
డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
పెదకాకాని(ఏఎన్‌యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్– మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల రెండో సెమిష్టర్ పరీక్ష ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీఈ ఏ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరీక్షలకు అన్ని కోర్సుల నుంచి 9991 మంది హాజరు కాగా,
5642 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత 56.47 శాతంగా ఉందన్నారు.
ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చని సూచించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీలకు ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫీజు వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచామని చెప్పారు. వెబ్‌సైట్‌ను పరిశీలించి సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య కృష్ణారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఎ. శివప్రసాదరావు, పరీక్షల విభాగం నోడెల్ ఆఫీసర్ ఆర్. ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.