
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
కనమర్లపూడి ప్రమాదంలో గాయపడిన
చికిత్స పొందుతూ మహిళ మృతి
శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం జాతీయ రహదారిపై ఈనెల 21న జరిగిన మినీ వాహనం, ఆటో ఢీకొన్న ఘటనలో మరొకరు మృతిచెందారు. ఘటనలో బత్తుల యశోదకుమారి (29) రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రగాయాలతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు శావల్యాపురం ఎస్‌ఐ లేళ్ల లోకేశ్వరరావు తెలిపారు. గుంటూరులో మృతదేహానికి పంచనామా నిర్వహించి, అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనలో ఇప్పటికే నలుగురు దుర్మరణం చెందగా, యశోదకుమారి మృతితో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.