#HBDYSJagan: సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి | Ys Jagan Birthday Celebrations 2025 Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

#HBDYSJagan: సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

  • వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌
  • బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ అబ్దల్‌ నజీర్‌, చంద్రబాబు, కేసీఆర్‌, పవన్‌, షర్మిళ,  భట్టిలకు వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు
  •  తనకు బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పడంపై వైఎస్‌ జగన్‌ హర్షం
2025-12-21 21:17:54

మీ ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయా: వైఎస్‌ జగన్‌

  • పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ  వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు
  • నాపై వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు  చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయా
  • వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు
  • మీ అందరి మద్దతే  నా బలం
2025-12-21 18:48:22

రాజంపేట మండలం ఎల్లాగడ్డలో..

అన్నమయ్య జిల్లా:

  • రాజంపేట మండలం ఎల్లాగడ్డలో వైఎస్‌ జగన్‌  పుట్టినరోజు వేడుకలు
  • ఎల్లాగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేకు కట్ చేసిన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి...
  • అనంతరం మైనారిటీల తరపున జగనన్నకు బర్త్‌డే విషెస్‌ తెలిపిన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి
  • పేదల పెన్నిధి ముస్లిం మైనార్టీల పక్షపాతి వైఎస్ జగన్‌ 10 కాలాలపాటు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి...
     
2025-12-21 18:32:26

వి.కోటలో ఘనంగా వైఎస్‌ జగన్ పుట్టినరోజు వేడుకలు

చిత్తూరు జిల్లా: 

  • వి.కోటలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
  • జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
  • అధిక సంఖ్యలో రక్తదానం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి పిఎన్ నాగరాజు
     
2025-12-21 18:29:58

వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా సింహాద్రి అప్పన్నకు భారీ కానుక

విశాఖపట్నం:

  • వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా సింహాద్రి అప్పన్నకు భారీ కానుక.
  • రూ. 70 లక్షలు విలువ చేసే పగడాల హారాన్ని స్వామి వారికి సమర్పించిన భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు.
  • వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు.
  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా సింహాచలం దేవస్థానంలో వరహా లక్ష్మీ నరసింహ స్వామివారికి 381 గ్రాముల బంగారంతో తయారు చేసిన పగడాల హారంను కుటుంబ సమేతంగా సమర్పించిన వైఎస్ఆర్సీపీ భీమిలీ నియోజక వర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు.
2025-12-21 17:04:06

రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలి: బొత్స

విజయనగరం జిల్లా  

గరివిడి వైసీపీ కార్యాలయంలో ఘనం గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

  • కేక్ కట్ చేసిన రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లం చంద్రశేఖర్, పార్లమెంట్ పరిశీలికులు కిల్లి సత్యనారాయణ.
  • మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

    బహిరంగ సభలో బొత్స కామెంట్స్
  • రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలి.
  • జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టేందుకు దేవుడు మరింత ఆశీస్సులు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
  • రాష్ట్రంలో మహాత్మా గాంధీ ఉపాధి పథకంపై కేంద్రం కుట్ర చేస్తుంది.
  • పేద ప్రజలు గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడతారు.
  • మహాత్మా గాంధీ ఉపాధి పథకంలో కుట్రలో చంద్రబాబుకు భాగం ఉంది.
  • పేద ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
  • మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పై కుట్ర జరిగితే కేంద్ర ప్రభుత్వాన్నిచంద్రబాబు ఎందుకు ప్రశ్నించరు.
  • రాష్ట్రంలో పాలన గాడి తప్పింది.
  • రెండు మూడు చానల్ హడావిడి తప్ప పాలన లేదు.
2025-12-21 16:54:40

వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు రూ.5000 సాయం

ఏలూరు జిల్లా

  • ద్వారకా తిరుమల మండలం జాజులగుంట గ్రామంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు.

  • పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఉన్న 10 నిరుపేద కుటుంబాలకు రూ.5000 చొప్పున అందజేసిన మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత .

  • పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు.

2025-12-21 16:33:21

ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

కాకినాడ జిల్లా
 

  • జగ్గంపేటలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.
  • పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళలకు చీరల పంపిణీ, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.
2025-12-21 16:28:43

పార్వతీపురం మన్యం జిల్లా

  • పాలకొండలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి.

  • అభిమానులు, కార్యకర్తలు నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు.

  • రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలను అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేత.

  • సాలూరు పట్టణం బోసు బొమ్మ జంక్షన్ వద్ద మాజీ మంత్రి పి రాజన్న దొర ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

  • కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన అభిమానులు కార్యకర్తలు

2025-12-21 16:28:43

ఢిల్లీలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

న్యూఢిల్లీ

  • ఢిల్లీలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.
  • జై జగన్ నినాదాలు చేసిన కార్యకర్తలు.
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ నేతలు, అభిమానులు. 

    వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి కామెంట్స్‌

  • విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్.
  • సంక్షేమ పాలనతో ప్రజలకు అద్భుతమైన పాలన అందించారు.
2025-12-21 16:05:03

అంగరంగ వైభవంగా వైఎస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

చిత్తూరు జిల్లా

  • గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త  కృపాలక్ష్మి.

  • జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మహిళలు,యువకులు.

2025-12-21 16:02:38

మధిరలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

ఖమ్మం జిల్లా

  • మధిరలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.

  • బబ్లు ఆధ్వర్యంలో వృద్ధాశ్రయాల్లో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ.

  • అనంతరం అన్నదానం నిర్వహించిన జగన్ అభిమానులు.

2025-12-21 15:59:06

నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి జగన్

విజయవాడ

  • పశ్చిమ నియోజకవర్గంలో 46 వ డివిజన్ లంబాడీ పేట గాంధీ బొమ్మ సెంటర్ లో ఘనంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.
  • కేక్ కట్ చేసి ఫ్రూట్స్‌  పంచిపెట్టిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు .
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికార ప్రతినిధి బండి పుణ్యశీల, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు.
  • మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్
  • వైసీపీ అధినేత మా జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.
  • తెలుగు ప్రజలు ఎక్కడున్నా జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజును పండగ వేడుకలాగా చేసుకుంటారు.
  • పశ్చిమ నియోజకవర్గంలో పటివాడలో కూడా బట్టల పంపిణీ ఫ్రూట్ పంపిణీ రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరూ పండగ క్రిస్మస్ సంక్రాంతి ముందుగానే వచ్చేశాయి.
  • నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి జగన్.
  • కుటమీ ప్రభుత్వం వచ్చి 18 నెలల అయినా పథకాలు అమలు చేయడంలో విఫలం అయ్యారు.
  • ప్రతి కుటుంబానికి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్.
  • ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు జగనన్న.
2025-12-21 15:55:19

ప్రజలంతా జగన్ పుట్టినరోజు వేడుకలను ఒక పండుగల జరుపుకుంటున్నారు

ఎన్టీఆర్ జిల్లా

  • మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
  • మైలవరం ఎల్ హెచ్ ఆర్ కాంప్లెక్స్ వద్ద  కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన మాజీమంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌.
  • ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ  

జోగి రాజీవ్ కామెంట్

  • పేద ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.
  • వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలంతా జగన్ వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
  • రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వం.
  • పేద ప్రజల బాగుకోసం జగన్‌ని మళ్ళీ సీఎం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
  • ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం.
  • పథకాలను అమలు చేసి మోసపోయిన నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ఏపీ ప్రజలంతా జగన్ పుట్టినరోజు వేడుకలను ఒక పండుగలా జరుపుకుంటున్నారు.
2025-12-21 15:48:05

పండుగ వాతావరణంలో వైఎస్ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు

తిరుపతి జిల్లా

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు.
  • రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని అక్షయ క్షేత్రంలో మానసిక వికలాంగుల నడుమ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి.
2025-12-21 15:39:04

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా

  • జగ్గయ్యపేటలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న) ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

  • అయ్యప్ప స్వామి, శ్రీకృష్ణుడి దేవాలయాల్లో భారీ అన్నదాన కార్యక్రమం.

  • ఇంటూరి కామెంట్స్...

  • మరలా జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బడుగు ,బలహీన వర్గాల వారు ఆకాంక్షిస్తున్నారు.

  • ఆ దేవుని దయవల్ల మరల ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న  ప్రభుత్వం ఏర్పడాలి.

  • పేద బడుగు వర్గాలలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పాలన చేసిన జగన్‌మోహన్ రెడ్డి దేవుడిగా నిలిచాడు.

  • బస్టాండ్ ఎదుట వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు.
  • కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు రాష్ట్ర కార్యదర్శి ఇంటూరీ రాజగోపాల్ (చిన్న), నాయకులు, కార్యకర్తలు.
2025-12-21 14:51:28

వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ఆదివారం జగన్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు. 
  • ఈ సందర్భంగా జగన్ పూర్తి ఆరోగ్యంతో, నిండు నూరేళ్లు ప్రజా సేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. 
  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు జగన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
2025-12-21 14:48:19

వైఎస్ జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి

బెంగళూరు

  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
  • బెంగళూరు నివాసంలో వైఎస్ జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి.
2025-12-21 14:45:13

వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పంటపొలాల్లో కేక్ కట్ చేసిన మహిళా రైతులు

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పంటపొలాల్లో కేక్ కట్ చేసిన మహిళా రైతులు.

  • పనిలో ఉన్న మహిళా రైతులు వైఎస్ జగన్‌పై ప్రేమతో వారి విరామం సమయంలో పంటపొలాల్లో కేక్ కట్ చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

2025-12-21 14:41:17

తెనాలిలో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ

గుంటూరు

  • తెనాలి నియోజవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ, పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ, వృద్ధాశ్రమంలో అన్నదాన,రక్త దాన కార్యక్రమాలను నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని.శివకుమార్.

  • పెద కాకాని సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి  అనంతరం  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం, క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాలను ప్రారంభించిన నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ.

  • వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా BC హాస్టల్ నందు 30 మంది విద్యార్థులకు పరుపులు ,నోట్ బుక్స్ ,పెన్నులు, స్కేలు, రబ్బర్లు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన వరి కూటి అశోక్ బాబు.

  • రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్  జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ హస్పటల్ లో రోగులకు పళ్ళు పంప్పిణి. కేక్ కటింగ్. 50 మంది రక్త దానం. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన రేపల్లే నియోజకవర్గ సమన్వయకర్త ఈవూరి గణేష్.

2025-12-21 14:34:06

జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పిల్లలు

కృష్ణాజిల్లా

  • వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరులోని సెయింట్ లుకాస్ అనాధ పిల్లల ఆశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. 
  • పిల్లలకు నిత్యవసర వస్తువులు అందజేసిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి. ప్రణీత్ కుమార్.
  • పిల్లలతో కలిసి భోజనం చేసిన ప్రణీత్ కుమార్.
  • జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పిల్లలు.
  • రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.ప్రణీత్ కుమార్ కామెంట్స్
  • పిల్లలతో కలిసి జగనన్న  పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉంది.
  • అన్ని గ్రామాల్లో పండగల పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి.
  • ఆంధ్రలోనే కాకుండా, తెలంగాణలో,కర్ణాటకలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు
  • జగనన్న సీఎం అయితే ప్రజలకు  ప్రతిరోజు పండగే.
2025-12-21 14:21:20

వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, గవర్నర్‌ అబ్దుల్ నజీర్

  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఆయన జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు, రాష్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.
2025-12-21 14:15:02

పార్వతీపురం మన్యం జిల్లా

  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చినమేరంగిలో కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్ రాజు.
2025-12-21 14:08:52

కోనసీమ జిల్లాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

  • కోనసీమ జిల్లాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
  • కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే చర్ల జగ్గయ్య ఆధ్వర్యంలో బాలింతలకు ఉయ్యాలలు పంపిణీ
  • యూరియా కొరత ప్రభుత్వానికి తెలియజేయాలని ఆలోచనతో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేసిన చిర్ల జగ్గిరెడ్డి
  • కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నాయకులు 
2025-12-21 14:07:08

రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు

  • కర్నూలు ఎస్బిఐ సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు. ‌

  • అనంతరం రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన ఎస్వీ మోహన్ రెడ్డి.

  • పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.

2025-12-21 13:52:04

గుంటూరు

  • గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

  •  పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా.

  • ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ.

  • నరసరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ లో మెగా వైద్య శిబిరం. 

  • ప్రభుత్వ వైద్యశాలలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ. మెగా రక్తదాన శిబిరం. అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం  చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

    బాపట్ల జిల్లా

  • బాపట్ల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ ఉప సభాపతి కోన రఘుపతి. బాపట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రక్తదానం, బాపట్ల ఏరియా వైద్యశాల నందు పండ్లు పంపకం, బాపట్ల పలు చోట్ల కేక్ కట్ చేసిన కోన రఘుపతి.

  • మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు.

  • అమరావతి గంటలమ్మ చెట్టు వద్ద మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.

  • సత్తనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి.

2025-12-21 13:52:04

దేశంలో ఉన్న మాస్ లీడర్‌లలో వైఎస్ జగన్ ఒకరు

గుంటూరు

  • గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.
  • కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి

    అంబటి రాంబాబు కామెంట్స్..
     
  • మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 53వ జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
  • తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ జగన్ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి.

  • జగన్ జన్మదినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం.

  • రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

  • ప్రతి ఏడాది జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసే వారి సంఖ్య పెరుగుతుంది.

  • రక్తదానం ప్రాణదానంతో సమానం.

  • దేశంలో ఉన్న మాస్ లీడర్‌లలో వైఎస్ జగన్ ఒకరు.

2025-12-21 13:35:38

నగరి నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు

చిత్తూరు జిల్లా

  • నగరి నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు.

  • నగరి ఓం శక్తి ఆలయం వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన భూమన కరుణాకరరెడ్డి, ఆర్ కే రోజా.

  • ఓం శక్తి ఆలయం వద్ద నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ.

  • ర్యాలీలో పాల్గొన్న తిరుపతి,చిత్తూరు జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి,మాజీ మంత్రి ఆర్ కే రోజా,నగరి నియోజకవర్గం పరిశీలకుడు రాహుల్ రాజా రెడ్డి.

2025-12-21 13:27:22

వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ఎంపీ అవినాష్

వైఎస్ఆర్ జిల్లా

  • మైదుకూరు నియోజకవర్గంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు.
  • ఖాజీపేటలో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి.

రక్తదాన శిబిరాన్ని పరిశీలించిన ఎంపీ అవినాష్ రెడ్డి

  • జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి.
  • 53 కేజీల భారీ కేక్ ను కట్  చేసి జగన్ మోహనరెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎం.పీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి.
2025-12-21 13:22:46

కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఆదిమూలపు సురేష్

ప్రకాశం

  • కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు.

  • కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్.

  • జగన్ జన్మదిన సంధర్బంగా సింగరాయకొండలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.

2025-12-21 13:11:24

ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి మన్ననలు పొందిన ఏకైక సీఎం వైఎస్ జగన్

కృష్ణాజిల్లా

  • మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.

  • అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.

  • ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసిన సింహాద్రి రమేష్ బాబు.

  • పేద ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి మన్ననలు పొందిన ఏకైక సీఎం వైఎస్ జగన్: మాజీ ఎమ్మెల్యే సింహాద్రి.

  • నేడు రాష్ట్ర ప్రజలంతా జగన్ వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.

  • పేద ప్రజల బాగుకోసం జగన్‌ను మళ్ళీ సీఎం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.

  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏపీ ప్రజలంతా జగన్ పుట్టినరోజు జగన్ వేడుకలు జరుపుకుంటున్నారు.

2025-12-21 13:06:30

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి

అనంతపురం

  • వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా నార్పలలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి శైలజానాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

  • రాయదుర్గంలో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి.

శ్రీ సత్యసాయి జిల్లా

  • హిందూపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దీపిక

2025-12-21 13:01:16

కడపలో ఘనంగా వైఎస్ జగన జన్మదిన వేడుకలు

వైఎస్సార్ జిల్లా

  • కడప నగరంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

  • ఉదయం 8 గంటల నుంచి మొదలైన జన్మదిన వేడుకలు

  • పేదలందరికి అన్న దానం వస్త్ర దానం, ఫ్రూప్ట్స్ పంపిణి వివిధ నాయకులు చేసారు.

  • పట్టణమంటా విరివిగా పాల్గొన్న ప్రజలు.

  • పట్టణంఅంత పండగ వాతావరణం నెలకొంది.

  • జిల్లా పార్టీ కార్యాలయంలో 100కేజీల కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • యువకులతో బైక్ ర్యాలీ చేయడం మరో విశేషం.

  • మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, యమ్ యల్ సి  రామచంద్రా రెడ్డి, మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ బండి నిత్యనంద రెడ్డి పలువురు పాల్గొన్నారు.

2025-12-21 12:52:39

ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

ప్రకాశం జిల్లా

  • ఒంగోలు వైస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు.
  • కేక్ కట్ చేసి సంబరాలు, పార్టీ కార్యాలయంలో రక్తదానం చేసిన కార్యకర్తలు.
  • పాల్గొన్న జడ్పి చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ  ఒంగోలు పార్టీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు, పరిశీలకులు   బత్తుల బ్రహ్మనందరెడ్డి.
2025-12-21 12:48:37

పశ్చిమగోదావరి జిల్లా

  • తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ (ఆక్వాకల్చర్) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు.

  • పెంటపాడు వరకు పెద్దఎత్తున బైక్, కార్లతో ర్యాలీ చేపట్టిన వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు.

  • పెంటపాడు వెలమ పేటలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వడ్డి రఘురామ్ నాయుడు.

2025-12-21 12:48:37

పశ్చిమగోదావరి జిల్లా

  • తాడేపల్లిగూడెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు.

  • మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు.

2025-12-21 12:48:37

జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

ఏలూరు జిల్లా

  • జంగారెడ్డిగూడెంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

  • వేడుకలలో పాల్గొన్న చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ అధ్యక్షుడు బివిఆర్ చౌదరి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి

  • రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్న కార్యకర్తలు

  • రక్తదాన శిబిరంలో రక్త దానం చేసిన వైసీపీ కార్యకర్తలు, ఆస్పత్రిలో రోగులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ

2025-12-21 12:42:29

విజయనగరం  జిల్లా

  • శృంగవరపుకోట దేవి జంక్షన్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ జన్మదినోత్సవ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్
  • అనంతరం మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు
  • కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శోభాహైమావతి జి సి సి మాజీ ఛైర్మన్ శోభా స్వాతీరాణి
2025-12-21 12:42:29

జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిచిపోయాయి

చిత్తూరు జిల్లా

  • పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డు వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ.

  • భారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ కామెంట్స్

  • రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  • జగన్ ఇచ్చిన పథకాలను నేటికీ ఈ కూటమి ప్రభుత్వం పేర్లు మార్చి అందిస్తోంది.

  • జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిచిపోయాయి అనేదానికి ఇదే నిదర్శనం.

  • జగనన్న సంక్షేమ పథకాలు, సంక్షేమ పాలన ప్రతి ఇంటికీ అందించారు.

2025-12-21 12:23:54

ఉయ్యూరులో ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

  • కృష్ణా జిల్లా: కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి
  • భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు
  • వైఎస్‌ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నియోజవర్గం ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నాయకులు
  • డిసెంబర్ 21 తేదీ వైఎస్సార్‌సీపీ కుటుంబానికి పండుగ దినం: దేవభక్తుని
  • నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి జగన్
  • అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్
  • ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు జగనన్న
  • నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవించాలి
2025-12-21 12:09:13

కూటమి ప్రభుత్వం రాక్షస పాలన: మ్మెల్యే ఆకేపాటి

అన్నమయ్య జిల్లా

  • రాజంపేట నియోజకవర్గం నందలూరులో ఘనంగా వైఎస్ జగన్‌ జన్మదిన వేడుకలు

  • జగన్ బర్త్ డే సందర్భంగా నందలూరులో కేకు కట్ చేసిన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి.

  • వైఎస్ జగన్ జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు బెడ్ షీట్లు పంపిణీ

  • జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేసి కూటమి ప్రభుత్వం రాక్షస పాలన

  • పేదలకు సంక్షేమ పాలన కొనసాగించినప్పుడే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.

2025-12-21 11:47:11

క్యాంబెల్ హాస్పిటల్‌లో పేషెంట్లకు బెడ్లు, పండ్లు పంపిణీ

వైఎస్ఆర్ జిల్లా

  • ఘనంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్ జన్మదిన వేడుకలు.
  • జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో కేక్ కట్‌ చేసిన నేతలు
  • జగన్ జన్మించిన క్యాంబెల్ హాస్పిటల్ లో పేషెంట్లకు బెడ్లు, పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, నేతలు
  • నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ వైఎస్‌ జగన్ జన్మదిన వేడుకలు.
2025-12-21 11:39:08

వాడవాడలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

అనకాపల్లి

  • పాయకకరవుపేట నియోజకవర్గంలో వాడవాడలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.

  • కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు.

2025-12-21 11:39:08

బందరుకు మెడికల్ కాలేజీ తెచ్చింది జగన్: పేర్ని కృష్ణమూర్తి

కృష్ణాజిల్లా

  • మచిలీపట్నం వైసీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
  • పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలసి పాల్గొన్న మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
  • కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పేర్ని కృష్ణమూర్తి, కార్యకర్తలు.
  • బందరుకు మంచి చేసిన నాయకుడు జగన్.

    మా పోర్టు కల నెరవేర్చింది జగన్ : పేర్ని కృష్ణమూర్తి

  • బందరుకు మెడికల్ కాలేజీ తెచ్చింది జగన్.
  • మత్స్యకారులకు బందరు నుంచి మంత్రి ఉన్నప్పటికీ ఏనాడూ మత్స్యకారుల గురించి పట్టించుకోలేదు.
  • మత్స్యకారుల కష్టాన్ని చూసి వారి కోసం జగన్ హార్బర్ ఏర్పాటు చేశారు.
  • జగన్ మళ్లీ వస్తేనే తమ జీవితాలు బాగుపడతాయని జనం కోరుకుంటున్నారు.
  • జగన్‌కు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాం.
2025-12-21 11:24:40

మార్గాని భరత్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన కార్యకర్తలు

తూర్పుగోదావరి జిల్లా
 

  • రాజమండ్రిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
  • మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన కార్యకర్తలు
  • పలుచోట్ల చీరలు దుప్పట్లు పంపిణీ
  • 2029 లో కచ్చితంగా వైఎస్ జగన్ విజయం సాధించి రాష్ట్రంలో మరోసారి సుపరిపాలన అందిస్తారన్న మాజీ ఎంపీ మార్గాన్ని భరత్
2025-12-21 11:19:39

ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం

అనకాపల్లి

  • నర్సీపట్నంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.

  • భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు.

  • మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు.

  • హాజరైన మాజీ మంత్రి గుడివాడ, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్.

2025-12-21 11:17:20

భూమన కరుణాకరరెడ్డి, అభినయ్ రెడ్డి నేతృత్వంలో..

  • తిరుపతి: పద్మావతిపురంలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు
  • జగనన్న చిత్ర పటాలతో ప్లకార్డులతో నవరత్నాలు పథకాలు గుర్తుకు తెస్తూ ప్రత్యేకంగా వేడుకలు
  • భారీ కేక్ కట్ చేసిన భూమన కరుణాకరరెడ్డి, అభినయ్ రెడ్డి
  • అనంతరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రారంభించిన భూమన కరుణాకరరెడ్డి
  • బ్లడ్ డొనేషన్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు
  • వేడుకల్లో పాల్గొన్న మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్సార్‌సీపీ నేతలు
2025-12-21 11:02:58

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

  • తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
  • భారీ కేక్ కట్ చేసిన పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
  • హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్..
  • మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్‌రెడ్డి తదితరులు
2025-12-21 10:57:30

సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన నేత వైఎస్‌ జగన్‌

  • నెల్లూరు: నెల్లూరు వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు
  • మెగా రక్తదాన శిబిరం ఎర్పాటు చేసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
  • నాయకులు, కార్యకర్తలు నడుమ కేక్ కట్ చేసి సంబరాలు

కృష్ణాజిల్లాలో..

  • పామర్రు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు
  • కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
  • కేక్ కట్ చేసి వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన అనిల్ కుమార్, కార్యకర్తలు
  • సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన నాయకుడు వైఎస్‌ జగన్‌: కైలే
  • వైఎస్‌ జగన్‌.. పేదవాడి మనసులో గూడు కట్టుకున్నారు
  • తమ ఇంట్లో మనిషిగా భావించి వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజును ప్రతి కుటుంబం జరుపుకుంటోంది
  • వైఎస్‌ జగన్‌ పరిపాలన చిరస్థాయిగా నిలిచిపోయింది
  • ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేశారు
  • ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా డెలివరీ సిస్టమ్ ఏర్పాటు చేశారు
2025-12-21 10:55:07

విశాఖలో వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

  • విశాఖ: విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ బర్త్‌డే వేడుకలు
  • కేక్ కట్ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు
  • రక్తదానం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు
  • పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నేత వైఎస్ జగన్: కేకే రాజు
  • నాడు-నేడు ద్వారా చరిత్ర సృష్టించారు
  • దేశములో ఏ నేతా చేయలేనన్ని సంక్షేమం, అభివృద్ధి చేశారు.
2025-12-21 10:49:40

దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో..

  • ​ఎన్టీఆర్‌ జిల్లా: దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు
  • రెండు వందల మందికి పైగా రక్తదానం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు
  • అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన దేవినేని అవినాష్
  • దేశంలోనే అత్యంత మాస్ ఇమేజ్ ఉన్న నేత వైఎస్‌ జగన్: అవినాష్‌
  • జగన్ రోడ్డు మీదకి వస్తె లక్షల్లో ప్రజలు వస్తారు
  • సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్‌.. వైఎస్సార్‌.. జగన్‌
  • ఆయనతో రాజకీయ జీవితం గడుపుతునందుకు ఆనందంగా ఉంది
  • జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
2025-12-21 10:45:36

బధిరుల పాఠశాలలో వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు

  • ప్రకాశం జిల్లా: చీమకుర్తిలో వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు
  • బధిరుల పాఠశాలలో సంబరాలు
  • వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ నేతలు
  • విద్యార్థులతో మమేకమై కేక్‌ కట్‌చేసి చాక్లెట్స్‌ పంచిన వైఎస్సార్‌సీపీ నేతలు
     
2025-12-21 10:40:18

కర్నూలులో పేదలకు దుప్పట్లు

  • కర్నూలులో జగన్‌ అభిమానుల కోలాహలం
  • వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజ నేడు
  • కొండారెడ్డి బుడ్జ్ వద్ద భారీ ఎత్తున సంబరాలు 
  • పాల్గొన్న కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్
  • పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం
2025-12-21 10:05:42

నంద్యాలలో..

  • నంద్యాల నియోజకవర్గంలో ఘనంగా జగన్‌ జన్మదిన వేడుకలు
  • గోస్పడు మండలం లో భారీ కేక్ కట్ చేసి అన్నదానం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • నంద్యాల జగన్‌ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి , పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్ రెడ్డి, ఇతర నేతలు.. కార్యకర్తలు
2025-12-21 10:05:42

అనంతలో..

  • అనంతపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు 
  • వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసిన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి 
  • వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మ, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి తదితరులు
2025-12-21 10:05:42

విజయవాడలో వైఎస్‌ జగన్‌ బర్త్‌డే వేడుకలు

  • పోతిన మహేష్ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు
  • శ్రీవెంకట సాయి వృద్ధ ఆశ్రమం, ఆశీర్వాద్ ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ హోంలలో వైఎస్‌ జగన్‌ బర్త్‌డే వేడుకలు
  • వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన పోతిన మహేష్
  • వైఎస్‌ జగన్‌ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగించారు
  • ప్రతి ఇంట్లో జగన్ ఫోటో నేడు ఉంది
  • ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందించిన వ్యక్తి జగన్
2025-12-21 09:50:36

పులివెందులలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

  • వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు
  • వేడుకల్లో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి
  • మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • కేక్ కటింగ్ చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
  • రక్తదాన శిబిరంలో భారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు
2025-12-21 09:43:51

ఎక్స్‌లో టాప్‌ ట్రెండింగ్‌గా ‘హ్యాపీ బర్త్‌డే’ వైఎస్‌ జగన్‌

  • వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు
  • వైఎస్సార్‌సీపీ పాలన సంక్షేమాన్ని గుర్తు చేసుకున్న పేదలు 
  • చంద్రబాబు ప్రభుత్వ తీరును బేరీజు వేసుకుంటున్న జనం
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
2025-12-21 08:22:52

అదో చరిత్ర..

  • వైఎస్‌ జగన్‌ పాలనను గుర్తు చేసుకుంటున్న జనం
  • విప్లవాత్మక నిర్ణయాలతో మారిన ఊళ్లు కొత్త మెడికల్‌ కాలేజీలతో వైద్య విద్య కల సాకారం
  • నవరత్న పథకాలతో సొంతకాళ్లపై నిలబడ్డ అక్కచెల్లెమ్మలు
  • విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలనకు చిహ్నం అంటున్న జనం 
2025-12-21 08:00:14

నేడు జనహృదయ నేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు

  • నేడు వాడవాడలా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు
  • సుపరిపాలనకు ఆద్యుడు వైఎస్‌ జగన్‌ 
  • వైఎస్‌ జగన్‌ సీఎంగా అధికారం చేపట్టిన మొదటిసారే సంక్షేమ విప్లవాన్ని సృష్టించారు
  • అభివృద్ధిని పరుగులు పెట్టించారు
  • అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు
  • ‘పాలకుడంటే ఇలా ఉండాలి’ అంటూ నిర్వచనంగా నిలిచారు
  • అధికారం కోల్పోయినా.. ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా  నిలుస్తున్నారు
  • ప్రతి సమస్యపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు
  • ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు
  • రాష్ట్రంలో వాడవాడలా బర్త్‌డే వేడుకలు నిర్వహించడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు సిద్ధం   
     
2025-12-21 07:46:22
Advertisement
 
Advertisement
Advertisement