కొలువులు ఉంటేనే.. విదేశాల్లో చదువు..
ముంబై: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, వీసా పాలసీలు మారిపోతున్న నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసంపై ఆసక్తి గల విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. అఫోర్డబిలిటీతో పాటు (అందుబాటు స్థాయిలో వ్యయాలు) చదువు అనంతరం ఉద్యోగావకాశాలు, తాము చదివే కోర్సులపై కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం తదితర అంశాలకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ ఆధారిత విదేశీ విద్య సేవల ప్లాట్‌ఫాం లీప్ స్కాలర్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 30 లక్షల మంది పైగా విద్యార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇది రూపొందింది. దీని ప్రకారం 2024–25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 377 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇది 219 శాతం వృద్ధి చెందింది. ఇక న్యూజిలాండ్‌పై 6 శాతం నుంచి 2,900 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై 7 శాతం నుంచి 5,400 శాతానికి ఆసక్తి పెరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక 18 నెలల పాటు వర్క్ వీసా లభిస్తుండటం జర్మనీ విషయంలో సానుకూలాంశం. పాశ్చాత్య వర్సిటీలతో పోలిస్తే విద్యా వ్యయాలు తక్కువగా ఉండటం, కాస్త అందుబాటు దూరంలో ఉండటం యూఏఈకి సానుకూలంగా నిలుస్తోంది. అటు విద్యాభ్యాసం పూర్తయ్యాక మూడేళ్ల పాటు నివసించేందుకు, పని చేసేందుకు వర్క్ వీసా ఇచ్చే ఇమ్మిగ్రేషన్ పాలసీలతో భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్ ఆకర్షణీయంగా ఉంటోంది. ‘విద్యార్థులు ఇప్పుడు కేవలం అఫోర్డబిలిటీని మాత్రమే చూడటం లేదు. ఫలానా యూనివర్సిటీలో చదివామని గొప్పలకు పోవడం కన్నా సదరు డిగ్రీతో ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనేది కూడా వారికి కీలకంగా ఉంటోంది. పెట్టిన పెట్టుబడిపై రాబడి అవకాశాలను సైతం వారు లెక్కలు వేసుకుంటున్నారు‘ అని లీప్ స్కాలర్ సహ–వ్యవస్థాపకుడు ఆర్నవ్ కుమార్ తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → స్పెషలైజేషన్‌కి విద్యార్థులు గతంలో కన్నా మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 40.4 శాతం మంది విద్యార్థులు ఏఐ, మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్ మొదలైన వాటిల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తిగా ఉన్నారు. → 59.6 శాతం మంది వివిధ కోర్సుల్లో ఏఐ మాడ్యూల్స్ కూడా ఉన్న మాస్టర్స్ డిగ్రీలను ఎంచుకుంటున్నారు. → బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాలకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు చేసినా, ఏఐకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇది నిదర్శనం. → ఏఐ కోర్సులు చదివేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల కన్నా తాము చదువుపై పెడుతున్న పెట్టుబడిపై రాబోయే రాబడులను కూడా లెక్కలు వేసుకుంటున్నారు. → కోర్సు ఖర్చు, ఇతరత్రా వ్యయాలూ తమకు అత్యంత ప్రాధాన్యతాంశాలని 75 శాతం మంది వెల్లడించారు. స్కాలర్షిప్కు 70 శాతం, కెరియర్ పురోగతికి 58 శాతం, జీతభత్యాల పెరుగుదల అవకాశాల అంశానికి 49 శాతం ఓట్లు లభించాయి. 40 శాతం ఓట్లతో అధ్యాపకుల అనుభవం, రీసెర్చ్ అవకాశాలకు అయిదో ర్యాంకు దక్కింది. టాప్ 5 ప్రాధాన్యతాంశాల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. → విదేశీ విద్యను ఎంచుకునే అబ్బాయిలు (58 శాతం), అమ్మాయిల (42 శాతం) మధ్య అంతరం తగ్గుతోంది. అమ్మాయిలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ (స్టెమ్) కోర్సులను ఎంచుకుంటున్నారు. అందులోనూ ఏఐ, డేటా సైన్స్‌కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు.
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్‌ఫామ్‌గా రూపొందుతోంది. భారత్‌లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్‌లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్‌ఫామ్స్‌లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్‌లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్‌ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్‌ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్‌ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్‌పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్‌లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్‌ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్‌ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.
ఈ రాశి వారికి వస్తులాభాలు.. ధనలబ్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.8.11 వరకు తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాషాఢ రా.3.08 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.11.34 నుండి 1.15 వరకు, దుర్ముహూర్తం: సా.3.57 నుండి 4.44 వరకు, అమృత ఘడియలు: రా.9.54 నుండి 11.38 వరకుసూర్యోదయం : 6.28సూర్యాస్తమయం : 5.26రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకుమేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.వృషభం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.మిథునం: శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు.కర్కాటకం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సత్కారాలు జరుగుతాయి.సింహం: ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.కన్య: శ్రమ ఫలించదు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.తుల: కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది. సోదరుల కలయిక.ధనుస్సు: .పనులు పూర్తి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పోటీపరీక్షల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు.కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులు అనుకూల ఫలితాలు.సాధిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.మీనం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల సలహాలతో ముందుకు సాగుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)
ఇక మహా ఉద్యమమే
ఈ రాశి వారికి వస్తులాభాలు.. ధనలబ్ధి
ఏఐ, చాట్ జీపీటీల వాడకం ప్రమాదం
అరుదైన అంతరిక్ష అతిథి
హిడ్మా.. సన్నాఫ్ మడ్వి పొజ్జి
గుడ్డు సురక్షితమే!
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో
మరణ మృదంగం
బడిపై చలి దాడి!
పార్లమెంట్ ముట్టడికి యత్నం
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
.. వాలంటీర్లలా దీన్ని ఎత్తేద్దామంటే కుదరడం లేదు.. జగన్ గుర్తు రాకుండా పేరు మార్చేస్తున్నారు!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కమెడియన్
టీ20 వరల్డ్‌కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
ఇక మహా ఉద్యమమే
ఈ రాశి వారికి వస్తులాభాలు.. ధనలబ్ధి
ఏఐ, చాట్ జీపీటీల వాడకం ప్రమాదం
అరుదైన అంతరిక్ష అతిథి
హిడ్మా.. సన్నాఫ్ మడ్వి పొజ్జి
గుడ్డు సురక్షితమే!
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో
మరణ మృదంగం
బడిపై చలి దాడి!
పార్లమెంట్ ముట్టడికి యత్నం
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
మరో 20 దేశాలపై ప్రయాణ నిషేధం విధించిన అమెరికా- గతంలో 12 దేశాలపై నిషేధం
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
.. వాలంటీర్లలా దీన్ని ఎత్తేద్దామంటే కుదరడం లేదు.. జగన్ గుర్తు రాకుండా పేరు మార్చేస్తున్నారు!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కమెడియన్
టీ20 వరల్డ్‌కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్‌పై వేటు
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
ఫొటోలు
ఏపీవ్యాప్తంగా వైఎస్ జగన్ ముందస్తు బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)
శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)
హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)
రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)
కలర్‌ఫుల్ చీరలో కృతి శెట్టి.. ఫ్యాన్స్ కోసం ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
ముచ్చట గొలిపే ముత్యాల ముగ్గులు.. మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
‘మోగ్లీ 2025’ థ్యాంక్స్ మీట్..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్ (ఫొటోలు)
సినిమా
సెట్లో నేనొక్కదాన్నే మహిళని.. 'సైజ్' అని ఇబ్బంది పెట్టారు: రాధిక ఆప్టే
ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్లు.. చాలా విషయాల్లో స్ట్రెయిట్‌గా చెప్పలేరు. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని కూడా బయటపెట్టేందుకు ఇష్టపడరు. కానీ రాధికా ఆప్టే మాత్రం ధైర్యంగా చెబుతుంది. ఇప్పుడు కూడా దక్షిణాదిలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని రివీల్ చేసింది. రీసెంట్గా 'సాలీ మహబ్బత్' అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేసింది.'ఇండస్ట్రీలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. చాలా గుర్తింపు ఉన్న వ్యక్తుల నుంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. పైకి హుందాగా కనిపిస్తారు. కానీ కలిసిన తర్వాత వాళ్ల నిజస్వరూపాలు ఏంటనేవి అర్థమయ్యాయి. బాలీవుడ్, సౌత్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి ఉన్నాయి. నేను గతంలో కొన్ని సౌత్ మూవీస్ చేశారు. ఓ సినిమా సెట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను.''ఓ మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తున్నం. చూస్తే నేనొక్కదాన్నే మహిళని. వాళ్లకు నా బ్యాక్, రొమ్ము పెద్దగా కనిపించాలి. దీంతో 'అమ్మ ప్యాడింగ్ చేయండి.. ఇంకా ప్యాడింగ్ చేయండి' అని విసిగించారు. నాకా చాలా కోపం వచ్చింది. నా స్థానంలో మీ అమ్మో, చెల్లిలో ఉంటే ఇలానే చెబుతావా.. ప్యాడింగ్ చెయ్ ప్యాడింగ్ చెయ్ అని అంటావా' అని అరిచేశాను. అలా ఏం చేయనని చెప్పేశాను. ఆ రోజు నాకు మేనేజర్ లేడు, ఏజెంట్ లేడు. నాకంటూ ఓ టీమ్ లేదు.. ఆ అనుభవం తర్వాత మళ్లీ సౌత్ సినిమాలు చేయాలంటేనే భయం వేసింది' రాధిక ఆప్టే చెప్పింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే.. ఓ దక్షిణాది సీనియర్ హీరో కూడా గతంలో తనతో సెట్స్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. డబ్బుల కోసం ఆ హీరోతో మరో సినిమా చేయాల్సి కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది. రాధిక సౌత్ మూవీస్ విషయానికొస్తే.. 'రక్తచరిత్ర'తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తమిళంలో 'కబాలి'తో పాటు పలు సినిమాలు చేసింది.I remember a South film where I was the only woman, they wanted to add more padding on my bum & my breast. They were like, 'Amma, more padding' 😮— #RadhikaApte Which South movie is she referring to❓Kabali, Azhagu Raja or Balayya's Lion❓👀 pic.twitter.com/wm5Ne7Na4R— VCD (@VCDtweets) December 20, 2025
కల్యాణ్ పడాల తలకు కట్టు... అతడికేమైంది?
బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనలిస్టులు ఐదుగురు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు వారిని పలకరించేందుకు దాదాపు ఐదారుగురు సెలబ్రిటీలు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ, లయ, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ మొదటగా వచ్చారు. బుల్లితెర యాంకర్స్తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, క్వీన్ శ్రీముఖి అడుగుపెట్టారు. ఈ మేరకు వరుస ప్రోమోలు వదులుతున్నాడు బిగ్‌బాస్. బీబీ జోడీ రెండో సీజన్ మొదలు కాబోతోంది.. ఈ సీజన్ నుంచి కూడా జంటలు రావాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అనగానే కల్యాణ్.. వస్తాం అన్నా అంటూ సంతోషంగా ఆన్సరిచ్చాడు. ఎలాగో ఈ షోలో పవన్-రీతూ జంటగా కనిపించడం ఫిక్స్! కల్యాణ్ తలకు కట్టుమరి తనూజ- కల్యాణ్ కూడా జోడీగా వస్తారా? లేదా? అనేది చూడాలి! ఇక శ్రీముఖి వచ్చినప్పుడు ఇమ్మూ చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. పుష్ప స్కిట్లో భాగంగా కల్యాణ్.. తనూజను గిల్లేశాడు. ఈ ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించాడు. అయితే అతడికి పెద్ద గాయం ఏమీ అవలేదు. నిధి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించింది. అప్పుడు కల్యాణ్ తలకు చిన్న దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. కాబట్టి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు.
జలకన్యలా జవాల్కర్.. గ్లామరస్ కృతి సనన్
జలకన్యలా మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్అందమైన చందమామలా హీరోయిన్ కృతి సనన్చీరలో మాయ చేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్అడవిలో మూవీ షూటింగ్.. రాశీఖన్నా పోజులుపెట్ డాగ్‌తో ఫుల్ సంతోషంగా హీరోయిన్ అంజలిరంగురంగుల డ్రస్‌లో మెరిసిపోతున్న భాగ్యశ్రీ View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Priyanka Jawalkar ★ (@jawalkar) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sri Divya (@sd_sridivya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial)
రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
విడుదలై రెండు వారాలు దాటిపోయినా సరే 'ధురంధర్' జోరు అస్సలు తగ్గట్లేదు. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రూ.600-700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీని కూడా వసూళ్లలో ఈ చిత్రం దాటేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2009లో తొలి పార్ట్ రిలీజైనప్పుడు మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు. మన దేశంలోనూ వేల కోట్ల వసూళ్లు వచ్చాయి. 2022లో రెండు పార్ట్ విడుదలైతే ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే దక్కింది. రూ.400-500 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. కానీ నిన్న(డిసెంబరు 19) థియేటర్లలోకి మూడో పార్ట్‌కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అదే స్టోరీ అదే విజువల్స్ ఉన్నాయని చూసొచ్చిన ఆడియెన్స్ అనుకుంటున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.అదే టైంలో 'ధురంధర్'కి నిన్న(డిసెంబరు 19) రూ.22.50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే రేసులో ఉన్న హాలీవుడ్ మూవీ 'అవతార్ 3'ని కూడా హిందీ మూవీ దాటేసిందనమాట. చూస్తుంటే ఈ వీకెండ్లోనూ 'ధురంధర్' హవా కనిపించేలా ఉంది. ఈ మూవీ దెబ్బకు ఇటు తెలుగులో రిలీజైన 'అఖండ 2'పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే తెలుగు తప్ప మిగతా ఏ భాషలోనూ బాలకృష్ణ చిత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అలా 'ధురంధర్' ఎఫెక్ట్.. తెలుగు, ఇంగ్లీష్ మూవీస్‌పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది.
క్రీడలు
క్రికెట్ నుంచి ఎన్బీఏ వరకు.. ఈ ఏడాది క్రీడా రంగాన్ని కుదిపేసిన వివాదాలు ఇవే
2025 సంవత్సరం.. క్రీడా రంగంలో అనేక విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. ఆసియాకప్ నో షేక్ హ్యాండ్ నుంచి ఎన్బీఏ (NBA) బెట్టింగ్ స్కామ్ వరకు చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టాప్-5 కాంట్రవర్సీలపై ఓ లుక్కేద్దాం.నో హ్యాండ్ షేక్..ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'నో హ్యాండ్‌షేక్' వివాదం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సంప్రదాయం. కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. సూర్య బాటలోనే మిగితా భారత ప్లేయర్లు కూడా నడిచారు. టోర్నీ అసాంతం పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టుగానే వ్యవహరిచింది. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించలేదు.ఆ తర్వాత ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మెన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియాకప్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)ని బెట్టింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) చేసిన దాడులలో కొంతమంది బాస్కెట్‌బాల్ దిగ్గజాలు.. మాఫియా ముఠాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లు మాఫియా ముఠాలతో కలిసి ఇన్సైడర్ సమాచారాన్ని బెట్టింగ్ కోసం వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో చాన్సీ బిలప్స్, టెర్రీ రోజియర్, డామన్ జోన్స్ వంటి దిగ్గజాలు నిందితులగా ఉన్నారు.'గ్రోవెల్' (Grovel) వివాదంఈ ఏడాది నవంబర్‌లో భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. అయితే రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ నాడ్.. భారత జట్టును ఉద్దేశించి "గ్రోవెల్" (మా ముందు సాష్టాంగపడేలా చేస్తాం) అనే పదాన్ని వాడటం పెద్ద రచ్చకు దారితీసింది. ఇది జాత్యహంకారానికి ప్రతీకగా పరిగణించబడింది. దీనిపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ సైతం తప్పుబట్టాడు. ఆ తర్వాత షుక్రీ నాడ్ క్షమాపణలు చెప్పాడు.మెద్వెదేవ్ ఆగ్రహంయూఎస్ ఓపెన్ 2025 తొలి రౌండ్లోనే రష్యా టెన్నిస్ ఆటగాడు డానియిల్ మెద్వెదేవ్ వెనుదిరిగాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో ఓడిపోడంతో మెద్వెదేవ్ అసహనానికి గురయ్యాడు. అతడు తన రాకెట్‌ను అక్కడే విరగ్గొట్టాడు. అంతకుముందు కోర్టులో ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. అంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడికి 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) జరిమానాను నిర్వాహకులు విధించారు.హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలుఐపీఎల్-2025 సీజన్ సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వ్యాఖ్యాతగా వ్యహరించిన హర్భజన్.. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను లండన్‌లోని 'నల్ల టాక్సీ' (Kaali Taxi) తో పోల్చాడు. దీంతో జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని భజ్జీపై విమర్శల వర్షం కురిసింది.
'అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్.. నిజంగా ఇదొక సర్ప్రైజ్'
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు టీ20 వరల్డ్‌కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. మొన్నటివరకు వైస్ కెప్టెన్‌గా గిల్‌ను ఇప్పుడు ఏకంగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. ఈ ఏడాది ఆసియాకప్‌తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.అతడి కోసం ఇన్ ఫామ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికి గిల్‌పై మెనెజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. కానీ ఆ నమ్మకాన్ని శుభ్‌మన్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ ప్రస్తుత ఫామ్ ఆందోళనకరంగా ఉన్నప్పటికి.. అతడిలోని టాలెంట్ ఎప్పటికి పోదు అని గవాస్కర్ అన్నారు."నిజంగా ఇది సర్ప్రైజ్. గిల్ ఒక క్వాలిటీ బ్యాటర్. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో కూడా పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అతడు విఫలమయ్యాడు. అందుకు నేను అంగీకరిస్తా.కానీ ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ అనేది శాశ్వతం. టీ20 ఫార్మాట్‌కు చాలా కాలం దూరంగా ఉండటం వల్లే గిల్ తన రిథమ్‌ను కోల్పోయాడు. టెస్టు క్రికెట్లో దుమ్ములేపుతున్న గిల్‌కు టీ20 శైలి అలవడటానికి కొంత సమయం పడుతుందని" స్టార్ స్పోర్ట్స్ షోలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా శుభ్‌మన్ గిల్ స్ధానంలో జట్టులోకి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వచ్చాడు. రెండేళ్ల తర్వాత అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్‌కు ఊహించని షాక్?
విజయానికి చేరువలో ఆస్ట్రేలియా.. అదే జరిగితే?
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో విజయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల దూరంలో నిలిచింది. 435 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇంకా 228 రన్స్ వెనుకంజలో ఉంది. పర్యాటక జట్టు విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. క్రీజులో జెమ్మీ స్మిత్ (2), విల్ జాక్స్ (11) ఉన్నారు. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టును ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకొట్టాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోరూట్ (39) కాస్త ఫర్వాలేదన్పించాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్‌తో పాటు పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.హెడ్ సూపర్ సెంచరీ..అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170 , 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. అలెక్స్ కారీ 72 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే మరో రెండు టెస్టులు మిగిలూండగానే యాషెస్ సిరీస్‌ను కంగారులు సొంత చేసుకోనున్నారు.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్‌కు ఊహించని షాక్?
బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్‌కు ఊహించని షాక్?
టీ20 ప్రపంచకప్-2026కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ అక్షర్‌పటేల్‌ను తిరిగి వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం కెప్టెన్‌గా సెలక్టర్లు కొనసాగించారు. కానీ వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ను తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.పేలవ ఫామ్‌లో సూర్య..స్కై కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్‌గా మాత్రం అట్టర్‌ప్లాప్ అయ్యాడు. ఒకప్పుడు టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఈ ముంబై ఆటగాడు.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. గత 14 నెలల్లో 24 టీ20 మ్యాచ్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్‌పై పడుతున్నట్లు బీసీసీఐ భావిస్తోంది.దీంతో అతడి స్దానంలో మరో ఆటగాడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు ఇండియా టూడే తమ కథనంలోపేర్కొంది. వాస్తవానికి సూర్యను కెప్టెన్సీ నుంచి ముందే తొలగించాలని భావించినప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మెగా టోర్నీ ముందు ప్రయోగాలు చేయడం ఇష్టం లేక సూర్యనే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సూర్యకు కెప్టెన్‌గా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు.కెప్టెన్సీ రికార్డు అదర్స్..సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఏకంగా 28 విజయాలు సాధించింది. 5 మ్యాచ్ ఓడిపోగా.. మరో రెండింట ఫలితం రాలేదు. అతడి విజయశాతం 84.9%గా ఉంది. కానీ అతడి పేలవ ఫామ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.కెప్టెన్సీ రేసులో అక్షర్, హార్దిక్..!అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. అటువంటిది గిల్‌ను టీ20 కెప్టెన్‌గా చేస్తారంటే నమ్మశక్యం కావడం లేదు. టీ20 కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్షర్‌ను తిరిగి వైస్ కెప్టెన్‌గా నియమించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది హార్దిక్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉందని, తిరిగి అతడికి జట్టు ప్గాలు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. భారత జట్టుకు తదుపరి టీ20 కెప్టెన్ ఎవరో తెలియాలంటే ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
న్యూస్ పాడ్‌కాస్ట్
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
బిజినెస్
26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?
కోబాల్ట్ ల్యాబ్స్ కో-ఫౌండర్.. భారత సంతతికి చెందిన కళ్యాణి రామదుర్గం(Kalyani Ramadurgam).. మాజీ అఫర్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'ఆషి అగర్వాల్'తో కలిసి, ఫైనాన్స్ విభాగంలో 2026కి ఫోర్బ్స్ 30-అండర్-30 యునైటెడ్ స్టేట్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంతకీ ఎవరీ కళ్యాణి రామదుర్గం?, ఫోర్బ్స్ జాబితాలో చేరేలా ఏమి సాధించారనే.. విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించడానికి ముందు.. కళ్యాణి రామదుర్గం యాపిల్ సంస్థలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు, సెక్యూరిటీ సమస్యలు వంటివి గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీపై పని చేశారు.అలా కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభంయాపిల్ కంపెనీలో పని చేస్తూ.. బ్యాంకులు, ఇతర పెద్ద కంపెనీలు తమ నియమాలను పాటిస్తున్నాయా.. లేదా? అని తెలుసుకోవడానికి వేల పేజీల డాక్యుమెంట్లను మనుషులు మాన్యువల్‌గా చెక్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం తీసుకురావాలనే సంకల్పంతో కళ్యాణి కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించారు.కోబాల్ట్ ల్యాబ్స్ స్టార్టప్.. ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ సహాయంతో పెద్ద పెద్ద డాక్యుమెంట్లను వేగంగా చదివి, బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు తమ వ్యాపారాలను.. చట్టాలు, నియమాల ప్రకారం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. భద్రత కూడా మెరుగవుతుంది.అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ గుర్తింపుకోబాల్ట్ ల్యాబ్స్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది.. మిలియన్ల డాలర్ల ఫండింగ్‌ను కూడా సాధించగలిగింది. టెక్నాలజీని ఉపయోగించి, అద్భుతం చేసిన.. కల్యాణి రామదుర్గం కృషికి గుర్తింపుగా 26ఏళ్ల వయసులో ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు దక్కింది.కోబాల్ట్ ల్యాబ్స్ ఒక మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం.. ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో చూపించే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ రంగంలో ఇలాంటి ఆలోచనలు చేసే ఎంతోమందికి ఇదొక ప్రేరణ.కళ్యాణి రామదుర్గం యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా అని అక్కడే ఆగిపోయి ఉంటే.. నేడు ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు సంపాదించగలిగేవారా?, కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి చెందకూడదు. కొత్తగా ఆలోచించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పెద్ద సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విజయమే. ఆ విజయాన్ని అక్కడితో ఆపేయకూడదు.In 2023, Kalyani Ramadurgam founded Kobalt Labs with former Affirm software engineer Ashi Agrawal to bring compliance into the machine-learning age. Kobalt's AI models sort through mountains of documents to help banks vet their business partners, ensuring they're following the… pic.twitter.com/G238c6pXVg— Forbes (@Forbes) December 17, 2025
బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు!
ఈ ఏడాది ఇక ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరం బంగారం మార్కెట్లో చరిత్రాత్మక ఏడాదిగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో తులం (10 గ్రాములు) బంగారం ధర సుమారు రూ.80 వేల స్థాయిలో ఉండగా, ఏడాది చివరికి అది రూ.1.30 లక్షలకుపైగా చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ బలహీనత, భారతీయ రూపాయి మారకం విలువ వంటి అంశాలు బంగారం ధరలను కొత్త రికార్డుల వైపు నడిపించాయి. 2025లో పసిడి ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతూ వచ్చాయి.. కొత్త మార్కులను ఎలా దాటాయి.. చూద్దాం ఈ కథనంలో..జనవరి: స్థిరమైన ఆరంభం2025 జనవరిలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.80 వేలు – రూ.82 వేల మధ్య కొనసాగింది. సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ పెద్దగా కదలికలు చూపకపోయినా, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి.మార్చి: వేగం పుంజుకున్న ధరలుమార్చి నాటికి బంగారం ధరలు రూ.88,000–రూ.90,000 స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం బంగారాన్ని ‘సేఫ్ హేవన్’గా మార్చాయి.ఏప్రిల్: చరిత్రాత్మక మైలురాయిఏప్రిల్ నెల బంగారం మార్కెట్లో కీలక మలుపు. ఏప్రిల్ చివరి వారంలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటింది. ఒకే రోజులో వేల రూపాయల పెరుగుదల నమోదై, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.మే–జూన్: స్వల్ప ఊగిసలాటమే, జూన్ నెలల్లో ధరలు కొంత స్థిరపడుతూ రూ.95,000– రూ.98,000 మధ్య కదిలాయి. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినా, పెట్టుబడి డిమాండ్ మాత్రం కొనసాగింది.సెప్టెంబర్: మళ్లీ జోరుసెప్టెంబర్ నాటికి బంగారం ధరలు మరోసారి వేగం పుంజుకుని రూ.1.08 లక్షల నుంచి రూ.1.10 లక్షల స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.అక్టోబర్: పండుగ సీజన్ రికార్డులుదసరా–దీపావళి సీజన్లో బంగారం ధరలు మరింత ఎగబాకాయి. అక్టోబర్ మధ్య నాటికి 10 గ్రాముల ధర సుమారు రూ.1.30 లక్షలకు చేరి కొత్త ఆల్‌టైమ్ హైని నమోదు చేసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కలసి ధరలను ఆకాశానికి చేర్చాయి.డిసెంబర్: స్వల్ప తగ్గుదలడిసెంబర్ చివర్లో ధరలు కొంత సర్దుబాటు చెంది రూ.1.28 లక్షలు – రూ.1.30 లక్షల పరిధిలో కొనసాగాయి. ఏదేమైనప్పటికీ, ఏడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్ని ఇచ్చిన ఆస్తిగా నిలిచింది.
2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో.. వాహన తయారీ సంస్థలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా లెక్కకు మించిన ఈవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ కథనంలో ఈ ఏడాది (2025) దేశీయ విఫణిలో కనిపించిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ఇండియన్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన హ్యుందాయ్ క్రెటా.. ఈ ఏడాది ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 42 కిలోవాట్ బ్యాటరీ, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఎంపికలతో లభిస్తుదఞ్హి. ఇవి రెండూ వరుసగా 420 కిమీ, 510 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారును డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 58 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 18.02 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా హారియార్ ఈవీ2025 టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి 'టాటా హారియార్ ఈవీ'. acti.ev ప్లస్ EV ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు 65 kWh & 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 627 కిమీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎక్స్ఈవీ 9ఎస్ పేరుతో.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది 59 kWh, 70 kWh, 79 kWh అనే బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఈ కారు రేంజ్.. ఎందుకుని బ్యాటరీ ప్యాక్, వేరియంట్‌ను బట్టి 521 కిమీ నుంచి 679 కిమీ వరకు ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్లు & లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా కారెన్స్ క్లావిస్ ఈవీకియా మోటారు లాంచ్ చేసిన కారెన్స్ క్లావిస్ ఈవీ.. ఏడు సీట్ల లేఅవుట్‌ను పొందుతుంది. ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇది 42 kWh & 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌లతో.. 404 కిమీ, 490 కిమీ రేంజ్ అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో లెవల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలు మధ్య ఉన్నాయి.విన్‌ఫాస్ట్ వీఎఫ్7 & వీఎఫ్6వియత్నామీస్ EV బ్రాండ్ విన్‌ఫాస్ట్ ఈ ఏడాది.. వీఎఫ్7 & వీఎఫ్6 కార్లను లాంచ్ చేసింది. వీఎఫ్7 ధరలు రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 70.8 కిలోవాట్ బ్యాటరీ, 75.3 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో సింగిల్ మోటార్ & డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది.వీఎఫ్6 విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణంగా 59.6 kWh బ్యాటరీతో.. ఫ్రంట్-మోటార్ సెటప్ & ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ కారు 468 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.వోల్వో ఈఎక్స్30వోల్వో కంపెనీ ఈఎక్స్30 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 69 kWh లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ కారు రియర్ మౌంటెడ్ మోటారుతో జతచేయబడి.. 272 bhp & 343 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 480 కిమీ రేంజ్ అందిస్తుంది. DC ఛార్జర్‌ని ఉపయోగించి 28 నిమిషాల్లో 10–80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).
కొత్త ఏడాదిపై రియల్ ఎస్టేట్ గంపెడాశలు
2025లో.. ఔటర్ వరకూ గ్రేటర్ పరిధి విస్తరణ..భారత్ ఫ్యూచర్ సిటీతో నగరంలో నాలుగో నగరి అవతరణ..మూసీకి పునరుజ్జీవంతో నైట్ ఎకానమీ ఆవిష్కరణ..మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ల ప్రణాళికలతో కొంగొత్త ఉత్సాహం....హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చే ఈ మెగా ప్రాజెక్ట్‌లకు శ్రీకారం పడింది. ఇక, వీటి కార్యాచరణతో కొత్త ఏడాదిలో నగర స్థిరాస్తి రంగం దూసుకెళ్లడం ఖాయమని నిర్మాణ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో రియల్ అభివృద్ధికి ఢోకా లేదని భావిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల రాకతో ఐటీ నిపుణులు, సంస్థలు హైదరాబాద్ వైపు దృష్టిసారిస్తున్నారు.స్థిరాస్తి రంగానికి మెరుగైన మౌలిక వసతులే జవసత్వాలు. రహదారులు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలు వంటి సామాజిక వసతులు ఉన్న చోట స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, కోకాపేట, నార్సింగి వంటి ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వాలు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో నిర్మాణ సంస్థలు పోటీపడీ మరీ నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాయి. దీంతో ఎకరం వందల కోట్లు పలికే రికార్డ్ స్థాయికి ఆయా ఏరియాలు అభివృద్ధి చెందాయి. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క చదరపు అడుగు(చ.అ.) కార్యాలయ స్థలం లావాదేవీ జరిగితే.. 10 చ.అ. నివాస స్థలానికి డిమాండ్ ఏర్పడుతుందని అంటారు. ఆఫీసు స్పేస్ అభివృద్ధితో నివాస, వాణిజ్య సముదాయాల అవసరం ఏర్పడుతుంది. రెండేళ్ల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. మన భాగ్యనగరం బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అందుబాటు ధరలు, నిపుణుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి రకరకాల కారణాలతో బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో కంపెనీల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఔటర్ గ్రేటర్.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. 27 నగర, పురపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా జీహెచ్ఎంసీ అవతరించింది. రెండు వేల చ.కి.మీకు పైగా విస్తరించిన జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో కొత్త ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి. బహుళ స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుతో సమర్థవంతమైన పరిపాలన, సమాంతర అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులను వేగవంతమవుతాయి. పట్టణీకరణ సవాళ్లు, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం సులువు అవుతుంది. పాత మున్సిపాలిటీల్లోనూ మెరుగైన మౌలిక వసతులు రావడంతో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఏర్పడటం ఖాయం. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వెంచర్లకు నిర్మాణ సంస్థలు, డెవలపర్లు ముందుకొస్తారు.మెట్రో బూమ్..హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగోల్–శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం–కోకాపేట, ఎంజీబీఎస్ – చాంద్రయాణగుట్ట, మియాపూర్– పటాన్చెరు, జేబీఎస్–మేడ్చల్/శామీర్‌పేట వంటి కీలక మార్గాలలో మెట్రో పరుగులు పెట్టనుంది. సుమారు 76–86 కి.మీ. మేర మెట్రో కొత్త లైన్ రానుంది. మెట్రో విస్తరణతో శివారు ప్రాంతాలు ప్రధాన నగరంతో అనుసంధానమవుతాయి. ప్రీమియం గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది. కోకాపేట, గచ్చిబౌలి, ఉప్పల్ వంటి విమానాశ్రయంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారతాయి. మెట్రో లైన్లలోని ఆస్తి విలువలు 10–20 శాతం మేర పెరుగుతాయి. కొత్త స్టేషన్ల చుట్టూ 2–3 కి.మీ. వరకూ బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు వస్తాయి.ఫ్యూచర్ బెటర్ఏటేటా మహా నగరం విస్తరిస్తోంది. విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం రకరకాల కారణాలతో నగరంలో వలసలు పెరుగుతున్నాయి. శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటంతో ప్రధాన నగరంలో జనసాంద్రత పెరుగుతోంది. మౌలిక వసతులపై ఒత్తిడి పడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారుల మధ్యలో మీర్ఖాన్పేటలో సుమారు 30 వేల ఎకరాలలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి పునాదులు వేసిన సంగతి తెలిసిందే. ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ ఏడు మండలాల్లోని 56 గ్రామాలను కలుపుతూ ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో రహదారులు, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ గ్రామాలలో భూములకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్–2047ను కూడా నిర్వహించింది. రెండు రోజుల సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి.మూసీ అభివృద్ధికేసి..భాగ్యనగరం నడిబొడ్డున వడ్డాణం మాదిరిగా అందంగా పొదిగిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మూసీ నదిని కేవలం నదీ తీర ప్రాంతంగా మాత్రమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖలా నిలిచేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నైట్ ఎకానమీకి మూసీని కేరాఫ్ మూసీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. మూసీ నదిని బ్లూ, గ్రీన్ అని రెండు భాగాలుగా అభివృద్ధి చేయనున్నారు. బ్లూ మాస్టర్ ప్లాన్‌లో వరద నీటి నివారణ, వంతెనల నిర్మాణం తదితర అంశాలుంటే.. గ్రీన్ మాస్టర్ ప్లాన్‌లో నదీ తీరంలో గ్రీనరీ, రవాణా ఆధారిత అభివృద్ధి తదితర అంశాలుంటాయి.మూసీ నదీ తీర పునరుజ్జీవం, ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తూర్పు–పశ్చిమ నదీ తీరాన్ని కలుపుతూ 35–40 కి.మీ. కారిడార్‌ను అభివృద్ధి చేస్తారు. మూసీ నదీ తీరాన్ని రవాణా ఆధారిత అభివృద్ధిగా కలిపి డెవలప్ చేయాలని ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నది తీరం వెంబడి ప్రజా స్థలాలు, వినోద కేంద్రాలు, విహార ప్రదేశాలు, సాంస్కృతిక వేదికలు, విహార ప్రదేశాలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రాలు, సైకిల్, వాకింగ్ ట్రాక్స్ వంటి స్థిరమైన రవాణా ఏర్పాట్లు వంటివి ఏర్పాట్లు చేయనున్నారు. వరదల నిరోధకత, జీవ వైవిధ్యం, సమ్మిళిత రూపకల్పనపై దృష్టిసారించనున్నారు. అలాగే ఆగ్యుమేటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్) ఆధారిత స్టోరీ టెల్లింగ్ జోన్లు, కల్చరల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు.త్రిబుల్ ఆర్ రయ్.. ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30–50 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్)కు ప్రణాళికలు చేసింది. హైదరాబాద్ చుట్టూ 340 కి.మీ. ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ ఇదీ. త్రిబుల్ ఆర్తో రాష్ట్ర మొత్తం కనెక్టివిటీ మెరుగవుతుంది. ఇంటర్ ఛేంజ్‌లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. పారిశ్రామిక గిడ్డంగులు, శాటిలైట్ టౌన్షిప్లకు ఆస్కారం ఉంటుంది.
ఫ్యామిలీ
మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా : రకుల్ ప్రీత్ సింగ్
‘ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా.. కానీ నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే.. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది.. ప్రస్తుతం కథలు వింటున్నా.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’ అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టాప్ సెలబ్రెటీలకు మేకప్ మెన్‌గా చేసిన కడాలి చక్రవర్తి ఆధ్వర్యంలో పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ’ని రకుల్ ప్రారంభించారు. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని తన కోరికని తెలిపారు. తన తొలి చిత్రం నుంచి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు అన్ని సినిమాలకూ తనకు మేకప్ చేసిన చక్రి మేకప్ అకాడమీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం కూడా ఆయనే అని అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఆ ప్రశ్న ఉద్యమం అయింది!
గత మూడు దశాబ్దాలుగా న్యాయవాది వర్ష్ దేశ్ పాండే లింగ వివక్షతకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అసౌకర్యం, బాధలో నుంచి తలెత్తిన ఒక సాధారణమైన ప్రశ్నతో ఆమె పోరాటం ప్రారంభమైంది. ‘అమ్మాయిలు తమదైన సమాజానికి ఎందుకు దూరం అవుతున్నారు?’ ఈ ప్రశ్న ‘దళిత మహిళా వికాస్ మండల్’కు పునాదిగా మారింది. మహారాష్ట్రలో పాతుకుపోయిన చట్టవిరుద్ధమైన లింగనిర్ధారణ పరీక్షల రాకెట్లను బహిర్గతం చేసిన పాండే ఉద్యమాలు ఎన్నో చేసింది. ఎంతోమంది దొంగ వైద్యులను జైలుకు పంపించింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన యూఎన్ పాపులేషన్ అవార్డ్ రూపంలో ఆమె పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇది నాకు వచ్చిన గుర్తింపు కాదు. నా పక్కన నిలబడిన ధైర్యవంతులైన మహిళలకు’ అంటోంది వర్ష్ దేశ్ పాండే పాండే.
ఈ సంవత్సరాన్ని కాగితంపై పెట్టండి...
డిసెంబర్ వచ్చింది. అందరి భావనా కన్ను మూసి తెరిచేంతలో కొత్త సంవత్సరం వచ్చేసిందే అని. కాని డిసెంబర్ మాసం ‘ఎగ్జామ్ ఇవాల్యుయేటర్’ వంటిది. ఈ సంవత్సరం మొత్తం మీరు కుటుంబ, ఆర్థిక, వ్యక్తిగత, స్నేహ, బౌద్ధిక, కళారంగాలలో మీ సమయాన్ని ఎలా వెచ్చించారో, ఏ మేరకు ఎదిగారో బేరీజు వేస్తుంది. అందుకే కాగితం తీసుకుని హైలైట్స్ రాసుకోండి. వచ్చిన మార్కులను బట్టి కొత్త ఏడాదికి మరింత జాగ్రత్తగా సిద్ధం కండి.కాలం దగ్గర మేజిక్ ఉంటుంది. అది కొందరికి చిటికెలో అయిపోయిన భావన ఇస్తుంది. మరొకరికి ఎంతకూ గడవని మొండిఘటంలా తోస్తుంది. అంతా మానసికమే. మన చేతుల్లో ఉన్న సంగతే. ‘గర్వించ దగ్గ విషయం’ ఏమిటంటే గతంలో కొందరికి మెల్లగా, కొందరికి వేగంగా గడిచిన కాలం ఇప్పుడు అందరికీ ఒక్కలాగే పరుగు పరుగున సాగుతోంది. కారణం? అందరి చేతుల్లో ఫోన్లు ఉండటమే. అలా రీల్స్ చూస్తూ ఉంటే డిసెంబర్ రావడం ఏమిటి... దశాబ్దాలే గడిచిపోతాయి. నిజం. ఎన్ని డైవర్షన్స్ ఇవాళ మన జీవితంలో! ఎంత తీరుబడిలేనితనం – ‘పనికిమాలిన విషయాల ఆక్రమణ వల్ల! సమయమంతా వాటికి వెచ్చించడం వల్ల. అలా వెనక్కు తిరిగి చూడండి. ఈ సంవత్సరం నిర్మాణాత్మకంగా ఏమైనా చేయగలిగారా? సాధించగలిగారా? 2024 డిసెంబర్ చివరన తీసుకున్న నిర్ణయాలు ఏవైనా కొన్ని అమలు చేయగలిగారా? అలా గాల్లో చూస్తూ మననం చేసుకుంటే లెక్క తేలదు. పేపర్ మీద పెట్టాలి. ఒక తెల్లకాగితం తీసుకుని మీ పేరు రాసి కింద ‘హైలైట్స్ 2025’ అని హెడ్డింగ్ పెట్టి ఒక్కో విభాగంలో ఏమైనా చేశారో చేయలేకపోయారో రాసుకోండి. అప్పుడు సంవత్సరం ఎలా గడిచిందో తెలుస్తుంది. తప్పులు ఒప్పులు తెలుస్తాయి. అప్రమత్తత కలుగుతుంది. కాలం విలువైనది. కాలానికి విలువనిచ్చినవారే విలువైన జీవితాలను నిర్మించుకుంటారు.కుటుంబం: కుటుంబానికి ఎంత సమయం ఇవ్వగలిగారో రాసుకోండి. కుటుంబ సభ్యుల సబబైన ఆకాంక్షలకు ఏమేరకు సపోర్ట్ చేయగలిగారు? అసలు వారి ఆకాంక్షలేమిటో విన్నారా? ప్రతి సభ్యుడికి సమానమైన విలువ, గౌరవం ఇచ్చి తద్వారా మీరు గౌరవం పొందారా? థ్యాంక్యూలు ఎక్కువా... లేదా సారీలా? కుటుంబ ఆరోగ్యం గురించి, హెల్త్ పాలసీల గురించి, పెద్దలకు చేయించాల్సిన టెస్ట్‌ల గురించి ఎంత సమయం ఇచ్చారు? వారు మీ పట్ల సంతృప్తిగా ఉన్నారా? పేపర్ మీద రాసుకుంటూ ఉంటే మీరు మెరుగ్గానే వ్యవహరించినట్టుగా అనిపిస్తోందా?ఆర్థికం: గత సంవత్సరం సంపాదన కన్నా ఈ సంవత్సరం సంపాదన విషయంలో కొత్త ఆలోచనలు చేశారా? ఒక ఆదాయ మార్గంపై ఆధారపడకుండా ఇతర ఆదాయ మార్గాలకు ప్రయత్నించారా లేదా? ఈ సంవత్సరం పొదుపు ఎంత? పెట్టుబడి ఎంత? కనీసం కాసింత బంగారం అయినా కొని దాచగలిగారా? దుబారా జరిగితే ఎందుకు జరిగినట్టు? డబ్బు విషయంలో మార్చుకోవలసిన పద్ధతులు, బలహీనతలు మార్చుకున్నారా? ఆర్థికంగా జరిగిన తప్పులు ఏమిటి? నెక్ట్స్ ఏం చేయాలి?వ్యక్తిగతం: మిమ్మల్ని మీరు పట్టించుకున్నారా? వ్యాయామం, దృఢత్వం, చలాకీతనం వీటికై ఏం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య పరీక్షలు, ‘రిపేర్లు’ చేయించుకున్నారా? కంటి, పంటి వైద్యాలు... బరువు అదుపు... కేశ, చర్మ సంరక్షణ... సమతుల్య ఆహారం... తినకూడని ఆహారాన్ని మానేయడం... ఈ సంవత్సరం ఎన్ని లెక్కలేనితనాలు... ఇవన్నీ రాబోయే సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా ఉండాలంటే పేపర్ మీద మీరు వేసుకున్న మార్కులే హెచ్చరిక.స్నేహం: స్నేహితులను నిలబెట్టుకోవడమే కాదు టాక్సిక్ స్నేహాలను, మొహమాట పెట్టి మనల్ని ఎక్స్ ప్లాయిట్ చేసుకునే స్నేహాలను వదులుకోవడం కూడా ముఖ్యమే. ఈ సంవత్సరం మీ స్నేహవాతారణం ఎలా ఉంది. మంచి స్నేహితుల కోసం మీరు ఏం చేశారు? వారికి మీ స్నేహాన్ని, ప్రేమనూ పంచారా? చెడ్డ స్నేహితులు మిగిలి మంచి స్నేహితులు మీ నుంచి దూరమై ఉంటే మీ దోషాలు ఏమిటో చూసుకున్నారా? స్నేహం వల్లే కాలం సులువుగా కదులుతుంది. స్నేహంలో మీకు వచ్చిన మార్కులు ఎన్ని?మెదడుకు ఆహారం: మనిషి మెదడు ఒక సూపర్ కంప్యూటర్. దానికి జ్ఞానం ఇచ్చే కొద్దీ అది జీవనాన్ని సులభతరం చేస్తుంది. నేర్చుకుంటూ ఉన్నప్పుడే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం మెదడుకు కొత్త విషయాలు ఏం చె΄్పారు? మంచి ఆలోచనాత్మక పుస్తకాలు, వ్యాసాలు, ప్రపంచ పరిణామాలు, ప్రకృతి విషయాలు ఏం తెలుసుకున్నారు? కొత్త ప్రాంతాలు ఏం చూశారు. పోనీ పిల్లల పుస్తకాల్లో ఉన్న కనీస విషయాలైనా మనం తెలుసుకున్నామా? సమాజం ఎటు పోతున్నదో తెలుసుకోకుండా మనం సరిగ్గా వెళ్లలేం. మేధో విషయాలను తెలుసుకోవడంలో మీకు వచ్చే మార్కులు ఎన్ని?కళారంగం: ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏం ఉంటుంది’ సినిమాలో డైలాగ్. సంగీతం, నాటకం, మంచి సినిమా, సాహిత్యం... ఈ సంవత్సరం వీటికి మీరిచ్చిన సమయం ఎంత? మంచి అనుభూతులను పొందింది ఎంత? 2025లో ఎన్నో ఉత్తమ పుస్తకాలు, పాటలు, సినిమాలు వచ్చాయి. వాటికి ఏ మేరకు సమయం ఇచ్చారు? మీ ఊళ్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారా? మీ కంటూ ఒక అభిమాన రచయితో, నటుడో, గాయకుడో ఉన్నాడా? జీవితం వేరు, రసాత్మక జీవితం వేరు. కళలతో జీవితం, కాలం రసాత్మకం అవుతాయి. మరి మీకొచ్చిన మార్కులెన్ని?బేరీజు వేసుకోండి. కొత్త సంవత్సరానికి సిద్ధం కండి.
పెళ్లిలో వధువు ల్యాప్‌టాప్ పట్టుకుని..
వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్ గౌరీ అగర్వాల్.ఆరోజు ఆమె పెళ్లి... వధువుగా పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు ‘కోయల్లో ఏఐలో బగ్ ప్రాబ్లమ్’ అంటూ ఒక వార్త వినిపించింది. ‘ఎవరికైనా చెప్పండి’ అని విసుక్కోకుండా... వేదికలో ఒక పక్కకు వెళ్లి... ల్యాప్‌టాప్ తీసుకొని క్రిటికల్ బగ్‌ను పది నిమిషాల్లో సాల్వ్ చేసింది గౌరీ అగర్వాల్.‘ఎక్స్’లో ఆమె తమ్ముడు మెహుల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ పోస్ట్ బోలెడు లైక్‌లతో దూసుకుపోతోంది. ‘స్టార్టప్‌ల గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పడూ అప్రమత్తంగానే ఉండాలి. విజేతల వృత్తి నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశాను’ అని రాశాడు గౌరీ అగర్వాల్ (Gauri Agarwal) సోదరుడు మెహుల్.అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు గౌరీ అగర్వాల్‌కు జై కొట్టారు.కొందరు ‘ఇది సరికాదేమో!’ అన్నట్లుగా కామెంట్ పెట్టారు.‘నేను కూడా వృత్తిని బాగా ప్రేమిస్తాను. అందుకోసం అపురూప క్షణాలను మాత్రం వృథా చేసుకోవాలనుకోను’ అని ఒకరు రాశారు. చదవండి: 20 ఏళ్లకే రీసైకిలింగ్ కింగ్..!People romanticize startups but it is a lot of work.This is my sister & co-founder @gauri_al at her own wedding, 10 minutes after ceremony, fixing a critical bug at @KoyalAI.Not a photo op, parents yelled at both of us.When people ask why we won, I'll point to this. pic.twitter.com/ee3wTEYwXG— Mehul Agarwal (@meh_agarwal) December 16, 2025
అంతర్జాతీయం
ఉక్రెయిన్‌పై పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్‌లో ఆశించిన సైనిక లక్ష్యాలను సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధక్షేత్రంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా పైచేయి సాధించాయని, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పైకి దండెత్తి దాదాపు నాలుగేళ్లవుతున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఆయన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సైతం నేరుగా లైవ్‌లో సమాధానాలిచ్చారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న వేళ పుతిన్ ఏం మాట్లాడుతారా అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆరంభంలో పెద్ద ఎత్తున దండెత్తి వచ్చిన రష్యా బలగాలను చాలా చిన్నదైన ఉక్రెయిన్ ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టగలిగినప్పటికీ, రాన్రానూ అత్యంత భారీ రష్యా ఆర్మీ, అధునాతన ఆయుధ సంపత్తి ముందు తలొంచక తప్పలేదు. రష్యా బలగాలు యుద్ధ క్షేత్రంలో మెరుపు వేగంతో చొచ్చుకుపోలేకున్నా, క్రమంగా పైచేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘మా బలగాలు యుద్ధక్షేత్రమంతటా ముందుకు వెళ్తున్నాయి. ఒక్కో చోట వేగంగా, మరోచోట నెమ్మదిగా వెళ్తున్నాయి. మొత్తమ్మీద శత్రువు వెనక్కి మరలుతున్నాడు’అని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేందుకు శాంతియుతమైన ఒప్పందం కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల్ని విక్రయించి, ఆ సొమ్మును ఉక్రెయిన్‌కు సాయంగా ఇవ్వాలంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తప్పుబట్టారు. దీనిని పశ్చిమ దేశాలు సాగిస్తున్న దోపిడీగా అభివర్ణించారు. యూరోజోన్పై వ్యాపార, పారిశ్రామికవేత్తలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక అవసరాల కోసం వడ్డీలేని రుణాన్ని అందించడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు అంగీకరించారు. 2026–27 సంవత్సరానికి ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల సాయం చేసేందుకు ఈయూ కట్టుబడి ఉందని కౌన్సిల్ అధ్మయక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో వెల్లడించారు. ఈ ఒప్పందానికి రావడానికి ఈయూ నాయకులు తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఈయూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం ముందున్న బడ్జెట్ లోటును ఇది పూడుస్తుందని, తమ దేశ రక్షణను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
వైట్ హౌస్ సైట్లో... ప్రైవేట్ వీడియో!
వాషింగ్టన్: వైట్ హౌస్.జిఒవి/లైవ్. అత్యంత పటిష్టమైన సెక్యురిటీ వాల్స్ ఉండే, అత్యంత సురక్షితమైన అమెరికా ప్రభుత్వ సైట్. అందులో సాధారణంగా అధ్యక్షుని ప్రసంగాల లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. అంతటి ముఖ్యమైన సైట్ కాస్తా గురువారం రాత్రి పొద్దు ఉన్నట్టుండి పెట్టుబడి పాఠాలు బోధించడం మొదలుపెట్టింది. అలా ఏకంగా 8 నిమిషాల పాటు సాగింది. తీరా చూస్తే అది మాట్ ఫార్లే అనే ఓ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్‌లో చెప్తున్న ఇన్వెస్టిమెంట్ సంబంధిత చిట్కాల తాలూకు లైవ్ స్ట్రీమింగ్. దాంతో అసలిదెలా జరిగిందో తెలియక విస్తుపోవడం వైట్ హౌస్ సిబ్బంది పనయింది. ఇది హ్యాకర్ల పనా, లేక తమవాళ్లే పొరపాటున స్ట్రీమ్ చేశారా అన్నది తేల్చడంలో వాళ్లిప్పుడు తలమునకలుగా ఉన్నారు. ’దీన్ని సీరియస్‌గానే తీసుకున్నాం. విచారణ జరుపుతున్నాం’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దాంతో, దీనితో తనకు ఏ సంబంధమూ లేదని యూట్యూబర్ ఫార్లే చెప్పుకొచ్చాడు. మనవాడు అక్కడితో ఆగలేదు. ‘నా స్ట్రీమ్ అంత పెద్ద సైట్లో అంతమందికి రీచ్ అవుతుందని ముందే తెలిస్తే బాగుండేది! ఇంకాస్త బాగా తయారై కనిపించేవాడిని. ఇంకొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్లు కాస్త నాటకీయ జోడించి మరీ చెప్పేవాడిని‘ అంటూ హాస్యమాడాడు! గత జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రభుత సైట్లు డిజిటల్ సెక్యూరిటీ బ్రీచ్ బారిన పడుతున్న ఉదంతాలు తరచూ జరుగుతున్నాయి. గత మే లో పలువురు అధికారులు, ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలకు అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోన్ నుంచి తనకు తెలియకుండానే మెసేజీకు, కాల్స్ వెళ్లి పెద్ద కలకలమే రేపాయి. ఇక గత ఏడాది ట్రంప్ ఎన్ని ప్రచార వేళ ఇరాన్ హ్యాకర్లు ఏకంగా ఆయన ప్రచార సైట్లలోకి చొరబడ్డారు.
బంగ్లాదేశ్‌లో మళ్లీ మంటలు
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. ‘ఇంక్విలాబ్ మంచ్’ నాయకుడు, విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యాకాండ అగ్గి రాజేసింది. ఈ హత్య పట్ల ఆగ్రహానికి గురైన జనం వీధుల్లోకి వచ్చారు. విధ్వంసం సృష్టించారు. పత్రికా కార్యలయాలపైనా విరుచుకుపడ్డారు. గురువారం రాత్రంతా హింసాకాండ కొనసాగింది. అసిస్టెంట్ ఇండియన్ హైకమిషన్ కమిషనర్ నివాసంపై రాళ్లు రువ్వారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రెహా్మన్ నివాసాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని అల్లరిమూకలు దాడి చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో దీపూచంద్ర దాస్(25) అనే కారి్మకుడు మరణించాడు. ఆటోలో వెళ్తుండగా హదీపై కాల్పులు షరీఫ్ ఉస్మాన్ హదీ గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా వ్యతిరేక రాడికల్ లీడర్‌గా యువతలో గుర్తింపు పొందాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరిగే ఎన్నికల్లో ఢాకా–8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు. ఈ నెల 12వ తేదీన సెంట్రల్ ఢాకాలోని విజోయ్‌నగర్ ప్రాంతంలో ప్రచారానికి ఆటోలో వెళ్తున్న హదీపై ముసుగులు ధరించి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. సరిగ్గా తలపై కాల్చడంతో కుప్పకూలిపోయాడు. ఒక చెవిలోకి దూసుకెళ్లిన తూటా మరో చెవి నుంచి బయటకు వచి్చంది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్‌కు తరలించారు. ఆరు రోజుపాటు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆరోగ్యం విషమించి గురువారం మృతిచెందాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ ఈ విషయాన్ని స్వయంగా టీవీలో ప్రకటించారు. దాంతో జనంలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హదీ మరణాన్ని జీరి్ణంచుకోలేక వీధుల్లో విధ్వంసానికి దిగారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాజ్‌షాహీ సిటీలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. నిరసనకారుల ముసుగులో అల్లరిమూకలు రెచ్చపోయాయి. గురువారం రాత్రంతా దాడులు జరిగాయి. రాజధాని ఢాకాలో నిరసనకారులు ఛాయానత్ అనే సాంస్కృతిక సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. ఫరి్నచర్‌ను బయటపడేసి నిప్పుపెట్టారు. బంగ్లా పత్రికలు ప్రొథోమ్ అలో, డెయిలీ స్టార్ కార్యాయాలపైనా దాడులు జరిగాయి. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు..హదీని హత్య చేసిన దుండుగులు భారత్‌కు పారిపోయారని ఆరోపిస్తూ నేషనల్ సిటిజెన్ పారీ్ట(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దుండగులను వెనక్కి తీసుకొచ్చేదాకా భారత హైకమిషన్‌ను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంయమనం పాటించాలని యూనస్ వినతి హింసాకాండ పట్ల మొహమ్మద్ యూనిస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంయమనం పాటించాలని, దాడులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. హదీని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హంతకులపై దయ చూపించే ప్రసక్తే లేదన్నారు. శనివారం సంతాపం దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వాయిదా తప్పదా? బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఇంతలోనే షరీఫ్ ఉస్మాన్ హత్య జరగడం, విధ్వంసం ప్రారంభం కావడంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.రిజర్వేషన్లతో మొదలైన రగడ → ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా(రిజర్వేషన్లు) వ్యవస్థను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రారంభించిన పోరాటం చివరకు ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి దారితీసింది. → 1971 నాటి బంగ్లా విమోచన ఉద్యమం పాల్గొన్నవారి వారసులకు ఉద్యోగాల్లో ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 2024 జూలైలో ఆందోళన ప్రారంభించారు. ఇది ‘జూలై తిరుగుబాటు’గా పేరుగాంచింది. → షేక్ హసీనా తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆందోళనకారులు పోరాటం ఉధృతం చేశారు. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మైనారీ్టలపై విచ్చలవిడిగా దాడులు జరిగా యి. → చేసేది లేక షేక్ హసీనా అప్పటికప్పుడే దేశం విడి చిపెట్టి వెళ్లిపోవాల్సి వచి్చంది. భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కలి్పంచింది. → నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. → షేక్ హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. → మరోవైపు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని, 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని మొహమ్మద్ యూనస్ ప్రకటించారు. → ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడం సంచలనాత్మకంగా మారింది. దీపూచంద్ర దాస్‌ను కొట్టి చంపారు బంగ్లాదేశ్‌లపై మైనారీ్టలైన హిందువులపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. 25 ఏళ్ల దీపూచంద్ర దాస్‌ను గురువారం రాత్రి దారుణంగా కొట్టి చెట్టుకి కట్టి ఊరి తీశారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దీపూచంద్ర దాస్ మైమెన్సింగ్ సిటీలో ఓ ఫ్యాక్టరీలో కారి్మకుడిగా పని చేస్తున్నాడు. దైవ దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అల్లరిమూక అతడిని హత్య చేసినట్లు బంగ్లా ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. దీపూచంద్ర హత్యను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. అతడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కచి్చతంగా శిక్షిస్తామని పేర్కొంది.బంగ్లాదేశ్‌ను గడగడలాడిస్తా.. షరీఫ్ ఉస్మాన్ హదీపై కాల్పులు జరిపిన దుండుగుల్లో ఫైజల్ కరీంను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పక్కాప్రణాళికతోనే హదీని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ హత్య తర్వాత దేశమంతటా తీవ్రస్థాయిలో అలజడి రేగుతుందని అతడు ముందే ఊహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న హదీపై కాల్పులు జరగ్గా, అంతకుముందు రాత్రి ఢాకా శివార్లలోని ఓ రిసార్ట్‌లో ఫైజల్ కరీం తన గర్ల్‌ఫ్రెండ్ మరియా అఖ్తర్ లీమాతో ఉన్నాడు. బంగ్లాదేశ్‌ను వణికించే పెద్ద సంఘటన జరగబోతోందని ఆమెతో చెప్పాడు. దేశాన్ని గడగడలాడించబోతున్నానని పేర్కొన్నాడు. మరుసటి రోజే మరో ఇద్దరితోపాటు కలిసి హదీపై కాల్పులు జరిపాడు.
బంగ్లాలో దారుణం.. హిందూ యువకుడిని చంపి ఆపై..
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు నానాటీకీ పెరిగిపోతున్నాయి. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం నేపథ్యంలో అక్కడి అల్లరి మూకలు రెచ్చిపోయాయు. గురువారం రాత్రి మైమెన్ సింగ్ అనే జిల్లాలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఒక హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టి చంపారు.బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి, హింస తీవ్రస్థాయికి చేరుకుంది. భారత వ్యతిరేఖ భావజాలం గల నేత షరీప్ ఉస్మాన్ హాదిని డిసెంబర్ 12న గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చారు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం సింగపూర్ తరలించారు. కాగా షరీప్ ఉస్మాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లాలో మరోసారి హింస చేలరేగింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఉస్మాన్ మృతిచెందారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఢాకాలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ హిందూ యువకుడిని కొట్టిచంపారు.ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ "ఒక అల్లరిమూకల సమూహం గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి చంపారు. అనంతరం అతనిని కాల్చివేశారు. మంటలలో వేసే ముందు నిరసన కారులు అతని శరీరాన్ని చెట్టుకు పట్టుకొని వ్రేలాడదీశారు." అని అధికారి అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అల్లరి మూకలను చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మైమెన్ మెడికల్ కాలేజ్‌కి తరలించామని తెలిపారు. ఈ ఘటన భాలుకా ఉప జిల్లా స్క్వేర్ మాస్టర్ బారిలో జరిగిందని తెలిపారు. బాధితుడు స్థానికంగా ఓ వస్త్రకర్మాగారంలో పనిచేస్తున్నారని అతని పేరు దీపు చంద్రదాస్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతుడి బంధువులకోసం వెతుకుతున్నామన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు వచ్చి కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు తావులేదని పేర్కొంది. కాగా బంగ్లాలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-జూన్ ప్రాంతంలో ఆ దేశంలో మైనార్టీలపై దాడుల ఘటనలు 258 జరిగాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 20 పైగా మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 59 దేవాలయాలపై దాడులు జరిగాయి.
జాతీయం
యాప్స్‌తో ఫుడ్ పెరిగింది
ఫుడ్ డెలివరీ యాప్స్ రాకతో ప్రజల ఆహార అలవాట్లు, పరిశ్రమ రూపురేఖలు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయాయి. కూర్చున్న చోటకే నిమిషాల్లో ఫుడ్ ప్రత్యక్షం అవుతోంది. కస్టమర్లు విభిన్న వంటకాలను ఆస్వాదించే అవకాశాలు పెరిగాయి. అటు రెస్టారెంట్ల వ్యాపారం.. బిర్యానీ తిన్నంత నిండుగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఎన్సీఏఈఆర్ ఏం చెప్పిందంటే... ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వెల్లువెత్తుతున్న ఆర్డర్ల విలువ రెండేళ్లలోనే రెండింతలైందని ఆర్థిక విధానాల మేథోమధన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైల్డ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్‌తో కలిసి ఎన్సీఏఈఆర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా హోటళ్లు సేవలు అందించే ప్రాంతం విస్తృతి పెరిగింది. వేలాది రెస్టారెంట్లు కస్టమర్ల మొబైల్ తెరపై ప్రత్యక్షం అవుతున్నాయి. కొత్త కొత్త వంటకాలు ఆఫర్ చేసే అవకాశం రెస్టారెంట్లకు కలిగింది. నూతన కస్టమర్లనూ అందిపుచ్చుకున్నాయి. అయితే అధిక కమీషన్ల కారణంగా ఈ ప్లాట్‌ఫామ్స్ నుంచి తప్పుకోవాలని కొన్ని హోటళ్లు భావిస్తుండడమూ కొసమెరుపు. రెండింతలైన విలువ..: మన దేశంలో 2023–24లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రూ.1.2 లక్షల కోట్ల విలువైన ఫుడ్‌ను కస్టమర్లకు చేర్చాయి. 2021–22లో ఇది రూ.61,271 కోట్లుగా నమోదైంది. ఈ రంగం భారత ఆర్థికవ్యవస్థ కంటే వేగంగా విస్తరిస్తోంది. తద్వారా శక్తివంతమైన ఆర్థిక చోదకంగా అవతరించింది. దీంతో జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 0.14 నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవల రంగాలతో పోలిస్తే ఫుడ్ యాప్స్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఫుడ్ డెలివరీ రంగం రెస్టారెంట్లు, వ్యవసాయం, రవాణా, సాంకేతికత విభాగాల్లో రెండింతల ఆర్థిక విలువను జోడిస్తోంది. ఫుడ్ యాప్స్‌లో రూ.10 లక్షల విలువైన ఆర్డర్లు కొత్తగా తోడైతే.. మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ.20.5 లక్షల విలువైన ఉత్పత్తి అదనంగా వచ్చి చేరుతోందని నివేదిక వెల్లడించింది. ఉపాధి జోరు..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఉపాధి పొందుతున్నవారి సంఖ్య భారత్‌లో 2021–22లో 10.8 లక్షల నుంచి 2023–24లో 13.7 లక్షలకు చేరింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా 12.3% అధికం అవుతోంది. ఇతర రంగాల్లో వార్షిక వృద్ధి 7.9% ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకరికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తే.. విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. రుచించని కమీషన్..: ప్రతి ఆర్డర్‌పై ఫుడ్ యాప్స్ ప్రస్తుతం వసూలు చేస్తున్న కమీషన్ మూడింట ఒక వంతు రెస్టారెంట్ ఓనర్లకు రుచించడం లేదు. ఈ కమీషన్లు ఏటా పెరుగుతూ బిల్ విలువలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తున్నాయి. ఆర్డర్ల పరిమాణం బలంగా ఉన్నా, సమకూరే నికర ఆదాయాలు తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై కమీషన్ 2019లో 9.6% నుండి 2023లో 24.6%కి వచ్చి చేరింది. కమీషన్ల విషయంలో పెద్ద హోటళ్లకు ఈ యాప్స్‌తో బేరమాడుకునే శక్తి ఎక్కువ. కానీ చిన్న హోటళ్లకు ఆ అవకాశం తక్కువగా ఉండడంతో లాభాలపై ఒత్తిడి ఉంటోంది. పేలవమైన కస్టమర్ సరీ్వస్, తగినంత లాభదాయకత లేకపోవడం కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్‌ను విడిచిపెట్టాలని భావిస్తున్నట్టు 35% మంది ఓనర్లు వెల్లడించారు. దేశంలో 28 నగరాల్లోని..: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌తో రెస్టారెంట్లు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 28 ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని 640 రెస్టారెంట్లను విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు. 2023లో ఈ ప్లాట్‌ఫామ్స్ గురించి ఎన్సీఏఈఆర్ విడుదల చేసిన నివేదికతో పోల్చారు. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రాకతో.. ⇒ ఫుడ్ యాప్స్‌తో తాము సేవలందిస్తున్న ప్రాంత పరిధి పెరిగిందన్న 59% రెస్టారెంట్లు.⇒ నూతన వంటకాలను జోడించినట్టు 52.7% మంది ఓనర్లు తెలిపారు⇒ కస్టమర్ల సంఖ్య దూసుకెళ్లిందని 50.4% మంది పేర్కొన్నారు.⇒ 2019–23 మధ్య ఈ యాప్స్ ద్వారా రెస్టారెంట్ల ఆదాయ వాటా 22% నుంచి 29%కి చేరింది.ఫుడ్ యాప్స్ విశేషాలు.. ⇒ భారత్‌లో ఈ ఏడాది జూన్ నాటికి 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ⇒ రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 6 కోట్లు మాత్రమే. ఈ కాలంలో యూజర్లు మూడింతలు దాటారు. ⇒ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడకంలో ప్రపంచంలో మన దేశానిదే పైచేయి. ⇒ మొత్తం ఫుడ్ యాప్స్ డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా ఏకంగా 43.79% ఉంది.
శబరిమల: ఎయిర్‌పోర్టు పనులకు ముందడుగు
కేరళ, ఎరుమేలిలో కేంద్రం నిర్మించబోయే శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులలో ముందడుగు పడింది. విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ, పరిహార అంచనా తదితర పనులను సంబంధిత రెవెన్యూశాఖ ప్రారంభించింది. రెవిన్యూ అధికారులు స్థలసేకరణ, భవనాలు, చెట్లు తదితర పరిహారానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.ఏటా అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున కేరళకు వస్తుంటారు. అయితే భక్తుల సౌకర్యం దృష్ట్యా స్వామివారి దర్శనానికి భక్తులకు దగ్గరగా ఉండే విధంగా ఎరుమలిలో ఎయిర్‌ఫోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా అధికారులు దానికి సంబంధించి స్థల సేకరణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చెరువల్లి ఎస్టేట్‌లో భూమిసేకరణలో భాగంగా చెట్లు, భవనాల విలువని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో మెుత్తం 916.27 హెక్టార్లు భూమి సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో 121.876 హెక్టార్లు స్థలంలో భవనాలు, నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. వాటి విలువ సేకరించిన అనంతరం పరిహారం నిర్ణయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళలో కేంద్రం ప్రతిపాదించిన శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలైలో ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.7,047 కోట్లు కాగా నిర్మాణం కోసం ఎరుమెలి,చెరువల్లి ఎస్టేట్లలో 2,570 ఎకరాల భూమి అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు భూమి సేకరణ పనులు ప్రారంభించారు.
పొగమంచు ఎఫెక్ట్: వెనుదిరిగిన ప్రధాని మోదీ హెలికాప్టర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పూర్‌లో శనివారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీకి నిరాశ ఎదురైంది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో, తక్కువ దృశ్యమానత కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్‌పూర్ హెలిప్యాడ్‌లో దిగలేకపోయింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు హెలికాప్టర్‌ను తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి మళ్లించినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.తాహెర్‌పూర్ చేరుకున్న ప్రధాని ఛాపర్, హెలిప్యాడ్‌పై దిగడానికి ముందు మైదానం చుట్టూ కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. అయితే పొగమంచు ఏమాత్రం తగ్గకపోవడంతో ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేవని అధికారులు నిర్ధారించారు. ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ప్రధాని హెలికాప్టర్ అక్కడి నుంచే యూటర్న్ తీసుకుని వెనుతిరిగింది.వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. హెలికాప్టర్ కోల్‌కతా విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుందని, అక్కడ నుంచి తదుపరి కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ భవన సముదాయానికి చేరుకున్న సమయంలో చిరునవ్వుతో అభివాదం చేస్తున్న దృశ్యాలను కూడా పీటీఐ విడుదల చేసింది. అయితే తాహెర్‌పూర్ పర్యటనలో ఎదురైన ఈ ఆటంకం కారణంగా ప్రధాని మోదీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
టీవీ డిబేట్లో రామ్‌దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో
ఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్ లైవ్ డిబేట్లో సహనాన్ని కోల్పోయారు. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై పిడిగుద్దులు కురిపించారు. అమర్ ఉజాలా లైవ్ డిబేట్ సందర్భంగా గందరగోళం జరిగింది. ఇది కాస్తా ముదిరి శారీరక ఘర్షణగా మారిపోయింది. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై దాడికి దిగారు. అవతలి వ్యక్తి దానిని ప్రతిఘటించి రామ్‌దేవ్‌ను స్టూడియో ఫ్లోర్‌పై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.హర్యానాలో ఇది ఫ్యామస్ అంటూ కొన్ని వ్యాయామాలు చేశారు రామ్‌దేవ్. ఆ తరువాత ఛాలెంజ్ అంటూ తోటి ప్యానలిస్ట్‌పై లంఘించారు. ఇలా కొద్ది క్షణాలు సాగిన తరువాత ఇది జోక్‌గానే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అతనికి శక్తిలేదు ఒప్పుకున్నాడు... అతనికోసం చప్పట్లు అంటూ అక్కడున్నవారిని ఉత్సాహపరచడంతో ఈ వివాదం సద్దు మణిగినట్టు అయింది. కాగా టెలివిజన్ చర్చల సమయంలో ఇలాంటి వింత ప్రవర్తనలతో రామ్‌దేవ్ ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా కమెంట్ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. వార్తా వేదికలు "కుస్తీ వేదికలు"గా మారాయని అనేక మంది వినియోగదారులు వ్యాఖ్యానించగా, ఛానెల్స్ చర్చల పేరుతో, "TRPల కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని మరికొందరు ఆరోపించారు. Leaving this here. pic.twitter.com/jyIilfWHkz— Piyush Rai (@Benarasiyaa) December 20, 2025
ఎన్ఆర్ఐ
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్‌పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్‌లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్‌పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన)
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
క్రైమ్
లవ్ మ్యారేజ్ చేసుకుని..కొట్టి చంపేశాడు
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్ విధించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన పరమేశ్, తన భార్య అనూష (20)ను వరకట్నం తీసుకురావాలంటూ గురువారం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారైన విషయం విదితమే. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలి భర్త పరమేశ్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకంగా మారిన సీసీ పుటేజీ.. ఈ హత్య కేసులో నిందితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజీ కీలకంగా మారింది. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం లావుపాటి కర్రతో అనూష తలపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్నట్లు నిక్షిప్తమైంది. Sensitive Content సీసీ ఫుటేజ్.. ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపిన భర్తతాండూరులోని సాయాపూర్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు..కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనూష.. చికిత్స మృతియువకుడి… https://t.co/ujX5RCu0jI pic.twitter.com/gnlmskOTnv— Telugu Scribe (@TeluguScribe) December 19, 2025 ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
70 ఏళ్లొచ్చినా.. రోజూ లైంగిక వేధింపులే
కర్ణాటక: 70 ఏళ్ల వయసు వచ్చింది, రోజూ సతాయిస్తూ నరకం చూపుతున్నాడు అని భర్త మీద 65 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ప్రిన్సిపాల్ గోవిందరాజనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెప్పిన మాట వినడం లేదని నేను, నా ఇద్దరు కుమారులు 8 రోజుల్లోగా ఇంటి నుంచి బయటికి వెళ్లాలని భర్త లీగల్ నోటీస్ ఇచ్చాడని తెలిపింది.హత్య బెదిరింపులు..వివరాలు.. బాధితురాలు ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేసి రిటైరయ్యారు. ఆమె మంచి హోదాలో ఉండడం భర్తకు నచ్చేది కాదు. జీతం, గ్రాట్యూటీ, పింఛన్, ఆస్తులను తన పేర మార్చాలని ఒత్తిడి చేసేవాడు. అతడు 1993లో కుద్రేముఖ్‌లో గనులలో ఉద్యోగం చేస్తూ మానేశాడు. అప్పటి నుంచి భార్యను లైంగిక క్రియ కోసం రోజూ వేధిస్తున్నాడు. అయినా సహిస్తూ వచ్చింది. నవంబరు 22 తేదీన బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు, ప్రతిఘటిస్తే గొంతునులిమి, కొట్టి, దూషించాడు. అంతేగాక తన ఇద్దరు కుమారులను హత్యచేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. ఇంటి సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయినట్లు తెలిపింది. తనకు గుండెకు బైపాస్ సర్జరీ అయ్యిందని, శ్వాసకోశ జబ్బుతో చికిత్స పొందుతున్నానని, భర్తకు ఏమాత్రం జాలి, దయ లేదని వాపోయింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సదరు శాడిస్టు భర్తకు నోటీస్ జారీచేశారు.
కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి
కర్ణాటక: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్‌బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. What’s wrong??https://t.co/pbux7NWQ0T— Divya Gandotra Tandon (@divya_gandotra) December 19, 2025
తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..
రామచంద్రాపురం (పటాన్చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్ పటేల్ కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్ నగర్ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
కోతుల కోసం చింపాంజీ ఐడియా
3 కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్

