
ఉచితంగా నిర్ధారణ పరీక్షలు
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు కిట్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నాం. కేసులు నిర్ధారణ జరిగితే సమాచారం ఇవ్వాలని, ప్లేట్‌లెట్స్ పేరుతో భయపెట్టవద్దని ప్రైవేటు వైద్యులందరికీ ఆదేశాలు జారీ చేశాం. ప్రతిరోజూ వైద్య సిబ్బందిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి వివరాలు సేకరిస్తున్నాం. దోమల నివారణ చర్యల్లో భాగంగా గంబూషియా చేప పిల్లలను నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వదిలాం. కేసులు నమోదైన ప్రాంతంలో యాంటీ లార్వా పద్ధతులు, ఫాగింగ్ చేస్తున్నాం. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే ముఖ్య కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు, వర్షపునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నుంచి రక్షణకు ఉదయం, సాయంత్రం సమయాల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమ తెరలు వాడటం చాలా మంచిది.
–డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి, గుంటూరు.