
కలిసికట్టుగా సమస్యలపై పోరాటం
అద్దంకి: నూర్‌బాషాలందరూ కలిసికట్టుగా ఉంటే సమస్యలపై పోరాటంతో విజయాలు సాధించవచ్చని రాష్ట్ర నూర్ బాషా యువజన సంఘం అధ్యక్షుడు దూదేకుల పెద మస్తాన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని షాదీఖానాలో సమావేశం నిర్వహించారు. పట్టణ నూర్ బాషా దూదేకుల కమిటీ అధ్యక్షుడిగా షేక్ మదీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో మస్తాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూర్ బాషా దూదేకుల ఆర్థిక సంస్థ ఏర్పాటు చేయడం సంతోషమని చెప్పారు. రానున్న రోజుల్లో ఏకతాటిపై ఉండి సమస్యల పరిష్కారం చేయాలన్నారు. రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ దూదేకుల దావూద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పిల్లలకు సర్టిఫికెట్‌లో లోపాలు జరుగుతున్నాయని వివరించారు. నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా కొటికలపూడి శ్రీనును, అద్దంకి యూత్ అధ్యక్షుడిగా ఎలిల్ సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా షైక్ సైదా వలి, కె.మీరావలి, ఉపాధ్యక్షులుగా అహమ్మద్, షేక్ అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా వేల్పూరి మస్తాన్ వలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ అజిజ్, ఎంప్లాయీస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సర్పరాజ్, రాష్ట్ర కార్యదర్శి అహ్మద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాని, సంఘ పెద్దలు పాల్గొన్నారు.