
ప్లేట్‌లెట్లపై అపోహలు వీడండి
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్స్ తగ్గటం సహజం. అంతమాత్రానికే ఊరికే రోగులు కంగారు పడకూడదు. సాధారణంగా రక్తంలో 2 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదం లేదు. డెంగీ మొదటి దశలో జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారతాయి. రెండో దశలో ప్లేట్‌లెట్స్ తగ్గటం, జ్వరం, వాంతులు, కాళ్ల వాపులు వస్తాయి. మూడో దశలో బీపీ తక్కువగా ఉండటం, ప్లేట్‌లెట్స్ తగ్గటం, శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. నాలుగో దశలో రోగికి కామెర్లతోపాటుగా షాక్‌లోకి వెళతాడు. బీపీ తగ్గడంతోపాటు కిడ్నీల పనితీరు కూడా తగ్గిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. అవి పగిలి రక్తం బయటకు వస్తుంది. మూత్రంలో, దగ్గు తున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. నాలుగో దశను డెంగీ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ అంటారు. మొదటి మూడు దశలలో ఎలాంటి భయాందోనలు చెందాల్సిన పనిలేదు.
– డాక్టర్ కోగంటి కల్యాణ్ చక్రవర్తి, జ్వరాల స్పెషలిస్ట్, గుంటూరు.