వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు | - | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు

Jul 29 2025 7:28 AM | Updated on Jul 29 2025 8:00 AM

వైద్య

వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు

గుంటూరుమెడికల్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులు– 20, ల్యాబ్‌ టెక్నీషియన్లు–3, డేటా ఎంట్రీ ఆపరేటర్లు–16, ఎల్‌జీఎస్‌లు–47 పోస్టులకు సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. డీఎంహెచ్‌ ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రా ల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు నిరంతరంగా అందించాలని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ విజయమ్మ, జిల్లామ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు, పరిపాలనా అధికారి లక్ష్మీకుమారి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ భక్తవత్సలం, అకౌంట్‌ ఆఫీసర్‌ కృష్ణకుమారి, డీపీఓ సైమన్‌ రాజు పాల్గొన్నారు.

నేడు జీజీహెచ్‌లో ఓపీ ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం

గుంటూరుమెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో ఏబీడీఎం ఈ– హాస్పిటల్‌ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఓపీ, లేబరేటరీ, ఇన్‌ పేషంట్‌ సేవలను డిజిటల్‌ విధానంలో చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న ఏబీడీఎం వర్షన్‌ నెక్ట్స్‌జెన్‌ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మైగ్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. దీని వల్ల సాయంత్రం 9 గంటల వరకు ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సిబ్బంది, రోగులు గమనించి ఆసుపత్రి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

కురగల్లులో ఘర్షణ

తాడేపల్లిరూరల్‌: మంగళగిరి మండల పరిధిలో ని కురగల్లులో సోమ వారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయి మ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు గాయమైంది.

వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు 
1
1/1

వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement