
బీభత్సం సృష్టించిన కారు
నరసరావుపేట టౌన్: అతివేగంగా వచ్చిన కారు ఢీకొని ద్విచక్ర వాహనదారులతో పాటు నడిచి వెళ్తున్న బాలికకు తీవ్రగాయాలైన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంద గ్రామానికి చెందిన ఎ. మరియదాసు, బూదాల బాబురావులు ద్విచక్ర వాహనంపై ప్రకాష్‌నగర్ సెయింట్ జోసఫ్ స్కూల్ వైపు నుంచి 60 అడుగుల రోడ్డుకు వెళ్తున్నారు. పక్కనే మరో ద్విచక్ర వాహనంపై నవీన్ అనే వ్యక్తి వస్తున్నాడు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఏపీ 11 ఏఎస్ 1638 నంబర్ గల కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కారును వెంబడించటంతో కారు అతివేగంగా రివర్స్ చేస్తూ అప్పుడే ట్యూషన్ నుంచి వస్తున్న బాలిక షేక్ ఆయేషాను ఢీకొట్టింది. సంఘటనలో బాలిక ఎడమ చేయి విరిగింది. క్షతగాత్రులు నలుగురిని ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారును స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.వి. చరణ్ మంగళవారం తెలిపారు. కారు నడిపిన నిందితుడు పట్టణానికి చెందిన మైనర్ బాలుడు షేక్ సుభానిగా గుర్తించారు. మైనర్‌కు కారు నడిపేందుకు ఇచ్చిన ఓనర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనదారులపైకి దూసుకెళ్లి.. బాలికను ఢీకొట్టి నలుగురికి గాయాలు కారు డ్రైవర్ మైనర్ బాలుడిగా గుర్తింపు