బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jul 25 2025 4:44 AM | Updated on Jul 25 2025 4:44 AM

బాపట్

బాపట్ల

శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025
పయ్యావుల సారూ..

సాక్షి ప్రతినిధి,బాపట్ల: రైతులు పండించిన బ్లాక్‌ బర్లీ పొగాకు కొంటామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి సర్కార్‌ మొక్కుబడిగా కొన్న పొగాకుకూ డబ్బులు చెల్లించక మొండికేసింది. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మార్క్‌ఫెడ్‌ ద్వారా ఇప్పటి వరకూ 3,700 టన్నుల పొగాకు మాత్రమే కొన్న ప్రభుత్వం 40 రోజులు దాటినా రైతుల ఖాతాల్లో ఒక్క పైసా జమచేయలేదు. 2050 మంది రైతులకు సంబంధించి రూ.33 కోట్లు చెల్లించాల్సి ఉంది. పొగాకు కొన్న మార్క్‌ఫెడ్‌ అధికారులు ప్రభుత్వం డబ్బులు వేస్తుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇన్నాళ్లు అప్పులు తెచ్చి ఎకరాకు రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టిన రైతులు పొగాకు కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేని స్థితిలో లబోదిబోమంటున్నారు. పొగాకు కొనడమే భాగ్యమని, డబ్బులు ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకోవాలే తప్ప ఎలా అడుగుతారని పచ్చనేతలు కన్నెర్ర చేస్తున్నారు. దీంతో పేద రైతులు భయపడి పొగాకు డబ్బుల విషయంపై నోరు మెదపలేక మిన్నకుండి పోతున్నారు. ప్రభుత్వం మాత్రం డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పడంలేదు. శుక్రవారం ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో కొత్తగా పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నారు. కనీసం ఆర్థిక మంత్రి అయినా కరుణించి పొగాకు డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

కొనుగోలులో వివక్ష

మరోవైపు పొగాకు కొనుగోళ్లలో వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. కూటమి పార్టీల నేతలు చెప్పిన రైతుల పొగాకు మాత్రమే అధికారులు కొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులన్న సాకుచూపి చాలామంది రైతుల పొగాకును కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై కొందరు రైతులు అధికారులను అడిగితే టీడీపీ నాయకులు చెబితేనే కొంటామని చెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకవైపు గత ఎన్నికల్లో ఓట్లేయలేదన్న అక్కసుతో కొందరి రైతుల పొగాకును కొనుగోలు చేయకపోగా కొన్న రైతులకూ ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వివక్ష చూపక అందరి రైతుల పొగాకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

7

న్యూస్‌రీల్‌

బ్లాక్‌ బర్లీ పొగాకుకు నో పేమెంట్‌ ఇప్పటివరకూ కొన్నది 3,700 టన్నులు 2050 మంది రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.33 కోట్లు 40 రోజులు దాటుతున్న పైసా ఇవ్వని సర్కార్‌ పొగాకు డబ్బులకోసం రైతుల ఎదురు చూపులు

మొక్కుబడి కొనుగోళ్లతో సరి

పండించిన పొగాకును టొబాకో కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతో బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన రైతు ఉప్పుటూరు సాంబశివరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు రైతులు ఆత్మహత్య చేసుకోగా కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ పరిస్థితిలో పొగాకును కంపెనీల ద్వారా కొనిపించడమా? లేక ప్రభుత్వమే టొబాకో బోర్డు లేదా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయడమో చేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో పర్చూరులో మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొంటామని ప్రకటించిన ప్రభుత్వం జూన్‌ 19వ తేదీన పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అరకొరగా పొగాకు కొంటోంది. ఇప్పటివరకూ జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలు పెట్టి 3,700 టన్నులు మాత్రమే కొంది. వాస్తవానికి ఇంకా రైతుల వద్ద 50 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా పొగాకు ఉండగా ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా 14 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ లెక్కన ప్రభుత్వం ఇంకా 11 వేల టన్నులు మాత్రమే కొననుంది. దీంతో మిగిలిన పొగాకు ఎవరుకొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

బాపట్ల1
1/7

బాపట్ల

బాపట్ల2
2/7

బాపట్ల

బాపట్ల3
3/7

బాపట్ల

బాపట్ల4
4/7

బాపట్ల

బాపట్ల5
5/7

బాపట్ల

బాపట్ల6
6/7

బాపట్ల

బాపట్ల7
7/7

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement