
ప్రసన్నతబాబుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పురస్కారం
రేపల్లె: చేతి రాతతో బైబిల్‌ను రచించిన రేపల్లె పట్టణానికి చెందిన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ గంజిదేవ వరప్రసన్నత బాబు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి పురస్కారం పొందారు. పట్టణంలోని 20వవార్డుకు చెందిన వరప్రసన్నత బాబు ఆంధ్ర బ్యాంక్‌లో విధులు నిర్వహిస్తు ఖాళీ సమయాలలో చేతి రాత ద్వారా బైబిలును రచించారు. బైబిలును ప్రచురించారు. ఈ బైబిలు గ్రంథంను ఏఈఎల్‌సీ సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించి పలు చర్చిలకు బహూకరించారు. విషయం గుర్తించిన వరల్డ్ రికార్డ్స్ సంస్థ అవార్డుతో వరప్రసన్నతబాబును ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు.