
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జిల్లా వ్యాప్తంగా 210 మందిక్రీడాకారులు హాజరు
చినగంజాం: మండలంలోని కడవకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికల కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీ అరుణ్‌కుమార్ ప్రారంభించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలురు, బాలికలకు సంబంధించి ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని చీరాల, బాపట్ల, కడవకుదురు, ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం, చెరుకుపల్లి, చినగంజాం, వేటపాలెం, పందిళ్లపల్లి ప్రాంతాల నుంచి సుమారు 210 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, షాట్‌పుట్, పరుగు, నడక వంటి పలు క్రీడలకు సంబంధించిన ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ కోమట్ల స్వామిరెడ్డి, కార్యదర్శి ఎం.వెంకటరెడ్డి, అథ్లెటిక్ కోచ్ కె. అనంత కుమార్‌రెడ్డి, పీడీ శ్రీనివాసరెడ్డి, బి.లలిత, లక్ష్మీ నారాయణ, మారుతి, మాలతి, సాంబశివరావు, ఉదయభాస్కర్, పలువురు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు