
రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న కూటమి ప్రభుత్వం
బాపట్ల: రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోదుగుల మాట్లాడారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికి సంక్షేమం అనే మాట ఏనోటా వినిపించటం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం..అభివృద్ధి రెండు కళ్ళులా చూశారన్నారు. నేడు ప్రజలు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను తట్టుకోలేక పోతున్నారన్నారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహరెడ్డికి, నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, కోన రఘుపతికి కృత్తజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల