
అంగన్‌వాడీ కేంద్రాలకు కూరగాయల విత్తనాలు పంపిణీ
రేపల్లె: చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ట్ ట్రస్ట్ సహకారంతో బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు న్యూట్రి కిచెన్ గార్డెన్ కార్యక్రమంలో భాగంగా పలు రకాల కూరగాయల విత్తనాలను ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సునీత సోమవారం పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో విత్తనాలు నాటడంతో కేంద్రాలకు అవసరమైన కూరగాయలు పండించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ఫౌండేషన్ వారు అందించటం అభినందనీయమన్నారు. మండలంలోని చోడాయపాలెం, బొబ్బర్లంక, పెనుమూడి, విశ్వేశ్వరం, పిరాట్లంక, తుమ్మల, కారుమూరు, నల్లూరుపాలెం గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలకు న్యూట్రీ కిచెన్ గార్డెన్ విత్తనాలు పంపిణీ చేశారు. ప్రోగ్రామ్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, అంగన్‌వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.