
గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
జెడ్పీ సీఈవో జ్యోతిబసు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు మండలానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి పీఏఐ పోర్టల్‌పై సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ 2.0 వెర్షన్ (పీఏఐ పోర్టల్)కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, తెన్నులపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఎం డి. రవీంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు.