహాన్ని కొలలపూడి తరలించారు. -
కారు కాలువలో పడి విద్యార్థి మృతి
అమర్తలూరు (వేమూరు) : కారు అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలో జూపూడి పవన్ (18) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్ఐ రవితేజ కథనం మేరకు.. విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం అద్దెకు తీసుకున్న కారులో ఒంగోలులోని జూపూడి పవన్ ఇంటికి వెళ్లారు. తిరిగి బాపట్ల బీచ్‌కు వెళ్లి, విజయవాడ బయలు దేరారు. ఈ క్రమంలో అమర్తలూరు మండలం ప్యాపర్రు, యలవర్రు రోడ్డు వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కాలువలో పడి పోయింది. కారులో ఉన్న విద్యార్థులు అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చారు. అప్పటికి పవన్ మృతి చెందాడు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా విజయవాడ నగరానికి చెందిన విద్యార్థులని ఎస్ఐ తెలిపారు. పవన్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలరించిన గరికపాటి ప్రవచనాలు నరసరావుపేట: స్థానిక పాతూరులోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక తరంగణి, శ్రీ నాగసరపు సుబ్బరాయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేదాంత భేరీ ప్రవచనానికి మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు హాజరై ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ట్రస్టు చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తాలు డాక్టర్ గరికపాటిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పత్తి పంటకు బీమా గడువు పొడిగింపు
నరసరావుపేట రూరల్: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పత్తి పంటకు బీమా గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు శనివారం తెలిపారు. భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ అగ్రికల్చర్ ఇన్యూరెన్స్ కంపెనీ ద్వారా జిల్లాలో పంటల బీమా అమలులో ఉందని తెలిపారు. రైతులు పత్తి పంటపై అమలవుతున్న బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల ద్వారా నమోదు చేయబడతారని తెలిపారు. రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రాలు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు , క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్‌ఏలను సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు. వాతావరణ సంబంధిత ప్రమాదాల సమయంలో పంటలకు కలిగే నష్టాన్ని బీమా ద్వారా పొందే అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక పీజీఆర్ఎస్లో 38 అర్జీలు స్వీకరణ నరసరావుపేట: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల కోసం శనివారం కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 38 అర్జీలు స్వీకరించారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేశారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రూ.2.75 కోట్ల విలువైన 20 పనులకు పౌడా ఆమోదం నరసరావుపేట: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.2.75 కోట్లతో చేసే 20 పనులకు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ కమిటీ (పౌడా) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శనివారం కలెక్టరేట్లో పౌడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన అభివృద్ధి, ప్రణాళికా కార్యకలాపాలపై అథారిటీ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు అజెండాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలియచేశారు. దీనిలో అథారిటీ సభ్యులు డీటీసీపీ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సునీత, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ టి.రవీంద్రబాబు, ఏపీ సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.రాంబాబు, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, కాలుష్య నియంత్రణ మండలి విభాగ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర కార్యదర్శి ఎం.నవీన్‌కుమార్ పాల్గొన్నారు. 581 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.30 అడుగులకు చే రింది. ఇది 286.7635 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,20,339 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
బర్లీ రైతుకు బాబు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల అనుమానమే నిజమైంది. రైతులు పండించిన మొత్తం పొగాకు కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని మంత్రివర్గం తీర్మానం చేయడంపై పొగాకు రైతులు మండిపడుతున్నారు. ఇందులో టీడీపీకి చెందిన రైతులు కూడా ఉండడం గమనార్హం. మాట మార్చిన ప్రభుత్వం రైతులు పండించిన మొత్తం బ్లాక్ బర్లీ పొగాకు కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాటమార్చింది. ఇప్పడు ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి అన్నదాతలను నిలువునా ముంచింది. వాస్తవానికి బ్లాక్ బర్లీ సాగుచేసిన రైతుల్లో 95 శాతం మంది 4 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకూ పొగాకు పంటను సాగుచేశారు. మూడు ఎకరాలలోపు పొగాకు సాగుచేసిన వారు నామమాత్రంగానే ఉన్నారు. ఈ ఏడాది ఎకరానికి 17 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు జిల్లా వ్యవసాయశాఖ అంచనా కట్టింది. ఈ లెక్కన 1.50 ఎకరాలలోపు సాగుతోనే 20 క్వింటాళ్ల బ్లాక్ బర్లీ దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక్కొక్క రైతు నుంచి 1.50 ఎకరాలలో పండిన పొగాకునే కొంటానని చెప్పింది. ఒకవైపు టొబాకో కంపెనీలు మొక్కుబడిగా కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటుండడంతో రైతులు పండించిన మిగిలిన పొగాకును ఎవరు కొనుగోలు చేస్తారో ప్రభుత్వం చెప్పలేదు. రైతులను నిలువునా ముంచిన బాబు మంత్రివర్గ నిర్ణయం చూస్తే బ్లాక్ బర్లీ రైతులను నిలువునా వంచించినట్లే కనపడుతోంది. ఆది నుంచి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం మాటపై అపనమ్మకమే. ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఆలస్యంగానైనా 12 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోళ్లు మొదలు పెట్టింది. కొనుగోళ్లలో వివక్ష కనిపించినా ఆలస్యంగానైనా అందరి పొగాకు కొంటారని రైతులు భావించారు. చివరకొచ్చే సరికి ప్రభుత్వం ఏదొక సాకుచెప్పి తప్పించుకుంటుందని మిగిలిన రైతులతోపాటు రైతు సంఘాలు అనుమానిస్తూనే ఉన్నాయి. ఇప్పు డు వారు అనుమానించినట్లే జరిగింది. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్ల కొనుగోలు మెలికతో ప్రభుత్వం పొగాకు కొనుగోళ్ల నుంచి తప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి తమ లక్ష్యం 14 వేల టన్నులేనని మార్క్‌ఫెడ్ చెబుతోంది. ఇప్పటికే దాదాపు 4 వేల టన్నులు కొన్నామని, మరో 10వేల టన్నులు మాత్రమే కొంటామ ని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటనకు చేతలకు పొంతన లేదని స్పష్టమవుతోంది. రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బు వాస్తవానికి ఈ ఏడాది జిల్లాలో 53,067 ఎకరాల్లో రైతులు బ్లాక్ బర్లీ సాగు చేశారు. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే 52,989 ఎకరాల్లో బర్లీ సాగైంది. అద్దంకి నియోజకవర్గంలో 78 ఎకరాలలో మాత్రమే పొగాకు సాగుచేశారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఎకరాకు 17 క్వింటాళ్ల దిగుబడి అనుకుంటే మొత్తం 90 వేల టన్నుల దిగుబడి వచ్చింది. రైతులతో బ్లాక్ బర్లీ సాగుచేయించిన టొబాకో కంపెనీలు 30 వేల టన్నులలోపే కొనుగోళ్లు చేసి చేతులు దులుపుకున్నాయి. రైతుల వద్ద ఇంకా 50 వేల టన్నులకు పైగా పొగాకు ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్‌ఫెడ్ 40 రోజులలో 3,700 టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అదికూడా పచ్చపార్టీ నేతలు చెప్పిన రైతుల పొగాకు మాత్రమే కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంపై పొగాకు రైతుల ఆగ్రహం పండించిన పంట మొత్తం కొంటామన్న ప్రభుత్వం నేడు ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లే కొంటామని మెలిక జిల్లాలో 53,067 ఎకరాల్లో బర్లీ సాగు అధికారిక అంచనాల ప్రకారం 90 వేల టన్నుల దిగుబడి ఇప్పటివరకూ మార్క్‌ఫెడ్ ద్వారా కొన్నది 3,700 టన్నులే మరో 10 వేల టన్నులే లక్ష్యం అంటున్న మార్క్‌ఫెడ్ మిగిలిన పొగాకు ఎవరు కొంటారు? ఎమ్మెల్యే ఏలూరి ఏమంటారో? రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మొదలు కొని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వరకూ రైతు పండించిన ప్రతి పొగాకు మట్ట కొంటామని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బల్లగుద్ది చెప్పారు. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తేల్చి చెప్పడంతో ఇన్నాళ్లూ పొగాకు మొత్తం ప్రభుత్వం కొంటుందని బాకా ఊదిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన అనుచరగణం గొంతులో పచ్చివెళక్కాయ పడింది. ఇక నుంచి రైతులకు ఏం చెప్పాలో అర్థంకాక ఏలూరి తలపట్టుకున్నట్లు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సొంత పార్టీ రైతులకూ ఆగ్రహం తెప్పిస్తోంది. -
కొత్తపేటకు ఎన్నికల కళ
వేటపాలెం: ఎట్టకేలకు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత కొత్తపేట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ బూత్‌లతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల తేదీ ఖరారు చేయాల్సి ఉంది. కొత్తపేటలో 11,500 మంది ఓటర్లు, 16 వార్డులు, 32 పోలింగ్ బూత్‌లున్నాయి. 2020లో ఆధిపత్యం కోసం తెలుగుదేశం నాయకులు చేసిన ఘనకార్యం వల్ల చీరాల నియోజకవర్గంలో 23 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ ఎన్నికల నిలిచి పోయాయి. వేటపాలెం మండల పరిధిలో మొత్తం తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వేటపాలెం, దేశాయిపేట, కొత్తపేట వంటి మేజర్ పంచాయతీలు. వీటి పరిధిలో 16 శివారు గ్రామాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించారు. అయితే చీరాల రూరల్, వేటపాలెం మండలాల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలు ఐదేళ్లుగా పంచాయతీ ఎన్నికలకు నోచుకోలేదు. నాడు వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయతీకీ మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీల పునర్విభజన ... చీరాల రూరల్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీల పునర్విభజన జరిగాయి. కొత్తగా రెండు గ్రామ పంచాయతీలకు ప్రదిపాధనలు పంపారు. అదేవిధంగా వేటపాలెం మండలంలో ఉన్న తొమ్మిది గ్రామ పంచాయతీలను పునర్విభజన చేసి అదనంగా మరో మూడు పంచాయతీలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో ఇది గిట్టని టీడీపీ నాయకులు పునర్విభజనపై హైకోర్టులో 2020లో కేసు వేశారు. దీంతో ఎన్నిలు నిలిచిపోయాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి పంచాయతీల పునర్విభజనపై హైకోర్టులో కేసులు వేసిన అప్పటి టీడీపీ నేతలు కోర్టులో కేసులు తొలగిపోవడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం మిగిలిన పంచాయతీల సంగతేమిటి? హైకోర్టులో వేసిన కేసుల కారణంగా చీరాల నియోజకవర్గ పరిధిలో 2021 నుంచి 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిచి పోయాయి. అయితే దీనిపై ఆరు నెలల క్రితం కొత్తపేటవాసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రాగానే కొత్తపేట పంచాయతీ పరిధిలోని కొందరు గ్రామ పంచాయతీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై కోర్టు ఆరు నెలల్లో కొత్తపేట పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎన్నికల కమిషనర్ జూన్ 17 తేదీ నాటికి ఓటర్ల జాబితాలు, బూత్‌లు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరి చీరాల నియోజకర్గ పరిధిలో మిగిలిన 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎప్పడు జరుగుతాయో చూడాల్సిందే. -
బగళాముఖి దీక్షలు ప్రారంభం
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి ఆలయంలో భక్తులు శుక్రవారం అమ్మవారి మాలధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రావణమాసంలో అమ్మవారి భక్తులు బగళాముఖి దీక్ష తీసుకుని నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు. శ్రావణమాసం ప్రారంభం రోజున అమ్మవారి ఆలయంలో 11మంది భక్తులు దీక్ష చేపట్టారు. దీక్ష తీసుకునే భక్తులకు మాలలు, దుస్తులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సందర్భంగా బగళాముఖి అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు బాపట్ల: ఐసీడీఎస్‌లోని అంగన్వాడీల ఉద్యోగాలకు జిల్లా జేసీ జి.గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరే ట్లో ఇంటర్వ్యూలు జరిగాయి. నాలుగు కార్యకర్తల పోస్టులకు 12 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే 49 ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు జరగ్గా 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, సీడీపీఓలు పాల్గొన్నారు. బోల్తాపడిన క్యాబేజీ లారీ మేదరమెట్ల: బెంగళూరు నుంచి విజయవాడకు క్యాబేజీ లోడుతో వెళుతున్న ఐషర్ లారీ బోల్తాపడిన సంఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల తమ్మవరం బ్రిడ్జిపై శుక్రవారం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోగా కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల పోలీసులు తెలిపారు. ముగ్గురి ప్రాణాలు కాపాడిన డ్రోన్ చీరాల: చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో శుక్రవారం ముగ్గురు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోగా రూరల్ ఎస్సై చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేసి ప్రాణాలు కాపాడారు. మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలో అంకాలమ్మ తల్లి కొలుపుల సందర్భంగా గ్రామానికి చెందిన వెయ్యి మంది సముద్ర స్నానాలు చేసేందుకు వచ్చారు. వారిలో ముగ్గురు యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లి అలల తాకిడికి కొట్టుకుపోయారు. డ్రోన్ సహాయంతో యువకులను గుర్తించిన రూరల్ ఎస్సై చంద్రశేఖర్ వెంటనే విధుల్లో ఉన్న పోలీసులు, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేశారు. స్పందించిన వారు నీటిలో కొట్టుకుపోతున్న ముగ్గురినీ కాపాడారు. ఎస్సై చంద్రశేఖర్ యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించి వారితో పాటు వచ్చిన గ్రామస్తులకు క్షేమంగా అప్పగించారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీసంతమాగులూరు(అద్దంకి): కొమ్మాలపాడు మక్కెనవారిపాలెం గ్రామాల్లోని 453 మంది విద్యార్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం సైకిళ్లు పంపిణీ చేశారు. 46 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అదే విధంగా మక్కెనవారిపాలెం గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఆ తరువాత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కృషి
బాపట్ల: రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శుక్రవారం సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాపట్ల డిపోను మోడల్‌గా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్టాండ్‌లో మరుగుదొడ్ల కాంప్లెక్స్‌ను నిర్మించడానికి, సిమెంట్ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. బాపట్ల డిపోకు త్వరలో కొత్త బస్సులు కేటాయిస్తామని చెప్పారు. బాపట్ల నుంచి తిరుపతి, శ్రీశైలం బెంగళూరు ప్రాంతాలకు ప్రత్యేక బస్ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు నైట్ అలవెన్స్ రూ.130కి పెంచామని చెప్పారు. ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికీ డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బాపట్ల డిపోలో ఉత్తమ సేవలందించిన ఏడుగురు సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలోఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్రప్రసాద్, జిల్లా ప్రజా రవాణా రవాణా అధికారి డి.సామ్రాజ్యం, బాపట్ల డిపో మేనేజర్ పి.శ్రీమన్నారాయణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి -
జల్సాలకు అలవాటుపడి బైకులు చోరీ
నగరంపాలెం: జల్సాలు చేయడానికి సొమ్ము కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. సుమారు రూ.25 లక్షల విలువైన 34బైకులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల గుంటూరు తూర్పు, పశ్చిమ సబ్ డివిజన్లలోని పట్టాభిపురం, పాత గుంటూరు, నగరంపాలెం, తాడికొండ పీఎస్‌ల పరిధిలో ఎక్కువ గా బైకు చోరీలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, పాత నేరస్తుల కదలికలు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించామని చెప్పా రు. అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశామని అన్నారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు (కేవీపీ కాలనీ 4వ వీధి, శ్రీనివాసరావు పేట వాసులు)తోపాటు అక్కిశెట్టి ఆకాష్ (ఎల్ఐసీ కాలనీ), ఉప్పు రాకేష్ (స్తంభాలగరువు), మడుగుల రవితేజ (కేవీపీ కాలనీ), షేక్ అషీరు (పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం), కోన వెంకటగోపీ (లక్ష్మీనగర్ రెండో వీధి), టి.రాజేష్, బోయపాటి జయసాయి (తాడికొండ మండలం మోతడక గ్రామం ఎస్టీ కాలనీ)లను అరెస్ట్ చేశామని వివరించారు. అందరూ 27 ఏళ్లలోపు వారే... అరెస్ట్ అయిన వారందరూ 27 ఏళ్లలోపు వయస్సు వారే. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. రవితేజ, ఆకాష్‌లు చోరీలకు ఆజ్యం పోశారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొంతకాలంగా గుంటూరు నగర పరిధిలోని ఇళ్ల ఎదుట, మార్కెట్ ప్రదేశాలు, ఆసుపత్రులు, ప్రార్థన స్థలాల వద్ద నిలిపి ఉంచిన బైకులను దొంగిలించారు. తర్వాత ఆ బైక్‌లను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వీరిలో ఒకరిద్దరు పాత నేరస్తులు ఉన్నారు. బైకులను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. చోదకుల నిర్లక్ష్యం వల్లే వాహన చోరీలు జరగుతున్నాయని అన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వాహనాలకు హ్యాండిల్ లాక్, వీల్ లాక్‌లను బిగించుకోవాలని చోదకులకు సూచించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), అబ్దుల్ అజీజ్ (తూర్పు), అరవింద్ (పశ్చిమ), సీఐలు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇద్దరు మైనర్లు సహా తొమ్మిది మంది నిందితులు అరెస్ట్ రూ.25 లక్షల ఖరీదైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ -
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
బాపట్ల: తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తును ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. విపత్తు నిర్వహణ, నిర్మూలన ప్రణాళికపై కలెక్టర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున కృష్ణానది వరద విపత్తును దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఆలమట్టి, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా బ్యారేజి 90 శాతం నిండుగా ఉండడంతో ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కృష్ణానది కరకట్టపై నివాసముంటున్న గృహాల సర్వే చేయాలన్నారు. కరకట్టకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక, కంకర బస్తాలు సిద్ధం చేసుకుని కట్టను బలోపేతం చేయాలన్నారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తీర ప్రాంత మండలాలలో గుడిసెలు, సిమెంటు రేకుల ఇళ్లను ముందస్తుగా గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. తీరానికి పది కిలోమీటర్ల మేర తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గర్భిణులు, వృద్ధులు, మంచం పట్టిన వారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, చిన్నారులను గుర్తించి వివరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, గ్యాస్ సిలిండర్, డీజిల్, కిరోసిన్, జనరేటర్లు, చెట్లు తొలగించడానికి యంత్రాలు, తదితర యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. సమావేశంలో డీఆర్ఓ జి గంగాధర్‌గౌడ్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై ముందస్తు సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. పోలీస్ కవాతు మైదానాన్ని ముస్తాబు చేయాలని, జిల్లా ప్రగతి, అభివృద్ధిని చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విశేష సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసాపత్రాలతో సత్కరించడానికి అర్హులైన వారిని గుర్తించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించడానికి ఆహ్వానించాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సామాజిక వెనుకబాటులో ఉన్న వారిని ఆదరించాలి సామాజిక వెనుకబాటులో ఉన్న ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతులను ఆదరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్‌న్స్ కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్‌కి అర్జీలు అందజేశారు. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు. మిగిలిన నగదు ప్రభుత్వానికి చెల్లించాలి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో మిగిలిన నగదును ప్రభుత్వానికి తక్షణమే తిరిగి చెల్లించాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. అలా చెల్లించకుండా ఉన్న వారికి తక్షణమే చార్జి మెమోలు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అమలు తీరుపై అవగాహన కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను చూడకుండా దూరంగా ఉంచితే పోషణ ఖర్చు కింద వారికి నెలకు రూ.10వేలు ఇవ్వాలన్నారు. డబ్బులు ఇవ్వకుండా నిలిపివేస్తే మూడు నెలలు జైలు శిక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సువార్త, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగధీర భద్రాచారి పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
మేదరమెట్ల: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్ జిల్లాలకు చెందిన ఇద్దరి దొంగలను కొరిశపాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ మొయిన్ మేదరమెట్లలోని అద్దంకి రూరల్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈనెలలో కొరిశపాడు గ్రామంలోని హోటల్ నిర్వాహకురాలి మెడలో బంగారు చైన్ లాక్కొని పారిపోయిన ఇద్దరు దొంగలను పట్టుకోవడం కోసం ఓ టీంను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కొరిశపాడుకు చెందిన మేకల హరీష్, గుంటూరు సంజీవ్‌నగర్‌కు చెందిన షేక్ యాసిన్‌లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు గత నెలలో వేమూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పోయారు. వీరి వద్ద నుంచి కొరిశపాడులో పోయిన 28 గ్రాముల బంగారు గొలుసు, వేమూరులో పోయిన 30 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ మోటారు బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి బెట్టింగులకు, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు ఖర్చుల కోసం వివిధ ప్రదేశాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చైన్‌స్నాచింగ్‌లకు రెక్కీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ మల్లికార్జునరావు, కొరిశపాడు, మేదరమెట్ల, జె.పంగులూరు ఎస్ఐలు సురేష్, మహ్మద్ రఫీ, వినోద్‌బాబుతో పాటు వెంకటేష్, నాగరాజు, మత్తయ్య కానిస్టేబుల్స్‌ను రివార్డులతో డీఎస్పీ అభినందించారు. -
బంగారు ఆభరణాలు చోరీ
లక్ష్మీపురం: ఇంట్లో శుభకార్యం జరుగుతున్న నేపథ్యంలో దాచి పెట్టిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయిన ఘటన పై అరండల్‌పేట పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గుంటూరు నగరంలోని కొరిటెపాడు హనుమయ్యనగర్ ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణేశ్వర అనే వ్యక్తి భవన నిర్మాణ పని చేస్తుంటారు. జూన్ నెలలో కుమారుడు వివాహం ఉన్నందున కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. జూన్ 21న ఇంట్లో బీరువాలో 92 గ్రాముల బంగారు ఆభరణాలు భద్రపరిచి, వివాహ పనుల్లో ఉండి పోయారు. అయితే శుభకార్యం అయిన తరువాత ఈ నెల 23వ తేదీన చూసే సరికి ఆభరణాలు కనిపించలేదు. దీంతో శుక్రవారం అరండల్‌పేట పోలీసులకు సమాచారం తెలియజేయగా ఎస్సై సుబ్బారావు, సిబ్బంది వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్ ఆధారాలను సేకరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి
జీఆర్ఎం నోడల్ అధికారి పి.జయశ్రీ తాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యలు, వార్షిక కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్మెంట్ అధికారి పి.జయశ్రీ అన్నారు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఇటీవల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన 11వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించిన సమస్యల గురించి పలువురు తమ అర్జీలను పి.జయశ్రీకి అందజేశారు. సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. జమ కాని వారికి రానున్న 15 రోజులలో జమయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలను రైతులు ఇచ్చి, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 54 ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు బి. సాయి శ్రీనివాస నాయక్, ఎం.శేషిరెడ్డి, పి. పద్మావతి, జి. రవీందర్, జి. భీమారావు, ఏజీ చిన్నికృష్ణ, సీఆర్డీఏ సర్వే విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ జి.పాండురంగారావు రామకృష్ణన్, సామాజిక సంక్షేమ విభాగ అధికారి శ్రీనివాసరావు, డెవలప్మెంట్ ప్రమోషన్ జోనల్ జాయింట్ డైరెక్టర్ సి.హెచ్. మధుసూదనరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు గుంటూరు లీగల్: మహిళపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.57 వేల జరిమానా విధిస్తూ ఐదవ అదనపు జిల్లా సెషన్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. తాడేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సీతానగరం కరకట్ట వద్ద జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2021 జూన్ 19న కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని నిందితులుగా పరిగణించారు. వారిలో రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ పరారీలో ఉన్నాడు. మరో నిందితుడు షేక్ హబీబ్ అలియాస్ హనిగుండు మృతి చెందాడు. ఇంకో నిందితుడు సిరు కృష్ణకిషోర్ అలియాస్ కృష్ణను దోషిగా కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం అతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.57 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లపు కృష్ణ బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. అప్పటి సీఐ శేషగిరిరావు కేసు దర్యాప్తు చేయగా, డీఎస్పీ జె.రాంబాబు చార్జిషీట్ ఫైల్ చేశారు. కోర్టు లైజన్ కానిస్టేబుల్ బి.శ్రీనునాయక్, అప్పటి తాడేపల్లి కోర్టు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. మహిళకు న్యాయం జరిగేలా చూసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. బస్సులో బంగారు గొలుసు అద్దంకి రూరల్: బస్సులో దొరికి బంగారుపు చైనును ప్రయాణికులకు అందజేసిన కండక్టర్, డ్రైవర్‌ను డీఎం రామ్మోహన రావు శుక్రవారం అభినందించారు. సాయంత్రం దర్శి నుంచి అద్దంకి వచ్చిన బస్సులో కండక్టర్ ఏ. సుజాత, డ్రైవర్ యం. గిరిరాజులకు 12 గ్రాముల బంగారపు చైను దొరికింది. కాగా డ్రైవర్, కండక్టర్లు డిపో మేనేజర్ రామ్మోహనరావు సమక్షంలో అన్ని వివరాలు కనుగొని ప్రయాణికులు చంద్రకళ, చెన్నమ్మలకు అందజేశారు. చైనుకు లాకెట్ ఉండాలని చెప్పటంతో మళ్లీ బస్సులో వెతకగా లాకెట్ కూడా దొరకడంతో అదికూడా అప్పగించారు. -
అన్ని వర్గాలకు అందుబాటులో దూరవిద్య
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వైవిధ్యమైన దూరవిద్య కోర్సులను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తోందని ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పి.శరత్చంద్ర అన్నారు. శుక్రవారం ఎన్జీవో కాలనీలోని మహాత్మాగాంధీ కళాశాలలో ఇగ్నో కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శరత్చంద్ర మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది విద్యార్థులు, అనేక కోర్సులతో విద్యను అభ్యసిస్తున్న ఉన్నతమైన విశ్వ విద్యాలయంగా ఇగ్నో గుర్తింపు పొందినట్లు చెప్పారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రంగా మన రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఇగ్నో సేవలు అందిస్తోందని, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సివిల్స్ స్థాయికి తగిన పాఠ్య ప్రణాళికతో కూడిన అంశాలు ఇగ్నో ప్రత్యేకతలు అని, ఒకే విద్యా సంవత్సరంలో ఒక రెగ్యులర్ కోర్సుతో పాటు దూరవిద్యా విధానంలో ఆన్లైన్లో మరొక కోర్సు అభ్యసించే వీలుందని తెలిపారు. కార్యక్రమంలో గౌతమి విద్యాసంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి, ప్రిన్సిపాల్ పి. ఉదయ్‌కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పొగాకు కొనుగోలులో అవకతవకలు నివారించాలి ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు డిమాండ్ లక్ష్మీపురం: రాష్ట్రంలో పొగాకు కొనుగోలులో అవకతవకలు నివారించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలని, నాణ్యత పేరుతో తెచ్చిన పొగాకును బయ్యర్లు వెనక్కి పంపకుండా చూడాలన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం పొగాకు రైతుల సంఘం నాయకుల సమావేశం డాక్టర్ కొల్లా రాజమోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలు పొగాకు కొనకపోవడంతో ఆందోళన చేపట్టడం వలన మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ గుంటూరు జిల్లాలో 50 కిలోమీటర్ల దూరం వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. సగం కూడా కొనుగోలు చేయకుండా బయ్యర్లు తిప్పి పంపుతున్నట్లు, ప్రైవేటు వారికి ఉపయోగపడేలా ఇలా చేస్తున్నట్లు ఆరోపించారు. దీంతో అయినకాడికి విక్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎం.హరిబాబు, కొల్లా రాజమోహన్, కంచుమాటి అజయ్, టి.రామారావు, జె.జయంతి బాబు, పి.శివాజి, పి.రామారావు, కె.గణేశ్ బాబు, పి.వి. జగన్నాథం, కె.విఠల్ రెడ్డి, బిక్కి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యంతో కూడిన విద్యాబోధన అవసరం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థి కేంద్రంగా నైపుణ్యంతో కూడిన విద్యాబోధనను ఉపాధ్యాయులకు సాగించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు. సదరన్ ప్రైవేట్ లెక్చరర్, టీచర్ ఆర్గనైజేషన్ (ఎస్పీఎల్టీఓ) ఆధ్వర్యంలో శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు మనోవిజ్ఞాన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలను వివరించారు. తరగతి గదిలో విద్యార్థి కేంద్రీకృత విద్యా బోధన జరగాలన్నారు. ఉపాధ్యాయుడే విద్యార్థికి లక్ష్య నిర్దేశకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విజయవాడలోని ఎడ్యుకేషనల్ టీచర్ రీసెర్చ్ కౌన్సెలింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.రామశేషాద్రిరావు మాట్లాడుతూ మనోవిజ్ఞాన నైపుణ్య కౌన్సెలింగ్ విధానం ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థుల మానసిక స్థితిని గమనించి, అందుకు అనుగుణంగా విద్యాబోధన సాగించాలని సూచించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. జీకేఆర్ స్కూల్ డైరెక్టర్ జి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల మానసిక స్థితిలో మార్పులను తీసుకురావడంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించుకోవడంలో శిక్షణ తరగతులు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎల్టీఓ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య, కార్యదర్శి ఎం.రాకేష్, కళాశాల విభాగ అధ్యక్షుడు కావూరి గోవిందరాజులు, జిల్లా, రాష్ట్ర స్థాయి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
దాడులు చేస్తే అది సివిలైజేషనా? తాడేపల్లి రూరల్ : ‘మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. ’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తన సినిమా ఈవెంట్లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్‌కళ్యాణ్ రెచ్చగొట్టడం దారుణం’’ అన్నారు.పర్చూరు(చినగంజాం):పర్చూరు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావుతో కలిసి శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ముందుగా పర్చూరు బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పర్చూరులోని నెహ్రూ కాలనీ, నాగులపాలెంలో పాల్గొని సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా అనే విషయమై ప్రజలతో మాట్లాడారు. పర్చూరులో రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్లు, నాగులపాలెం గ్రామంలో రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీ్త్ర నిధి చెక్కులు పంపిణీ అనంతరం పర్చూరు మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొని రూ.4 కోట్ల సీ్త్ర నిధి చెక్కులను స్వయం సహాయక గ్రూపులకు అందజేశారు. అగ్రికల్చర్ డ్రోన్‌ను మంత్రి కేశవ్, ఎంఎల్ఏ సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం పర్చూరు మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో పొగాకు కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏలూరి ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామంలో పొగాకు కొనుగోలు కేందాన్ని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన పొగాకును పరిశీలించారు. చీరాల శాసనసభ్యుడు ఎం.మాలకొండయ్య, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న ఆర్డీఓ గ్లోరియా, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, వైస్ చైర్మన్ శంకరశెట్టి చిరంజీవి, పార్టీ మండల అధ్యక్షుడు షంసుద్దీన్, నాయుడు హనుమంతరావు, తిరుమలశెట్టి శ్రీహరి, పొద వీరయ్య పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు ఖండన పోలీస్‌స్టేషన్‌లో నేతల ఫిర్యాదు -
ఔచిత్యం పాటించే కవిత్వం ప్రేక్షకులను రంజింప చేస్తుంది
డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ బాపట్ల: ఔచిత్యం పాటించే కవిత్వం ఏదైనా ప్రేక్షకులను, పాఠకులను రంజింప చేస్తుందని సాహితీవేత్త, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. వివేక సర్వీస్ సొసైటీ, ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ సంయుక్త నిర్వహణలో నెలనెల నందివర్ధనం 103వ కార్యక్రమం బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలోని వివేకా కార్యాలయంలో గురువారం జరిగింది. నా కవిత్వ తత్వం నిర్మాణం గమనం గమ్యం అనే అంశంపై సుద్దాల అశోక్ తేజ ప్రసంగించారు. పాట, సంగీతం, సాహిత్యం తన కుటుంబం నుంచి వారసత్వంగా తనకు వచ్చాయని, తండ్రి హనుమంతు నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు. ఎలాంటి సాహిత్యానికై నా, కవిత్వానికై నా ఔచిత్య భంగం కలగకూడదని తాను విశ్వసిస్తానన్నారు. కవిత్వానికి పునాదిగా ఔచిత్యాన్ని క్రమం తప్పకుండా పాటించడం అనేది తనకు అలవాటు అయ్యిందని స్పష్టం చేశారు. తన సాహిత్యం యావత్తూ ప్రజలను చైతన్యం చేసే విధంగా ప్రకృతి, శ్రమ, సీ్త్ర, మానవ సంబంధాలు అనే అంశాల మీద కొనసాగిందన్నారు. సాహిత్యం ప్రజల చెవిని, హృదయాన్ని రెండింటినీ తాకే విధంగా మంచి ఎత్తుగడతో ముందుకు సాగాలని తన తండ్రి చేసిన సూచన మేరకు తన కవిత్వ ప్రస్థానం కొనసాగిందన్నారు. నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ.. అంటూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే కవిత్వం, ప్రతి సీ్త్రలో అమ్మ ను, సోదరిని చూడాలనే సందేశంతో సీ్త్ర ఔన్నతాన్ని తెలియజేసే కవిత్వం, శ్రమ శక్తి గొప్పతనాన్ని తెలియజేసే కవిత్వం, మానవ జీవన సౌందరాన్ని , మానవ సంబంధాల గొప్పతనా న్ని, ప్రత్యేకతను తెలియజేసే కవిత్వం తన నుంచి ప్రసవించి, ప్రసరించిందన్నారు. ‘తెలుగు సినీ గేయ సాహిత్యం‘ అనే శీర్షికతో నెలనెల నందివర్ధనం కార్యక్రమాల ప్రసంగ పాఠాల సంచికను డాక్టర్ సుద్దాల ఆవిష్కరించారు. వివేక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎన్వీ నాగరాజు, కార్యదర్శి అంబటి మురళికృష్ణ, ధృతి అధ్యక్షులు కళ్లం హరినాధరెడ్డి, కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పీ4 పథకంతో పేదలకు చేయూత
రేపల్లె: సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరో పావర్టీ పీ–4 పథకం ద్వారా పేదలకు చేయూతనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జీరో పావర్టీ – పీ–4 పథకంలో భాగంగా చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేదలను గుర్తించి వారి కనీస అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం పీ–4 పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి గ్రామంలో ఆర్థికంగా స్థిరపడిన వారి నుంచి ఆ గ్రామంలోని నిరుపేదలను ఎంపిక చేసి చేయూతనివ్వటం జరుగుతుందన్నారు. చెరుకుపల్లిలోని 10 ఎస్టీ కుటుంబాలను పీ–4 సర్వే ద్వారా ఎంపిక చేసి ఆదుకునేందుకు దత్తత తీసుకున్నామన్నారు. 10 ఎస్టీ కుటుంబాల స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసుకునేందుకు జాబ్‌కార్డులు కావాలని, పక్కా గృహాలు నిర్మించి అందించాలని, స్వయం ఉపాధి పొందేందుకు మార్గాలు చూపించాలని పలు కుటుంబాల సభ్యులు కలెక్టర్‌తో చెప్పారు. స్పందించిన అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్‌కార్డులు మంజూరు చేయాలని, పక్కా గృహాలను కేటాయించాలని, అర్హులైన యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వారి ఆసక్తి మేరకు బ్యాంకుల నుంచి రుణాలు కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంపన్నుల కుటుంబాల నుంచి అందే సాయంతోపాటు వ్యక్తిగతంగా సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. యానాదుల యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు చౌటూరి రమేష్ జిల్లా కలెక్టర్ వెంకట మురళికి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ నేలపు రామలక్ష్మి, సీపీవో ఏఎస్ రాజు, డీఆర్డీఏ పీడీ కే.శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్, తహసీల్దార్ సీహెచ్ పద్మావతి, ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు. మడ అడవుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలి బాపట్ల: మడ అడవుల దినోత్సవాన్ని జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మడ అడవుల దినోత్సవం నిర్వహణపై మొక్కలు నాటే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు. సూర్యలంక తీర ప్రాంతం, నగర వనాన్ని ఆయన పరిశీలించారు. మడ అడవుల దినోత్సవానికి బాపట్ల సూర్యలంకకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కల్యాణ్ జిల్లాకు రానున్నారని కలెక్టర్ చెప్పారు. మడ అడవులు వృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా మొక్కలు నాటుతామన్నారు. సూర్యలంకలోని అటవిశాఖకు చెందిన నగరవనం, సూర్యలంక తీర ప్రాంతంలోని అటవీ భూములను కలెక్టర్ పరిశీలించారు. మడ అడవులు పెరగడం ద్వారా ప్రకృతి విపత్తుల మంచి తీవ్రమైన నష్టం జరగకుండా అరికట్టగలమన్నారు. వాటి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మంత్రి పర్యటన జయప్రదం చేసేందుకు అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్‌కుమార్, డీపీఓ ప్రభాకర్ డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల ఆర్డీవో గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లి గ్రామసభలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి -
సిరులు కురిపిస్తున్న ఇసుక దందా
చీరాలటౌన్: ప్రకృతి వనరులు తరలిపోతున్నాయి. కూటమి నేతృత్వంలో అవినీతి తార స్థాయికి చేరుతోంది. ఇసుక కోసం గబ్బర్సింగుల్లా మారిన అక్రమార్కుల దెబ్బకు నేల తల్లి విలవిల్లాడిపోతోంది. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలతో ఇసుక దందాతో పేట్రేగిపోతున్నారు. స్థానిక పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు దొరికినంత జేబుల్లో వేసుకుని అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. ప్రధానంగా చీరాల మండలంలోని సముద్ర తీర ప్రాంతంతో పాటు ఆటోనగర్ సమీపంలో, 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు, ఈపూరుపాలెం, విజయనగర్‌కాలనీ, సావరపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, పాతచీరాల తదితర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలను ఇబ్బడిముబ్బడిగా కొల్లగొడుతున్నారు. రోజుకు 150 ట్రాక్టర్లు, టైరు బండ్ల ద్వారా ఇసుక తరలిస్తూ లక్షలు వెనుకేసుకుంటున్నారు. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, ఆటోనగర్ సమీపంలో ఈపురుపాలెంకు చెందిన ‘పరోట’ ఇసుకను అక్రమంగా 24 గంటలపాటుగా ఇబ్బడిముబ్బడిగా అమ్మకాలు చేస్తున్నాడు. శివారు కాలనీలు, ప్రధాన రోడ్డుపై వెళితే చాలు ఎక్కడ చూసినా ఇసుక తరలిస్తున్న టాక్టర్లు, టైరుబండ్లు కనిపిస్తూనే ఉన్నాయి. చీరాల పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమార్కులకు కల్పవృక్షంగా మారింది. గతంలో గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో టైరుబండ్లలో ఇసుక తరలించే వారు. కానీ నేడు వారి ఇష్టం వచ్చినట్లు తవ్వేసుకుంటున్నారు. టైరు బండి రూ.2వేల వరకు, ట్రాక్టర్ రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొత్తవారు ఎంట్రీ... ఇసుక అక్రమ వ్యాపారం చేస్తే అతి కొద్దిరోజుల్లోనే లక్షలు గడిస్తుండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ వ్యాపారంపై పడింది. చీరాల మండలంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, గవినివారిపాలెంతోపాటు విజయనగర్‌కాలనీ, పాతచీరాల తదితర గ్రామాల్లో అధికార పార్టీ నేత అండతో పరోటా, చోటామోటా రాజకీయ నాయకులతోపాటు పలువురు ఇసుక అక్రమ వ్యాపారంలోకి దిగారు. ముఖ్యంగా ఇసుక వ్యాపారం చేస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చనే నమ్మకంతో చాలా మంది కొత్తగా ఇసుక దందాకు దిగారు. ‘పరోట’ నేతృత్వాన మండలంలో జోరుగా ఇసుక తవ్వకాలు పట్టించుకోని అధికారులు అందరి చూపు ఈ వ్యాపారం పైనే..చర్యలు తీసుకుంటాం ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించం. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు చేస్తున్నాం. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, పాతచీరాల, తీర ప్రాంత గ్రామాల్లో అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహించినా, అమ్మకాలు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవు. –కుర్రా గోపీకృష్ణ: తహసీల్దార్ -
బాపట్ల
శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025పయ్యావుల సారూ.. సాక్షి ప్రతినిధి,బాపట్ల: రైతులు పండించిన బ్లాక్ బర్లీ పొగాకు కొంటామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి సర్కార్ మొక్కుబడిగా కొన్న పొగాకుకూ డబ్బులు చెల్లించక మొండికేసింది. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటి వరకూ 3,700 టన్నుల పొగాకు మాత్రమే కొన్న ప్రభుత్వం 40 రోజులు దాటినా రైతుల ఖాతాల్లో ఒక్క పైసా జమచేయలేదు. 2050 మంది రైతులకు సంబంధించి రూ.33 కోట్లు చెల్లించాల్సి ఉంది. పొగాకు కొన్న మార్క్‌ఫెడ్ అధికారులు ప్రభుత్వం డబ్బులు వేస్తుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇన్నాళ్లు అప్పులు తెచ్చి ఎకరాకు రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టిన రైతులు పొగాకు కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేని స్థితిలో లబోదిబోమంటున్నారు. పొగాకు కొనడమే భాగ్యమని, డబ్బులు ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకోవాలే తప్ప ఎలా అడుగుతారని పచ్చనేతలు కన్నెర్ర చేస్తున్నారు. దీంతో పేద రైతులు భయపడి పొగాకు డబ్బుల విషయంపై నోరు మెదపలేక మిన్నకుండి పోతున్నారు. ప్రభుత్వం మాత్రం డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పడంలేదు. శుక్రవారం ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో కొత్తగా పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నారు. కనీసం ఆర్థిక మంత్రి అయినా కరుణించి పొగాకు డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలులో వివక్ష మరోవైపు పొగాకు కొనుగోళ్లలో వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. కూటమి పార్టీల నేతలు చెప్పిన రైతుల పొగాకు మాత్రమే అధికారులు కొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా వైఎస్సార్సీపీ సానుభూతిపరులన్న సాకుచూపి చాలామంది రైతుల పొగాకును కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై కొందరు రైతులు అధికారులను అడిగితే టీడీపీ నాయకులు చెబితేనే కొంటామని చెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకవైపు గత ఎన్నికల్లో ఓట్లేయలేదన్న అక్కసుతో కొందరి రైతుల పొగాకును కొనుగోలు చేయకపోగా కొన్న రైతులకూ ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వివక్ష చూపక అందరి రైతుల పొగాకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. 7న్యూస్‌రీల్ బ్లాక్ బర్లీ పొగాకుకు నో పేమెంట్ ఇప్పటివరకూ కొన్నది 3,700 టన్నులు 2050 మంది రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.33 కోట్లు 40 రోజులు దాటుతున్న పైసా ఇవ్వని సర్కార్ పొగాకు డబ్బులకోసం రైతుల ఎదురు చూపులు మొక్కుబడి కొనుగోళ్లతో సరి పండించిన పొగాకును టొబాకో కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతో బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన రైతు ఉప్పుటూరు సాంబశివరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు రైతులు ఆత్మహత్య చేసుకోగా కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ పరిస్థితిలో పొగాకును కంపెనీల ద్వారా కొనిపించడమా? లేక ప్రభుత్వమే టొబాకో బోర్డు లేదా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడమో చేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో పర్చూరులో మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొంటామని ప్రకటించిన ప్రభుత్వం జూన్ 19వ తేదీన పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అరకొరగా పొగాకు కొంటోంది. ఇప్పటివరకూ జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలు పెట్టి 3,700 టన్నులు మాత్రమే కొంది. వాస్తవానికి ఇంకా రైతుల వద్ద 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా పొగాకు ఉండగా ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 14 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ లెక్కన ప్రభుత్వం ఇంకా 11 వేల టన్నులు మాత్రమే కొననుంది. దీంతో మిగిలిన పొగాకు ఎవరుకొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
ఓటరు క్లెయిమ్‌లపై విచారణ
చీరాల టౌన్: చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్‌లపై బీఎల్వోలతో సమర్థంగా విచారణ నిర్వహిస్తున్నామని ఈఆర్వో, ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. గురువారం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయపార్టీల నాయకులతో ఓటరు క్లెయిమ్‌లపై విచారణ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్ అర్జీలు పెండింగ్‌లో లేకుండా విచారణ చేస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు తమ బూత్ ఏజెంట్లతో విచారణ చేయించుకోవచ్చన్నారు. క్లెయిమ్ అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అవాంతరాలు లేకుండా విచారణ చేస్తున్నారని, ఏమైనా అభ్యంతరాలుంటే వివరాలను తెలియజేయాలన్నారు. ఇటీవల మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతి బీఎల్వో వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌లోని ఓటర్ల పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం విచారణ చేయాలని, ఇష్టానుసారంగా విధులు నిర్వహించవద్దనే ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యలను తనకు గానీ, ఏఈఆర్వోలకు గాని తెలియజేయాలని కోరారు. రాజకీయపార్టీల నాయకులకు ఉన్న పలు అనుమానాలను ఆర్డీఓ నివృత్తి చేశారు. తహసీల్దార్ కుర్రా గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డీటీ సుశీల, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరం జె.పంగులూరు: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు. మండల పరిధిలోని కొండమంజులూరు జాతీయ రహదారి వెంబడి గత సర్వే నెంబర్ 58లో ఆక్రమణకు గురైన డొంక పోరంబోకును ఆర్డీఓ గురువారం పరిశీలించారు. 58 సర్వే నెంబర్లో మొత్తం 2.47 ఎకరాలు డొంక పోరంబోకు ఉన్నట్లు అధికారులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆక్రమణకు గురైన డొంక పోరంబోకు స్థలాన్ని గుర్తించి, ఆక్రమించిన వారిని గుర్తించి సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం పంచాయతీ, రెవెన్యూ అధికారులు.. ఆక్రమించిన వారికి నోటీసులు పంపించి స్థలం స్వాధీనం చేసుకోవాలని కోరారు. కొండమంజులూరు గ్రామానికి ఆనుకొని ఉన్న మట్టి దిబ్బను పరిశీలించారు. అక్రమ మట్టి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూర్పు కొప్పెరపాడులోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 14 వేల టన్నుల పొగాకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.సింగారావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు -
నత్తనడకన గుండ్లకమ్మ బ్రిడ్జి నిర్మాణం
బల్లికురవ: గుండ్లకమ్మ వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీంతో ఇటువైపు ప్రజలు అటు.. అటు వైపు ప్రజలు ఇటు వెళ్లే వీలు లేక అల్లాడిపోతున్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏడేళ్లు అవుతున్నా కూటమి సర్కారు దానిని పూర్తి చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో వాహనచోదకులు, ప్రజలకు అవస్థలు తప్పటంలేదు. 2018లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బల్లికురవ మండలం వెలమవారిపాలెం పంచాయతీలోని కె.జమ్ములమడక కాలనీ సమీపంలో గుండ్లకమ్మను దాటేందుకు సీఆర్‌ఎఫ్‌లో రెండు లేయర్లు బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పిల్లర్లు, బీములు వేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. రెండేళ్లుగా పనుల ఊసేలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, సంతమాగులూరు, ముండ్లమూరు, దర్శి మండలాల్లోని 80 గ్రామాలకు కనెక్టివిటీతో రాకపోకలకు ఇబ్బందులు తొలుగుతాయి. చుట్టూ తిరగాల్సిందే.. వంతెన పూర్తి కాని పరిస్థితుల్లో.. నాలుగు మండలాల్లోని ప్రజలు అద్దంకి మీదుగా రాకపోకలు సాగించాల్సి రావడంతో 40 నుంచి 50 కిలోమీటర్లు అదనంగా ప్రయాణిస్తూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఎండాకాలంలో మాత్రం బైక్‌లు, బాటసారులు గుండ్లకమ్మ నదిలోనే ప్రయాణించే అవకాశం ఉంది. వర్షాకాలంలో మాత్రం అది కుదరని పని. ఉచిత ప్రయాణానికి అవకాశం బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కారంచేడు, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, ముండ్లమూరు, దర్శి మండలాల్లోని 140 గ్రామాలను కలుపుతూ చీరాల, చిలకలూరిపేట డిపోల నుంచి పొదిలికి నేరుగా బస్సు వసతి కల్పించవచ్చు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉమ్మడి జిల్లాలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ప్రకటిస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బస్సులో జిల్లా కేంద్రానికి నేరుగా వెళ్లవచ్చు. ప్రస్తుతం మూడు బస్సులు మారుతూ గంటల తరబడి నిరీక్షిస్తేనే గమ్యం చేరుకొనే పరిస్థితి. పిల్లర్లు, బీముల పనులు పూర్తి కాగా.. శ్లాబులేసి మార్జిన్లో గోడలు నిర్మిస్తే రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణం విషయమై ఆర్అండ్బీ ఏఈ బాబ్జిని వివరణ కోరగా బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు నిలిచాయని తెలిపారు. పనులు పూర్తి చేయించి రాకపోకలకు ఇబ్బందులు తొలగిస్తామన్నారు. ఏడేళ్లుగా సాగుతున్న పనులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 గ్రామాల ప్రజల అవస్థలు వర్షాకాలంలో రాకపోకలకు బ్రేక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చీరాల–దర్శి– పొదిలికి నేరుగా బస్సు వసతి పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోవడం వల్ల వేలాది కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు రెండో రోజు శుక్రవారం పాత గుంటూరులోని శ్రీ కృష్ణ కల్యాణ మండపంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనసూయ, రమణరావు అధ్యక్షతన జరిగాయి. నరసింగరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోపు సంక్షేమ బోర్డు పని చేయడం ప్రారంభించాలని, లేనిపక్షంలో సెప్టెంబర్ 15న లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సామూహిక ధర్నా చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు మాట్లాడారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా రమణరావు, ఆర్.వి.నరసింహారావు, కోశా ధికారిగా గోపాలరావు, ఉపాధ్యక్షులుగా అనసూయ, రాజ్‌గోపాల్, సహాయ కార్యదర్శులుగా సుందరబాబు, అప్పారావు, 17మందితో కార్యదర్శివర్గాన్ని, 63 మంది తో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గుంటూ రు జిల్లా నుంచి దండా లక్ష్మీనారాయణ, నార్ని నాగేశ్వరరావు నియమితులయ్యా రు. డిసెంబర్లో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభల విజయవంతానికి రాష్ట్రంలో వాడవాడలా ప్రచారం చేయాలని సభలో తీర్మానించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఉమామహేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నరసింగరావు -
అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి
పిడుగురాళ్ల: ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల పెంపునకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం(ఏపీఓపెన్ స్కూల్‌సొసైటీ) రాష్ట్ర కో–ఆర్డినేటర్ పి.రవీంద్రనాథ్ సూచించారు. పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరగాలన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. అనంతరం ఓపెన్ స్కూల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పాఠశాల హెచ్ఎం మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ నెల 30వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు అపరాధ రుసుం రూ.200 చెల్లించి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440004297, 8522994297 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పల్నాడు జిల్లా కో–ఆర్డినేటర్ హుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంగాల దాచేపల్లి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాచేపల్లికి చెందిన జంగాల సింగరయ్య యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాక వెంగళరావు యాదవ్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నట్లు సింగరయ్య యాదవ్ గురువారం తెలిపారు. రానున్న రోజుల్లో బీసీలను ఏకతాటిపైకి తీసుకొస్తానని, బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి బీసీల అభ్యున్నతి ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమవుతుందని, రాష్ట్రంలోని బీసీలంతా వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేసి బీసీలు అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సింగరయ్య యాదవ్‌ని పలువురు అభినందించారు. ఆరు మండలాల్లో స్వల్ప వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆరు మండలాల్లో స్వల్ప వర్షం పడింది. దుగ్గిరాల మండలంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా 8.6 మిల్లీమీటర్లు పడగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 2.6 మి.మీ. పడింది. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర కో–ఆర్డినేటర్ పి.రవీంద్రనాథ్ -
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి పర్చూరు(చినగంజాం): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని లిక్కర్ స్కాం పేరుతో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ నేతలను పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే నాయకులను, కార్యకర్తలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూడటం కూటమి సర్కార్‌కు సమంజసం కాదన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిస్టలరీల ద్వారానే 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసి అమ్మారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ బ్రాండ్లతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం లిక్కర్ షాపులను కొనసాగించిందే తప్ప కొత్తగా ఏర్పాటు చేసింది లేదని, ప్రభుత్వ దూకాణాలను ఏర్పాటు చేసి లిక్కర్ షాపుల నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం చేకూరిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని లిక్కర్ అమ్మకాలు చేశారని ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వంలో అదే బ్రాండ్లు ఆరు నెలలపాటు కొనసాగించారని, ప్రభుత్వానికి చేకూరే ఆదాయం లేకపోగా బెల్టు షాపులను విపరీతంగా ప్రోత్సహించి పార్టీ నాయకులకు లాభాలు తెచ్చి పెడుతున్నారని ఆరోపించారు. రైతుల పరిస్థితి పట్టదా? పార్టీల ప్రాతిపదికన పొగాకు కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసమంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొగాకు సాగు చేసిన వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులని.. వారిలో ఎక్కువ మంది కౌలు రైతులున్నారని వారంతా పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారి పంటను కొనుగోలు చేయక పోవడం దారుణమైన విషయమన్నారు. -
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
కనమర్లపూడి ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతూ మహిళ మృతి శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం జాతీయ రహదారిపై ఈనెల 21న జరిగిన మినీ వాహనం, ఆటో ఢీకొన్న ఘటనలో మరొకరు మృతిచెందారు. ఘటనలో బత్తుల యశోదకుమారి (29) రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రగాయాలతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు శావల్యాపురం ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు తెలిపారు. గుంటూరులో మృతదేహానికి పంచనామా నిర్వహించి, అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనలో ఇప్పటికే నలుగురు దుర్మరణం చెందగా, యశోదకుమారి మృతితో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. -
సంతమాగులూరు తండ్రీకొడుకుల హత్య కేసులో టీడీపీ నేత?
సాక్షి,బాపట్ల: జిల్లా సంతమాగులూరు మండలంలో జరిగిన జంట హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం.చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కుమారుడు కిడ్నాప్,దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్తున్న వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను అగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం దారుణంగా హత్య చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తండ్రీ,కొడుకుల హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో బాదం మాధవరెడ్డితో హతులు వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డికి ఆర్ధిక పరమైన గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి వివాదం కారణంగానే మృతుల్ని పక్కాప్లాన్ ప్రకారం హత్య చేశారని, హత్యలో స్వయంగా బాదం మాధవరెడ్డి పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలి
శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ బాధితుల డిమాండ్ గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో భవనాలు కోల్పోతున్న యజమానులకు హైకోర్టు ఆదేశాల మేరకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారాన్ని చెల్లించిన తరువాతే పనులు ప్రారంభించాలని బ్రాడీపేట–అరండల్‌పేట షాప్ ఓనర్స్ అండ్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ సెంటర్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే బ్రిడ్జి పనులు చేపట్టాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటకీ, అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఆర్వోబీ నిర్మాణంతో భవనాలు కోల్పోతున్న 58 మంది యజమానులకు నష్టపరిహారాన్ని ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ విధంగా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేరకు చెల్లించాల్సిన నష్టపరిహారంతో పాటు ఆర్వోబీ నిర్మాణ వ్యయం రూ.98 కోట్లను కలుపుకుంటే మెగా ఫ్లై ఓవర్ నిర్మించవచ్చునని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం హడావుడిగా పిల్లర్స్ నిర్మాణ పనులను చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన వర్క్ ఆర్డర్‌లోనే బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుగానే రోడ్డు విస్తరణ పనులు, కాలువల నిర్మాణం, విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పూర్తి చేయాల్సి ఉందని, అధికారులు ఇవేవీ చేయలేదని విమర్శించారు. అధికారులు ఏకపక్ష వైఖరితో ముందుకు వెళితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే డిజైన్ ప్రకారం హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు మెగా ఫ్లై ఓవర్‌ను, సింగిల్ పిల్లర్‌తో పాటు ఆర్‌యూబీలను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాలు సులభంగా ప్రయాణిస్తాయని తెలిపారు. 70 ఏళ్లుగా అభివృద్ధి చెందిన శంకర్ విలాస్ సెంటర్ ఉనికి దెబ్బతినకుండా ఉంటుందని చెప్పారు. ఎర్త్ వాల్‌తో కూడిన ప్రస్తుత డిజైన్ ద్వారా బ్రిడ్జిని నిర్మిేంచడం ద్వారా ఈ ప్రాంతం పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ నాయకుడు జి.కార్తిక్ మాట్లాడుతూ తాము బ్రిడ్జి నిర్మాణానికి, అభివృద్ధికి వ్యతిరేకం కాదని తెలిపారు. పరిహారం కింద బాండ్లు ఇస్తే తీసుకోబోమని, 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని కోర్టుకు వెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. కోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన కోరారు. -
జ్వరాల ఆస్పత్రిలో పాముల సంచారం
గుంటూరు మెడికల్ : గోరంట్లలోని ప్ర భుత్వ ఛాతీ, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో పాములు సంచారంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి రెండు పాములను చంపగా, బుధవారం మరొకట వంటగదిలో ప్రత్యక్షమైంది. వాస్తవానికి ఆస్పత్రి శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పరిశుభ్రంగా ఉంచి పాములు, ఇతర క్రిమికీటకాలు లోపలకు రాకుండా చర్యలు తీసుకోవాలి. అయితే, కాంట్రాక్టర్ పట్టించుకున్న దాఖలా లేదు. పాములు వార్డుల్లోకి వచ్చిన తరువాత అయినా బుధవారం ఆస్పత్రి అంతా స్పెషల్ డ్రైవ్ చేసి, పరిశుభ్రం చేయకపోవడంతో మరలా పెద్దపాము ఏకంగా కిచెన్‌లోకి ప్రవేశించి, సిబ్బంది గుండె ఆగిపోయేంత పని చేసింది. ఆస్పత్రిలో పాముల సంచారం గురించి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకంటి రఘును సాక్షి వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. పాములు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
లక్ష్మీపురం: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాత గుంటూరులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బుధవారం భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ముందుగా యూనియన్ జెండాను సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణారావు, సీఐటీయూ జెండాను వి. ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోతే ఎమ్మెల్యేలను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను చైతన్యంతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పలు తీర్మాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి. నరసింహారావు మహాసభల నివేదికను ప్రతినిధుల ముందు చర్చకు పెట్టారు. కార్యక్రమంలో వర్కింగ్ ఉమెన్ రాష్ట్ర నాయకురాలు దయా రమాదేవి తదితరులు ప్రసంగించారు. -
అందుబాటులో 1,681 మెట్రిక్ టన్నుల ఎరువులు
సత్తెనపల్లి: ఖరీఫ్ సాగుకు సత్తెనపల్లి పట్టణ, గ్రామీణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో 1,681 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సత్తెనపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు బి.రవిబాబు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గల గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణ, గ్రామీణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో యూరియా–590 మెట్రిక్ టన్నులు, డీఏపీ– 327 మెట్రిక్ టన్నులు, పొటాష్ ఎరువులు –95 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు–585 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ–84 మెట్రిక్ టన్నులు నిల్వలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. రైతులందరూ మీ మీ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద, ప్రైవేట్ ఎరువుల దుకాణాలు వద్ద నుంచి ఎరువులను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి.సుబ్బారెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుడికి ఆరేళ్ల జైలు
రేపల్లె: ఓ వ్యక్తిని కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి ఎస్పీడీ వెన్నెల బుధవారం తీర్పు వెలవరించారు. పట్టణానికి చెందిన ఆర్కే జ్యూయలర్స్ నిర్వాహకుడు జక్కం రామకృష్ణ భార్యపై పట్టణానికి చెందిన పడకల వెంకటేశ్వరరావు 2017 సెప్టెంబర్ 11న అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జక్కం రామకృష్ణ నిలదీశారు. వెంకటేశ్వరరావు చాకుతో రామకృష్ణపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో రేపల్లె ఎస్ఐ బాలనాగిరెడ్డి కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తులో నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనగాని శ్రీనివాసమూర్తి వాదించారు. రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చీరాల రూరల్: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చినగంజాం–ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ల మధ్య దిగువలైన్‌లో చోటుచేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొమడయ్య బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 30 సంవత్సరాలు ఉంటాయని, 5.5 అడుగుల ఎత్తు, ఛామనచాయ రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. మృతుని కుడి రిబ్స్‌పై ఒక నల్లని పుట్టుమచ్చ, ఎడమ భుజంపై ఒక నల్లని పుట్టుమచ్చ ఉందన్నారు. మృతుని శరీరంపై నలుపు రంగు గడులు కలిగిన ఫుల్‌హ్యాండ్ షర్ట్, వెలిసిపోయిన బ్లూ జీన్స్ ప్యాంట్ ఉందని, ఎడమచేయి ఉంగరం వేలుకు తాబేలు బొమ్మ ఉన్నట్లు చెప్పారు. మృత దేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 9440627646 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. బస్సు ఢీకొని యాచకుడు మృతిమార్టూరు: జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యాచకుడు మృతి చెందాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి ఒంగోలు వెళుతున్న ఇంద్ర బస్సు బొల్లాపల్లి టోల్గేట్ సమీపంలోకి వస్తున్న క్రమంలో ఓ యాచకుడు హఠాత్తుగా రోడ్డుపైకి రావటంతో బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన యాచకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సును స్టేషన్‌కు పంపి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు షిర్డీ నుంచి గుంటూరు వెళుతుండగా ప్రమాదం నరసరావుపేటటౌన్: ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే గడియార స్తంభం సెంటర్లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. పోలీసుల కథనం ప్రకారం.. షిర్టీలో ప్రయాణికులను ఎక్కించుకొన్న మారుతి సుధాశ్రీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గుంటూరుకు బయలు దేరింది. మార్గమధ్యంలో తెల్లవారు జామున నరసరావుపేట గడియార స్తంభం వద్దకు వచ్చే సరికి ఆగి ఉన్న లారీని క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి బస్సు డివైడర్‌ను ఢీకొంది. సంఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. సంఘటనతో ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న సీఐ లోకనాథం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
పేదల అభ్యున్నతికి పాటుపడాలి
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఆర్థికంగా వృద్ధి చెందిన వారు ముందుకు వచ్చి వారిని దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను అభివృద్ధి చేసేందుకు పీ–4 పథకాన్ని ప్రవేశపెట్టిందన తెలిపారు. ఇందులో భాగంగా మార్చి నుంచి నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 1.20 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా వారిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దలతో చర్చించి అర్హత ఉన్నవారందరినీ జాబితాలో చేర్చామని తెలిపారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు వ్యక్తిగతంగా, సంస్థల పరంగా బంగారు కుటుంబాలను దత్తతకు తీసుకుని సహకారం అందించాలని ఆమె కోరారు. బంగారు కుటుంబాల్లోని పిల్లల విద్యా అవసరాలు, చిరు వ్యాపారులను ప్రోత్సహించడానికి మెంటార్‌గా, ఇతర అంశాల్లోనూ మార్గదర్శులు సహాయం అందించాలని తెలిపారు. ప్రభుత్వ విజన్– 2047 స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేయాలంటే పీ–4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో సీపీఓ శేషశ్రీ , ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
పిడుగురాళ్లలో హతమార్చి నంద్యాలలో డోర్ డెలివరీ
నంద్యాల: భర్తను తన తమ్ముడితో కలిసి చంపేసి.. ఆపై మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాలలోని భర్త ఇంటి వద్ద విడిచిపెట్టింది. ఈ ఘటన నంద్యాలలో జరిగింది. నంద్యాల టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి సంతానం. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా భార్య కొంతకాలంగా పుట్టిల్లు అయిన పిడుగురాళ్లలో ఉంటోంది. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకొని రావడానికి భర్త పిడుగురాళ్లకు సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ భార్య బంధువులు, రమణయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య కలిసి, రమణయ్య కంట్లో కారం చల్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమ్ముడితో కలిసి భర్త మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చి, మృతదేహాన్ని అక్కడ పడేసి పరారయ్యారు. మృతుడి ముఖంపై కారంపొడి ఉండటం..తల, వీపుపై గాయాలు ఉండటంతో రమణయ్య కుమార్తెలు జ్యోతి, చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి భర్త ఇంటి వద్ద విడిచిపెట్టిన భార్య హత్యకు సహకరించిన ఆమె తమ్ముడు -
రెంటపాళ్ళలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి
సత్తెనపల్లి: మిరప నారు దిబ్బల పైకి గొర్రెల మందను వదలడమే కాకుండా వైఎస్సార్ సీపీ శ్రేణులపై సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో టీడీపీ సానుభూతిపరులు మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు, వల్లెపు రవితేజ, వల్లెపు వీరయ్య మిరప నారు దిబ్బలు సాగు చేస్తుండగా టీడీపీ సానుభూతి పరులైన నంబుల కాటంరాజు, యాగంటి బాబురావు, సైదయ్యలకు చెందిన గొర్రెల మంద పడటంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన కాటంరాజు, బాబురావు, సైదయ్యలు దాడి చేయడంతో వల్లెపు రాంబాబు, వల్లెపు రవితేజ, వల్లెపు వీరయ్యలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ప్రతిగా టీడీపీ సానుభూతిపరులు కూడా ఫిర్యాదు చేశారు. గాయపడి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్సార్ సీపీ నాయకులు కొర్లకుంట వెంకటేశ్వర్లు, కొమ్మెర శివశంకర్, కొమెర వీరాంజి, మారిశెట్టి వెంకట్రావు, వల్లెపు సహదేవుడు, గంగిలి ఏసోబు, చల్లా వెంకటేశ్వర్లు, తదితరులు పరామర్శించారు. -
గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
డీఆర్ఓ జి.గంగాధర్‌గౌడ్ బాపట్ల: గంజాయి రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో మాదకద్రవ్య నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఈగల్ టీంలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. యువత, విద్యార్థులు ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా నష్టపోవడంతోపాటు సమాజంలోనూ తీవ్ర దుష్పరిణామాలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వ అధికారులతోపాటు విద్యాసంస్థల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా సహకారాన్ని అందించాలన్నారు. క్రైం డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ అధికారులు అందరూ సహకరించాలని కోరారు. జిల్లాలో 2022 –25 సంవత్సరం వరకు మొత్తం 73 కేసులు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో 64 మంది గంజాయి సరఫరా, 275 మంది విక్రేతలను గుర్తించామని చెప్పారు. విస్తృత తనిఖీలు చేయడంతోపాటు జిల్లాలో 14 యాంటీ గంజాయి టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గంజాయి రవాణా, సరఫరా వివరాలు తెలిస్తే వివరాలను 1972 టోల్ ఫ్రీ నెంబరుకు తెలియజేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచో డాక్టర్ విజయమ్మ, రవాణా శాఖ అధికారి పరంధామ రెడ్డి, పోర్టు అధికారి బీవీఎం మూర్తి, ప్రొబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ అధికారి రాజ్దేబోరా, వికలాంగుల సంక్షేమ అధికారి సువార్త, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, షాడో స్వచ్ఛంద సంస్థ ఎన్జీవో రాజా సాల్మన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవాన్ని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి తెలిపారు. బుధవారం నగర శివారుల్లోని లాంఫాం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఆమె వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయ గౌరవ కులపతి, గవర్నర్ ఎస్. అబ్దుల్‌నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. పూర్వ విద్యార్థి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పంజాబ్ గవర్నమెంట్, డైరెక్టర్ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ. వేణుప్రసాద్ పాల్గొంటారని ఆమె తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినవారికి స్నాతకోత్సవంలో పురస్కారాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇంటి సిలిండర్లు వ్యాపారానికి వాడితే చర్యలు గుంటూరు వెస్ట్: గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వాడితే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ఆర్.చంద్రముని తెలిపారు. గత రెండు రోజులుగా నగరంలో 20 రెస్టారెంట్లు, టిఫిన్ బండ్లపై సిబ్బందితో దాడులు చేసినట్లు చెప్పారు. ఇందులో 147 డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారాలకు ఉపయోగిస్తునట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని 30 మందిపై 6–ఏ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇక నుంచి తరచూ తనిఖీలు చేస్తామని ఆయన వెల్లడించారు. వైభవంగా శాకంబరీ దేవి ఉత్సవాలు తెనాలి: స్థానిక గాంధీ చౌక్‌లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో బుధవారం శాకంబరీ దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో అర్చకులు జంపని నాగభాస్కర్ ఉత్సవాలను వైభవోపేతంగా జరిపారు. అమ్మవారిని వివిధ కూరగాయలతో విశేషంగా అలంకరించారు.అర్చకులు పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆలయంలో శాకాంబరీ దేవి ఉత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు తాళాబత్తుల ఉదయ్‌శంకర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శాకంబరీ దేవిగా దుర్గమ్మ తాడేపల్లి రూరల్: మంగళగిరి పెదకోనేరులోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం శాకంబరీ దేవి అలంకారోత్సవాలు ప్రారంభమ్యాయి. ఆలయ అర్చకులు కూర్మాల బాలసాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కూర్మాల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మూడు రోజలు పాటు అమ్మవారికి అలంకార ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలి రోజు అమ్మవారిని కూరగాయలతో శోభాయమానంగా అలంకరించామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రావణ మాసం ప్రారంభం రోజు పూలతో అలంకరించి పూజలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. -
‘పచ్చ’ కార్యాలయంలో అధికారుల సమావేశం
రేపల్లె ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ ప్రజాప్రతినిధి హోదాలో పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించడంపై ప్రజలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ఏడీఏ లక్ష్మితోపాటు నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహాయకులు హాజరయ్యారు. మంత్రి ఇక్కడ క్రియాశీలకంగా లేకపోవడంతో బదులుగా ఆయన సోదరుడు శివప్రసాద్ ఇలా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలలో జోక్యం చేసుకుంటున్నారని అధికారులు బహిరంగంగానే వాపోతున్నారు. – రేపల్లె -
నీటిపై రాతలా జలమార్గం
బకింగ్ హాం కాలువకు దక్కని పూర్వ వైభవం చినగంజాం: ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ నుంచి తమిళనాడు ప్రాంతంలోని పుదుచ్చేరి వరకు కొనసాగే బకింగ్ హాం కాలువ రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ కాలువ ద్వారా జలరవాణా మార్గాన్ని పునరుద్ధరించేందుకు ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి. కానీ అవి ముందుకు మాత్రం కదలడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపగా, సర్వేకు ఆదేశాలు జారీ అయ్యాయి. పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఆంగ్లేయుల పాలనలో 1806లో ఆనాటి బ్రిటిష్ పాలకులు బకింగ్ హాం కాలువ నిర్మాణం చేపట్టారు. జల మార్గం ద్వారా సౌకర్యవంతంగా తక్కువ ఖర్చుతో నిత్యావసర సరుకులు వరణా చేసేవారు. 1876–78 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతదేశాన్ని ఈ కాలువ కాపాడింది. 1965లో వచ్చిన తుపాన్, వరదల కారణంగా కాలువ దెబ్బతిని పూర్తి నిరుపయోగంగా మారింది. అప్పటి నుంచి ఆక్రమణల చెరలో కుంచించుకుపోయింది. అడుగు ముందుకు పడని పనులు కోస్తా తీరం వెంబడి ప్రయాణించే కాలువలో నావికా యోగ్యంగా 420 కి.మీ. వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా నల్లమడ లాకుల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు(257 కి.మీ.) కొమ్మమూరు కాలువగా పిలుస్తారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా మీదుగా తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా వరకు బకింగ్ హాం కాలువ(163 కి.మీ.) విస్తరించి ఉంది. పెదగంజాం నుంచి సహజసిద్ధమైన కాలువ మార్గం ద్వారా చైన్నె నౌకాశ్రయానికి కలుపబడిన జలమార్గం ఇది. ఈ మార్గం పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంచనాలు చేపట్టింది. అడుగు ముందుకు పడలేదు. కృష్ణా డెల్టా పరివాహకంగా ఉన్న కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం జలరవాణా మార్గం ప్రకటన చేయడంతో నీటి పారుదల శాఖ అప్రమత్తమైంది. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన వంతెనల నిర్మాణాన్ని నిలిపివేసింది. పడవల రవాణాకు అనుకూలంగా డిజైన్లు మార్చవలసి వస్తుందని ఆలోచనతో పనులు నిలిపివేశారు. రూ. 3 వేల కోట్లు ఖర్చు అంచనా సుమారు 32 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేలా కాలువను తిరిగి డిజైన్ చేసి.. 30 నుంచి 40 టన్నుల బరువు సరుకును రవాణా చేసే ఓడలు ప్రయాణం చేసేలా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ. 3 వేల కోట్లు ఖర్చు అవుతుందని సంబంధిత కన్సల్టెన్సీ సంస్థ నివేదించింది. జల రవాణాను పునరుద్ధరిస్తే ఏడాదికి సుమారు 11 మిలియన్ల టన్నుల సరుకును రవాణా చేసే అవకాశం ఉందని సర్వే సంస్థ పేర్కొంది. నావిగేషన్ కెనాల్‌గా ఉపయోగించవచ్చని తెలిసినా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. కాలువ అభివృద్ధి చేస్తే అమరావతికి బహుళ ప్రయోజనకారిగా ఉండనుంది. ఒకప్పుడు కాకినాడ నుంచి నాటి మద్రాసు వరకు విస్తరించిన బకింగ్ హాం కాలువ జల రవాణాలో కీలకపాత్ర పోషించింది. బ్రిటిష్ వారి కాలంలో నిత్యావసర సరుకులు జలరవాణా ద్వారానే ఎక్కువగా అందుతుండేవి. ఆ కాలువ ప్రస్తుతం రూపు రేఖలు కోల్పోయింది. పునరుద్ధరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.పర్యాటక రంగానికి ఊతం ప్రస్తుతం కాలువ ఆక్రమణల చెరలో చిక్కుకొని రొయ్యల చెరువులు, ఇతర నిర్మాణాలతో కుంచించుకుపోయింది. కెనాల్ అభివృద్ధి చేయాలంటే భూ సేకరణకు రూ. 391 కోట్లు, డ్రెడ్జింగ్ కోసం రూ. 333 కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో సర్వే సంస్థ తేల్చి చెప్పింది. గతంలో ఉన్న లాకులు ధ్వంసం అవడంతో అత్యంత విలువైన కలప, రాగి రేకులు దొంగలపాలయ్యాయి. కెనాల్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు 420 కి.మీ. పరిధిలో 48 లాకులు, 15 టెర్మినల్స్ నిర్మించడం ద్వారా అందుబాటులోకి తీసుకొని రావచ్చని నిపుణులు చెబుతున్నారు. జలరవాణాతో పాటు పర్యాటక రంగానికి కూడా తోడ్పాటు అందించే అవకాశాలున్నాయి. -
ఆడబిడ్డ నిధి అమలేదీ?
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘ఓట్లేసి గెలిపిస్తే 19 నుంచి 59 సంవత్సరాలలోపు మహిళలందరికీ నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు ఇస్తాం. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం’.. అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా కూటమి నేతలు ఇచ్చిన హామీ ఇది. కానీ ఓట్లు పడి గద్దెనెక్కాక ప్రభుత్వ స్వరం మారింది. దీనిపై మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద 19 – 59 ఏళ్లలోపు మహిళలందరికి నెలకు రూ.1500 ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. ఏడాది దాటినా మహిళలకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నయవంచనకు పాల్పడ్డారని చంద్రబాబు తదితరులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బకాయి పడిన సర్కార్ జిల్లాలో 6,61,958 మంది మహిళలు ఉండగా.. ఇందులో 15 శాతం మంది పింఛనుదారులు. వారు పోగా 5,76,893 మంది మహిళలు ఉన్నారు. వీరందరికి నెలకు రూ. 1500 ప్రకారం రూ. 86.53 కోట్లు ఇవ్వాలి. కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నందున మొత్తం రూ.1124.94 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదు. నియోజకవర్గం అర్హుల ఇవ్వాల్సిన సంఖ్య మొత్తం వేమూరు 86,645 168,95,77,500 రేపల్లె 98,719 192,50,20,500 బాపట్ల 83,288 162,41,16,000 పర్చూరు 99,120 193,28,40,000 అద్దంకి 1,06,561 207,79,39,500 చీరాల 1,02,560 199,99,20,000 మొత్తం 5,76,893 1124,94,13,500 ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చి ఓట్లేయించుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్కపైసా ఇవ్వలేదు. గడిచిన 13 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.19,500 ఇవ్వాలి. ఇలా మోసగించడం సరికాదు. ప్రభుత్వం వెంటనే మహిళలకు డబ్బులు చెల్లించాలి. – బెల్లంకొండ శివపార్వతి, బలిజపల్లి గ్రామం, వేమూరు మండలం ఆడబిడ్డలను మోసగించడం తగదు ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మి ఆడపడుచుల ఓట్లు పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన హామీ అమలు చేస్తారని భావించాం. సంవత్సరం దాటినా పైసా ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ రూ.19,500 రావాలి. ఇప్పటికై నా ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన బకాయి మొత్తం చెల్లించారు. ఆడబిడ్డలను వంచించిడం మంచిది కాదు. – సీతామహాలక్ష్మి, ఓడరేవు, చీరాల నియోజకవర్గం నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో కూటమి ప్రచారం ఓట్లేసి గెలిపిస్తే ఆడబిడ్డలకు అండగా నిలబడతామని హామీ గద్దెనెక్కాక ఆ విషయమే మరిచిపోయిన కూటమి సర్కార్ జిల్లాలో దాదాపు 5.76 లక్షల మంది అర్హులు ఇప్పటివరకు వారికివాల్సిన మొత్తం రూ.1,124.94 కోట్లు కూటమి ప్రభుత్వం నయవంచనపై మహిళలు తీవ్ర ఆగ్రహం ఇకనైనా చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ -
బ్లాక్ బర్లీ పొగాకు సాగుపై నిషేధం
‘అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేద్దాం బాపట్ల: జిల్లాలో బ్లాక్ బర్లీ పొగాకు సాగుపై నిషేధం విధించినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ఈ ఏడాది సదరు ఆదేశాలను ఉల్లంఘించే రైతులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్లో కలెక్టర్ మురళి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రైవేట్ బయ్యర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంపెనీల హామీలతో రైతులు అధికంగా బ్లాక్ బర్లీ సాగు చేశారని తెలిపారు. కొనుగోలు సమయంలో కొన్ని కంపెనీలు వెనకడుగు వేశాయన్నారు. డిమాండ్‌కు మించి సాగు వల్ల మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయాయని, ఇది రైతుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో బ్లాక్ బర్లీ పంట సాగు చేయకూడదని, ఇది పూర్తిగా నిషేధితమని పునరుద్ఘాటించారు. నర్సరీలలోనూ బ్లాక్ బర్లీ నారు సాగు చేయటం కూడా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే వ్యవసాయ శాఖ అధికారులు ఆ పంటను ధ్వంసం చేయడంతోపాటు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ, లాభదాయక పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే పండించిన బ్లాక్ బర్లీ పొగాకును రైతులు ప్రైవేట్ కంపెనీలకు విక్రయించవచ్చని తెలిపారు. వర్షాల ప్రభావం నుంచి పంటను రక్షించుకోవాలని, తేమ శాతం 20% మించిన బేళ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రతి రైతు పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి రైతులు సహకరించాలని సూచన బాపట్ల: అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపునకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అక్షర ఆంధ్ర కార్యక్రమానికిగాను గ్రామ స్థాయిలో వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ‘ఉల్లాస్’ – అక్షర ఆంధ్ర కార్యక్రమంలో జీవితాంతం నేర్చుకునే అవకాశాల కల్పన కోసం కేంద్ర ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ఆర్థిక, సాంకేతిక, క్రియాత్మక అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేయాలని ఆయన చెప్పారు. అమలులో వలంటీర్లు , ఉపాధ్యాయులు, విద్యాసంస్థల పాత్ర కీలకమని అన్నారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. జిల్లాలో పీ–4 మార్గదర్శకులతో గ్రామాలలో ఉన్న నిరక్షరాస్యులను మ్యాపింగ్ చేయాలన్నారు. సమావేశంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
లైసెన్స్ ఫీజులు చెల్లించకుంటే కఠిన చర్యలు
చీరాల: మద్యం షాపులు, రెస్టారెంట్ అండ్ బార్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. ఎకై ్సజ్ శాఖకు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులను బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు చెల్లించడంలేదని బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఎకై ్సజ్ శాఖకు టోపీ’ అనే కథనానికి జిల్లా ఎకై ్సజ్ శాఖ స్పందించింది. ఈ మేరకు బి.వెంకటేశ్వర్లు బుధవారం చీరాలలోని ఎకై ్సజ్ స్టేషన్లో యజమానులతో సమావేశం నిర్వహించారు. లైసెన్స్ ఫీజులు చెల్లించని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, కాలపరిమితి దాటిన మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనల మేరకు ప్రకటించిన సమయానికే నిర్వహించాలని కోరారు. ఈ విషయమై నోటీసులు ఇచ్చామన్నారు. బెల్ట్ షాపుల నియంత్రణకు నిత్యం నిఘా ఉంటుందన్నారు. సమాచారం ఇవ్వదలచిన వారు 14405, 9440902495 కు కాల్ చేయాలన్నారు. సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సై బి.శ్రీహరి పాల్గొన్నారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు -
బాపట్ల జిల్లాలో జంట హత్యల కలకలం
సాక్షి,బాపట్ల: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో జంట హత్యలు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు తండ్రి, కొడుకులను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. మృతులు పాతమాగులూరికి చెందిన వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే,వీరి హత్యకు బెంగుళూరులో ఆస్తి వివాదాలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కక్ష సాధింపుతోనే మిథున్‌రెడ్డి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే వైఎస్సార్సీపీ ముఖ్యనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి అంజనీప్రసాదరెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబు సర్కార్ బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు. ఎంత మందిపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా పార్టీశ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంటుందన్నారు. కూటమి ఏడాది పాలనపట్ల ప్రజల్లోనేకాక కూటమి శ్రేణుల్లోనే వ్యతిరేకత మొదలైందన్నారు. -
రైలు ఢీకొని ఉద్యోగి మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఆర్ అండ్ బీ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న జాన్‌బాబు(50) మంగళవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. జాన్‌బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు తెలిపారు. -
రేవులో పడి వ్యక్తి మృతి
నిజాంపట్నం: వేటకు వెళ్తూ ప్రమాదవశాత్తు రేవులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. అడవులదీవి ఎస్ఐ బాబూరావు వివరాల మేరకు కొత్తపాలెం పంచాయతీ శారదానగర్‌కు చెందిన బాలకోటయ్య (23) సముద్రంలో వేటకు వెళ్ళేందుకు సోమవారం రేవులో పడవపై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి రేవులో పడ్డాడన్నారు. గల్లంతైన బాలకోటయ్య మృతదేహాన్ని మంగళవారం రేవు ఒడ్డున గుర్తించామన్నారు. మృతుని సోదరుడు బాల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. షార్ట్ సర్క్యూట్‌తో టైలర్ షాపు దగ్ధం మేదరమెట్ల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలోగల టైలర్ దుకాణం సోమవారం అర్ధరాత్రి మంటల్లో కాలిపోయింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి దుకాణం తలుపులు వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో స్థానికులు ఫోన్ చేసి షాపులో మంటలు వస్తున్నాయని చెప్పటంతో అక్కడకు వచ్చే సరికి దుకాణం పూర్తిగా కాలిపోయింది. దుకాణంలో ఉన్న బట్టలు, సామాగ్రి దగ్ధమయ్యాయని.. వాటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని వాపోయాడు. లారీని ఢీ కొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు మేదరమెట్ల: ఆగిఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన టాటాఏస్ ఆటో ఢీ కొన్న సంఘటన జాతీయ రహదారిలోని పి.గుడిపాడు గాజు ఫ్యాక్టరీ వద్ద మంగళవారం జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కొరియర్ లారీ పి.గుడిపాడు జాతీయరహదారి గాజు ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉంది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న టాటాఏస్ ఆటో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన ఆటో ఆగిఉన్న లారీని ఢీ కొంది. దీంతో లారీలోని డ్రైవర్‌కు.. ఆటో డ్రైవర్‌కు గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 10 మంది వైఎస్సార్ సీపీ నేతల విచారణ సత్తెనపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన అక్రమ కేసులో 10 మంది వైఎస్సార్ సీపీ నేతలను మంగళవారం సత్తెనపల్లిటౌన్ పోలీస్టేషన్లో సీఐ నాగమల్లేశ్వరరావు విచారించారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ న్యాయవాది పెండెం బాబురావుతో పాటు నాయకులు జూపల్లి పాల్, జడా ప్రసాద్, కూకుట్ల శ్రీనివాసరావు, అజయ్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, పవన్‌కుమార్, ప్రమోద్,వినోద్, ఉల్లం.శ్రీనులను విచారించారు. -
అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం
నరసరావుపేట రూరల్: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈనెల 23వ తేదీ బుధవారం లోపు రైతుసేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుని వద్ద గ్రీవెన్స్ పెట్టవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని లింగంగుంట్ల, అల్లూరివారిపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లాడుతూ పంట సాగు చేసే కౌలు రైతులు కౌలు కార్డులు పొందాలని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో వరి పంటకు ఎకరానికి రూ.80లు ప్రీమియం చెల్లించి ఆగస్టు 15వ తేదీ కల్లా ఇన్స్యూరెన్స్ చేసుకోవాలని సూచించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతురావు, ఏఓ ఐ.శాంతి, ఏఈవో బ్రహ్మయ్య, వీఏఏ సామంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర సత్తెనపల్లి: త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించిన సందర్భంగా హెల్ప్ ఫౌండేషన్ (సతెనపల్లి)ఆధ్వర్యంలో నందిగామలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో 108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర ర్యాలీ మంగళవారం నిర్వహించారు. సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడుతూ.. జాతీయ జెండా భారత దేశం యొక్క సార్వభౌమత్వం, ఐక్యతకు చిహ్నమన్నారు. సత్తెనపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆళ్ల సాంబయ్య మాట్లాడుతూ త్రివర్ణ పతాకం భారతీయులకు అందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. తొలుత పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, పాఠశాల పీడీ సాంబశివరావు, చెంబేటి బోల్లయ్య, హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు అక్షయ్, నిర్మల్ కుమార్, జాతీయ జెండా వేషధారి శేఖర్, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, వాణి, జ్యోతి, అమల, గౌసియా, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
నగరంపాలెం: ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయతీ, సేవాతత్పరతతో మెలగాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సివిల్ ఎస్ఐ (పీఎస్ఐ)లు 53 మంది మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్‌లోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాద పూర్వకంగా కలిశారు. పీఎస్ఐలను ఉద్దేశించి ఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, పోలీసింగ్‌లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్లను నిర్వహించే విధానాలు, రికార్డులు, చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం 53 మంది ఎస్ఐలలో 36 మంది పురుషులు, 17 మంది మహిళా ఎస్ఐలు రిపోర్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు 23, పల్నాడు జిల్లాకు 13, బాపట్ల జిల్లాకు 10, ప్రకాశం జిల్లాకు ఒక్కరు చొప్పున, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు ముగ్గురు, తిరుపతికి ముగ్గుర్ని కేటాయించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి నగరంపాలెం: ప్రొబేషనరీ సివిల్ ఎస్ఐ (పీఎస్ఐ)లు సమర్థంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 23 మంది పీఎస్ఐలు, ఉద్యోగోన్నతి పొందిన ఆరుగురు ఎస్ఐలు మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన, సేవా గుణం కీలకమని అన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి రేంజ్‌కు 53 మంది పీఎస్ఐలు కేటాయింపు -
ఆర్టీఐ అర్జీలకు సకాలంలోసమాచారం అందించాలి
నరసరావుపేట రూరల్: ఆర్టీఐ అర్జీలకు సకాలంలో సమాచారం అందించే బాధ్యత అధికారులతో పాటు సిబ్బందిపై ఉందని జిల్లా ఉద్యాన అధికారి ఎ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఉద్యాన కార్యాలయంలో మంగళవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఆర్టీఐ ద్వారా ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఈ చట్టం ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా పాలనలో పారదర్శకతకు అవకాశం ఉంటుందని వివరించారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట బి.వెంకటేశ్వరరావు, ఉద్యాన అధికారులు, కార్యాలయ సిబ్బంది, గ్రామ ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు. -
దమ్మనవారిపాలెంలో భారీ చోరీ
కర్లపాలెం: దమ్మనవారిపాలెంలో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం ఎస్ఐ జి.రవీంద్ర తెలిపిన వివరాల మేరకు కర్లపాలెం మండలంలోని దమ్మనవారిపాలెం గ్రామానికి చెందిన పిట్ల పెద వెంకటరెడ్డి కుటుంబంతో ఈనెల 17వ తేదీన పాండిచ్చేరిలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్ళాడు. ఈనెల 20వ తేదీన పెద వెంకటరెడ్డి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉండటంతో గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 21వ తేదీన వెంకటరెడ్డి స్వగ్రామానికి వచ్చి ఇంటిని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. బీరువా లాకరులో ఉన్న 141 గ్రాముల బంగారం, అరకిలో వెండి, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. బాపట్ల రూరల్ సీఐ హరిబాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని క్లూస్ టీమ్స్ పిలిపించి వేలిముద్రలు సేకరిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన దినేష్ (20) మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కళాశాల నుంచి తన స్నేహితుడు గణేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరుకు బయలుదేరాడు. చౌడవరం వద్ద హైవేపై డివైండర్ రైలింగ్‌కు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొంది. దినేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకరోజు శాస్త్రవేత్తలుగా పాఠశాల విద్యార్థులు ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 8, 9వ తరగతుల విద్యార్థులు ఐదుగురు జాతీయ స్థాయి వన్డే యాజ్ ఏ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌కు ఎంపిక అయినట్లు పాఠశాల హెచ్ఎం లింగిశెట్టి సాంబయ్య మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన బి.అనుశ్రీ,, షేక్ ఖాసీం, షేక్ మస్తాన్‌వలి, కె.ప్రశాంత్, షేక్ అన్వర్‌లను ఇటీవల ఆన్లైన్లో నిర్వహించిన పరీక్షల్లో ఎంపిక చేశారని చెప్పారు. జిగ్యాసా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థ (భవనేశ్వర్)లో ఈ నెల 24న విద్యార్థులు అక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తారని తెలిపారు. విద్యార్థులను పలువురు ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి.నాగరాజులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.రామాంజనేయులు, రాజులు పాల్గొన్నారు. పేకాటపై పోలీసులు మెరుపుదాడి చిలకలూరిపేటటౌన్: మండలంలోని కుక్కపల్లివారిపాలెం గ్రామ శివారులోని పొలాల్లో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ నేతృత్వంలో పోలీసులు మంగళవారం దాడులు చేపట్టారు. అదుపులోకి తీసుకున్నవారి వద్ద నుంచి రూ.3,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
రెచ్చిపోయిన దొంగలు
మార్టూరు: మండల కేంద్రమైన మార్టూరులో మంగళవారం ఉదయం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. స్థానిక కొణిదెన రోడ్డులో నివాసం ఉండే కొండముది కళ్యాణి మూడు రోజుల క్రితం తమ ఇంటికి తాళం వేసుకొని కాశీ యాత్రకు బయలుదేరి వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కళ్యాణి ఇంటి కిటికీలు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. అనంతరం ఇంట్లోని బీరువా, కప్ బోర్డులను సైతం ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును చోరీ చేశారు. మంగళవారం ఉదయం చోరీ విషయాన్ని గమనించిన సమీప బంధువులు కాశీ యాత్రలో ఉన్న కళ్యాణికి, పోలీసులకు సమాచారం అందించారు. బాపట్ల నుంచి వచ్చిన క్లూస్ టీం బృందం కళ్యాణి నివాసాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. కాశీ యాత్ర విరమించుకొని తిరుగు ప్రయాణమైన కళ్యాణి మార్టూరు వచ్చిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. కిటికీలు, కప్‌బోర్డులు ధ్వంసం చేసి సొత్తు అపహరణ -
పీ–4 లక్ష్యం పేదరిక నిర్మూలన
పర్చూరు(చినగంజాం): పేదరిక నిర్మూలన పీ–4 లక్ష్యం అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న పేర్కొన్నారు. జీరో ప్రాపర్టీ పీ 4 కార్యక్రమంలో భాగంగా మండలంలోని నూతలపాడు గ్రామంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది.. పేద కుటుంబాల్లో దిగువనున్న 20 శాతం మంది పేదలకు మద్దతు ఇవ్వాలన్నారు. పీ4 ప్రభుత్వ, ప్రయివేట్ ప్రజల భాగస్వామ్యాన్ని సూచిస్తుందన్నారు. దీని కోసం విరాళమివ్వడానికి సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులు అంటారని, నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబంగా గుర్తిస్తారని తెలిపారు. మార్గదర్శి కుటుంబాలు చూపే బాటలో బంగారు కుటుంబాలు అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి. ప్రద్యుమ్నకుమార్, డిప్యూటీ ఎంపీడీఓ కె. సత్యనారాయణ, తహసీల్దార్ పి. బ్రహ్మయ్య, నూతలపాడు సర్పంచ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కారు అద్దాలు పగలకొట్టి చోరీ
మంగళగిరి టౌన్ : రెండు వేర్వేరు కారుల అద్దాలు పగలకొట్టి ల్యాప్‌టాప్‌లు చోరీ చేసిన ఘటన మంగళగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు డీబీఎస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రీనివాస్ సిల్వరాజ్ విధులు నిమిత్తం విజయవాడ బ్యాంకుకు వచ్చారు. అక్కడ పని ముగించుకుని విజయవాడ క్లస్టర్ హెడ్ సుధాకర్‌తో పాటు తన సిబ్బందితో గుంటూరు బ్యాంకుకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు చినకాకానిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న భోజన హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో బద్వేల్కి చెందిన సాయిరాం అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎర్రబాలెంలో తాను కొనుగోలు చేసిన స్థలం చూడడానికి వచ్చి భోజనం చేసేందుకు వీరు కూడా వారి కారులో హోటల్‌కు చేరుకున్నారు. వీరిద్దరూ కార్లను పార్కింగ్ చేసి భోజనం చేయడానికి లోపలికి వెళ్లారు. భోజనం చేసి అనంతరం బయటకు వచ్చి చూడగా కారు అద్దాలు పగలకొట్టి ఉండడం గమనించారు. కారు లోపల పెట్టిన ల్యాప్‌టాప్, బ్యాగులు అపహరణకు గురిఅయినట్లు గుర్తించారు. శ్రీనివాస్ సెల్వరాజ్ కారులో ల్యాప్‌టాప్‌తో పాటు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయని, సాయిరామ్ కారులో ల్యాప్‌టాప్‌తో పాటు సుమారు 5 వేల రూపాయలు నగదు, ఇంటి తాళాలు, బీరువా తాళాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. రెండు ల్యాప్‌టాప్‌లు, నగదు అపహరణ