అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం | - | Sakshi
Sakshi News home page

అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం

Jul 23 2025 7:13 AM | Updated on Jul 23 2025 7:13 AM

అన్నద

అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం

నరసరావుపేట రూరల్‌: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈనెల 23వ తేదీ బుధవారం లోపు రైతుసేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుని వద్ద గ్రీవెన్స్‌ పెట్టవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని లింగంగుంట్ల, అల్లూరివారిపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లాడుతూ పంట సాగు చేసే కౌలు రైతులు కౌలు కార్డులు పొందాలని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంలో వరి పంటకు ఎకరానికి రూ.80లు ప్రీమియం చెల్లించి ఆగస్టు 15వ తేదీ కల్లా ఇన్స్యూరెన్స్‌ చేసుకోవాలని సూచించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతురావు, ఏఓ ఐ.శాంతి, ఏఈవో బ్రహ్మయ్య, వీఏఏ సామంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర

సత్తెనపల్లి: త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న ఆమోదించిన సందర్భంగా హెల్ప్‌ ఫౌండేషన్‌ (సతెనపల్లి)ఆధ్వర్యంలో నందిగామలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో 108 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్ర ర్యాలీ మంగళవారం నిర్వహించారు. సర్పంచ్‌ బలిజేపల్లి రమాదేవి ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడుతూ.. జాతీయ జెండా భారత దేశం యొక్క సార్వభౌమత్వం, ఐక్యతకు చిహ్నమన్నారు. సత్తెనపల్లి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఆళ్ల సాంబయ్య మాట్లాడుతూ త్రివర్ణ పతాకం భారతీయులకు అందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. తొలుత పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, హెల్ప్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, పాఠశాల పీడీ సాంబశివరావు, చెంబేటి బోల్లయ్య, హెల్ప్‌ ఫౌండేషన్‌ సభ్యులు అక్షయ్‌, నిర్మల్‌ కుమార్‌, జాతీయ జెండా వేషధారి శేఖర్‌, ఉపాధ్యాయ బృందం, అంగన్‌వాడీ కార్యకర్తలు సుజాత, వాణి, జ్యోతి, అమల, గౌసియా, విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం1
1/1

అన్నదాత సుఖీభవ పథకంపై గ్రీవెన్స్‌కు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement