
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద నీరు
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు వాగులు నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు అధిక మొత్తంలో వచ్చి చేరింది. జేఈ రమేష్ వరద నీటిని బుధవారం దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి నీరు విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 50 గేట్లకు ఒక అడుగు మేర, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 60,270 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశామని తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా, తూర్పు డెల్టా, రైవస్, బందరు కాలువలకు 16,729 క్యూసెక్కులు విడుదల చేశామని పేర్కొన్నారు.
మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
బాపట్ల: మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ గంగాధర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ (సిఫార్డ్) స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి అధ్యక్షత వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సిఫార్డ్ సంస్థ డైరెక్టర్ కె.రవి ప్రదీప్, బాపట్ల మండల పరిషత్ అధికారి బాబురావు, ఆర్పీఎఫ్ సీఐ చంద్రశేఖర్, డీసీపీఓ పి.పురుషోత్తమరావు, బాలల సంరక్షణ అధికారి జి.కృష్ణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయి జ్యోతి పాల్గొన్నారు.

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద నీరు