
మధ్యవర్తిత్వంపై ముగిసిన 40 గంటల శిక్షణ
గుంటూరు లీగల్: సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన ప్లాపస్ చైర్మన్‌న్‌లు, మెంబెర్స్‌కు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్, ఒకటో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ 40 గంటల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్లాపస్ చైర్మన్ జి.రజిని మాట్లాడుతూ శిక్షకులు మీడియేషన్‌పై అవగాహన కల్పించారని, ఓర్పు, నైపుణ్యంతో అన్ని అనుమానాలను నివృత్తి చేశారని కృత/్ఞతలు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చైన్నె నుంచి శిక్షణ కోసం నియమించిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ రత్నతార, న్యాయవాది, సీనియర్ ట్రైనర్ సత్యారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్. సత్యవతి, గురజాల పదో అదనపు జిల్లా జడ్జి జి.ప్రియదర్శిని సత్కరించారు.