ఫోర్బ్స్ జాబితాలో 26 ఏళ్ల కళ్యాణి రామదుర్గం
కోబాల్ట్ ల్యాబ్స్ కో-ఫౌండర్.. భారత సంతతికి చెందిన కళ్యాణి రామదుర్గం(Kalyani Ramadurgam).. మాజీ అఫర్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'ఆషి అగర్వాల్'తో కలిసి, ఫైనాన్స్ విభాగంలో 2026కి ఫోర్బ్స్ 30-అండర్-30 యునైటెడ్ స్టేట్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంతకీ ఎవరీ కళ్యాణి రామదుర్గం?, ఫోర్బ్స్ జాబితాలో చేరేలా ఏమి సాధించారనే.. విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించడానికి ముందు.. కళ్యాణి రామదుర్గం యాపిల్ సంస్థలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు, సెక్యూరిటీ సమస్యలు వంటివి గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీపై పని చేశారు.అలా కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభంయాపిల్ కంపెనీలో పని చేస్తూ.. బ్యాంకులు, ఇతర పెద్ద కంపెనీలు తమ నియమాలను పాటిస్తున్నాయా.. లేదా? అని తెలుసుకోవడానికి వేల పేజీల డాక్యుమెంట్లను మనుషులు మాన్యువల్‌గా చెక్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం తీసుకురావాలనే సంకల్పంతో కళ్యాణి కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించారు.కోబాల్ట్ ల్యాబ్స్ స్టార్టప్.. ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ సహాయంతో పెద్ద పెద్ద డాక్యుమెంట్లను వేగంగా చదివి, బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు తమ వ్యాపారాలను.. చట్టాలు, నియమాల ప్రకారం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. భద్రత కూడా మెరుగవుతుంది.అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ గుర్తింపుకోబాల్ట్ ల్యాబ్స్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది.. మిలియన్ల డాలర్ల ఫండింగ్‌ను కూడా సాధించగలిగింది. టెక్నాలజీని ఉపయోగించి, అద్భుతం చేసిన.. కల్యాణి రామదుర్గం కృషికి గుర్తింపుగా 26ఏళ్ల వయసులో ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు దక్కింది.కోబాల్ట్ ల్యాబ్స్ ఒక మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం.. ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో చూపించే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ రంగంలో ఇలాంటి ఆలోచనలు చేసే ఎంతోమందికి ఇదొక ప్రేరణ.కళ్యాణి రామదుర్గం యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా అని అక్కడే ఆగిపోయి ఉంటే.. నేడు ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు సంపాదించగలిగేవారా?, కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి చెందకూడదు. కొత్తగా ఆలోచించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పెద్ద సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విజయమే. ఆ విజయాన్ని అక్కడితో ఆపేయకూడదు.In 2023, Kalyani Ramadurgam founded Kobalt Labs with former Affirm software engineer Ashi Agrawal to bring compliance into the machine-learning age. Kobalt's AI models sort through mountains of documents to help banks vet their business partners, ensuring they're following the… pic.twitter.com/G238c6pXVg— Forbes (@Forbes) December 17, 2025
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!
కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్‌లకే కాదు చిన్న ప్రాజెక్ట్‌లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్‌షిప్‌ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్‌పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్‌ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్లో జవాబుదారితనం పెరిగింది.
ఆ ఐదేళ్లు.. చరిత్రలో సువర్ణ అధ్యాయం
వైఎస్ జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేత. జన సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి రహిత, నిష్పాక్షికమైన పాలన అందించారాయన. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులెన్నో తెచ్చారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ప్రతీ ఇంటి గడప దగ్గరకి చేర్చడం.. ఆయన్ని అందరివాడిగా మార్చేసింది. అలా జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేది..ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలూ, సంక్షేమ ఫలాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.వ్యవసాయరంగాన్ని పండగ చేశారు..రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వ్యవసాయరంగాన్ని పండగ చేసి చూపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. ఐదేళ్లలో రైతుల రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చుచేసింది. రైతు భరోసా పథకంతో పెట్టబడి సాయం అందించి.. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వైఎస్ జగన్ తోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ప్రభుత్వమే ప్రీమియం భారాన్ని భరించింది. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కేంద్రాలు, ఇన్ ఫుట్ సబ్సిడీ, యంత్ర సేవా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రిలాబ్స్, వైఎస్సార్ పశు సంరక్షణ, జగనన్న పాల వెల్లువతో అన్నదాతకు అభయం ఇచ్చారు.ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేశారు..డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజారోగ్య ముఖచిత్రాన్నే వైఎస్ జగన్ మార్చేశారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. 108,104 సేవలు, గిరి పుత్రులకు బైక్ అంబులెన్స్‌లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ కంటి వెలుగు, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రూ.785 కోట్లతో వైఎస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్శించారు.చదువుల విప్లవం..విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసమే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో విద్యారంగం స్థితిగతులనే వైఎస్ జగన్ మార్చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..వైఎస్సార్సీపీ పాలనలో అక్క చెల్లెమ్మలకు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. మహిళా సాధికారితే లక్ష్యంగా 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందించారు. రూ.19,189 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలకు గత ఐదేళ్ల పాలనలో రూ.2030 కోట్లు లబ్ధి కలిగింది.వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఐదేళ్ల పాలనలో రూ.1.05 లక్షల లబ్దిపొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతో లక్షలాది మంది మహిళలకు వైఎస్ జగన్ అన్నలా నిలిచారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు హయాంలో కుదేలైన పొదుపు సంఘాలకు తిరిగి జీవం పోశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 16,44,029 మంది మహిళలకు లబ్ధి కలిగింది.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు..వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.అన్ని వర్గాలకూ..వైఎస్సార్ వాహన మిత్ర, లా నేస్తం.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు పథకం.. ఇలా ఎన్నో పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమం అంటే మంచి.. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. అన్ని వర్గాలకూ పథకాలు అందాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు.కోవిడ్‌లోనూ సంక్షేమం..కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. విపత్కర పరిస్థితులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కోవిడ్‌తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన వైఎస్ జగన్ 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కోవిడ్‌పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్ మహమ్మారిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.అభివృద్ధి పరుగులు..'అభివృద్ధి' అంటే ఏమిటో వైఎస్ జగన్ చేసి చూపించారు. అభివృద్ధి పరుగులు తీయించారు. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలిచింది. 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి. స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది.
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్‌ఫామ్‌గా రూపొందుతోంది. భారత్‌లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్‌లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్‌ఫామ్స్‌లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్‌లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్‌ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్‌ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్‌ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్‌పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్‌లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్‌ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్‌ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ
తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. మరికాసేపట్లో భేటీ
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్
Asia Cup Final: పాకిస్తాన్ భారీ స్కోర్
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు
అవసరమా ‘అఖండ’ కావరం?
ఫుడ్ డెలివరీ యాప్‌లు వద్దు బాబోయ్..
రైల్వే ఛార్జీల పెంపు.. 26 నుంచే కొత్త రేట్లు
మాట వినలేదని జట్టు నుంచి తీసేశారు..! ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్ జట్టులోనే
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
టీ20 వరల్డ్‌కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ
తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. మరికాసేపట్లో భేటీ
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్
Asia Cup Final: పాకిస్తాన్ భారీ స్కోర్
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు
అవసరమా ‘అఖండ’ కావరం?
ఫుడ్ డెలివరీ యాప్‌లు వద్దు బాబోయ్..
రైల్వే ఛార్జీల పెంపు.. 26 నుంచే కొత్త రేట్లు
మాట వినలేదని జట్టు నుంచి తీసేశారు..! ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్ జట్టులోనే
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
టీ20 వరల్డ్‌కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
ఫొటోలు
జగన్ మావయ్యతో క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)
వైఎస్ జగన్.. అరుదైన (రేర్) ఫొటోలు
ఏపీవ్యాప్తంగా వైఎస్ జగన్ ముందస్తు బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)
శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)
రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)
సినిమా
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
ప్రతి రంగంలోనూ లోటుపాట్లు ఉంటాయి. వైద్యరంగంలోనూ బయటకు కనిపించనవి చాలానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి అంశాల్ని పలు సినిమాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెడికల్ రంగంలో జరిగే మాఫియాపై ఓ థ్రిల్లర్ డ్రామా సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ హీరో నివిన్ పౌలీ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడిది హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కేపీ వినోద్(నివిన్ పౌలీ).. ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రారంభంలో ఇబ్బందిపడినా తర్వాత కుదురుకుంటాడు. పనితనం చూపిస్తాడు. ఈ ఫార్మా కంపెనీ.. గర్బిణిల కోసం కైడాక్సిన్ అనే మందు కనిపెడుతుంది. దీని సేల్స్ పెంచడంలో వినోద్ కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఈ మందు వల్ల పుట్టిన పిల్లలందరూ మధుమేహం (షుగర్) బారిన పడ్డారని డాక్టర్ శైలజ(శ్రుతి రామచంద్రన్)కి తెలుస్తుంది. ఇదే విషయం వినోద్‌కి చెబుతుంది. దీంతో ఉద్యోగం చేసిన కంపెనీపైనే న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? డాక్టర్ రాజీవ్ రావు(రజత్ కపూర్).. వినోద్‌కి ఎలాంటి సాయం చేశారనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో కల్పిత కథతో తీసిన సిరీస్. చూస్తున్నంతసేపు బయట హాస్పిటల్స్‌లోనూ ఇలానే జరుగుతుందా అనే సందేహం, మరోవైపు చిన్నపాటి భయం వేస్తుంది. మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే అలా ఉంది మరి. స్టోరీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో అక్కడక్కడ తడబాటు కనిపిస్తుంది. అయితేనేం ఇలాంటి స్టోరీలు అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కొందరు వ్యక్తులు టక్, షూ వేసుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని హాస్పిటల్స్‌లో అప్పుడప్పుడు కనిపించడం మీరు చూసే ఉంటారు. వీళ్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వీళ్ల చేసే పని ఏంటంటే.. ఫార్మా కంపెనీ తయారు చేసిన మందులు, మెడికల్ పరికరాలని ప్రతి ఊరిలో ఉండే డాక్టర్లు, ఆసుపత్రులు, ఫార్మాసిస్ట్‌లకు పరిచయం చేసి అమ్మడం. అసలు వీళ్లు ఎలా పనిచేస్తారు? ఎంతలా కష్టపడతారు? టార్గెట్స్ పేరు చెప్పి వీళ్లతో కంపెనీ ఎలాంటి పనులు చేయిస్తాయి? లాంటి విషయాల్ని ఈ సిరీస్‌లోని కేపీ వినోద్ పాత్రతో చాలా చక్కగా చూపించారు.కొన్ని ఫార్మా కంపెనీలు.. బిజినెస్సే ముఖ్యమనుకుని ప్రజల ప్రాణాలతో ఎలా చెలాగాటం ఆడుతున్నాయి? ఆయా సంస్థల నుంచి వచ్చే మెడిసన్ వల్ల భవిష్యత్తు తరాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది. ఎంతో ప్రమాదకరమైన మందులు.. ప్రజల్లోకి ఎంత తేలికగా వచ్చేస్తున్నాయనే అంశాలని ఈ సిరీస్‌లో పూసగుచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. అదే టైంలో డబ్బు ముఖ్యమని అనుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎవరికైనా సరే దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడు అనే విషయాల్ని కూడా ఈ సిరీస్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.కేపీ వినోద్ పాత్రలో నివిన్ పౌలీ సెటిల్డ్‌గా చేశాడు. మలయాళంలో ప్రముఖ హీరో అయినప్పటికీ.. ఈ సిరీస్‌లో చాలా సాధారణంగా కనిపిస్తాడు. కథకి తగ్గట్లే ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఈ పాత్రకు ఉండవు. లేడీ డాక్టర్ శైలజగా చేసిన శ్రుతి రామచంద్రన్, సీనియర్ డాక్టర్ రాజీవ్ రావు పాత్రలో రజత్ కపూర్ కూడా అదరగొట్టేశారు. మిగిలిన పాత్రధారులు కూడా స్టోరీకి తగ్గట్లు జీవించేశారు. సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా కథతో పాటే వెళ్తాం. అలా చూపించారు. టెక్నికల్ అంశాలు కూడా అన్ని సెట్ అయ్యాయి.దర్శకుడు పీఆర్ అరుణ్.. ఈ సిరీస్ కోసం చాలానే రీసెర్చ్ చేశాడని అనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్ డ్రామాని చూపించినప్పుడు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఒకటిరెండు సీన్స్ తప్పితే ఓవరాల్‌గా సిరీస్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 8 ఎపిసోడ్లుగా దీన్ని తీశారు. కానీ మొత్తం రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలే. ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి.- చందు డొంకాన
తెలుగుతెర సోగ్గాడు
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సృష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా – ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్‌బాబే అనేటంతగా స్పెషల్. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్ 19న కె. బాపయ్య దర్శకత్వంలో సురేష్ప్రోడక్షన్స్పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ విశేషం ‘సోగ్గాడు’. రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్‌ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే!గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. ‘సోగ్గాడు’చిత్రం స్పెషాలిటీ అది. సరదాగా జీవితం గడుపుతూ, ఊరంతటితో సోగ్గాడు అనిపించుకొనే నిఖార్సయిన, నిష్కల్మషమైన వ్యక్తి – శోభనాద్రి (శోభన్ బాబు). అతనికి ఓ మరదలు (జయసుధ). ఆమెను పెళ్ళి చేసుకోవాల్సిన హీరో... చదువురానివాడికి ఇచ్చి పెళ్ళి చేసేది లేదన్న మామ మీద పంతంతో... చదువుకున్న అమ్మాయి కోసం పట్నం వెళతాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడ ఓ హోటల్ రూమ్‌లో అతను మరో అమ్మాయి (జయచిత్ర)ని పెళ్ళాడాల్సి వస్తుంది. అనుబంధాలు, ఆస్తి తగాదాలు, అయినవాళ్ళ అన్యాయాలతో ఆ ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. నిజానికి, ‘సోగ్గాడు’ చూస్తుంటే సినిమా చూస్తున్నట్టనిపించదు. మన పల్లెటూళ్ళలోని నిజజీవితం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రేక్షక జనానికి అది బాగా పట్టింది. తెర వెనుక మరో రచయిత..ఓ పక్కా తమిళ రచయిత ఇచ్చిన సాదాసీదా కథను తీసుకొని, దాన్ని పక్కా తెలుగు వాతావరణంలో, మన పల్లెటూళ్ళు, అక్కడి పరిస్థితులు ప్రతిబింబించేలా తెరకెక్కించడం ఆషామాషీ కాదు. అది చేసి చూపించి, సెన్సేషనల్ హిట్ సాధించింది ‘సోగ్గాడు’. అప్పటికే తరచూ తనను కలుస్తూ, అనుబంధం పెంచుకున్న రచయిత మోదుకూరి జాన్సన్‌కు సంభాషణల బాధ్యత అప్పగించారు నిర్మాత రామానాయుడు. అయితే, ఈ సినిమాకు తెరపై పేరు కనబడని మరో కీలక రచయిత అప్పలాచార్య. ‘‘తమిళ సినీ కథా, సంభాషణల రచయిత బాలమురుగన్ ఇచ్చిన ఈ జిలేబీ కథ (నవ్వుతూ...)కు నేను, రచయిత అప్పలాచార్య కలసి పక్కా మన తెలుగుదనం వచ్చేలా, కామెడీ కలగలిసేలా ట్రీట్మెంట్ చేశాం. కథలో భాగంగా బాలమురుగన్ రాసిన తమిళ కీ డైలాగులు కూడా వాడుకున్నాం. జాన్సన్ మంచి డైలాగులు రాశారు. వాటికి అప్పలాచార్య మరింత మెరుగులు దిద్ది, వన్నె తెచ్చారు. కథకు తగ్గట్టు హీరో సహా వివిధ పాత్రల డైలాగులకు పల్లెటూరి భాష, ఆ యాస వాడాం’’ అని దర్శకుడు కె. బాపయ్య ‘సాక్షి’కి వివరించారు.అచ్చ తెలుగుదనానికై... అంతా ఔట్‌డోర్‌లో...:వ్యవసాయాధారమైన అప్పటి తెలుగు పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించడం కోసం ‘సోగ్గాడు’ను అత్యధికంగా ఔట్‌డోర్‌లో తీశారు. ‘‘వ్యవసాయదారులు తాము తీసుకెళ్ళిన టిఫిన్ క్యారేజీలను చెట్ల కొమ్మలకు కట్టుకొని, చేలల్లో పనికి దిగడం లాంటివి చేసేవారు. పల్లెటూళ్ళలో షూటింగ్‌తో నేను చిన్నప్పుడు చూసిన ఆ వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చా. అందుకే చిత్రీకరణకై యూనిట్ ఆరేడుసార్లు ఆంధ్రాకు వెళ్ళాం’’ అని బాపయ్య చెప్పారు. 1975 ఏప్రిల్ 26న మద్రాసులోని వాహినీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఆ తర్వాత బాపయ్య సహా ఎందరో సినీ ప్రముఖులకు స్వస్థలమైన విజయవాడ సమీపంలోని కోలవెన్నులో పెద్ద షెడ్యూల్ ΄్లాన్ చేశారు. రెండు రోజులు చిత్రీకరణ జరిగిందో లేదో... భారీ వర్షాలు రావడంతో షూటింగ్ రద్దయింది. అయితే, తర్వాత మళ్ళీ ఆ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో మళ్ళీ కోలవెన్ను వెళ్ళారు. గ్రామస్థుల విశేష సహకారం మధ్య అక్కడ ఓ వారం రోజుల పాటు ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 80 మందితో ‘సోగ్గాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట షూటింగ్ చేశారు. అలాగే, కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో చెడుగుడు (కబడ్డీ) పోటీల దృశ్యాలను చిత్రీకరణ జరిపారు. మరికొన్ని అవుట్డోర్ దృశ్యాలను ఎలమలో తీశారు. గోదావరి జిల్లాల్లో మండపేట, అలాగే నది నేపథ్యం కోసం గోదావరి నది పక్కన ఉండే సఖినేటిపల్లికి వెళ్ళి అక్కడ చిత్రీకరణ జరిపారు. నిర్మాత రామానాయుడు తన స్వస్థలమైన కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన చిత్రమూ ఇదే. అలా ఆ ఏడాది జూలై మొదటివారం కారంచేడు కళాకారులకు నివాసమై, వేలాది జనాన్ని ఆకర్షించింది. (తరువాత మళ్ళీ హిందీ రీమేక్ ‘దిల్దార్’లో జితేంద్ర – రేఖలతో ‘సోగ్గాడు లేచాడు...’ పాట హిందీ వెర్షన్‌ను కోలవెన్నులోనూ, ‘బెన్హర్’ తరహాలో ఎడ్లబండ్ల ఛేజ్ లాంటివి కారంచేడులోనూ చిత్రీకరించడం విశేషం). ఇక, సోగ్గాడు నగరానికి రావడం, తిరగడం లాంటి దృశ్యాలను హైదరాబాద్ అబిడ్స్‌లో తీశారు. మళ్ళీ సురేష్ప్రోడక్షన్స్పై...1964లో ‘రాముడు – భీముడు’తో ‘సురేష్‌ప్రోడక్షన్స్’ మొదలైనా, మధ్యలో సురేష్ మూవీస్, నిర్మాత నాగిరెడ్డి గారి పిల్లలను కలుపుకొని ‘విజయా – సురేష్ కంబైన్స్’ లాంటి వివిధ బ్యానర్ల పేర్లతో సినిమాలు తీశారు నిర్మాత రామానాయుడు. మళ్ళీ ‘సోగ్గాడు’ నుంచి మాత్రం మొదట స్థాపించిన ‘సురేష్‌ప్రోడక్షన్స్’ పేరుతోనే చిత్రనిర్మాణం పునః్రపారంభించారు. నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల ‘విజయా కంబైన్స్ రామానాయుడి ‘సురేశ్’ సంస్థ సంయుక్తంగా ‘విజయా అండ్ సురేష్ కంబైన్స్’ పేరిట సమర్పించినట్టు టైటిల్స్‌లో ఉంటుంది. పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం ‘విజయా కంబైన్స్ ’ పేరు కనిపించదు. ఏమైనా, సురేశ్ సంస్థ, నిర్మాత రామానాయుడుల స్థాయి ‘సోగ్గాడు’ కమర్షియల్ హిట్‌తో మరింత పెరిగింది. ఆ వినాయకుడి విగ్రహం షాటే ఇప్పటికీ...మరో విశేషం ఏమిటంటే, ‘సోగ్గాడు’ కోసం కోలవెన్ను గ్రామం నడిబొడ్డున మండపాల కూడలిలో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు అక్కడే స్థానికుల సహకారంతో వరసిద్ధి వినాయకుడి విగ్రహాన్ని రామానాయుడు ప్రతిష్ఠించారు. అక్కడ వినాయకుడికి ఆయన నమస్కరిస్తుండగా షాట్ తీశారు. అప్పట్నించి ‘సురేష్‌ప్రోడక్షన్స్’ తాము నిర్మించిన సినిమాల న్నింటికీ టైటిల్స్ ముందు ఆ వినాయకుడి పూజా దృశ్యాన్నే తెరపై చూపడం ఓ సెంటిమెంట్.కోరమీసం, ముఖం మీదకు పడే వంకీల జుట్టు, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ తెరపై కనిపించారు శోభన్‌బాబు. ఆ గెటప్‌కు ఆయనకు ప్రేరణ నిజజీవితంలోని తన బాబాయి. ‘సోగ్గాడు’ పాత్రధారణ కోసం నిజజీవితంలోని ఆ బాబాయి వేషభాషలనే అనుకరించినట్టు శోభన్ స్వయంగా చెప్పారు. ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో అలరించారు. తెలుగులో ఆమెకు తొలి ఛాన్స్... జయసుధ, జయచిత్రల గ్లామర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కథలో పల్లెటూరి వాతావరణం, బావా మరదళ్ళ సరసం లాంటివన్నీ ఉన్నాయి గనక తెరపై లంగా, ఓణీతో తెలుగుదనం కనిపించేలా యువ హీరోయిన్స్ అయితే బాగుంటుందని దర్శక, నిర్మాతలు భావించారు. అందుకే, అప్పటికే టాప్ రేంజ్లో ఉన్న సీనియర్ హీరోయిన్లను సైతం పక్కనపెట్టి జయచిత్ర, జయసుధలను ఎంచుకున్నారు. తమిళంలో అప్పటికే కథానాయికగా నటిస్తున్న తెలుగమ్మాయి జయచిత్ర మెయిన్ హీరోయిన్. ‘సోగ్గాడు’తోనే తెలుగుతెరకు నాయికగా ఆమె పరిచయమయ్యారు. అంతకు ముందు చిన్నవయసులో ఆమె తెలుగులో నటించారు. ‘‘తమిళంలో నేను హీరోయిన్గా పరిచయమైన ‘΄÷న్నుక్కు తంగ మనసు’ చిత్ర కథారచయితే బాలమురుగన్ గారే ‘సోగ్గాడు’కూ రచయిత కావడం మర్చిపోలేను’’ అని జయచిత్ర చెప్పారు. ‘‘సినిమా అంటే తెలియని చిన్నవయసు నుంచే జయచిత్ర, నేను మంచి ఫ్రెండ్స్. తమిళంలో బాలచందర్ ‘సొల్లత్తాన్ నినైక్కిరేన్’ (1973 – తెలుగులో ‘అమ్మాయిలూ జాగ్రత్త’గా రీమేకైంది), శివాజీగణేశన్ ‘భారత విలాస్’ (1973) సహా అయిదారు సినిమాలు కలసి కూడా పని చేశాం. జయచిత్రది ఓ ప్రత్యేక స్టైల్. ఆమెలా చిలిపి, అల్లరి పాత్రలు పోషించే శైలి వేరెవరికీ రాలేదు’’ అన్నారు జయసుధ. ఫలించిన శోభన్ జోస్యం... ఇక, అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ ఏమో హీరో మరదలిగా ‘సోగ్గాడు’లో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించారు. సురేష్ సంస్థలోనూ జయచిత్ర, జయసుధలకు అదే తొలి సినిమా. తరువాతి కాలంలో గ్లామర్ తారలుగా ఎదగడానికి ‘సోగ్గాడు’ ఘనవిజయం వాళ్ళిద్దరి కెరీర్‌కూ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ‘సోగ్గాడు’ షూటింగ్ జరుగుతుండగానే జోడీగా చేస్తున్న నటి జయసుధ భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారని ఓ జర్నలిస్టు, హీరో శోభన్‌బాబును ప్రశ్నించారు. ‘మరో రెండేళ్ళలో జయసుధ ్రపామినెంట్ స్టార్ అవుతుం’దని శోభన్ జోస్యం చెప్పారు. కట్ చేస్తే అక్షరాలా అదే జరిగింది. ఆ వెంటనే క్రాంతికుమార్ నిర్మించిన ‘జ్యోతి’(1976) తో ఆమె నటిగా తానేమిటో నిరూపించారు. ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ (1977)తో గ్లామర్ హీరోయిన్ అయ్యారు. ఇటు అందం, అటు అభినయంతో అనతికాలంలోనే జయసుధ స్టార్ హోదాను అందుకున్నారు. ఏయన్నార్ నుంచి చిరంజీవి దాకా నాటి అగ్రహీరోలందరితో నాయికగా రాణించారు. ∙స్టార్డమ్ తెచ్చిన సూపర్ హిట్...శోభన్‌బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రంలో కె.వి. మహదేవన్ సంగీతంలో ఆత్రేయ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్ష¯Œ లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్‌కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్‌ను ఓ కొత్త పంథాలో చూపిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్ హీరోతో పోటాపోటీగా శోభన్‌ను నిలిపింది ‘సోగ్గాడు’. అలాగే, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. అంతకు ముందే వచ్చిన ‘జీవనజ్యోతి’ (1975 మే 16) సమయానికే శోభన్‌బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు. ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడు నెలలకు వచ్చిన ‘సోగ్గాడు’ కూడా 32 కేంద్రాల్లోనే రిలీజై, 31 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకోవడం విశేషం. అయితే, ‘సోగ్గాడు’ 16 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 3 కేంద్రాల్లో షిఫ్టులతో కలిపి మొత్తం 19 సెంటర్లలో వంద రోజులాడినా, రజతోత్సవ ఘనత దక్కలేదు. శోభన్ కెరీర్లో అత్యధిక కేంద్రాల శతదినోత్సవ చిత్రం ఇదే. సరికొత్త స్టార్ హీరోగా శోభన్‌బాబు అవతరించడానికి ‘సోగ్గాడు’ తోడ్పడింది. విజయవాడ మునిసిపల్ స్టేడియమ్ గ్రౌండ్స్‌లో 1976 ఏప్రిల్11న శతదినోత్సవం జరిపారు. ∙బాక్సాఫీస్ హిట్‌తో... బాపయ్య బిజీ బిజీఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకుడు తాపీ చాణక్య దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన బాపయ్యకు సురేష్‌ప్రోడక్షన్స్ ఆవిర్భావం, తొలి చిత్రం ‘రాముడు– భీము డు’(1964) నుంచి ఆ సంస్థతో అనుబంధం ఉంది. ‘‘రామానాయుడు గారు ఆ కంపెనీ రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ పేపర్లు కావాలంటే, వెళ్ళి, కొని తెచ్చింది నేనే. ఆ సంస్థకు 60 ఏళ్ళు దాటడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాపయ్య. ఆయన దర్శకుడిగా పరిచయమైందీ సురేష్‌ప్రోడక్షన్స్ ‘ద్రోహి’తోనే. అది ఫెయిలైందని అందరూ వారించినా, రామానాయుడు మాత్రం బాపయ్య ప్రతిభపై నమ్మకం ఉంచి ‘సోగ్గాడు’ ఛాన్సిచ్చారు. ఆ అవకాశాన్ని బాపయ్య సద్వినియోగం చేసుకొని, కమర్షియల్ డైరెక్టర్‌గా నిరూపించుకున్నారు. దాదాపు సమాంతరంగా షూటింగులు జరిగి, వారం రోజుల తేడాలో రిలీజైన ఎన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’, శోభన్‌బాబు ‘సోగ్గాడు’ రెంటినీ హిట్ చేసి, బాక్సాఫీస్ వద్ద డైరెక్టర్‌గా తన సత్తా చాటుకున్నారు బాపయ్య. తరువాత చిరంజీవితో ‘సంఘర్షణ’, ‘కొదమ సింహం’ లాంటి చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడు కె. మురళీమోహనరావు అటు ‘ఎదురులేని మనిషి’కి కొద్దిరోజులు, ఇటు ‘సోగ్గాడు’కు పూర్తిగా బాపయ్య వద్ద దర్శకత్వ శాఖలో పనిచేయడం విశేషం. ఈ తెలుగు హిట్‌ను తర్వాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్దార్’ (1977 ఏప్రిల్ 13) పేరిట రామానాయుడే నిర్మించారు. తమిళంలో మాత్రం శివకుమార్ (హీరో సూర్య తండ్రి) – శ్రీవిద్య జంటగా వేరే దర్శక, నిర్మాతలు ‘రాధై కేట్ర కణ్ణన్’ (1978) పేరిట రీమేక్ చేశారు. తెలుగుహిట్ బాణీలనే తమిళంలోనూ వాడారు. హిందీ రీమేక్ ‘దిల్దార్’ తెలుగు వెర్షన్ తీసిన బాపయ్య దర్శకత్వంలోనే వచ్చింది. దర్శకుడిగా బాపయ్యకు అదే తొలి పూర్తిస్థాయి హిందీ చిత్రం. అక్కడ నుంచి ఆయన ఇటు నేరు తెలుగు చిత్రాలు, అటు మన తెలుగువాళ్ళు తీస్తున్న హిందీ రీమేక్స్‌తో ఇరవయ్యేళ్ళు బిజీ బిజీగా గడిపారు. ఎక్కడ విన్నా ఆ పాటలే!ఆ రోజుల్లో తెలుగునాట ఎక్కడ విన్నా... మహదేవన్ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘‘బహుశా ‘అవ్వా బువ్వా కావాలంటే...’ పాటో, మరో పాటో గుర్తు లేదు కానీ, ‘ఎదురులేని మనిషి’కై ఆత్రేయ రాసిన ఓ పాట అందులో ఒదగదనిపించి, విలేజ్ నేపథ్యంలోని ‘సోగ్గాడు’కు వాడాం’’ అని బాపయ్య గుర్తు చేసుకున్నారు. ‘సోగ్గాడు’ కోసం శోభన్‌బాబు డ్యాన్స్ మాస్టర్ బి. హీరాలాల్ వద్ద శిక్షణ ΄÷ంది, పాటలకు స్టెప్పులేశారు. ‘సోగ్గాడు లేచాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్లో ఓ హిస్టీరియా. ఫ్యా¯Œ ్స అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా...’ పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. ‘సోగ్గాడు’ అంతా పూర్తయ్యాక ఫస్ట్కట్ చూసుకున్నాక మరో ప్రణయ గీతం ఉంటే బాగుంటుందనిపించి, శోభన్– జయసుధలపై ‘చలివేస్తోంది చంపేస్తోంది’ పాట ఎ.వి.ఎం. స్టూడియోలో తీసి, కలిపారు. ఆ పాట కుర్రకారుకు కిర్రెక్కించింది. హ్యాట్రిక్ ‘ఫిల్మ్‌ఫేర్’ల... ఏకైక తెలుగు హీరో! చాలామందికి తెలియనిదేమిటంటే, శోభన్ కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ హిట్ అని అందరూ అనుకొనే ‘సోగ్గాడు’ కన్నా ‘జీవనజ్యోతి’దే వసూళ్ళలో పైచేయి. ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. టికెట్ రేట్లు ఎక్కువుండే ఏసీ, డీలక్స్ థియేటర్లలో ‘సోగ్గాడు’ రిలీజైన కాకినాడ, నెల్లూరు టౌన్లను మినహాయిస్తే, మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్ళు వచ్చింది – ‘జీవనజ్యోతి’కే! అయితే, ఆ రెండు చిత్రాలూ ఆయనను ఉత్తమ నటుడిగా నిలిపి, అవార్డు సాధించిపెట్టాయి. ‘ఖైదీ బాబాయ్’ (1974), ‘జీవనజ్యోతి’ (1975) తరువాత వరుసగా మూడో ఏడాది ఈ ‘సోగ్గాడు’ (1976)తో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఆయనకే దక్కింది. తెలుగులో అలా వరుసగా మూడేళ్ళు ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ అందుకున్న ఏకైక హీరో శోభనే!అది... నటభూషణ నామ సంవత్సరం!శోభన్‌బాబు కెరీర్లో శిఖరాయమాన సంవత్సరమంటే 1975! ఆ ఏడాది శోభన్ సినిమాలు 8 రిలీజైతే అందులో 5 (‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘జీవనజ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’) హిట్లు . రెండే (‘గుణవంతుడు’, ‘అందరూ మంచివారే’) ఫ్లాపులు. ఒకటి (‘బాబు’) యావరేజ్. అయిదు హిట్లలోనూ ‘జీవనజ్యోతి’ 25 వారాలాడి, సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. ఏయన్నార్‌కి పర్మినెంట్ నిర్మాతైన రామానాయుడు తీసిన ‘సోగ్గాడు’ రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి తొలగించబడింది. అలా ఉద్దేశ పూర్వకంగా హాళ్ళలో తీసేయడం పట్ల ఎన్నో ఊహాగానాలు వినవచ్చాయి. అప్పట్లో అది టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏమైనా అలా ఒకే ఏడాది అధికశాతం కమర్షియల్ సక్సెస్‌లతో శోభన్ క్రేజు పెరిగిపోయింది. పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది. ఎవరు ఆపదలచినా... ఆగని రీతిలో ఆయన ప్రస్థానం సాగిపోయింది తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల హీరోగా తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’ చేసిన మ్యాజిక్.ఆయన అప్పుడే చెప్పారు!‘‘మద్రాసులోని ఓ స్టూడియోలో షాట్ గ్యాప్‌లో నేను ఫ్లోర్ బయట కూర్చొనివుంటే, వేరే షూటింగ్ కోసం మేకప్ రూమ్ నుంచి వెళుతున్న శోభన్‌బాబు ‘మీరే కదా జయసుధ’ అంటూ నా దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆయన మంచి సక్సెస్‌లో ఉన్న పేరున్న హీరో. ఆయన నాలో ఏం గమనించారో కానీ, ‘యాక్టర్ సత్యనారాయణ గారు మీ ప్రతిభ గురించి చెప్పారు. మీరు పెద్ద ఆర్టిస్ట్ అవుతారు’ అని అప్పుడే అంచనా వేసేశారు. ‘సోగ్గాడు’కు చాలా ముందెప్పుడో... అలా మా ఇద్దరి తొలి పరిచయం. కట్ చేస్తే ఆ తర్వాత ‘సోగ్గాడు’ లో తొలిసారి ఆయన పక్కనే నటించాను. అంతకు ముందు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ లాంటి స్టార్ల చిత్రాల్లో పాత్రలు పోషించినా, ఒక అగ్ర హీరో సరసన హీరోయిన్గా నేను నటించడం ‘సోగ్గాడు’లోనే! ఆ సినిమా సెన్సేషనల్ హిట్‌తో హీరోయిన్గా నాకు పెద్ద బ్రేక్ వచ్చింది. అంతే... ఆ తర్వాత మా కాంబినేషన్లో ఎన్నో పెద్ద పెద్ద హిట్లు. కాలగతిలో శోభన్‌బాబు గారితో అత్యధికంగా 38 చిత్రాల్లో నటించిన హీరోయినయ్యాను. తెరపై సక్సెస్ఫుల్ పెయిర్‌గానే కాక ప్రేక్షకులకు అమితమైన అభిమానం ΄÷ందిన వెండితెర జంట మాది!’’– హీరోయిన్ జయసుధఅక్కినేనికి ‘దేవదాసు’... శోభన్‌కు ‘సోగ్గాడు’‘‘మా చిన్నప్పటి ‘సోగ్గాడు’ చిత్ర నిర్మాణం నాకు గుర్తే. మద్రాసులో బీచ్‌లో పడవల దగ్గర కూర్చొని, రచయిత మోదుకూరి జాన్సన్ డైలాగ్స్ రాయడం లాంటి దృశ్యాలు ఇప్పటికీ జ్ఞాపకమే. మా నాన్న గారి (డి. రామానాయుడు) ద్వారా ఆ సక్సెస్ గురించి ఎన్నో సంగతులు విన్నా. హిందీలోనూ ఆ చిత్రాన్ని జితేంద్ర – రేఖలతో ‘దిల్దార్’ పేరుతో రీమేక్ చేస్తే, అక్కడ కూడా మంచి సక్సెసే! ఏయన్నార్ గారికి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’ లాంటివి ఎలాగో, శోభన్‌బాబు గారికి ‘సోగ్గాడు’ అలా! ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆ సినిమాను మా సంస్థ నిర్మించడం మాకు గర్వకారణం.’’ – సురేష్ డక్షన్స్ సారథి డి. సురేశ్బాబుఛార్టర్డ్ ఫ్లైట్‌లో పంపారు!‘‘ఎన్టీఆర్ గారి సరసన హీరోయిన్గా మా అమ్మ జయశ్రీ నటించిన ‘దైవబలం’ చిత్రంలో శోభన్‌బాబు చిన్న పాత్ర పోషించారు. నేను అదే శోభన్‌బాబు పక్కన ‘సోగ్గాడు’తో తొలిసారి తెలుగులో హీరోయిన్గా పరిచయమయ్యా. అప్పటికే ఆయన పెద్ద హీరో. నేను కొత్త. అయినా, మొదటిరోజు వాహినీ స్టూడియోలో ‘ఏడుకొండలవాడా...’ పాటతో షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆయన నన్నెంతో ్రపోత్సహిస్తూ నటింపజేశారు. ‘సోగ్గాడు’ షూటింగ్ జరుగుతున్నప్పుడే నాకు తమ్ముడు పుట్టాడు. పెద్ద సాంగ్ షూటింగ్ మధ్యలో ఉండగా అప్పటికప్పుడు వెళ్ళడానికి నిర్మాత రామానాయుడు గారు ‘హిందూ’ పత్రిక వారి స్పెషల్ ఛార్టర్డ్ విమానంలో పంపిన సంగతి మర్చిపోలేను. అలాగే, ‘సోగ్గాడు’ చిత్రాన్ని తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆ బృందంలో రామానాయుడు గారు నన్ను తీసుకువెళ్ళారు. అదే నా తొలి విదేశీ పర్యటన. అక్కడ ఇండియన్ డ్యాన్సులు చేయాలంటే, రాజ్‌కపూర్ తదితరుల ఎదుట పాటలకు నేను డ్యాన్స్ చేశా. అదో మరపురాని అనుభూతి.’’ – హీరోయిన్ జయచిత్ర విజయవాడలో వేలాది జనం... అదే ట్రైన్లో ఎన్టీఆర్...‘‘శోభన్‌బాబుతో నా కాంబినేషన్లో ‘సోగ్గాడు’ నుంచి కృష్ణ – శోభన్‌బాబు మల్టీస్టారర్లు ‘ముందడుగు’, ‘మండేగుండెలు’ దాకా ఎన్నో హిట్స్ వచ్చాయి. తొలి రోజుల్లో నామమాత్రపు ΄ారితోషికాలకు చిన్న వేషాలు వేస్తున్నప్పటి నుంచి శోభన్‌బాబు నాకు తెలుసు. అలాంటివాడు పట్టుదల, క్రమశిక్షణ, ముందుజాగ్రత్తలతో ‘రిచెస్ట్ తెలుగు హీరో ఇన్ మద్రాస్’ అయ్యాడు. మంచి మనిషి, మహా అందగాడు. ఫైట్లు – యాక్షన్ కన్నా, ప్రేమ సీన్లు, ఫ్యామిలీ సీన్లు, అభినయం – డైలాగ్స్ ఎక్కువుండే వాటిని ఆయన ప్రిఫర్ చేసేవారు. ఆ రోజుల్లో ‘సోగ్గాడు’ శతదినోత్సవం విజయవాడలో చేస్తే, వేలల్లో జనం వచ్చారు. వేడుక అద్భుతంగా జరిగాక, మళ్ళీ అదే రోజు అర్ధరాత్రి దాటాక ఉన్న ట్రెయిన్ పట్టుకొని యూనిట్ అంతా మద్రాసుకు తిరుగు పయనమయ్యాం. అనుకోకుండా అదే రైలులో మా వెనకాల సీట్లలోనే అగ్ర హీరో ఎన్టీఆర్ ఉన్నారు. అది తెలిసి, వెళ్ళి పలకరించాం. ఆయన ఆత్మీయంగా అందరినీ అభినందించారు.’’ – దర్శకుడు కె.బాపయ్య – రెంటాల జయదేవ
ఓటీటీకి గురిపెట్టిన రివాల్వర్ రీటా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'రివాల్వర్ రీటా'. ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించారు. లేజీ ఓరియంటెండ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు.రివాల్వర్ రీటా కథేంటంటే..పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు.మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ.Watch Revolver Rita on Netflix out 26 December in Tamil, Telugu, Kannada and Malayalam#RevolverRitaOnNetflix@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction @mkt_tribe…— Netflix India South (@Netflix_INSouth) December 21, 2025
దురంధర్ మరో రికార్డ్.. ఆ లిస్ట్‌లో షారూఖ్ ఖాన్ జవాన్ కంటే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో విడుదలైన 16 రోజుల్లో ఏకంగా రూ. 785 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించిన ఏడో హిందీ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. షారూఖ్ ఖాన్ 'జవాన్', శ్రద్ధా కపూర్ 'స్త్రీ -2' చిత్రాల కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే ఆదివారం రోజే ఛావా(రూ.807 కోట్లు) వసూళ్లను అధిగమించేలా కనిపిస్తోంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ వల్ల దురంధర్ కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హమ్జా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు.
క్రీడలు
చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్
యాషెస్ సిరీస్ 2025-26ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ ఘోర పరభావాన్ని మూట కట్టుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 రన్స్‌కు ఆలౌటైంది.లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (85) అద్భుతంగా పోరాడినప్పటికీ.. మిడిలార్డర్ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ఆఖరిలో జామీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39 నాటౌట్) జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్ తలా మూడు వికెట్లతో ఇంగ్లీష్ జట్టు ఓటమిని శాసించారు."సిరీస్‌ను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో అడిలైడ్‌లో అడుగుపెట్టాము. కానీ మా కల ఇప్పుడు చెదిరిపోయింది. ఈ ఓటమి జట్టులోని ప్రతీ ఒక్కరిని ఎంతో బాధకు గురి చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది.ఈ మ్యాచ్‌లో ఆసీస్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు. నాలుగో ఇన్నింగ్స్‌లో మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి మేము ఆఖరివరకు పోరాడాము. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆడిన తీరు చూసి మేము గెలుస్తామని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. టాస్ ఓడినప్పటికి ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఓ మోస్తార్ స్కోర్‌కే కట్టడి చేయడంలో మేము విజయవంతమయ్యాము. అయితే ఆ తర్వాత మేము భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాము. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను ఆశించిన పట్టుదల వారిలో కన్పించింది. సిరీస్ కోల్పోయినప్పటికి మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: సంజూ శాంసన్ కీలక నిర్ణయం
పాక్‌తో ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. పాక్ మాత్రం ఒక్క మార్పు చేసింది.డానియల్ అలీ ఖాన్ స్ధానంలో నిఖాబ్ షఫీక్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని టీమిండియా.. తుది పోరులో కూడా తమ జోను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్ దుమ్ములేపుతున్నారు.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ , అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హంజా జహూర్ (వికెట్ కీపర్), హుజైఫా అహ్సాన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (151 బంతుల్లో 85; 8 ఫోర్లు), విల్ జాక్స్(47), బ్రైడన్ కార్స్(39), జేమీ స్మిత్(60) పోరాడినప్పటికి తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించ లేకపోయారు. రికార్డు లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ బెన్ డకెట్ (4) అవుట్ కాగా... కాసేపటికే ఒలీ పోప్ (17) కూడా వెనుదిరిగాడు. పోరాటానికి మారుపేరైన జో రూట్ (63 బంతుల్లో 39; 5 ఫోర్లు) కీలక దశలో వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లు ఆసీస్ సారథి కమిన్స్ ఖాతాలోకే వెళ్లాయి. అయితే బ్రూక్ (56 బంతుల్లో 30; 2 ఫోర్లు) అండతో క్రాలీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 177/3తో పటిష్టంగా కనిపించింది. ఇలాంటి దశలో ఆసీస్ స్పిన్నర్ లయన్ ఆ జట్టును దెబ్బ తీశాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆ్రస్టేలియా వైపు తిప్పాడు. బ్రూక్, స్టోక్స్ (18 బంతుల్లో 5; 1 ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే క్రాలీ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 194/6తో కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో సహచరుల నుంచి పెద్దగా సహకారం దక్కకపోయినా మొండిగా పోరాడిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ సారి అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయాడు. అయితే జేమీ స్మిత్, విల్ జాక్స్ నిలకడగా ఆడి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రెకెత్తించారు. స్మిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కార్స్ కూడా ఆకట్టుకున్నాడు. కానీ జాక్స్ ఔటయ్యాక ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. కార్స్ నాటౌట్‌గా నిలవగా.. ఆర్చర్, టంగ్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియోన్ తలా మూడేసి వికెట్లు పడగొట్టాడు.హెడ్ భారీ సెంచరీ అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... అలెక్స్ కేరీ (128 బంతుల్లో 72; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు పెద్దగా తోడ్పాటు అందించలేకపోవడంతో ఆసీస్ జట్టు ఆశించిన స్కోరు కంటే ముందే ఆలౌటైంది. జోష్ ఇన్‌గ్లిస్ (10), కెపె్టన్ ప్యాట్ కమిన్స్(6) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో అటు బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... బ్రైడన్ కార్స్3 వికెట్లు తీశాడు.
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.వన్డే జట్టులోకి వచ్చేందుకు..భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది'
న్యూస్ పాడ్‌కాస్ట్
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
బిజినెస్
హల్దీరామ్స్‌లో కేటర్‌టన్‌కు వాటా
న్యూఢిల్లీ: దేశీ స్నాక్స్ దిగ్గజం హల్దీరామ్స్‌లో తాజాగా కన్జూమర్ ఫోకస్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కేటర్టన్ పార్ట్నర్స్ వాటా కొనుగోలు చేసింది. అంతేకాకుండా హల్దీరామ్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు ఎల్.కేటర్టన్ తాజాగా వెల్లడించింది. అయితే పెట్టుబడి విలువ లేదా వాటా సంబంధ వివరాలు పేర్కొనలేదు. దేశీయంగా నాయకత్వస్థాయిలో ఉన్న హల్దీరామ్స్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వీలుగా చేతులు కలిపినట్లు తెలియజేసింది. కేటర్టన్ సుమారు 39 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులను నిర్వహిస్తోంది. వెరసి ఇప్పటికే హల్దీరామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన పలు అంతర్జాతీయ దిగ్గజాల సరసన చేరింది. ప్యాకేజ్డ్ స్నాక్స్, స్వీట్స్సహా రెస్టారెంట్లను నిర్వహించే హల్దీరామ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు చేపట్టే టెమాసెక్(సింగపూర్ కేంద్రం), అల్ఫా వేవ్ గ్లోబల్, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ) ఈ ఏడాది మొదట్లో వాటాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వివరాలు వెల్లడికానప్పటికీ 10 బిలియన్ డాలర్ల(రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఎల్.కేటర్‌టన్‌కు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ మాజీ ఎండీ సంజీవ్ మెహతా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఫామ్లీ, ఫెరారా క్యాండీ, కెటెల్ ఫుడ్స్, లిటిల్ మూన్స్, ప్లమ్ ఆర్గానిక్స్ తదితరాలలో పెట్టుబడులు చేపట్టింది.
50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ
న్యూఢిల్లీ: 2030 నాటికి దేశీయంగా 50 లక్షల మంది యువతకు ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్వాంటమ్ మొదలైన సరికొత్త సాంకేతికతల్లో శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నట్లు టెక్ దిగ్గజం ఐబీఎం వెల్లడించింది. ఇందుకోసం ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు వివరించింది. అంతర్జాతీయంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి శిక్షణ కల్పించాలన్న మిషన్‌లో భాగంగా భారత్‌లో దీన్ని చేపట్టినట్లు ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఒకేషనల్ కాలేజీలకు చేరువ కావడంతో పాటు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)తో కూడా జట్టు కట్టనున్నట్లు వివరించారు. సరికొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలనేవి ఆర్థికంగా పోటీపడేందుకు, సాంకేతిక పురోగతికి, సమాజ పరివర్తనకు తోడ్పడతాయని కృష్ణ చెప్పారు.
కొలువులు ఉంటేనే.. విదేశాల్లో చదువు..
ముంబై: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, వీసా పాలసీలు మారిపోతున్న నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసంపై ఆసక్తి గల విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. అఫోర్డబిలిటీతో పాటు (అందుబాటు స్థాయిలో వ్యయాలు) చదువు అనంతరం ఉద్యోగావకాశాలు, తాము చదివే కోర్సులపై కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం తదితర అంశాలకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ ఆధారిత విదేశీ విద్య సేవల ప్లాట్‌ఫాం లీప్ స్కాలర్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 30 లక్షల మంది పైగా విద్యార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇది రూపొందింది. దీని ప్రకారం 2024–25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 377 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇది 219 శాతం వృద్ధి చెందింది. ఇక న్యూజిలాండ్‌పై 6 శాతం నుంచి 2,900 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై 7 శాతం నుంచి 5,400 శాతానికి ఆసక్తి పెరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక 18 నెలల పాటు వర్క్ వీసా లభిస్తుండటం జర్మనీ విషయంలో సానుకూలాంశం. పాశ్చాత్య వర్సిటీలతో పోలిస్తే విద్యా వ్యయాలు తక్కువగా ఉండటం, కాస్త అందుబాటు దూరంలో ఉండటం యూఏఈకి సానుకూలంగా నిలుస్తోంది. అటు విద్యాభ్యాసం పూర్తయ్యాక మూడేళ్ల పాటు నివసించేందుకు, పని చేసేందుకు వర్క్ వీసా ఇచ్చే ఇమ్మిగ్రేషన్ పాలసీలతో భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్ ఆకర్షణీయంగా ఉంటోంది. ‘విద్యార్థులు ఇప్పుడు కేవలం అఫోర్డబిలిటీని మాత్రమే చూడటం లేదు. ఫలానా యూనివర్సిటీలో చదివామని గొప్పలకు పోవడం కన్నా సదరు డిగ్రీతో ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనేది కూడా వారికి కీలకంగా ఉంటోంది. పెట్టిన పెట్టుబడిపై రాబడి అవకాశాలను సైతం వారు లెక్కలు వేసుకుంటున్నారు‘ అని లీప్ స్కాలర్ సహ–వ్యవస్థాపకుడు ఆర్నవ్ కుమార్ తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → స్పెషలైజేషన్‌కి విద్యార్థులు గతంలో కన్నా మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 40.4 శాతం మంది విద్యార్థులు ఏఐ, మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్ మొదలైన వాటిల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తిగా ఉన్నారు. → 59.6 శాతం మంది వివిధ కోర్సుల్లో ఏఐ మాడ్యూల్స్ కూడా ఉన్న మాస్టర్స్ డిగ్రీలను ఎంచుకుంటున్నారు. → బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాలకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు చేసినా, ఏఐకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇది నిదర్శనం. → ఏఐ కోర్సులు చదివేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల కన్నా తాము చదువుపై పెడుతున్న పెట్టుబడిపై రాబోయే రాబడులను కూడా లెక్కలు వేసుకుంటున్నారు. → కోర్సు ఖర్చు, ఇతరత్రా వ్యయాలూ తమకు అత్యంత ప్రాధాన్యతాంశాలని 75 శాతం మంది వెల్లడించారు. స్కాలర్షిప్కు 70 శాతం, కెరియర్ పురోగతికి 58 శాతం, జీతభత్యాల పెరుగుదల అవకాశాల అంశానికి 49 శాతం ఓట్లు లభించాయి. 40 శాతం ఓట్లతో అధ్యాపకుల అనుభవం, రీసెర్చ్ అవకాశాలకు అయిదో ర్యాంకు దక్కింది. టాప్ 5 ప్రాధాన్యతాంశాల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. → విదేశీ విద్యను ఎంచుకునే అబ్బాయిలు (58 శాతం), అమ్మాయిల (42 శాతం) మధ్య అంతరం తగ్గుతోంది. అమ్మాయిలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ (స్టెమ్) కోర్సులను ఎంచుకుంటున్నారు. అందులోనూ ఏఐ, డేటా సైన్స్‌కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు.
రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్
మోటార్ సైకిల్ లేదా కారు కొనే ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వాహనాల మైలేజ్ కొంత తగ్గే సూచనలు కనిపించవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ.. తలలు పట్టుకుంటారు. బండి మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే.. మైలేజ్ పెరుగుతుందనే విషయాలు ఈ కథనంలో..వాహనాల మైలేజ్ తగ్గడానికి కారణాలుకొత్తగా కొన్న కారు లేదా మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం.. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం, స్పార్క్ ప్లగ్ పాడవ్వడం, ఇంజిన్ ఆయిల్, సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం మొదలైనవని తెలుస్తోంది.అంతే కాకుండా.. అకస్మాత్తుగా బండి వేగం పెంచడం, బ్రేక్ వేయడం, గేర్ సరిగా మార్చకపోవడం, క్లచ్‌ను ఎక్కువగా నొక్కి ఉంచడం, ట్రాఫిక్‌లో ఎక్కువగా ఆగి మళ్లీ స్టార్ట్ చేయడం, వాహనంపై ఎక్కువ బరువు వేసుకోవడం, నాణ్యతలేని పెట్రోల్ / డీజిల్, సరైన రోడ్లు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. మైలేజ్ తగ్గవచ్చు.ఫ్యూయెల్ ఆదా కోసంరైడింగ్ సమయంలో.. ఒక్కసారిగా వేగం పెంచకుండా.. సాఫ్ట్‌గా యాక్సిలరేట్ చేయాలి.ఎక్కువ RPMలో రైడ్ చేయడం ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. కాబట్టి సరైన గేర్ వాడాలి.అనవసరంగా స్పీడ్ పెంచకూడదు. స్థిరమైన స్పీడ్‌లో బండి నడపాలి.ఎక్కువ సేపు స్టాప్‌లో ఉంటే (సిగ్నల్ వద్ద) ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంత ఫ్యూయెల్ ఆదా అవుతుంది.టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే.. కూడా మైలేజ్ తగ్గుతుంది. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి.అనవసరంగా ఎక్కువ బరువులు వేయకూడదు. ఎక్కువసేపు క్లచ్ ప్రెస్ చేస్తూ ఉండకూడదు.ఇదీ చదవండి: ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
ఫ్యామిలీ
నెల్లూరు చేపల పులుసు
కావలసినవి: చేప ముక్కలు (కొరమీను / వంజరం / బొచ్చ చేప) – అర కిలో; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి); టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి); పచ్చిమిర్చి – 3–4 (నిలువుగా కట్చేసినవి); వెల్లుల్లి రెబ్బలు – 8–10 ( నిలువుగా కట్చేసినవి); అల్లం – చిన్న ముక్క; కరివేపాకు – 2 కొమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; చింతపండు రసం – కప్పు (పులుపు తగినంత); నూనె – 3 టేబుల్ స్పూన్లు; పులుసు మసాలా: కారం – 2 టీ స్పూన్లు; ధనియాలపోడి – 2 టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్రపోడి – పావు టీ స్పూన్; మెంతులు – పావు టీ స్పూన్.తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, పసుపు రాసి పక్కన పెట్టాలి. మట్టిపాత్ర లేదా మందమైన వెడల్పాటి పాత్రలో నూనె వేసి, వేడి చేయాలి. అందులో మెంతులు వేసి, వేగాక ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాలపోడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసం, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలను జాగ్రత్తగా పులుసులో వేయాలి. కదపకూడదు. మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. పులుసు నుంచి నూనె పైకి తేలినప్పుడు జీలకర్రపోడి, కొత్తిమీర వేసి మంట తీసేయాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.దాల్ మఖనీసంప్రదాయ ఉత్తర భారతీయ వంటకం కావలసినవి: మినప్పప్పు – కప్పు; రాజ్మా – పావు కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది); టమాటా గుజ్జు – 2 కప్పులు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 1 (సన్నగా తరగాలి); కారం∙– టీ స్పూన్; ధనియాలపోడి – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; పాల మీగడ – పావు కప్పు; కొత్తిమీర – అలంకరణకు;తయారీ: పప్పులు రాత్రిపూట నానబెడితే ఉదయానికి ఉడికించడానికి రెడీగా ఉంటాయి. నానబెట్టిన పప్పులను కుకర్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి పాన్ లో నూనె, టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి టమాటా గుజ్జు వేసి, నూనె తేలేవరకు ఉడికించాలి. తర్వాత కారం, ధనియాలపోడి, ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత ఉడికించిన మినప పప్పు, రాజ్మా పై మిశ్రమంలో వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మెల్లగా మరిగించాలి. సన్నని మంటపై అరగంటసేపు ఉడికిస్తే రుచి మరింత బాగుంటుంది. చివరగా మిగిలిన వెన్న, మీగడ, గరం మసాలా వేసి కలిపి, ఐదు నిమిషాలు ఉడికించి, స్టౌ ఆఫ్ చేయాలి. పై నుంచి మరికొద్దిగా పాల మీగడ, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలిదాల్ మఖానీని నాన్, రోటీ, జీరా రైస్ లేదా కుల్చాతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.మటన్ రోగన్ ఘోష్ఇది కాశ్మీర్‌కు చెందిన ప్రసిద్ధ వంటకం. ఘుమఘుమలాడే మసాలా, మృదువైన మటన్ ముక్కలు, ప్రత్యేకమైన రంగు, రుచి ఈ వంటకం ప్రత్యేకత. కావలసినవి: మటన్ – పావు కిలో; పెరుగు – కప్పు; ఉల్లి పాయలు – 2 (సన్నగా తరిగినవి); అల్లం – వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; కాశ్మీరీ కారం – 2 టీ స్పూన్లు; కారం – పావు టీ స్పూన్ ; ధనియాలపోడి – రెండు టీ స్పూన్లు; జీలకర్రపోడి – టీ స్పూన్; సోంపుపోడి – 1 టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; యాలకులు – 3; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ – 1; నూనె లేదా నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – అలంకరణకు.తయారీ: మటన్‌కు కొద్దిగా ఉప్పు, సగం అల్లం–వెల్లుల్లి పేస్ట్ రాసి, 30 నిమిషాలు ఉంచాలి. పాన్ లేదా ప్రెజర్ కుకర్‌లో నూనె/నెయ్యి వేడి చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మిగిలిన అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మటన్ ముక్కలు వేసి, మసాలాలో బాగా కలిపి 5–7 నిమిషాలు వేయించాలి. మంట తగ్గించి పెరుగు కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి. కశ్మీరీ కారం, కారం, ధనియాలు, జీలకర్ర, సోంపుపోడులు, ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బయట గిన్నెలో అయితే మటన్ మెత్తబడే వరకు ఉడికించాలి. మూత తీసి గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉంచి, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి.రోటీ, నాన్ లేదా అన్నంతో ఈ మటన్ రోగన్ ఘోష్ ను వడ్డించాలి.
లఘు చిత్ర వైభవం..
నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. సిటీలో మొట్టమొదటి సారిగా ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 21 తేదీ వరకూ కొనసాగనుంది. నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశంతో పాటు స్పెయిన్, ఈజిప్‌్ట, యూకే, యూఎస్ఏ, సౌత్ కొరియా, శ్రీలంక, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ వంటి పలు దేశాల నుంచి 704 చిత్రాలు ఎంట్రీలు రావడం విశేషం. అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మొదటి రోజు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అన్సెసావో, జహాన్ షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 704 ఎంట్రీల నుంచి 60 అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. అన్సెసావో.. 30 నిమిషాల నిడివి గల కొంకణి లఘు చిత్రం ‘అన్సెసావో’.. టొరంటోలో జరిగిన 14వ అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. మంగురీష్ జగదీష్ బండోద్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యం, ఒంటరితనం తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ ప్రయాణాన్ని సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఈ చిత్రానికి నటి ప్రశాంతి తల్పంకర్ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పోరాటం, బలహీనతలతో సతమతమవుతున్న ఒక వృద్ధురాలి భావోద్వేగ లోతును, సంక్లిష్టతను ఆమె తన అద్భుతమైన నటనతో ప్రతిబింబించారు. జహాన్–ది లాస్ట్ గిఫ్ట్.. రాహుల్ శెట్టి దర్శకత్వం వహించిన జహాన్ చిత్రం.. సంయమనంతో కూడిన కథనంతో పాటు ఆకట్టుకునే దృశ్యాలను మిళితం చేసి, వాతావరణ మార్పుల వాస్తవాలను చూపిస్తుంది. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రాన్ని ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రదర్శించారు. ఇది పర్యావరణ బాధ్యత, వాతావరణ అవగాహనపై ప్రాధాన్యతను తెలిపింది. అంతేకాకుండా, ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.ప్యానెల్ చర్చలు.. మాస్టర్‌క్లాసులు.. ఎంపిక చేసిన 60 లఘు చిత్రాల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి లభించనుంది. రెండు రోజుల పాటు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4, 5లలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలిరావు, నాగేశ్ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్ బోర్పుజారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి వస్తున్న కొత్త ప్రతిభను హైలైట్ చేస్తూ..ఒక ప్రత్యేక ఈశాన్య పెవిలియన్ కింద 11 లఘు చిత్రాలు, ప్రేక్షకుల కోసం ఎంపిక చేసిన ఐదు క్లాసిక్ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అదనంగా, భారతీయ సినిమాలో సమకాలీన సమస్యలపై ప్యానెల్ చర్చలు, యువ, ఔత్సాహిక చిత్రనిర్మాతల కోసం ఒక మాస్టర్‌క్లాస్ కూడా ఉంటుంది. టిక్కెట్లు జోమాటో యాప్‌లోని డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా : రకుల్ ప్రీత్ సింగ్
‘ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా.. కానీ నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే.. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది.. ప్రస్తుతం కథలు వింటున్నా.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ సెలబ్రెటీలకు మేకప్ మెన్‌గా చేసిన కడాలి చక్రవర్తి ఆధ్వర్యంలో పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ’ని రకుల్ ప్రారంభించారు. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని తన కోరికని తెలిపారు. తన తొలి చిత్రం నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు అన్ని సినిమాలకూ తనకు మేకప్ చేసిన చక్రి మేకప్ అకాడమీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం కూడా ఆయనే అని అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది. మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే.
అంతర్జాతీయం
ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు న్యాయస్థానం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తోషాఖానా-2 అవినీతి కేసులో విచారణ జరిపిన కోర్టు, శనివారం (డిసెంబర్ 20) వీరికి చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పు ప్రకారం, పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడేళ్ల శిక్షతో పాటు, దంపతులిద్దరికీ చెరో రూ. 10 మిలియన్ల భారీ జరిమానా విధించారు.సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి 2021లో అందిన విలాసవంతమైన బహుమతులను వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. విదేశీ ప్రముఖులు ఇచ్చే విలువైన ఆభరణాలు, విలాసవంతమైన గడియారాలను ప్రభుత్వ నిధికి (తోషాఖానా) అప్పగించకుండా, తక్కువ విలువ చూపించి కొనుగోలు చేశారని ప్రాసిక్యూటర్లు నిరూపించారు. ఆ తర్వాత ఆ వస్తువులను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి, కోట్లాది రూపాయల లాభం పొందారని దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇమ్రాన్ ఖాన్ 2022లో అధికారం కోల్పోయినప్పటి నుండి ఎదుర్కొంటున్న సుమారు 200 పైగా కేసుల్లో ఇది అత్యంత కీలకమైనది. గతంలో తోషాఖానా-1 కేసులో పడిన 14 ఏళ్ల శిక్షకు ఇది అదనం. దీంతో ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి. అయితే ఈ తీర్పులను ఇమ్రాన్ పార్టీ అయిన 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక న్యాయ హత్య అని, రాబోయే ఎన్నికల నుండి ఇమ్రాన్‌ను దూరం చేయడానికి సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.ఈ తాజా తీర్పు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో, ఈ శిక్ష పీటీఐ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తీర్పు నేపధ్యంలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పించేందుకే ఇన్ని కేసులు పెడుతున్నారని ఇమ్రాన్ వాదిస్తుండగా, ఇది అవినీతిపై చట్టం సాధించిన విజయమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు పీటీఐ నేతలు ప్రకటించారు. Pakistan's Dawn reports - "A special court of the Federal Investigation Agency (FIA) on Saturday sentenced PTI founder Imran Khan and his wife Bushra Bibi to 17 years imprisonment in the Toshakhana-2 case. The case pertains to the purchase of an expensive Bulgari jewellery set,… pic.twitter.com/LOtVNMr9pq— ANI (@ANI) December 20, 2025
సిరియా అల్లకల్లోలం.. అమెరికా ప్రతీకార దాడులు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, సిరియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియాలోని (Syria) ఉగ్రస్థావరాలపై అమెరికా (US Strikes on Syria) దళాలు విరుచుకుపడుతున్నాయి. అమెరికన్లపై ఉగ్రదాడికి ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలను టార్గెట్ చేసి అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. కాగా, ఈ నెల 13న సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్‌కు చెందిన ఉగ్రవాది దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడిన విషయం తెలిసిందే. దీనికీ ప్రతిగా సిరియాలోని ఉగ్రమూకలపై అమెరికా భారీగా వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. ఈ సందర్బంగా సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ‘ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్’ను (Operation Hawkeye Strike) ప్రారంభించామని తెలిపారు. ఉగ్రమూకల అరాచకాలకు ధీటుగా జవాబిచ్చామన్నారు.- The U.S. Armed Forces launched Operation Hawkeye Strike, a large-scale retaliatory operation targeting dozens of Islamic State (ISIS) and ISIS-affiliated military sites across northern and central Syria.The strikes were conducted in direct respo...pic.twitter.com/dcxWpkV28p— Ashley Williams (@ashley_wil38239) December 20, 2025ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ దాడులు ఐసిస్ బలమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సమూహాన్ని లక్ష్యంగా చేసుకునే అమెరికా ప్రయత్నానికి పూర్తిగా మద్దతు ఇస్తున్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికన్లపై దాడి చేసే దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఈ దాడి ఓ హెచ్చరిక. మీరు ఏ విధంగా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మీరు దెబ్బతినవలసి వస్తుంది వార్నింగ్ ఇచ్చారు.CENTCOM releases footage from Operation Hawkeye Strike , a massive retaliatory assault on ISIS in Syria.Over 100 precision munitions used by U.S. & Jordanian forces to destroy 70+ ISIS targets across northern & central Syria. pic.twitter.com/xsC15zkqOe— TRIDENT (@TridentxIN) December 20, 2025మరోవైపు, పీట్ హెగ్సెత్ స్పందిస్తూ.. సిరియాలోని ఐసిస్ ఫైటర్లు, ఆయుధాగారాలు, మౌళికవసతులను నాశనం చేసేందుకు అమెరికా దళాలు ఆపరేషన్ హాక్ఐ స్ట్రైక్ ప్రారంభించాయని తెలిపారు. అయితే, ఇది యుద్ధానికి ప్రారంభం కాదు. ప్రతీకారం మాత్రమే అని చెప్పుకొచ్చారు. గత శనివారం (డిసెంబర్ 13న) పాల్మైరాలో అమెరికా దళాలపై జరిపిన దాడికి ప్రతిగా దీనిని చేపట్టామన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ప్రజలను రక్షించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయం అని చెప్పారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికా మిమ్మల్ని వేటాడి, కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. U.S. forces deliver decisive retaliation against ISIS in Syria following the attack that claimed the lives of two American soldiers. Operation Hawkeye Strike is underway, A-10 Warthogs, Apache helicopters, and other assets launching into the night to dismantle ISIS targets.… pic.twitter.com/ouxNAl6cfp— Freyja (@FreyjaTarte) December 20, 2025
తైవాన్‌లో దారుణం.. మెట్రో వద్ద విచక్షణారహిత దాడి
తైపీ: తైవాన్ రాజధాని తైపీలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి జనంపై కత్తి, పొగ గ్రనేడ్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. తర్వాత నిందితుడు ఓ భవనం ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడిని 27 ఏళ్ల చాంగ్ వెన్గా గుర్తించారు.ఈ సందర్భంగా తైవాన్ ప్రీమియర్ చో జంగ్-తాయ్ మాట్లాడుతూ.. రాజధాని తైపీలోని మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు చాంగ్ వెన్కు నేర చరిత్ర ఉంది. అతడిపై వారెంట్లు కూడా ఉన్నాయి. అతను ఉద్దేశపూర్వకంగా స్మోక్ బాంబులను విసిరి.. ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేశాడు. ఇందుకోసం పొడవైన కత్తిని ప్రయోగించినట్లు కనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. BREAKING: 3 killed, 5 injured as knife attacker goes on rampage in central Taipei, Taiwan after setting off smoke bombs at main train station — Reuters pic.twitter.com/04zgmAZs8T— Rapid Report (@RapidReport2025) December 19, 2025
ఉక్రెయిన్‌పై పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్‌లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించాయని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పైకి దండెత్తి దాదాపు నాలుగేళ్లవుతున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఆయన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సైతం నేరుగా లైవ్‌లో సమాధానాలిచ్చారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న వేళ పుతిన్ ఏం మాట్లాడుతారా అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆరంభంలో పెద్ద ఎత్తున దండెత్తి వచ్చిన రష్యా బలగాలను చాలా చిన్నదైన ఉక్రెయిన్ ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టగలిగినప్పటికీ, రాన్రానూ అత్యంత భారీ రష్యా ఆర్మీ, అధునాతన ఆయుధ సంపత్తి ముందు తలొంచక తప్పలేదు. రష్యా బలగాలు యుద్ధ క్షేత్రంలో మెరుపు వేగంతో చొచ్చుకుపోలేకున్నా, క్రమంగా పైచేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘మా బలగాలు యుద్ధక్షేత్రమంతటా ముందుకు వెళ్తున్నాయి. ఒక్కో చోట వేగంగా, మరోచోట నెమ్మదిగా వెళ్తున్నాయి. మొత్తమ్మీద శత్రువు వెనక్కి మరలుతున్నాడు’అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేందుకు శాంతియుతమైన ఒప్పందం కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి, ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పుబట్టారు. దీనిని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. యూరోజోన్పై వ్యాపార, పారిశ్రామికవేత్తలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక అవసరాల కోసం వడ్డీలేని రుణాన్ని అందించడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు అంగీకరించారు. 2026–27 సంవత్సరానికి ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం చేసేందుకు ఈయూ కట్టుబడి ఉందని కౌన్సిల్ అధ్మయక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో వెల్లడించారు. ఈ ఒప్పందానికి రావడానికి ఈయూ నాయకులు తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఈయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం ముందున్న బడ్జెట్ లోటును ఇది పూడుస్తుందని, తమ దేశ రక్షణను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
జాతీయం
అరుదైన అంతరిక్ష అతిథి
అదో అరుదైన అంతరిక్ష అతిథి. ఇంకా చెప్పాలంటే మన సౌర మండలంలోకి దూసుకొచ్చిన చొరబాటుదారు. అదే... 3ఐ/అట్లాస్‌గా పిలుస్తున్న తోకచుక్క! అది అనంత విశ్వంలో సుదీర్ఘయానం చేసి మరీ మన చెంతకు వచ్చింది. ఆ క్రమంలో భూమికి నష్టమేమైనా చేస్తుందేమోనని సైంటిస్టులు కలవరపడ్డా, అలాంటిదేమీ లేకుండానే తన మార్గాన తిరిగి సుదూర విశ్వంలోకి వెళ్లిపోతోంది! దాంతో అంతా హమ్మయ్యా అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు...! మతి పోగొడుతున్న ఫొటోలు 3ఐ/అట్లాస్ శుక్రవారం రాత్రి, అంటే డిసెంబర్ 19న భూమికి సైంటిస్టులు ముందుగా వేసిన అంచనా కంటే కూడా అతి సమీపానికి వచ్చింది. 1.8 ఆస్ట్రనామికల్ యూనిట్ల (27 కోట్ల కిలోమీటర్లు) సమీపానికి అని వారు భావించగా, అది ఏకంగా 1.4 ఆస్ట్రనామికల్ యూనిట్ల (20 కోట్ల కి. మీ.) సమీపానికి వచ్చేసింది. ఆ సందర్భంగా ఉటా అబ్జర్వేటరీ తీసిన ఫొటో అందరినీ అలరిస్తోందిప్పుడు. అందులో 3ఐ/అట్లాస్ రెండు తోకలతో వింత హొయలు పోతూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లియో నక్షత్ర మండలంలోని తారలు తళుక్కుమంటూ కనువిందు చేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
గుడ్డు సురక్షితమే!
న్యూఢిల్లీ: గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందంటూ వ్యాప్తిలో ఉన్న వదంతులను భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఖండించింది. అవన్నీ ప్రజల్లో అనవసరంగా భయాందోళనలను రేకెత్తించే తప్పుదోవ పట్టించే, శాస్త్రీయంగా నిరూపితం కాని వార్తలని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో లభ్యతలో ఉన్న గుడ్లు మానవ వినియోగానికి సురక్షితమైనవని తేల్చి చెప్పింది. గుడ్లలో ప్రమాదకరమైన రసాయనాలున్నాయంటూ వస్తున్న పుకార్లకు ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని తెలిపింది. భారత్‌లో విక్రయించే గుడ్లలో క్యాన్సర్‌ను కలిగించే నైట్రోఫురాన్ మెటబోలైట్స్(ఏవోజెడ్) ఉన్నాయంటూ మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఇటీవల వస్తున్న కథనాల నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఆహార భద్రత, ప్రమాణాల (కలుషితాలు, విషపదార్థాలు, అవశేషాలు) నిబంధనలు–2011 ప్రకారం కోళ్ల పెంపకంతోపాటు గుడ్ల ఉత్పత్తి అన్ని దశల్లోనూ నైట్రోఫ్యూరాన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని పేర్కొంది. ఒకవేళ అనుమతించిన దానికంటే తక్కువ స్థాయిలో స్వల్ప అవశేషాలు బయటపడినా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందకు రాదు, అలాగే దీనివల్ల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని ప్రకటించింది. మన దేశంలో నియంత్రణలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయని కూడా తెలిపింది. ఎక్కడో ఏవో కొన్ని ప్రయోగశాలల్లో వెలువడిన ఫలితాలను సాధారణీకరిస్తూ, గుడ్లు సురక్షితం కాదని ముద్ర వేయడం శాస్త్రీయంగా సరికాదని కూడా స్పష్టం చేసింది.
మహా జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తాం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పార్టీ అవినీతి, బంధుప్రీతి కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. ఇక్కడ మహా జంగిల్‌రాజ్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో ఆటవిక రాజ్యం ఉండేదని, సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, అదే ఫలితం బెంగాల్లోనూ పునరావృతం కాబోతోందని తేల్చిచెప్పారు. బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ‘పరివర్తన్ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. బెంగాల్ కోటపై జెండా ఎగురవేయబోతున్నామని స్పష్టంచేశారు. మహా జంగిల్‌రాజ్‌ను కచ్చితంగా అంతం చేస్తామని తేల్చిచెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో బెంగాల్లో బీజేపీ విజయానికి ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ ‘‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను, బీజేపీని ఎంతగా వ్యతిరేకించినా మాకు అభ్యంతరం లేదు. కానీ, ప్రజలను ఎందుకు వేధిస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. అవినీతి, బంధుపీత్రి, బుజ్జగింపు రాజకీయాల వల్ల ఇక్కడ ప్రగతి ఆగిపోయింది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. కట్ మనీ, కమీషన్ల సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. బెంగాల్ నిజంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే బీజేపీని గెలిపించాలి. మాకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం. తృణమూల్ కాంగ్రెస్ అకృత్యాల నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ అనే నినాదం రాష్ట్రంలో మార్మోగిపోతోంది. అందుకే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారు చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం సిగ్గుచేటు. వారిని కాపాడేందుకే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారిని గుర్తిస్తే వచ్చే నష్టమేంటో చెప్పాలి. బంగ్లాదేశ్‌లో మతపరంగా వేధింపులకు గురై మన దేశంలోకి వచ్చినవారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వాలని సంకల్పించాం. దానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బాధితులను బెదిరించాలని చూస్తోంది’’ అని మోదీ విమర్శించారు. తాహెర్‌పూర్‌లో ప్రధాని మోదీకి బదులుగా బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు రూ.3,200 కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు. పొగమంచు వల్ల హెలికాప్టర్ యూటర్న్ భారీ పొగమంచు కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మోదీ హెలికాప్టర్లో కోల్‌కతా నుంచి తాహెర్‌పూర్ చేరుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌పై దిగాల్సి ఉండగా, పొగమంచు వల్ల అది సాధ్యం కాలేదు. దాంతో చేసేది లేక హెలికాప్టర్‌ను మళ్లీ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. మోదీ కోల్‌కతా నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు. మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి తాహెర్‌పూర్‌లో సభ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మోదీ ప్రసంగించే సభకు వెళ్తుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సీల్డా–కృష్ణానగర్ సెక్షన్‌లోని తాహెర్‌పూర్, బడ్కుల్లా రైల్వేస్టేషన్ల మధ్య పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపా రు. కార్యకర్తల మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ తప్పులను సరిచేస్తున్నాం.. గౌహతి ఎయిర్‌పోర్టులో నూతన టెరి్మనల్ ప్రారంభించిన మోదీ గౌహతి: అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలపాటు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీ ఎజెండాలో ఈశాన్య రాష్ట్రాలు ఏనాడూ లేవని ఆక్షేపించారు. కాంగ్రెస్ తప్పులను బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆయన శనివారం అస్సాంలో పర్యటించారు. రాజధాని గౌహతిలో అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలోయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత లోకప్రియ గోపీనాథ్ బార్దోలోయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ.4,000 కోట్లతో నిర్మించిన నూతన టెరి్మనల్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అస్సాం అటవీ భూములను ఆక్రమించుకొని రాష్ట్ర గుర్తింపునకు ముప్పుగా మారిన చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడిందని ఆరోపించారు. చొరబాటుదారులను గుర్తించడానికి ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే దీని అక్ష్యమన్నారు. కొందరు దేశ ద్రోహులు ఇప్పటికీ చొరబాటుదారులను కాపాడేందుకు ఆరాటపడుతున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అస్సాంను గతంలో తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)లో విలీనం చేయడానికి కుట్రలు జరిగాయని, కాంగ్రెస్ కూడా ఇందులో భాగస్వామి అని ధ్వజమెత్తారు. ఆ కుట్రను గోపీనాథ్ బార్డోలోయి విజయవంతంగా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అస్సాం రాష్ట్రం భారతదేశం నుంచి విడిపోకుండా కాపాడారని కొనియాడారు. ఇండియాకు, ఆసియాన్ దేశాలకు మధ్య అస్సాం అనుసంధానంగా మారిందన్నారు. కీలక రంగాల్లో దేశ అభివృద్ధికి అస్సాం ఒక ఇంజిన్‌గా పనిచేస్తోందని ప్రశంసించారు. గౌహతిలో మెగా రోడ్ షో గౌహతిలో మోదీ శనివారం సాయంత్రం 3.8 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రహదారికి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీజీ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ జనం నినదించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద రోడ్ షో ముగిసింది. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బలాన్ని చాటేలా ఈ రోడ్ షో జరిగింది. బీజేపీ నాయకులతో భేటీ ప్రధాని మోదీ అస్సాం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
యాప్స్‌తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేధోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అపైŠల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్‌తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్‌ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్‌ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్‌లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్‌లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్‌పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్‌తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సర్వీస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్‌ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రాకతో.. » ఫుడ్ యాప్స్‌తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు. » నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు » కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు. » 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు..» భారత్‌లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. » రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. » ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. » మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది.
ఎన్ఆర్ఐ
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్‌పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్‌లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్‌పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన)
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
క్రైమ్
సిరిసిల్ల: పాడె పైనుంచి పోస్ట్‌మార్టం హాల్‌కి..
సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్‌లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కొడుకులు కాదు.. దుర్మార్గులు
ఆ పెద్దాయన్ని పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. హమ్మయ్యా.. అనుకుంటున్న టైంలో వారం వ్యవధిలోనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈసారి ఆస్పత్రికి వెళ్లడం బాగా ఆలస్యమై ప్రాణం పోయింది. అయితే కొడుకుల దొంగ చూపులు.. పొంతన లేని సమాధానాలు.. వాళ్ల కాల్ డాటా.. తండ్రి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పడ్డ తాపత్రయం.. ఇది పక్కా స్కెచ్చేసి చేసిన హత్య అని బయటపెట్టాయి. తండ్రికి రూ.3 కోట్ల దాకా బీమా చేయించి.. ఆపై పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. రకరకాల వ్యాపారాలు చేసి.. అప్పుల పాలైన ఇద్దరు తనయులు తమ స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. ఒకసారి స్థానికులు తండ్రిని రక్షించగా.. మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్లాన్‌ను అమలు పరిచారు ఈ దుర్మార్గులు. ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పొదటూర్పేట్ గ్రామానికి చెందిన ఈపీ గణేశన్(56).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన పాము కాటుతో ఇంట్లోనే ఆయన చనిపోయారు. అయితే.. వారం తిరగకుండానే కుటుంబం ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో ఆ కంపెనీ వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరవేయడం.. వాళ్లు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. గణేష్ కొడుకు మోహన్‌రాజ్(26), హరిహరన్(27) ప్రైవేట్ ఉద్యోగులు. అయితే ఆన్లైన్ బెట్టింగ్‌లు, ఇతర విలాసాల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఇన్సూరెన్స్‌లు చేయించి హతమార్చాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు. దీనికి నలుగురు స్నేహితుల సాయం కోరారు. అక్టోబర్ 15వ తేదీన ఒక పామును గణేశన్ మీదకు వదిలారు. అది కాలి మీద కాటేయడంతో.. ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి రక్షించారు. వారం తర్వాత ఈసారి మరింత విషపూరితమైన పామును తెచ్చి మెడ మీద కాటు వేయించారు. ఈసారి ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తలుపులు వేసి ఉండిపోయారు. ఆపై చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పాము పగ బట్టి చంపిందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే.. వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకులు క్లెయిమ్‌కు దిగడంతో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది. ఏజెంట్‌తో దర్యాప్తు చేయించే క్రమంలో వరుసగా పాము కాటుకు గురికావడం, ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం లాంటి విషయాలు తెలిశాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డిసెంబర్ 6వ తేదీన నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ ఇద్దరు కొడుకుల ఫోన్ కాల్స్ రికార్డింగులు.. ఆర్థిక లావాదేవీల ఆధారంగా తండ్రిని పాము కాటుతో హత్య చేయించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితులిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది.
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వీడియోలు
ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
కోతుల కోసం చింపాంజీ ఐడియా
3 కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్

