
ఆట్యా– పాట్యా జిల్లా జట్టు ఎంపిక
నకరికల్లు: పల్నాడు జిల్లా ఆట్యా– పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని పలు ఉన్నతపాఠశాలల నుంచి క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. న్యాయనిర్ణేతలు 15 మంది బాలికలు, 15 మంది బాలురను పల్నాడు జిల్లా జట్టులో ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాణించి రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటాలని ఆట్యా–పాట్యా అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఆగస్ట్ 9, 10వ తేదీలలో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్ కాసా మల్లికార్జునరావు, ఫిజికల్ డైరెక్టర్‌లు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీరాణి, తిరుమలబాయి, పి.తిరుపతిరావు, పెద్ద వెంకటేశ్వర్లు, అశోక్, పి.ఆంజనేయులు, షేక్.నాగూర్‌వలి, దరియావలి, వెంకటరమణ పాల్గొన్నారు.
బాలికల జట్టులో..
బి.సౌజన్య(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ నజ్మ(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ సుహానా మస్తాని(శ్రీ చైతన్య కళాశాల), కె.వైష్ణవి(జెడ్పీ హెచ్‌ఎస్, ఎస్.బి.పురం), డి.రంగ మహాలక్ష్మి(జెడ్పీహెచ్‌ఎస్, నకరికల్లు), సీహెచ్ విజయ(జెడ్పీహెచ్‌ఎస్, నకరికల్లు), ఎం.స్నేహ(శ్రీచైతన్య), ఎం.దివ్యసన్నిధి(జెడ్పీహెచ్‌ఎస్, కావూరు), షేక్.జి.సాధిక(జెడ్పీహెచ్‌ఎస్, నకరికల్లు), టి.లిఖిత(జెడ్పీహెచ్‌ఎస్, నకరికల్లు), బి.మేఘన(ఏపీ మోడల్‌స్కూల్, దేచవరం), కె.బుజ్జి(ఏపీ మోడల్ కాలేజ్, దేచవరం), బి.ప్రమీల(జెడ్పీహెచ్‌ఎస్, కావూరు), పి.దీక్షిత(సింధూ స్కూల్), బి.స్వాతి ప్రియ(సింధూ స్కూల్) ఎంపికయ్యారు.
బాలుర జట్టులో..
షేక్ ఇస్మాయిల్(ఏపీ మోడల్ స్కూల్, దేచవరం), పి.వరప్రసాద్(జెడ్పీహెచ్‌ఎస్, ఎస్.బి.పురం), ఎం.వి.సాయిప్రదీప్(ఆక్స్‌ఫర్డ్ విట్, నరసరావుపేట), కె.శ్రీనివాస్(వాగ్దేవి జూనియర్ కళాశాల, నరసరావుపేట), టి.మణిదీప్(జెడ్పీహెచ్‌ఎస్, ఎస్.బి.పురం), షేక్ జాన్‌సైదా(ఆక్స్‌ఫర్డ్ విట్, నరసరావుపేట), ఆర్.లక్ష్మీనారాయణ(తిరుమల ఆక్స్‌ఫర్డ్), జి.లక్ష్మీప్రశాంత్(జెడ్పీహెచ్‌ఎస్, ఎస్.బి.పురం), ఎస్.సాయితేజ(ఆక్స్‌ఫర్డ్ విట్), బి.మణికంఠ(జెడ్పీహెచ్‌ఎస్, నకరికల్లు), షేక్ నబిరసూల్(జడ్పీహెచ్‌ఎస్,నకరికల్లు), డి.కోటేశ్వరరావు(జెడ్పీహెచ్‌ఎస్, నకరికల్లు), వై.అఖిల్(జెడ్పీహెచ్‌ఎస్, నకరికల్లు), డి.శ్రీవెంకట అతులిత్(సింధూ స్కూల్), డి.ప్రసూన్(జెడ్పీహెచ్‌ఎస్, కావూరు) ఎంపికయ్యారు. ప్రతిజట్టులో అదనంగా స్టాండ్‌బైలో ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు.