
లైసెన్స్ ఫీజులు చెల్లించకుంటే కఠిన చర్యలు
చీరాల: మద్యం షాపులు, రెస్టారెంట్ అండ్ బార్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. ఎకై ్సజ్ శాఖకు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులను బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు చెల్లించడంలేదని బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఎకై ్సజ్ శాఖకు టోపీ’ అనే కథనానికి జిల్లా ఎకై ్సజ్ శాఖ స్పందించింది. ఈ మేరకు బి.వెంకటేశ్వర్లు బుధవారం చీరాలలోని ఎకై ్సజ్ స్టేషన్‌లో యజమానులతో సమావేశం నిర్వహించారు. లైసెన్స్ ఫీజులు చెల్లించని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, కాలపరిమితి దాటిన మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనల మేరకు ప్రకటించిన సమయానికే నిర్వహించాలని కోరారు. ఈ విషయమై నోటీసులు ఇచ్చామన్నారు. బెల్ట్ షాపుల నియంత్రణకు నిత్యం నిఘా ఉంటుందన్నారు. సమాచారం ఇవ్వదలచిన వారు 14405, 9440902495 కు కాల్ చేయాలన్నారు. సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సై బి.శ్రీహరి పాల్గొన్నారు.
ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు