
మద్యం షాపు వద్ద వ్యక్తి మృతి
పోలీసుల చొరవతో ప్రాణం పదిలం
కారంచేడు: మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మంగళవారం కారంచేడులో జరిగింది. ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన వాసుమళ్ల అనిల్ (42) తన భార్య కృపారాణితో కలసి కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో తమ బంధువు అంత్యక్రియల కు హాజరయ్యారు. అనంతరం బంధువులతో కలసి మద్యం తాగేందుకు వైన్ షాపునకు వచ్చాడు. మద్యం కొనుగోలు సమయంలో ఒక్కసారిగా ముందుకు పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అక్కడికి చేరుకున్న భార్య కృపారాణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం చీరాలకు పంపించామన్నారు. మృతునికి భార్యతోపాటు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి మరణ వార్త విన్న కుమార్తె మానస ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను కారంచేడు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పరీక్షించి మెరుగైన వైద్యం కోసం చీరాల ఆస్పత్రికి తరలించారు.