
అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి
పిడుగురాళ్ల: ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల పెంపునకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం(ఏపీఓపెన్ స్కూల్‌సొసైటీ) రాష్ట్ర కో–ఆర్డినేటర్ పి.రవీంద్రనాథ్ సూచించారు. పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరగాలన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. అనంతరం ఓపెన్ స్కూల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. పాఠశాల హెచ్‌ఎం మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ నెల 30వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు అపరాధ రుసుం రూ.200 చెల్లించి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440004297, 8522994297 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పల్నాడు జిల్లా కో–ఆర్డినేటర్ హుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంగాల
దాచేపల్లి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాచేపల్లికి చెందిన జంగాల సింగరయ్య యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాక వెంగళరావు యాదవ్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నట్లు సింగరయ్య యాదవ్ గురువారం తెలిపారు. రానున్న రోజుల్లో బీసీలను ఏకతాటిపైకి తీసుకొస్తానని, బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి బీసీల అభ్యున్నతి ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందని, రాష్ట్రంలోని బీసీలంతా వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేసి బీసీలు అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సింగరయ్య యాదవ్‌ని పలువురు అభినందించారు.
ఆరు మండలాల్లో స్వల్ప వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆరు మండలాల్లో స్వల్ప వర్షం పడింది. దుగ్గిరాల మండలంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా 8.6 మిల్లీమీటర్లు పడగా, అత్యల్పంగా తాడికొండ మండలంలో 2.6 మి.మీ. పడింది.
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర కో–ఆర్డినేటర్ పి.రవీంద్రనాథ్

అడ్మిషన్ల పెంపునకు కృషి చేయండి