
కొరవడిన సంతోషం
సంక్షేమంలో
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సమస్యల స్వాగతం
రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు..అందుకోసమే పీ–4 తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండే వసతి గృహాల గురించి పట్టించుకోవడం లేదు. కప్పుకునేందుకు దుప్పట్లు లేక చలికి గజగజలాడుతున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేక కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. కడుపునిండా తిండి తిందామంటే కంచంలో భోజనం ఉండదు. చివరకు తాగేందుకు నీరు లేక అవస్థలు పడుతున్నారు. ఏళ్ల కిందట నిర్మించిన హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. ‘సాక్షి’ బృందం శనివారం జిల్లాలోని పలు హాస్టల్స్‌ను విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ మొత్తం 27 ఉండాల్సి ఉండగా వాటిల్లో విద్యార్థులు లేక రెండు వసతి గృహాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న 25 వసతిగృహాల్లో 1475 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఎస్టీ ఇంటిగ్రేటెడ్ వసతిగృహం 01, ఆశ్రమ పాఠశాల 01, గురుకుల పాఠశాలలు 06, కళాశాల వసతిగృహాలు 2 చొప్పున మొత్తం 10 వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 850 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 42 వసతి గృహాలు ఉండగా వాటిల్లో 15 వసతి గృహాల్లో విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రస్తుతం 27 వసతి గృహాల్లో 915 మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వాటిల్లో 8 కళాశాల వసతిగృహాలు, 19 పాఠశాలల వసతిగృహాలు ఉన్నాయి.
పత్తాలేని డీపీసీ
ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఏడాదికి ఒకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డీపీసీ (డిస్ట్రిక్ పర్చేజ్ కమిటీ) సమావేశం జరగాలి. ఈ సమావేశంలో ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకొని వాటి ఆధారంగా వసతిగృహాలకు సరఫరా చేసే నిత్యావసర వస్తువులకు ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా డీపీసీ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.గత ప్రభుత్వంలో ఉన్న పాతధరల ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో చాలీచాలనీ బిల్లులతో వార్డెన్లు మెనూను సక్రమంగా పాటించడకుండా వారికిష్టమొచ్చినట్లు వంటలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు వసతిగృహాల్లోని భోజనం తినటం మానేసి వారే భోజనం తయారుచేసుకొని తినే దుర్భర పరిస్థితి జిల్లాలో నెలకొంది. చాలాచోట్ల పిల్లలు సాయంత్రం సమయంలో బయటనుంచి భోజనం, కూరలు తెచ్చుకొని తింటుంటుంగా మరికొన్ని చోట్ల సమీపంలోని అన్న క్యాంటీన్, భోజనం హోటళ్లకు వెళ్లి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి దాపరించింది.
సమస్యలు కేరాఫ్... బాపట్ల
గిరిజన కళాశాల వసతిగృహం
పట్టణంలోని గిరిజన కళాశాల వసతి గృహం సమస్యలకు కేరాఫ్‌గా మారింది. కళాశాలలో 33 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో రాసుకున్నారు. వాస్తవంగా అక్కడ 12 మంది మాత్రమే ఉన్నారు. వసతిగృహంలోని కిటికీలకు ఒక్కదానికి కూడా మెస్‌లు లేవు. దీంతో దోమలు విద్యార్థుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాచ్‌మెన్, స్వీపర్, వంట మనిషి ఒకే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు పడుకునే గదిని కనీసం ఊడిచే నాథుడులేరు. అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు పడుకుంటున్నారు. వంటగదిలో చెత్త పేరుకుపోయింది. గ్రైండర్ నెలల తరబడి కడిగిన దాఖలాలు లేవు. దుర్ఘంధం వెదజల్లుతుంది. వసతిగృహం చుట్టూ ముళ్ల చెట్లు పెరిగి విషసర్పాలకు అవాస కేంద్రంగా మారింది. మురుగునీరు వసతిగృహం చుట్టూ నిలిచి దోమలకు అవాస కేంద్రాలుగా మారాయి. వసతిగృహంలో మొత్తం 10 మరుగుదొడ్లు ఉండగా వాటిల్లో ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయటం లేదు. దీంతో విద్యార్థులు కిలోమీటర్ల మేర సైకిళ్లపై బహిర్బూమికి వెళ్తున్నారు. వంట ఉచికరంగా లేక విద్యార్థులు ప్రతి రోజూ ప్రైవేట్ హోటల్స్, వంట వచ్చిన విద్యార్థులు ఇక్కడే వంటచేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. స్నానాల గదిలో ఒక్కగదికి కూడా డోర్ సక్రమంగా లేదు.
అద్దంకి : గురుకుల, సాంఘిక సంక్షేమ, కేజీబీవీ, వసతి గృహాల్లో విద్యార్థులు అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నారు. వసతి గృహాల్లో సరైన వసతులు లేకవంటూ ప్రభుత్వానికి, ఆ శాఖల అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో శనివారం ‘సాక్షి’ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని వసతి గృహాల్లో విజిట్ చేసింది. నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరుగలోని ఏల్చూరు గ్రామాల్లో కేజీబీవీలున్నాయి. వాటిలో బల్లికురవ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే 270 మంది విద్యార్థులున్నారు. బెడ్లు, డార్మిటరీలు లేవు. ఏల్చూరు కేజీబీవీని గదుల కొరత వేధిస్తోంది. పడుకునేందుకు, చదువుకునేందుకు ఒకే గుదులు వినియోగించుకోవాల్సి వస్తుంది. కేజీబీవీలకు మెయిటెనెంన్స్ నిధులు ఇవ్వడం లేదు. దాంతో ఏదైనా రిపేర్ వస్తే ప్రిన్సిపాల్స్ సొంత నిధులతో చేయించుకునే దుస్థితి ఉంది. అద్దంకి పట్టణంలో రెండు ఎస్సీ, ఒకటి పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఒక హాస్టల్ ఉంది. ఇందులోనూ కిటికీలకు డోర్‌లు లేవు. కళాశాల ఇచ్చిన మంచాలు ఉన్నా, బెడ్‌లు లేవు. మరుగుదొడ్లు మరమ్మతుల్లో ఉన్నందున కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకే వెళ్తున్నారు. ఒక ఎస్సీ బాలుర వసతి గృహానికి సొంత భవనం లేదు. కేఆర్‌కే మినహా మిగిలిన అన్ని వసతి గృహాల్లో టాయిలెట్స్ సరిపడా ఉన్నాయి. జె. పంగులూరు మండలంలోని ముప్పవరంలో రెండు వసతి గృహాలున్నాయి. ఒకటి అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ వసతులు బాగానే ఉన్నా, బెడ్‌లు మంచాలు లేవు. వసతి గృహాల్లో పిల్లలకు సరిపడా దుప్పట్లు ఇవ్వలేదు. కొరిశపాడు మండలంలోని మేదరమెట్లలో ఒక వసతి గృహం ఉంది. ఇక్కడ పిల్లలకు ఒకే దుప్పటి ఇచ్చారు. బెడ్లు, మంచాలు లేవు.
మరమ్మతులకు నోచని వాటర్ ప్లాంట్
రేపల్లె నియోజకవర్గంలోని గురుకులంలో వాటర్‌ప్లాంట్ మరమ్మతులకు గురికావడంతో తాగునీటి కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరుకుపల్లి మండలం కావూరు, నిజాంపట్నం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నేలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం భవనం మరమ్మతులకు గురైంది. శ్లాబ్ పెచ్చులూడి చువ్వలు బయటపడ్డాయి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
అధ్వానంగా మరుగుదొడ్లు
వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, వెల్లటూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో గతంలో ప్రభుత్వ వసతిగృహాలు ఉండేవి. వాటిల్లో కొల్లూరు, వెల్లటూరు హాస్టల్ తొలగించారు. వేమూరు బీసీ బాలికల హాస్టల్, భట్టిప్రోలు బీసీ హాస్టల్‌లో చదువుతున్న పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో పిల్లలు పడుకునేందుకు సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. వసతిగృహా
నేల మీదేనే నిద్ర
ఖర్చులు కొండంత...ఇచ్చేది గోరంత
ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నా వసతి గృహాల్లోని వార్డెన్లకు మాత్రం గతంలో వలే పాత రేట్లు ప్రకారం బిల్లులు నమోదు చేస్తున్నారు. ఇచ్చేది అరకొర అయినా సకాలంలో అందించకపోవడంతో వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. ఒక్కొ విద్యార్థికి సగటున రోజుకు రూ.46 నుంచి రూ.50లోపు చెల్లిస్తున్నారు. వీటిల్లో ప్రతి రోజూ ఒక్కో విద్యార్థికి పాలు, మజ్జిగ, టిఫిన్ కింద ఇడ్లీ, చట్నీ, పల్లీ చిక్కీ, సాయంత్రం స్నాక్స్‌గా బఠానీ గుగ్గిళ్లు, రాగి జావ, రాత్రి భోజనంలో కూర, సాంబారు, వారంలో మూడురోజులపాటు చికెన్, రోజుకోక రకం పండ్లు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.80 నుంచి రూ.100 ఖర్చు అవుతుంది. ప్రభుత్వం చాలీచాలనీ బిల్లులు చెల్లించడంతో వార్డెన్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 62 వసతిగృహాలు
హాస్టల్స్‌లో 3240 మంది
విద్యార్థులకు వసతి
అప్పుల ఊబిలో వార్డెన్లు
వసతిగృహాల్లో విద్యార్థులే వంట మాస్టర్లు, స్వీపర్లు
కనీస వసతులు కరువు
అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు
మల,మూత్రాలకు బహిర్భూమికి
వెళ్తున్న విద్యార్థులు

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం

కొరవడిన సంతోషం