
కూటమి మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ప్రజలను హామీలతో నమ్మించి మోసం చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు అన్నారు. సుబ్బారెడ్డిపాలెంలో ఆదివారం మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను ప్రతి వ్యక్తి చూపించి, దాని ద్వారా సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నాయకులతో కలిసి క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక విభాగం అధ్యక్షుడు తన్నీరు సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, మైనార్టీ సెల్ విభాగం అయేషా బుడే, లతీఫ్, షంషుద్దీన్, సుభాని, కోటి, శ్రీరాములు, గుంటూరు శ్రీను, కరుణాకర్, చిట్టిబాబు, జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, హరేరామిరెడ్డి, ప్రసంగి, సర్పంచ్ సురేష్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, పోలిరెడ్డి, సురేష్, ప్రభాకరరెడ్డి, శివనాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శివఫణీంద్రరెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి
బండారు ప్రభాకరరావు