
పెండింగ్ మెస్ బిల్లులు విడుదల చేయాలి
బాపట్లఅర్బన్: ప్రభుత్వ హాస్టళ్లలో పెండింగ్‌లో ఉన్న మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు యల్లావుల సోహిత్ డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీసేందుకు మంగళవారం హాస్టళ్లను పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు సోహిత్ మాట్లాడుతూ పట్టణంలో విద్యార్థులతో కలిసి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నామన్నారు. హా స్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్య లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో చాలా హాస్టళ్ల భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చాలా హాస్టల్లో విద్యార్థులకు సరిప డా గదులు లేక ఒక్కొక్క గదిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉంటున్న పరిస్థితిని గమనించామని తెలిపారు. హాస్టల్స్‌కు పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని తెలిపారు. హాస్టల్స్‌ను తనిఖీ చేసిన వారిలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ పర్వేజ్ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సోహిత్ బీసీ హాస్టల్ సందర్శన భోజనం నాణ్యత పరిశీలన