
ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి
చీరాల: డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ నవ్యాంధ్ర వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా బుధవారం డీఎస్పీ ఎండీ మొయిన్‌కు వినతిపత్రం అందించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేదన్నారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఇది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమేష్, జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, పి.అనిల్‌నాయుడు, జి.రవితేజ తదితరులు పాల్గొన్నారు.