
పీ–4 లక్ష్యం పేదరిక నిర్మూలన
పర్చూరు(చినగంజాం): పేదరిక నిర్మూలన పీ–4 లక్ష్యం అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న పేర్కొన్నారు. జీరో ప్రాపర్టీ పీ 4 కార్యక్రమంలో భాగంగా మండలంలోని నూతలపాడు గ్రామంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది.. పేద కుటుంబాల్లో దిగువనున్న 20 శాతం మంది పేదలకు మద్దతు ఇవ్వాలన్నారు. పీ4 ప్రభుత్వ, ప్రయివేట్ ప్రజల భాగస్వామ్యాన్ని సూచిస్తుందన్నారు. దీని కోసం విరాళమివ్వడానికి సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులు అంటారని, నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబంగా గుర్తిస్తారని తెలిపారు. మార్గదర్శి కుటుంబాలు చూపే బాటలో బంగారు కుటుంబాలు అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి. ప్రద్యుమ్నకుమార్, డిప్యూటీ ఎంపీడీఓ కె. సత్యనారాయణ, తహసీల్దార్ పి. బ్రహ్మయ్య, నూతలపాడు సర్పంచ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.