
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
దాడులు చేస్తే అది సివిలైజేషనా?
తాడేపల్లి రూరల్ : ‘మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. ’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తన సినిమా ఈవెంట్‌లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్‌కళ్యాణ్ రెచ్చగొట్టడం దారుణం’’ అన్నారు.
పర్చూరు(చినగంజాం):పర్చూరు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావుతో కలిసి శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ముందుగా పర్చూరు బొమ్మల సెంటర్‌లో ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పర్చూరులోని నెహ్రూ కాలనీ, నాగులపాలెంలో పాల్గొని సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా అనే విషయమై ప్రజలతో మాట్లాడారు. పర్చూరులో రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్లు, నాగులపాలెం గ్రామంలో రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీ్త్ర నిధి చెక్కులు పంపిణీ
అనంతరం పర్చూరు మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొని రూ.4 కోట్ల సీ్త్ర నిధి చెక్కులను స్వయం సహాయక గ్రూపులకు అందజేశారు. అగ్రికల్చర్ డ్రోన్‌ను మంత్రి కేశవ్, ఎంఎల్‌ఏ సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం పర్చూరు మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో పొగాకు కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు.
పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏలూరి
ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామంలో పొగాకు కొనుగోలు కేందాన్ని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన పొగాకును పరిశీలించారు. చీరాల శాసనసభ్యుడు ఎం.మాలకొండయ్య, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న ఆర్డీఓ గ్లోరియా, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, వైస్ చైర్మన్ శంకరశెట్టి చిరంజీవి, పార్టీ మండల అధ్యక్షుడు షంసుద్దీన్, నాయుడు హనుమంతరావు, తిరుమలశెట్టి శ్రీహరి, పొద వీరయ్య పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల ఆగ్రహం
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు ఖండన
పోలీస్‌స్టేషన్‌లో నేతల ఫిర్యాదు