
ఇంటర్ సంస్కరణలపై అవగాహన అవసరం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలను అమలు చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యా సంస్కరణలపై శనివారం హార్డ్ కళాశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు. పల్నాడుజిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో నీలావతిదేవి మాట్లాడుతూ, విద్యార్థులను జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సిలబస్ రూపకల్పన జరిగిందని తెలిపారు. అలాగే అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా సిలబస్ ఉంటుందని తెలిపారు. జాతీయస్థాయిలో మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల సూచనల మేరకు సంస్కరణల అమలుకు కార్యాచరణ తీసుకవస్తున్నట్టు వివరించారు. దుర్గి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు ఇంటర్ బోర్డు ప్రవేశ పెట్టిన నూతన సిలబస్, నూతన సబ్జెక్స్ కాంబినేషన్‌పై అవగాహన కల్పించారు. సమావేశంలో దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టి.జె.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి