ఈ రాశి వారికి కొత్త మిత్రుల పరిచయం.. శుభవార్తలు | Rasi Phalalu: Daily Horoscope On 31-07-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి కొత్త మిత్రుల పరిచయం.. శుభవార్తలు

Jul 31 2025 5:22 AM | Updated on Jul 31 2025 9:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 31-07-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.సప్తమి రా.3.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: చిత్త రా.12.49 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.7.18 నుండి 9.03 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: సా.5.50 నుండి 7.34 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.42, సూర్యాస్తమయం: 6.31.

మేషం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

వృషభం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వాహనసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది.« ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశాజనకం.

కర్కాటకం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం.

సింహం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం.

కన్య: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. శ్రమాధిక్యం. నిరుద్యోగులకు ఒత్తిడులు.

తుల: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరాశ.. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: శ్రమ ఫలిస్తుంది. భూ, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. వృత్తి, వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి.

కుంభం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం.

మీనం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement