
టైప్‌రైటింగ్ పరీక్షలకు 54 మంది హాజరు
రేపల్లె: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైప్ రైటింగ్ పరీక్షలు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇంగ్లిష్ లోయర్‌కు 30 మంది, హయ్యర్ పరీక్షకు 15 మంది, జూనియర్ గ్రేడ్‌కు ఏడుగురు, తెలుగు హయ్యర్‌కు ఒకరు, లోయర్‌కు ఒకరు చొప్పున మొత్తం 54 మంది హాజరైనట్లు పరీక్షల చీప్ సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు.
జిల్లా ఫ్లోర్ బాల్
ఎంపిక పోటీలు
వినుకొండ: పల్నాడు జిల్లా ఫ్లోర్‌బాల్ అండర్ –14, 19 బాలబాలికల ఎంపిక పోటీలు పట్టణంలోని లయోలా పాఠశాలలో నిర్వహించినట్లు పల్నాడు జిల్లా ఫ్లోర్ బాల్ ప్రధాన కార్యదర్శి ఎం.కిశోర్‌బాబు తెలిపారు. పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 3న నరసరావుపేటలోని కె–రిజ్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో లయోలా స్కూల్ హెచ్‌ఎం అభినా ష్, జిల్లా కార్యదర్శి కిశోర్, పీఈటీలు ఏడుకొండలు, కోటేశ్వరమ్మ, రవితేజ, వివిధ పాఠశాలల నుండి 100మంది బాలబాలికలు పాల్గొన్నారు.
తైక్వాండో పోటీల్లో 15 మందికి బంగారు పతకాలు
తెనాలి అర్బన్: గుంటూరు జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెనాలి కేఎస్‌ఆర్ అకాడమి విద్యార్థులు 15 మందికి బంగారు, ఆరుగురికి వెండి, ఇద్దరికి కాంస్య పతకాలు లభించినట్లు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. పోటీలను రేపల్లెలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. వీరందరూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఆదివారం అకాడమి ఆవరణలో క్రీడాకారులకు పతకాలు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, వీరవల్లి మురళి, కుర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

టైప్‌రైటింగ్ పరీక్షలకు 54 మంది హాజరు