
ఆడబిడ్డ నిధి అమలేదీ?
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘ఓట్లేసి గెలిపిస్తే 19 నుంచి 59 సంవత్సరాలలోపు మహిళలందరికీ నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు ఇస్తాం. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం’.. అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా కూటమి నేతలు ఇచ్చిన హామీ ఇది. కానీ ఓట్లు పడి గద్దెనెక్కాక ప్రభుత్వ స్వరం మారింది. దీనిపై మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద 19 – 59 ఏళ్లలోపు మహిళలందరికి నెలకు రూ.1500 ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. ఏడాది దాటినా మహిళలకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నయవంచనకు పాల్పడ్డారని చంద్రబాబు తదితరులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే బకాయి పడిన సర్కార్
జిల్లాలో 6,61,958 మంది మహిళలు ఉండగా.. ఇందులో 15 శాతం మంది పింఛనుదారులు. వారు పోగా 5,76,893 మంది మహిళలు ఉన్నారు. వీరందరికి నెలకు రూ. 1500 ప్రకారం రూ. 86.53 కోట్లు ఇవ్వాలి. కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నందున మొత్తం రూ.1124.94 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదు.
నియోజకవర్గం అర్హుల ఇవ్వాల్సిన
సంఖ్య మొత్తం
వేమూరు 86,645 168,95,77,500
రేపల్లె 98,719 192,50,20,500
బాపట్ల 83,288 162,41,16,000
పర్చూరు 99,120 193,28,40,000
అద్దంకి 1,06,561 207,79,39,500
చీరాల 1,02,560 199,99,20,000
మొత్తం 5,76,893 1124,94,13,500
ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి
ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చి ఓట్లేయించుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్కపైసా ఇవ్వలేదు. గడిచిన 13 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.19,500 ఇవ్వాలి. ఇలా మోసగించడం సరికాదు. ప్రభుత్వం వెంటనే మహిళలకు డబ్బులు చెల్లించాలి.
– బెల్లంకొండ శివపార్వతి, బలిజపల్లి గ్రామం, వేమూరు మండలం
ఆడబిడ్డలను మోసగించడం తగదు
ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మి ఆడపడుచుల ఓట్లు పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన హామీ అమలు చేస్తారని భావించాం. సంవత్సరం దాటినా పైసా ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ రూ.19,500 రావాలి. ఇప్పటికై నా ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన బకాయి మొత్తం చెల్లించారు. ఆడబిడ్డలను వంచించిడం మంచిది కాదు.
– సీతామహాలక్ష్మి, ఓడరేవు, చీరాల నియోజకవర్గం
నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో కూటమి ప్రచారం ఓట్లేసి గెలిపిస్తే ఆడబిడ్డలకు అండగా నిలబడతామని హామీ గద్దెనెక్కాక ఆ విషయమే మరిచిపోయిన కూటమి సర్కార్ జిల్లాలో దాదాపు 5.76 లక్షల మంది అర్హులు ఇప్పటివరకు వారికివాల్సిన మొత్తం రూ.1,124.94 కోట్లు కూటమి ప్రభుత్వం నయవంచనపై మహిళలు తీవ్ర ఆగ్రహం ఇకనైనా చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్

ఆడబిడ్డ నిధి అమలేదీ?

ఆడబిడ్డ నిధి అమలేదీ?