
గుర్రపు డెక్క తొలగించకపోతే నిరాహార దీక్ష
వేమూరు: భట్టిప్రోలు నుంచి రేపల్లె డ్రైన్ వరకు గుర్రపు డెక్క పూర్తిగా తొలగించక పోతే నిరాహార దీక్ష చేస్తానని వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజక వర్గం ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలం అద్దేపల్లి వెళ్లు మురుగు కాలువల్లో ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్క తొలగింపు పనులు శుక్ర వారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగు కాలువల్లో గుర్రపు డెక్క వల్ల మురుగు నీరు పారుదల కాక పోవడంతో అధిక వర్షాలు వల్ల గతేడాది 2500 ఎకరాలు దెబ్బతినడం జరిగిందన్నారు. కనగాల ప్రాంతంలో పెరవలి, పెరవలి పాలెం గ్రామాలకు చెందిన 1500 ఎకరాలు మునిగి పోవడం జరిగిందన్నారు. గత నెలల్లో కురిసిన వర్షాలు వల్ల వెద సాగు పద్ధతి పూర్తిగా మునిగి పోవడం జరిగిందన్నారు. గత నెల 19న మురుగు కాలువల్లో దిగి ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్క తొలగించాలని నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. గురువారం మురుగు కాలువల్లో గర్రపు డెక్క తొలగించాలని జల దీక్ష చేయడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు సక్రమంగా స్పందించక పోవడంతో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేయడంతో ఇరిగేషన్ డి ఈ వచ్చి మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తొలగించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించు కోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పడమటి శ్రీనివాసరరావు, నియోజ వర్గం రైతు విభాగం అధ్యక్షులు గోపాల రాము, సయ్యద్ సిరాజ్, పసుపులేటి శివరామ ప్రసాద్, జంగం వాసు, వేల్పూరి నాగేశ్వరరావు, వేల్పూరి చిన్నారి, సయ్యద్ నవీ, జల్లి జోషి కాంత్, కౌతవరపు పద్మావతి, కౌతవరపు శ్రీనివాసరరావు, యన్నం సురేష్, దాసరి కిరణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు