
‘పచ్చ’ కార్యాలయంలో అధికారుల సమావేశం
రేపల్లె ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్
ప్రజాప్రతినిధి హోదాలో పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించడంపై ప్రజలు, ప్రజాసంఘాలు
ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ఏడీఏ లక్ష్మితోపాటు నాలుగు మండలాల వ్యవసాయ
అధికారులు, వ్యవసాయ సహాయకులు హాజరయ్యారు. మంత్రి ఇక్కడ క్రియాశీలకంగా
లేకపోవడంతో బదులుగా ఆయన సోదరుడు శివప్రసాద్ ఇలా సమావేశాలు నిర్వహిస్తూ
ప్రభుత్వ కార్యక్రమాలలో జోక్యం చేసుకుంటున్నారని అధికారులు బహిరంగంగానే
వాపోతున్నారు. – రేపల్లె