
కక్ష సాధింపుతోనే మిథున్‌రెడ్డి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ముఖ్యనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి అంజనీప్రసాదరెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబు సర్కార్ బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు. ఎంత మందిపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా పార్టీశ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంటుందన్నారు. కూటమి ఏడాది పాలనపట్ల ప్రజల్లోనేకాక కూటమి శ్రేణుల్లోనే వ్యతిరేకత మొదలైందన్నారు.