
నేషనల్ తైక్వాండోలో పతకాలు
వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు నేషనల్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని బుధవారం తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విజవాడలో తైక్వాండో నేషనల్ ఓపెన్ పోటీలు జరిగాయి. హైస్కూల్‌లో చదువుతున్న అక్కాచెల్లెళ్లు యార్లగడ్డ లక్ష్మీప్రియ, లాస్యప్రియ విజేతలుగా నిలిచి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు జె. దేవభిక్షం ఉపాధ్యాయిని జె. శ్రావణి అభినందించారు.