Vikarabad
-
వికారాబాద్‌లో తనిఖీలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాల్లో బుధవారం డాగ్ స్క్వాడ్, బీడీ టీంలు తనిఖీలు చేపట్టాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. కడ్తాల్ ఎస్ఐకి ఉత్తమ పోలీసు అధికారి అవార్డు కడ్తాల్: నేర పరిశోధన విభాగం 2024 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కడ్తాల్ ఎస్ఐ వరప్రసాద్ ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు అందుకున్నారు. పీఎస్ పరిధిలో నమోదైన పలు కేసులను వేగంగా దర్యాప్తు చేయడంతో, ఉత్తమ సేవలకు గానూ బుధవారం డీజీపీ జితేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎస్ఐ వరప్రసాద్‌తో పాటు బెస్ట్ హోంగార్డుగా అవార్డు తీసుకున్న పాండును సీఐ గంగాధర్, పోలీసులు అభినందించారు. ప్రేమ పేరుతో మోసం సాఫ్ట్వేర్ ఉద్యోగికి రిమాండ్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరుకు చెందిన దుబ్బాక సాగరిక ఆదిబట్ల టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2022లో కోల్కటా టీసీఎస్‌లో పని చేసిన సమయంలో సహోద్యోగి పత్లావత్ సంజీవతో ఆమెకు పరియచం ఏర్పడింది. ప్ర స్తుతం వీరిద్దరూ ఆదిబట్ల టీసీఎస్‌లో ఉద్యో గం చేస్తూ సహజీవనంలో ఉన్నారు. ఈక్రమంలో సాగరిక గర్భం దాల్చింది. దీంతో సంజీవ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు, బుధవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. సాగరికకు అబార్షన్ చేసిన తుర్కయంజాల్‌లోని మహోనియా ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు రానివ్వం
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ యాలాల: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు బెన్నూరు, లక్ష్మినారాయణపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశా రు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు ధా న్యం తడవకుండా, తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తూకం వేసిన ధా న్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. లారీల కొరత ఉందని ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్ఐ వేణు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టీబీ ముక్త్ అభియాన్ అనంతగిరి: జిల్లాలో ఈ నెల 22 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్. వెంకటరవణ, జిల్లా టీబీ ప్రొగ్రాం అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రోజులు పాటు క్షేత్రస్థాయిలో టీబీ రోగులకు గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ప్రత్యేకంగా పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ వచ్చిందన్నారు. 2030 నాటికి దేశంలో టీబీని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు. టీబీని ప్రాథమిక దశలోనే గుర్తించడం, సరైన చికిత్స అందించడం, చికిత్స మధ్యలో ఆపివేయకుండా చూసుకోవడంతో వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. చికిత్స పొందుతున్న రోగులకు ఆరు నెలల పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పోషకాహారం కోసం ఇవ్వనున్నట్లు వివరించారు. పాఠశాల పునర్నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పాత శిశుమందిరం పునర్నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారు. బుధవారం పాఠశాల పూర్వ విద్యార్థి చంద్రశేఖర్‌రెడ్డి తనవంతుగా రూ.10 లక్షలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును పాఠశాల విద్యాపీఠం ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అభినందించారు. ఏపీఎంపై డీఆర్డీఓకు ఫిర్యాదు నందిగామ: నందిగామ మండల మహిళా సమాఖ్యలో ఏపీఎంగా పనిచేస్తున్న యాదగిరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీసీ యాదయ్య జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వీర్లపల్లి సంఘంలో ఎలాంటి తీర్మానాలు లేకుండా రూ.3 లక్షలు చెక్కురూపంలో నిధులను మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్లస్టర్లో సీసీగా పనిచేస్తున్న తనకు ఈ విషయం తెలియడంతో ఏపీఓను ప్రశ్నించగా తననే దూషించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఏపీఎం యాదగిరిని వివరణ కోరగా.. అందులో తన ప్రమేయం లేదని, అకారణంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజానిజాలు విచారణలో తేలుతాని స్పష్టంచేశారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐపై వేటు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై వేటు పడింది. ఆయనను మల్టీజోన్ రేంజ్ ఆఫీస్‌కు సరెండర్ చేస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో మంచాల ఎస్ఐగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ ఓ యాక్సిడెంట్ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితమే ఆయన ఇబ్రహీంపట్నం పీఎస్ నుంచి రిలీవ్ అయినట్లు సమాచారం. -
కాగ్నా.. ఖాళీ!
యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపుఇటీవల తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి శివారులోని కాగ్నా నది నుంచి అర్ధరాత్రి వేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అదే గ్రామానికి చెందిన జర్నప్ప డయల్ 100కు కాల్ చేసి చెప్పాడు. అరగంట వ్యవధిలో జర్నప్ప వద్దకు అగ్గనూర్కు చెందిన ఓ నాయకుడు తన అనుచరులతో వచ్చాడు. పోలీసులకు సమాచారం ఇస్తావా అంటూ దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇస్తే ఇసుక వ్యాపారులు రావడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఈ ఒక్క సంఘటన చాలు ఇసుక మాఫియాకు పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటో అనేది అర్థమవుతుంది. జర్నప్ప ఒక్కడిమీదే కాదు ఇసుక అక్రమ రవాణాకు అడ్డు వచ్చే వారు ఎవరైనా దాడులకు గురికావడం నిత్యకృత్యంగా మారింది. గతేడాది ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఎస్ఐలు, సీఐలపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు. తాండూరు: నియోజకవర్గంలోని నాలుగు మండలాలను తాకుతూ కాగ్నానది ప్రవహిస్తుంది. వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భూగర్భ జలాల పెంపునకు ఈ నది ఎంతగానో దోహదం చేస్తుంది. తాండూరు పట్టణంతోపాటు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తుంది. కొడంగల్ నియో జకవర్గానికి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అలాంటి కాగ్నాపై రాబందుల్లా ఇసుక వ్యాపారులు విరుచుకపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ఇసుక రవాణాకు అడ్డంకి లేకుండా చూసుకుంటున్నారు. రెండు నెలల క్రితం వీర్‌శెట్టిపల్లికి చెందిన జర్నప్ప ఇసుక అక్రమ రవాణాపై డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసుల ద్వారా ఆ సమాచారం ఇసుక మాఫియాకు చేరింది. సదరు వ్యక్తిపై అక్రమార్కులు దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. అనుమతి లేకుండానే.. ఉదయం 11 గంటల ప్రాంతంలో కాగ్నానది నుంచి ఇసుక లోడ్‌తో ట్రాక్టర్లు తాండూరు పట్టణానికి రావడం కనిపించింది. నది నుంచి వరుసగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు బయటికి వచ్చాయి. అనుమతి పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే మా ఓనర్ వద్ద ఉన్నాయంటూ ట్రాక్టర్ డ్రైవర్లు సమాధానం చెప్పారు. ఇసుక తవ్వుతున్న చోట రెవెన్యూ సిబ్బంది కనిపించలేదు. చెక్ డ్యాం పక్కనే తవ్వకాలు తాండూరు పట్టణ శివారులో కాగ్నా నదికి సంబంధించిన చెక్‌డ్యాం ఉంది. ఇక్కడి నుంచి పట్టణానికి తాగునీరు సరఫరా అవుతుంది. చెక్ డ్యాం ద్వారా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడి పంప్ హౌస్‌కు ఇరువైపులా ఇసుక తోడేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెక్ డ్యంకు 3 కిలోమీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు చేయరాదు. కానీ ఇసుక వ్యాపారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అన్ని మండలాల్లో ఇదే తంతు తాండూరు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాల్లో ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగుతోంది. ఇసుక వ్యాపారులు మాఫియాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. పెద్దేముల్ మండలం రేగొండి, రుక్మాపూర్, మంబాపూర్, మన్సాస్పల్లి, పెద్దేముల్, మంబాపూర్ గ్రామాల్లో ఇసుక రవాణాకు అడ్డూఅదపు లేకుండా పోయింది. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్, కో కట్,సంగెంకుర్దు, దేవనూర్, అగ్గనూర్ గ్రామాలు.. బషీరాబాద్ మండలం ఎక్మాయి, జీవన్గి, క్యాద్గిరా, ఇందర్‌చెడ్, దామర్‌చెడ్, మంతట్టి, రెడ్డిగణపూర్, గొట్టిగకలాన్ గ్రామాలు, తాండూరు మండలంలో పాత తాండూరు, బిజ్వార్, చిట్టిగణపూర్, చంద్రవంచ, నారాయణపూర్, వీర్‌శెట్టిపల్లి గ్రామా లు ఇసుక రవాణాకు కేంద్రంగా మారాయి. తాండూరు పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నా ఇసుక రవాణాను కట్టిడి చేయలేకపోతున్నారు. రోజూ 300ల ట్రాక్టర్లతో..కాగ్నానది నుంచి నిత్యం 300ల ట్రాక్టర్లతో పదుల ట్రిప్పులు ఇసుక తరలిస్తున్నారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం ప్రాంభమవుతుంది. వర్షాలు పడితే ఇసుక సేకరణకు అవకాశం ఉండదు. దీంతో అక్రమార్కులు వీలైనంత వరకు ఇసుకను తోడేసి ఖాళీ స్థలాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయం పోలీసులు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక టన్ను నాణ్యమైన ఇసుకకు మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3వేల ధర పలుకుతోంది. ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. టిప్పర్‌కు రూ.50 వేలు తీసుకుంటున్నారు. రాత్రి వేళ ట్రాక్టర్ల మోతఅర్ధరాత్రి వేళ ఇసుక ట్రాక్టర్ల కారణంగా కంటిమీద కునుకు లేకుండా పోతోందని పాతతాండూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత తాండూరు మీదుగా రెండు మార్గాల ద్వారా కాగ్నానదిలోకి దారి ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల తిరుగుతున్నాయి. వాటి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. నిత్యం 300ల ట్రాక్టర్లతో వేల ట్రిప్పులు రూ.లక్షల్లో వ్యాపారం ఫిర్యాదు చేసే వారిపై దాడులకు తెగబడుతున్న అక్రమార్కులు చోద్యం చూస్తున్న పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కాగ్నానది నుంచి రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలి స్తున్నారని డయల్ 100 కు ఫోన్ చేశా. ఇసుక వ్యాపారులు ఇంటికి వచ్చి నాపై దాడి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశా. నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. – జర్నప్ప, వీర్‌శెట్టిపల్లి, తాండూరు మండలంఆ ప్రాంతాల్లోనే తవ్వకాలు చేయాలి కాగ్నానదిపరీవాహక ప్రాంతంలో ఆరు చోట్ల ఇసుక త వ్వకాల కోసం పాయింట్ల ను గుర్తించాం. ఇసుక అవసరం ఉన్న వారు రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే అనుమతులు ఇస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇసుక సేకరించాలి. – సత్యనారాయణ, ఏడీ, గనుల శాఖ కేసులు పెడుతున్నాం కాగ్నానది నుంచి ఇసుక అ క్రమ రవాణాను అడ్డుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై కేసులు నమో దు చేశాం. అనుమతి పత్రాలు ఉంటేనే ఇసుకను తరలించాలి. ఇసుక రవాణాపై సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నాం. – బాలకృష్ణారెడ్డి, డీఎస్పీ, తాండూరు సబ్‌డివిజన్ -
పనిచేసే కార్యకర్తలకే పదవులు
● పీసీసీ ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు వినోద్‌రెడ్డి ● నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి: పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే పదవులు ఇస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు వినోద్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటిపెట్టుకొని ఉన్నవారిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. పార్టీకి సేవ చేసిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువవికాసం వంటి వాటిపై ఇంటింట ప్రచారం చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభి వృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఈ ప్రాంతానికి వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ స్పోక్స్ పర్సన్ నరేందర్ యాదవ్, పీసీసీ సభ్యుడు రితిక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పూడూరు, దోమ, చౌడాపూర్ మండలాల అధ్యక్షులు సురేందర్ ముదిరాజ్, విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’
తాండూరు టౌన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఆదివారం సైతం పరీక్ష కొనసాగనున్నది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ, సింధు బాలికల, తెలంగాణ మైనారిటీ బాలికల కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జనరల్ విభాగంలో ఫస్టియర్ 2,965 మంది, సెకండియర్ 952 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 454 మంది, సెకండియర్ 292 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కస్టోడియన్ కృష్ణయ్య తెలిపారు. పరీక్షల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఒకే కేంద్రంలో పరీక్షలు కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు కేంద్రం లోపలికి అరగంట ముందు అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని చెప్పారు. తాండూరులో నాలుగు పరీక్ష కేంద్రాలు -
కొనసాగుతున్న శిక్షణ తరగతులు
దౌల్తాబాద్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్‌పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం రెండో రోజు శిక్షణలో పలు విషయాలు తెలియజేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆర్పీలు సాయిలు, భీమప్ప చెప్పారు. గణితం, తెలుగు సామాన్యశాస్త్రం సబ్జెక్టులపై శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్‌స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో గేదె మృతి కుల్కచర్ల: విద్యుదాఘాతంతో ఓ గేదె మృతిచెందిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కల్మన్‌కాల్వ గ్రామం పెద్దోళ్ల రాజేందర్‌రెడ్డికి చెందిన గేదె తన పొలంలో గాలికి తెగిపడిన విద్యుత్తు వైరుకు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు రూ.లక్ష వరకు నష్టపోయామని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అదుపుతప్పి కారు బోల్తా మొయినాబాద్: అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం జేబీఐటీ కళాశాల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న క్వాలీస్ కారు అతివేగంతో వెళ్తూ అమ్డాపూర్ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో సైకిళ్ల అందజేత కందుకూరు: లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులు సురక్షిత, ప్రవీణకు బుధవారం ఈ–సైకిళ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ జి.మహేంద్రకుమార్‌రెడ్డి చేతుల మీదుగా బాలికలకు అందించి ఒక్కో సైకిల్ ధర రూ.10 వేలు ఉంటుందని కోశాధికారి కె.వెంకటేశ్వర్లుగుప్తా తెలిపా రు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
కుల్కచర్ల: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పుట్టపహాడ్ గ్రామానికి చెందిన హరిశ్చందర్ బుధవారం రాత్రి 9 గంటలకు వ్యక్తిగత పని నిమిత్తం తన బైక్‌పై మహబూబ్‌నగర్ వెళ్తున్నాడు. మార్గమధ్యలో గ్రామ శివారు దాటక ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట నిఘాచేవెళ్ల: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయని, అన్ని కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని చేవెళ్ల ఎస్ఐ వనం విరీష చెప్పారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరై ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య ఇబ్రహీంపట్నం రూరల్: అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. స్ఫూర్తి కళాశాల సమీపంలో నాదర్గుల్లో నివాసం ఉండే మడను అవినాష్(20) అనే యువకుడు కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. వృక్తి అదృశ్యం యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ(50) ఈ నెల 7న పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా జాడలేదు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి కడ్తాల్: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని పుల్లేర్బోడ్తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేనావత్ గోపాల్‌నాయక్‌కు ఉన్న పాడి ఆవు మేత మేసుకుంటూ పక్క పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. దీంతో విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు బాధిత రైతు తెలిపారు. ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. -
పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు
మొయినాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేల ఆరోగ్యం, నీటి వినియోగం, పర్యావరణ రక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట పైర్లు సాగుచేసి భూమిలో కలియదున్నడంతో భూసారం పెరుగుతుందన్నారు. ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఖర్చులు తగ్గించాలని.. నీటి వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానాలను అవలంబించాలన్నారు. పర్యావరణ రక్షణకు చెట్లను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ సునీల్‌కుమార్, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప -
ఆధునిక పద్ధతుల్లో బోధన చేపట్టాలి
కొత్తూరు: మారుతున్న విద్యావ్యవస్థ, పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్దతుల్లో మార్పులు చేసుకోవాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్పీడీ) రమేశ్ సూచించారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో సీఆర్పీ, ఎస్జీటీ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి, శ్రద్ధ పెంచేందుకు ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. బడిబాటలో భాగంగా బడిఈడు పిల్లను బడుల్లో చేర్పించేలా ఉపాధ్యాయులకు స్థానికులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ అంగూర్‌నాయక్, ఉపాధ్యాయులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ రమేశ్ -
విరిగిన చెట్ల కొమ్మలు
మొయినాబాద్: అకాల వర్షం ఆగమాగం చేసింది. మొయినాబాద్ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు నిలిచింది. మున్సిపల్ కేంద్రంతోపాటు అజీజ్‌నగర్ చౌరస్తా, హిమాయత్‌నగర్ చౌరస్తా, గండిపేట చౌరస్తా, కనకమామిడి గేటు సమీపంలో రోడ్డుపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బలమైన ఈదురుగాలులకు ముర్తుజాగూడలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. సుమారు నాలుగు గంటలపాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
తుక్కుగూడ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలల గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో హామీలు నెరవేర్చలేదన్నారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు, తులం బంగారం అందజేస్తామన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ బంగారం అందలేదని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా వాగ్దానాలు ప్రకటించారని మండిపడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ వాణి, ఏఎంసీ చైర్మన్ కృష్ణానాయక్, మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు, లబ్ధిదారులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ -
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
షాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా): రంగాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశ్‌కు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు మాన్యశ్రీ, ఆర్యాధ్య, కూమారుడు ప్రనిల్ ఉన్నారు. మల్లేశ్ మండల పరిధిలోని నాగర్‌గూడలో కులవృతి అయిన కటింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. సోలీపేట్కు చెందిన మంగలి బాలమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అందరి వివాహాలయ్యాయి. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పెళ్లికి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా, మోక్షిత నీలోఫర్‌లో చికిత్స పొందుతోంది.అనాథలయ్యామురా.. ‘తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా.. నేను, నా పిల్లలు అనాథలయ్యామురా’.. అంటూ పెళ్లి కుమారుడి (సతీష్) అక్క స్వప్న తన తమ్ముడి పట్టుకుని విలపించింది. తండ్రి రామస్వామి రాగానే నా బతుకు ఆగమయ్యింది నాన్నా అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. న్యాయం జరిగేలా చూస్తాం.. రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, డాక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, మహేందర్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, నరేందర్, రఫిక్, దయాకర్ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తామని తెలిపారు. చదవండి: చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం -
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ పరిగి: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ అన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ కోసం మంగళవారం నస్కల్ గ్రామంలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. స్థల సేకరణ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళుతామని తెలిపారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. తద్వారా వారి కాళ్లపై వారు నిలబడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం రామ్మూర్తి, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఐ దివ్య, సీసీ రాంచంద్రయ్య పాల్గొన్నారు. -
కార్మిక సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: కార్మిక సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వికారాబాద్ మార్కెట్ యార్డు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సీఐటీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అలాగే పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీ వేతనాలు వచ్చేలా చూడాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికారాబాద్‌లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు 8 గంటల పనివిధానం అమలు చేయాలని విన్నవించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో ఆయా యూని యన్ల నాయకులు అమృత, భారతి, రేణుక, పెంటమ్మ, నర్సింలు, నీలమ్మ, శంకర్, శివకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్ -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా పీఎస్‌ల వారీగా నమోదైన కేసుల సంఖ్య, పురోగతిపై సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ కళాశాల బృందాలచే ప్రజలకు అవగాహన, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇసుక, గుట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరించి వాటి ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా నిఘా పెంచాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఎరువులు, విత్తనాల దుకాణాలపై దాడులు నిర్వహించాలని తెలిపారు. తక్కువ ధరకు విత్తనాలు ఇస్తామని చెప్పేవారిని నమ్మవద్దని, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని చెప్పారు. త్వరలో బక్రీద్ పండుగ ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలన్నారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని సిబ్బందికి సూచించారు. పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ప్రజల సహకారంతో పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ టీవీ హన్మంత్‌రావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలి ఎస్పీ నారాయణరెడ్డి -
మిల్లులకు ధాన్యం బస్తాలు
బషీరాబాద్: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ఎక్కడి వడ్లు అక్కడే శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు స్పందించారు. కాశీంపూర్, మైల్వార్, నావంద్గీ, దామర్‌చెడ్ కేంద్రాలకు ఏడు లారీలను పంపారు. కాశీంపూర్ నుంచి 1,410 బస్తాలు, మైల్వార్ నుంచి 1,950, నావంద్గీ, దామర్‌చెడ్ కేంద్రాల నుంచి 1,226 బస్తాల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 10వేల బస్తాలు ఆయా కేంద్రాల్లోనే ఉన్నట్లు తెలిసింది. ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్‌పై డీఎస్ఓ మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాక్షి కథనంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి స్పందించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తూకం చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డికి ఫోన్ చేసి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. దీంతో వారు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. ఏడు లారీల ద్వారా 4,500 బ్యాగుల తరలింపు -
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మోమిన్‌పేట: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మేకవనంపల్లి నుంచి మోమిన్‌పేట, మొరంగపల్లి, వెల్చాల్, గోవిందాపూర్ మీదుగా ఎన్కతల గ్రామం వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం తుద ముట్టించిందన్నారు. అక్కడి పౌరులకు ఇబ్బందులు లేకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. భారత సైన్యం ముందు నిలువలేక అగ్రరాజ్యం అమెరికా కాళ్లు పట్టుకొందని తెలిపారు. భవిష్యత్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే ఇదే విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్ల నందు, మండల అధ్యక్షుడు అశిరెడ్డి, మండల మాజీ అధ్యక్షులు భుజంగ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రమేష్, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అర్హులకే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి యాలాల: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాలాలలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 మంది లబ్ధిదారులకు రూ.75.08 లక్షల విలువ చేసే చెక్కులు అందజేసినట్లు వివరించారు. ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్‌బాబా, మాజీ సర్పంచులు శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలే మన బాధ్యత ● జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరవణ ● జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఎంఎల్‌హెచ్‌పీలకు అవగాహన అనంతగిరి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరవణ వైద్యులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలకు వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పనిచేయడం, ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం గురించి ఒక్క రోజు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పీహెచ్‌సీల వైద్యులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, కీటక జనత వ్యాధులు వంటి కార్యక్రమాల అమలు చేయాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇళ్లల్లోనే ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఇక వేళ బయటికి వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణ పొందే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫార్మసీ ఆఫీసర్లకు స్టాక్ నిర్వహణ, పంపిణీ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జీవరాజు, పీఓలు డాక్టర్ పవిత్ర, బుచ్చిబాబు, జానీ, నిరోషా, ప్రవీణ్‌కుమార్, నిఖిల్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, స్టాటిస్టికల్ అధికారి నాగమల్లేశ్వరరావు, రవీందర్‌రెడ్డి, శివశంకర్, జిల్లా పరిఽధిలోని ఫార్మసీ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం
పరిగి: హైదరాబాద్– బీజాపూర్ రహదారి రక్తసిక్తమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లింట నిర్వహించిన చిన్నవిందుకు హాజరై వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో షాబాద్ మండలం సీతారాంపూర్‌కు చెందిన మల్లేశ్(35), ఇదే మండలం సోలిపేట్‌కు చెందిన బాలమ్మ (60), చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత(32), ఫరూక్నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన సందీప్(28) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంతోష్‌కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరిగి ఆస్పత్రికి అక్కడి నుంచి తాండూరు, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిగి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.ఎలా జరిగిందంటే..వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ, స్వప్న దంపతుల కూతురు మల్లేశ్వరిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన సతీష్‌కు ఇచ్చి ఈనెల 16న పరిగిలో వివాహం జరిపించారు. 19న చిన్నవిందు ఏర్పాటు చేయడంతో పెళ్లి కొడుకు బంధువులు సుమారు 50 మంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రాత్రి 8:30 గంటలకు చందనవెళ్లి నుంచి పరిగికి చేరుకున్నారు. బస్సును పార్కింగ్ చేసి వస్తానని వెళ్లిన డ్రైవర్.. ఇదే ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సు పాడవడంతో అందులో ఉన్నవారిని పరిగి నుంచి వారి గమ్యస్థానంలో వదిలేసి, తిరిగి అర్ధరాత్రి 1:20 గంటలకు పరిగికి చేరుకున్నాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో పాటు బంధువులతో కలిసి చందనవెళ్లి బయలుదేరారు. పది నిమిషాలు కూడా గడవకముందే రంగాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ఎడమ వైపు నిలిపి ఉన్న సిమెంట్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది.తల్లి మృతి, ప్రాణాపాయంలో కూతురుప్రమాద స్థలంలో మృతిచెందిన హేమలత కూతురు మోక్షిత(5)కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన వారిని వికారాబద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సుజాత, నీరజ, నిహారి, మహేశ్, అరుణ, సాహితికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రియాంక, కార్తీక్, రమేశ్, లక్ష్మి, రాములు, మంజుల, సుజాత, నవనీతకు స్వల్ప గాయాలయ్యాయి.పెళ్లి కొడుకు బావ మృతిపెళ్లికొడుకు సతీష్ బావ (అక్క భర్త) మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఇదే బస్సులో ఉన్నారు. మృతుల్లో కిషన్‌నగర్‌కు చెందిన సందీప్‌కు ఆరు నెలల క్రితమే వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం నాగుపల్లికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. పెళ్లికుమారుడికి మేనబావ కావడంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇతని తండ్రి గతంలోనే మృతిచెందగా ఒకేఒక్క కుమారుడైన సందీప్ అకాల మృతితో అతని కుటుంబం విలవిల్లాడుతోంది. -
విమర్శలను తిప్పికొట్టాలి
తాండూరు: కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను నాయకులు తిప్పికొట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తులసీ గార్డెన్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఆర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఏళ్ల నుంచి కష్టపడి పని చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు పదవుల్లో పెద్దపీట వేస్తామన్నారు. పార్టీ పదవులకు ఆశావహులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. శాసన సభ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను హస్తగతం చేసుకున్నామని గుర్తు చేశారు. కార్యకర్తల శ్రమతోనే తాము ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రమేష్ మహరాజ్, పార్టీ జిల్లా ఇన్చార్జి వినోద్‌కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, అధికార ప్రతినిధి నరేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, తాండూరు ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, ఉత్తమ్‌చంద్, నారాయణరెడ్డి, అజయ్‌ప్రసాద్, ప్రభాకర్‌గౌడ్, గోపాల్, వేణు, మల్లప్ప, ఆయా మండలాల మండల, గ్రామ కమిటీ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు తదితరులున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
డాక్టర్ లేని దవాఖాన
ధారూరు: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా.. శాసనసభాపతి నియోజకవర్గంలోని ఓ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి. డాక్టర్లు, ఏఎన్ఎంలు డిప్యూటేషన్లపై వెళ్లిపోవడం.. ఖాళీ స్థానాల్లో ఎవరినీ నియామకం చేయక పేదలు ఇబ్బంది పడుతున్నారు. అదనపు బాధ్యతలకు వెనుకడుగు మండల పరిధిలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆరు నెలల క్రితం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంఓగా పనిచేసిన బదిలీపై వచ్చారు. ఇటీవల ఆమె తనకున్న పలుకుబడితో చర్లపల్లి జైలు ఆస్పత్రికి బదిలీ చేయించుకున్నారు. ఆమె స్థానంలో ధారూరు పీహెచ్సీ డాక్టర్ శాంతికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడే పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్ఓ) విధులకు సరిగా హాజరుకాకపోవడం సరికాదని చెప్పడంతో ఆయన డీఎంహెచ్ఓతో డాక్టర్ శాంతికి చీవాట్లు పెట్టించినట్లు తెలిసింది. దీంతో మోమిన్‌కలాన్ సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ స్వాతిని నాగసమందర్‌కు పంపడంతో ఆమె రెండు రోజులు విధులు నిర్వహించి విరమించుకున్నారు. అనంతరం కోట్‌పల్లి పీహెచ్సీ డాక్టర్ మేఘనకు శనివారం నాగసమందర్ పీహెచ్‌సీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె బాధ్యతలు స్వీకరించకుండానే విముఖత చూపినట్లు తెలుస్తోంది. పీహెచ్సీలో వైద్య సేవలు అందుతాయా లేదా అని రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ పీహెచ్సీలో డాక్టర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి ప్రకాశ్ పేర్కొన్నారు. డిప్యూటేషన్‌పై వెళ్లిపోయిన ఏఎన్ఎంలు నాగసమందర్‌లో పనిచేస్తున్న ఏఎన్ఎంను తాండూర్ మండలం జిన్గుర్తి పీహెచ్‌సీకి, తరిగోపుల ఏఎన్ఎంను రామయ్యగుడ పీహెచ్‌సీకి, కేరెళ్లి ఏఎన్ఎంను, కేరెళ్లి పల్లె దవాఖానలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీని నాగసమందర్ పీహెచ్‌సీకి, కుక్కింద సబ్సెంటర్లో మూడు పోస్టులు ఖాళీ అయ్యాయి. పల్లె దవాఖాన డాక్టర్‌ను బలవంతంగా బదిలీ చేసి మరో పల్లె దవాఖానకు పంపగా.. సెకండ్ ఏఎన్ఎం ధారూరుకు, మొదటి ఏఎన్ఎం జిన్‌గుర్తికి డిప్యూటేషన్‌పై పంపారు. ప్రస్తుతం ఆయా సబ్సెంటర్లలో ఏఎన్ఎంలు లేక వైద్య సేవలు కరువయ్యాయి. ఏఎన్సీ సేవలకు బ్రేక్ ప్రతీ బుధవారం చిన్న పిల్లలకు, గర్భిణులకు టీకా వేయాల్సి ఉంటుంది. ప్రతీ శనివారం సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించా ల్సి ఉంటుంది. దీంతో పాటు రక్త నమూనాల సేక రణ సేవలు నిలిచిపోయానని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నించేవారే కరువయ్యారని విచారం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవలు సరిగా అందక ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఈ వి షయంలో చొరవ తీసుకుని నాగసమందర్ పీహెచ్సీలో డాక్టర్ నియమించడంతో పాటు ఏఎన్ఎంల కు ఇచ్చిన డిప్యూటేషన్ ఆర్డర్లు రద్దు చేయించి తిరిగి ఆయా సబ్‌సెంటర్లకు రప్పించాలని కోరుతున్నారు. పెద్దల ఇలాకాలో పేదలకు అందని వైద్యం నాగసమందర్ పీహెచ్ఎస్లో డాక్టర్, నాలుగు ఏఎన్ఎం పోస్టులు ఖాళీ డిప్యూటేషన్ల పేరిట బదిలీలు ఇన్చార్జిలుగా వెళ్లేందుకు విముఖత చూపుతున్న వైద్యులు -
భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి
కొడంగల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామస్తులు కోరారు. మంగళవారం గ్రామంలోని సర్వే నంబర్ 19కు చెందిన రైతులు ఆ భూముల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. భూములిచ్చిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. తక్షణమే తమకు పరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎరన్‌పల్లి శ్రీనివాస్, మల్లేశ్, ఆశమ్మ, బసప్ప, అమృతప్ప, శేఖర్, నర్సప్ప, రాములు గౌడ్, సావిత్రమ్మ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పార్టీలు బీఎల్ఓలను నియమించుకోవాలి తహసీల్దార్ విజయ్‌కుమార్ కొడంగల్: ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు ఉంటే సరిచేయించుకోవాలని తహసీల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు సమాయత్తమవ్వాలని సూచించారు. ప్రతీ పార్టీ నుంచి బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, సీపీఐ నాయకుడు ఇందనూర్ బషీర్, ఆసిఫ్ ఖాన్, తలారి శేఖర్, శంకర్‌నాయక్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజులు సెలవులో ఉన్నా .. ● నాపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదు ● యాచారం ఎస్ఐ మధు యాచారం: తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పగడాల శ్రీశైలం తనపై రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని యాచారం ఎస్ఐ మధు అన్నారు. మంగళవారం ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడుతూ.. శ్రీశైలం ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఏప్రిల్ 13, 14 తేదీల్లో తమ కూతు రు పుట్టిన రోజు వేడుకలు ఉన్నందున రెండు రోజులు సెలవులో ఉన్నట్లు వివరించారు. పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి ఏసీపీ రంగస్వామి షాద్‌నగర్: పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ రంగస్వామి సూచించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర, బక్రీద్ పండుగ, సందర్భంగా పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో మంగళవారం శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ.. ప్రత ఒక్కరు పరమత సహనం పాటించాలన్నారు. బక్రీద్, హనుమాన్ జయంతి వేడుకలు హిందూ, ముస్లింలు సోదరభావంతో ఐకమత్యంగా జరుపుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు సహకరించా లని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఎస్ఐ విజయ్‌కుమార్, నాయకులు బాబర్‌ఖాన్, ఇబ్రహీం, వెంకటేశ్, జమృద్‌ఖాన్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు. -
కార్మిక చట్టాల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
పరిగి: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, రైతులకు అన్యాయం చేస్తోందని వ్యవపసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన చట్టాలతో కార్మికులు కట్టుబానిసలుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోదంన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య -
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి
తుర్కయంజాల్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. పురపాలక సంఘం పరిధిలోని తొర్రూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో దళారులకు క్వింటా రూ.1,700 రైతులు అమ్ముకుని రూ.600 నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బచ్చిగళ్ల రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, నాయకులు కందాల బల్దేవ్ రెడ్డి, పోరెడ్డి అర్జున్ రెడ్డి, కొత్త రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏఎంసీ చైర్మన్ వర్సెస్ డైరెక్టర్లు
● చేవెళ్ల మార్కెట్ కమిటీ పాలకవర్గంలో మనస్పర్థలు ● అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేవెళ్ల: చేవెళ్ల మార్కెట్ కమిటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య సయోధ్య కుదరక రచ్చకెక్కుతున్నారు. తాను మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తుంటే తనపై కుట్రతో ఆరోపణలు చేస్తున్నారని.. డైరెక్టర్లు మార్కెట్ కార్యదర్శి మహేందర్‌కు ఫోన్ చేసి ప్రతీ నెలా డబ్బులివ్వాలని బెదిరిస్తున్నారంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్ ఆరోపిస్తుంటే.. చైర్మన్ తమను పట్టించుకోవడం లేదని.. మార్కెట్ కార్యదర్శితో కలిసి అవినీతికి పాల్పడుతున్నారంటూ మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు ఆరోపణలతో వివాదం మొదలైంది. అభివృద్ధికి సహకరించాలి చేవెళ్ల మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ రాములు, కార్యదర్శి మహేందర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కె ట్ కమిటీ డైరెక్టర్లు అసత్య ఆరోపణలతో మార్కెట్‌ను బదనాం చేస్తున్నారని.. వారి సొంత నిర్ణయాలను ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తున్నా రని మండిపడ్డారు. మార్కెట్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో రూ.2 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కొందరు డైరెక్టర్లు చిన్న విషయాలను రాద్దాంతం చేస్తున్నారన్నారు. సెక్రటరీకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు డిమాండ్ చేయడం, కమీషన్ ఏజెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామంటూ అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అవి నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు చేసిన డైరెక్టర్లే తాము చేయ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధికి కలిసిరావాలన్నారు. పదవులకు రాజీనామా చేస్తాం: డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధి కోసం చైర్మన్‌ను ప్రశ్నిస్తే తమపై కార్యదర్శితో ఆరోపణలు చేయించడం సరికాదని డైరెక్టర్లు జనార్ధన్, మల్లేశ్, నరేందర్, సత్యనారాయణ, హనీఫ్ అన్నారు. మార్కెట్ అభివృద్ధికి సంబంధించిన వివరాల లెక్కలు అడిగితే తమై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య జన్మదిన వేడుకలకు పాలకవర్గాన్ని పట్టించుకోకుండా చైర్మన్ ఒక్కరే తన ఫొటోతో ఫ్లెక్సీలు వేయించుకుని పాలకవర్గాన్ని దూరం పెట్టాడన్నారు. డైరెక్టర్లు లేకుండానే మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించి తాము హాజరైనట్లు రికార్డు చేశారని ఆరోపించారు. కమీషన్ ఏజెంట్లు తక్‌పట్టీలు ఇవ్వడం లేదని చెబితే పట్టించుకోవడం లేదన్నారు. తక్ పట్టీలు ఇవ్వకుండా చైర్మన్, కార్యదర్శి కలిసి అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే డైరెక్టర్లు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారని అన్నారు. అవసరమైతే తమ డైరెక్టర్ల పదవులకే రాజీనామాలు చేస్తామన్నారు. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
యాచారం: ఉపాధి పనుల్లో అవకతవకలు పరిపాటయ్యాయి. మంగళవారం మండల కేంద్రంలో 16వ ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీఓ శ్రీలత, అంబుడ్స్‌మెన్ సునీత, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్, ఇన్చార్జి ఎంపీడీఓ శైలజ, ఎంపీఓ శ్రీలత, ఏపీఎం లింగయ్య ఆధ్వర్యంలో ఈ ప్రజావేదిక కొనసాగింది. మండల పరిధిలోని 24 పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వరకు రూ.5.5 కోట్లకు పైగా నిధులు వెచ్చించి కూలీలకు ఉపాధి కల్పించినట్లు గుర్తించారు. పలు గ్రామాల్లో సక్రమంగా రికార్డులు నమోదు చేయకపోవడం, కూలీలు చేసిన పనులకు సకాలంలో డబ్బులు జమ కాకపోవడం, ఒకరి పేరు మీద రికార్డులు మరొకరి పేరిట నమోదు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. ఉపాధి పనులు కల్పించే విషయంలో గాని, కూలీలకు డబ్బులు ఇచ్చే విషయంలో గాని, స్లిప్పులు అందజేసే విషయంలోగాని తప్పులు చేసిన వారిని వదలమని హెచ్చరించారు. కూలీలకు చేతినిండా పని కల్పించి సకాలంలో డబ్బులు అందించాలన్నదే సర్కార్ లక్ష్యమని చెప్పారు. ఏ గ్రామంలో ఏ తప్పు జరిగిందో.. ఆడిట్ సిబ్బంది గుర్తిస్తున్నారని వివరించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు గాను సాయంత్రం వరకు కేవలం పది గ్రామాల వివరాలనే ఆడిట్ సిబ్బంది వెల్లడించారు. గోప్యంగా ప్రజావేదిక సభ ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజా వేదిక సభ మండల పరిషత్ సమావేశ మందిరంలో పెట్టడంపై కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అంజయ్య మాట్లాడుతూ.. ప్రజావేదిక సభ తేదీని ఈజీఎస్ అధికారులు గోప్యంగా ఉంచారన్నారు. గతంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై ఎంత మంది మీద చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదని.. కూలీలు పనులు చేసి పస్తులుంటున్నారని.. పలుమార్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా ఫలితం లేదన్నారు. అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆందోళన డీఆర్డీఓ శ్రీలత హామీతో శాంతించిన కూలీలు, ఆందోళన కారులు -
మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నేడు ఆఖరు
తాండూరు రూరల్: తాండూరు మండలం జినుగుర్తి గేటు సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు మంగళవారంతో గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈఓ, సీఈసీ గ్రూపుల్లో 40 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేస్తామన్నారు. బాలికలకు హాస్టల్ వసతి ఉన్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి అనంతగిరి: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 119 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీల్లో ప్రాధాన్యతను బట్టి పరిష్కారించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. 29న ఆలయ భూముల కౌలుకు వేలం అనంతగిరి: నవాబుపేట మండలం చిట్టిగిద్ద, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో శ్రీ నంబిగురు స్వామి మఠానికి చెందిన ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు ఈ నెల 29న వేలం నిర్వహించనున్నట్లు ఈవో శాంతకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60.14 ఎకరాల భూమిని 3 సంవత్సరాల పాటు సాగు చేసుకునేందుకు కౌలుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని పాల్గొనే వారు రూ.5 వేలు డిపాజిట్ చేయాలని తెలిపారు. హక్కు పొందని వారికి డిపాజిట్ వాపసు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల రైతులు వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు. నేడు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం తాండూరు: కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ సంస్థాగత సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సన్నాహక సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు టీ.రామ్మోహర్‌రెడ్డి, పరీశీలకుడిగా జిల్లా ఇంచార్జ్ వినోద్‌కుమార్ హాజరు కానున్నారు. ఈ సమావేశానికి నియోజవకర్గంలోని మండల కమిటీ, గ్రామ కమిటీ నాయకులు, ముఖ్య నాయకులు హాజరు కావాలని కోరారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి తాండూరు టౌన్: తాండూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూమి, ప్లాట్లు ఇచ్చిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సీపీ ఎం ఆధ్వర్యంలో బాధితులు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాండూరు చుట్టూ బైపాస్ రింగ్‌రోడ్డు వేస్తామని చెప్పి కోకట్, అంతారం, చెంగోల్ పరిధిలోని పలువురి నుంచి భూములు, ప్లాట్లు తీసుకుని నేటి వరకు పరిహారం చెల్లించకపోవడం సమంజసం కాదన్నారు. బాధితులు న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించేలా చూడాలని ఆర్డీఓను వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో మహ్మద్ సాదిక్, బాలస్వామి, సురేష్, రమేష్, శ్రీనివాస్, బాల్‌రెడ్డి, వెంకటమ్మ, నర్సిములు, రాజు, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
బంట్వారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం కోట్‌పల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం బలగం అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మెజార్టీ స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కోట్‌పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్, బంట్వారం అధ్యక్షుడు మహేష్‌యాదవ్ నాయకులు కృష్ణయాదవ్, మహేందర్‌రెడ్డి, ఓగులాపూర్ రాజు, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీఐని సందర్శించిన ఎంపీ అనంతగిరి: వికారాబాద్‌లోని ఐటీఐ కళాశాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో ఉన్న ట్రేడ్లు, కోర్సులు తదితర విషయాలపై ప్రిన్సిపాల్ నరేంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేయడం గొప్ప విషయమన్నారు. ఏదైన ప్రాజెక్టు విజయవంతం చేయడంలో టెక్నీషియన్ పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్రబాబు, అధ్యాపకులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్. రాజశేఖర్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నరోత్తంరెడ్డి, పట్టణ అధ్యక్షులు యాస్కి శిరీష, నాయకులు వెంకట్, శివరాజు, సుధాకర్ ఆచారి, రాఘవేందర్, శ్రీనివాస్, విజయ్, వినయ్ తదితరులు ఉన్నారు. ● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి -
కబ్జా చెరలో 786 ఎకరాలు
బషీరాబాద్: మండలంలో వందల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మైల్వార్ రిజర్వ్డ్ ఫారెస్టులో సుమారు 676 ఫారెస్ట్ భూములను కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల రైతులు కబ్జా చేసి యథేచ్ఛగా పంటలు సాగుస్తున్నారు. ఈ రిజర్డ్వ్ ఫారెస్టులో సుమారు 5 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. తెలంగాణలోని నీళ్లపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్‌పూర్, మైల్వార్ గ్రామాలు.. సరిహద్దు అవతలి వైపు కర్ణాటకకు చెందిన గోపన్‌పల్లి, బోందంపల్లి తండా, ఇంద్రానగర్, కర్బార్తండాలు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దులు తేలకపోవడంతో కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అనేక సార్లు సర్వే అంతర్రాష్ట్ర అటవీ భూముల సరిహద్దు విషయమై గతంలో అనేక సార్లు అధికారులు సర్వే చేశారు. గతేడాది స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఈ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి సర్వే నిర్వహించాలని అసెంబ్లీలో ప్రస్థావించారు. అప్పట్లో దీనిపై స్పందించిన కలెక్టర్ సర్వే చేయాలని రెవెన్యూ, అటవీ అధికారులను ఆదేశించారు. సర్వేకి కర్ణాటక అధికారులు కూడా హాజరు కావాలని లేఖ రాశారు. కానీ వారు ముందుకు రాకపోవడంతో తెలంగాణ అధికారులే ఈ ఏడాది ఫిబ్రవరి 11న సర్వే చేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన 60 మంది రైతులు 286 ఎకరాలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన సుమారు వంద మంది 396 ఎకరాలు కబ్జా చేసినట్లు తేల్చారు. చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు ఉమ్మడి నివేదికను సమర్పించారు. ఆక్రమణలు నిజమే మైల్వార్ రిజర్వుడ్ ఫారెస్టులోని కంపార్ట్మెంట్ 49లో 811 హెక్టార్ల భూమి ఉంది. గతంలో తాము సర్వే చేశాం. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్, కర్ణాటకలోని మూడు గ్రామాలకు చెందిన రైతులు భూములను కబ్జా చేశారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక అందజేశాం. – శ్రీదేవి సరస్వతి, ఎఫ్ఆర్ఓ, తాండూరు -
ఆదర్శప్రాయుడు పుచ్చలపల్లి
తాండూరు టౌన్: సాయుధ రైతాంగ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమర యోధుడు పుచ్చల పల్లి సుందరయ్య అందరికీ ఆదర్శనీయుడని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె శ్రీనివాస్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ధీరుడని కొనియాడారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లి తన నిరాడంబరతను చాటుకున్న మహనీయుడన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేసిన ఆయన చరిత్ర అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు బుగ్గప్ప, మల్కయ్య, సాదిక్, బాలస్వామి, రాజు, సురేష్, సంజు తదితరులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ శంకర్ అనంతగిరి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ ఎన్ శంకర్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటర్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విదార్థులకు పరీక్షలు ఉంటాయని వివరించారు. సమావేశంలో జిల్లా పరీక్షల సమన్వయ కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, సత్తయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడు కుమార స్వామి, ప్రిన్సిపాళ్లు సురేశ్వర స్వామి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఖాతాల్లో రూ.48 కోట్లు జమ
వికారాబాద్ జిల్లా: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ హెచ్చరించారు. సోమవారం దోమ మండల కేంద్రంతో పాటు ఆయా సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 128 కేంద్రాల ద్వారా 33,226 మెట్రిక్ టన్నులు సేకరించి మిల్లులకు తరలించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.48 కోట్లు జమ చేసినట్లు వివరించారు. అనంతరం మోత్కూర్‌లోని మహాలక్ష్మి రైస్‌మిల్లు, పరిగి పట్టణంలోని శ్రీ వెంకట సాయి రైస్ మిల్లును సందర్శించారు. ధాన్యం నిల్వ లు తడవకుండా చూసుకోవాలని మిల్లు యాజమానులకు సూచించారు. లారీలను ఖాళీ చేయించి త్వరితగతిన కొనుగోలు కేంద్రాలకు పంపించేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఓ తుక్యానాయక్, డీటీ గణేశ్ పాల్గొన్నారు. -
హాంఫట్
వేల ఎకరాలు అన్యాక్రాంతం● జిల్లాలో అటవీ విస్తీర్ణం 1,08,000 ఎకరాలు ● కబ్జాకోరల్లో 25శాతానికి పైనే.. ● కొడంగల్ నియోజకవర్గంలో 2వేల ఎకరాలు ● బషీరాబాద్ – కర్ణాటక సరిహద్దులో 1,500 ఎకరాలు అక్రమార్కులపాలు ● చోద్యం చూస్తున్న అటవీ శాఖ జిల్లా అధికారులుఅటవీ భూములువికారాబాద్: అటవీ శాఖలో అక్రమాలు.. అవకతవకలు.. ఆక్రమణలు సర్వసాధారణమైపోయాయి. అధికారులు ఎవరు ఉన్న ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అడవుల ఆక్రమణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రియల్టర్లు, క్వారీల నిర్వాహకులు, రిసార్ట్‌ల యజమానులు ఫారెస్ట్ భూములను యథేచ్ఛగా కబ్జాచేసి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై బదిలీవేటు పడటం అనుమానాలకు తావిస్తోంది. అటవీ భూము ల్లో అభివృద్ధి పేరిట అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారు. జిల్లాలో మొత్తం 1,08,000 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 25 శాతం అంటే (సుమారు 31 వేల ఎకరాలు) ఆక్రమణకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 94 ఫారెస్టు బ్లాకులు ఉండగా అందులోని కొన్ని బ్లాక్‌లలో ఉన్న ఏరియా మొత్తం కబ్జా కోరల్లోకి వెళ్లి పోయింది. మరికొన్ని చోట్ల 50శాతం నుంచి 90 శాతం వరకు ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో చెట్లను నరికి వ్యవసాయం చేసేవారు.. కానీ ఇప్పడు వ్యాపార అవసరాల కోసం కబ్జాలకు పాల్పడుతున్నారు. కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.కోట్ల విలువ చేసే ఖనిజ సంపద స్వాహా వికారాబాద్ రేంజ్‌లోని అటవీ భూముల్లో రెండు క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒకచోట రూ.160 కోట్లు, మరో చోట రూ.60 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని తేల్చారు. ఈ విషయమై గతంలో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. తాండూరు ఫారెస్టు రేంజిలోని ఓ క్వారీలో సైతం రూ.60 కోట్ల విలువైన ఖనిజ సంపద కొల్లగొట్టారని గుర్తించి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దుద్యాల్ ఫారెస్టు పరిధిలోని ఓ క్వారీలో సైతం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని నోటీసులు జారీ చేశారు. అనంతగిరి సమీపంలోని ఫారెస్టు భూమిని ఆక్రమించిన ఓ రిసార్ట్స్ యజమానికి నోటీసులు ఇవ్వడంతో పాటు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పూడూరు మండలం దామగుండం సమీపంలో ఓ రిసార్ట్స్ ఫారెస్టు భూమిలో ఏర్పాటు చేయగా వారికి నోటీసులు ఇచ్చారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇదంతా గతంలో ఉన్న ఫారెస్టు అధికారులు చేయగా.. ప్రస్తుత అధికారులు వారితో లోపాయికారిగా వ్యవహరిస్తూ చూసీచూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఆరు నెలల కాలంలో నలుగురు జిల్లా ఫారెస్టు అధికారులు మారారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డీఎఫ్ఓ వచ్చాక మొదట్లో కాస్త హల్చెల్ చేయగా ఆ వెంటనే మిన్నకుండి పోయారు. కొడంగల్ నియోజకవర్గంలో.. ● కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని 127 సర్వే నంబర్లో 2వేల ఎకరాల ఫారెస్టు భూమి ఉంది. మొత్తం అన్యాక్రాంతం అయ్యింది. కేవలం 180 ఎకరాలు ఉండగా దాన్ని స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేస్తామని ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబర్(127)ను 82కు మార్చారు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియదు. ఈ భూమి తమదేనని అటవీ శాఖ అధికారులు క్లైమ్ చేసుకోలేదు. దీంతో మైనింగ్ అధికారులు క్వారీలు, క్రషర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. పెద్ద ఎత్తున మైనింగ్ తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకున్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొని నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం మైనింగ్ నిర్వాహకులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
ఎక్కడి వడ్లు అక్కడే..!
● కొనుగోలు కేంద్రాల్లోనే 14 వేల ధాన్యం బస్తాలు ● లారీల కొరతతో మిల్లులకుతరలించని వైనం ● వర్షాలకు తడుస్తున్న వడ్లు ● ఆందోళనలో రైతులు ● పట్టించుకోని అధికారులు బషీరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసి ముద్దవుతున్నాయి. బషీరాబాద్ మండలంలో ఐదు సెంటర్ల ద్వారా వడ్లు సేకరిస్తున్నారు. కాశీంపూర్‌లో ఐకేపీ ద్వారా. నావంద్గీ, నవల్గా, దామర్‌చెడ్, మైల్వార్ గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 వేల బస్తాల సేకరించారు. ఇందులో 16 వేల బస్తాలు మిల్లులకు తరలించిగా మరో 14వేల బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోయాయి. తూకాలు ముగిసిన వెంటనే ధాన్యం బస్తాలను అగ్గనూర్ సమీపంలోని వెంకట పద్మావతి, లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని బాలాజీ రైస్ మిల్లులకు తరలించాలి. కానీ లారీల కొరతతో రవాణా ఆగిపోయింది. వర్షం పడిన ప్రతిసారీ ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. గన్నీ బ్యాగుల కొరత మండలానికి సరిపడా గన్నీ బ్యాగులు సరఫరా కాలేదు. దీంతో రైతులు వడ్లను రోడ్ల మీద, కల్లాల్లోనే ఉంచుతున్నారు. గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని కేంద్రాల నిర్వాహకులు అధికారులను కోరగా కొరత ఉందని అంటున్నారు. ప్రస్తుతం 15 వేల వరకు గన్నీ బ్యాగులు అవసరమని నావంద్గీ సొసైటీ సీఈఓ వెంకటయ్య తెలిపారు. తేమ శాతం పేరుతో లారీ వెనక్కు మండలంలోని మైల్వార్ కొనుగోలు కేంద్రం నుంచి మూడు రోజుల క్రితం ధాన్యం లోడ్‌తో ఓ లారీవెంకట పద్మవతి రైస్ మిల్లుకు వెళ్లింది. అయితే తేమ శాతం అధికంగా ఉందంటూ మిల్లు యజమాని లారీని మైల్వార్ కేంద్రానికి తిప్పిపంపించారు. అధికారులు పరిశీలిస్తే తేమశాతం 17 వచ్చింది. మిల్లు యజమాని తీరుతో తాము తీవ్రంగా నష్టపోయామని మైల్వార్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఏరువాక పౌర్ణమి వరకు..
తాండూరు రూరల్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులోని కోత్లాపూర్ శివారులో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు జూన్ 11న ఏరువాక పౌర్ణమి వరకు కొనసాగుతాయి. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారి జాతరకు రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి దర్శించుకుంటారు. ప్రతీ శుక్రవారం, మంగళవారం భక్తులు బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. నూతన దంపతులు అమ్మవారి సమక్షంలో ఒడిబియ్యం పోసుకుంటారు. ఆలయ చరిత్ర మండల పరిధిలోని కోత్లాపూర్‌లో వెలిసిన రేణుక ఎల్లమ్మ ఆలయానికి 850 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. గ్రామానికి చెందిన రాళ్ల రాగిరెడ్డి తన పొలంలో గుంటుకతో పొలంను చదును చేస్తుండగా.. ఓ రాయి గుంటుకకు అడ్డు తగిలింది. వెంటనే ఆ రాయిని గుంటుక మీద పెట్టి పొలంలో మరల చదును చేస్తుంటే తిరిగి అదే స్థలంలోకి వెళ్లింది. రెండు మూడు సార్లు అలాగే జరిగింది. ఓ రోజు రాత్రి రాగిరెడ్డి నిద్రిస్తుండగా ఎల్లమ్మ తల్లి కలలోకి వచ్చి గుంటుకకు అడ్డు వచ్చిన రాయిని తానేనని.. అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పింది. దీంతో అక్కడ గుడి నిర్మించి పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయాభివృద్ధికి పాటుపడిన కర్ణాటక మాజీ మంత్రి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన మాజీ విద్యాశాఖ మంత్రి అరవింద్ లింబావళి ఇళవేళ్పు కోత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ తల్లి. అమ్మవారి దయతోనే తాను రాజకీయంగా రాణించాలని చిన్న గుడిలా ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలయాభివృద్ధి చేశాడు. ప్రతీ ఏడాది రెండు మూడు సార్లు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ప్రస్తుతం ఉత్సవాలకు ఆలయ ప్రాంగణంలో బండలు, రంగులు వేయించారు. 2001 నుంచి ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. 30న ప్రధాన ఘట్టం ఈ నెల 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం, సిడే ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొలకల పౌర్ణమికి ప్రారంభమైన ఈ జాత ఏరువాక పౌర్ణమితో ముగుస్తుంది. పోలీసు బందోబస్తు జాతర సందర్భంగా కరన్‌కోట్ ఎస్ఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రథోత్సవం, సిడే ఊరేగింపు సందర్భంగా నియోజకవర్గంలోని సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జినుగుర్తి పీహెచ్సీ తరుపున వైద్య సాదుపాయం కల్పిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ నవీన్‌రెడ్డి, ఈఓ శేఖర్‌గౌడ్ తెలిపారు. భక్తులు వంటలు చేసుకునేందుకు ప్రత్యేక షెడ్లతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.. గ్రామస్తుల సహకారంతో జాతర వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర 30న రథోత్సవం, సిడే ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయాధికారులు -
ఆగని రేషన్ బియ్యం దందా
పోలీసుల దాడిలో పట్టుబడిన రేషన్ సన్న బియ్యం కుల్కచర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం సైతం అక్రమార్కుల ధనార్జనలో భాగమైంది. దొడ్డుబియ్యం అయితే ఏముంది సన్నబియ్యమైతే ఏముంది అనుకున్నారు రేషన్ అక్రమ సరఫర నిర్వాహకులు లబ్ధిదారుల నుంచి కొంచెం ధర ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడులు నిర్వహించగా చౌడాపూర్ గ్రామానికి చెందిన చిట్టెల చంద్రశేఖర్ తన గోదాంలో ఐదు క్వింటాళ్ల రేషన్ సన్నబియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. లబ్ధిదారులు తమ ఇష్టంతో అమ్మితేనే కొనుగోలు చేశానని బియ్యం విక్రేత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసి బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. యువతి అదృశ్యం అనంతగిరి: వికారాబాద్ ఠాణా పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లికి చెందిన వడ్డె నవనీత(19) ఈ నెల 16న భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించింది. ఉదయం లేచి చూడగా ఆమె ఇంట్లో కనిపించలేదు. ఎక్కడ వాకబు చేసినా ఆమె ఆచూకీ లభ్యమవ్వలేదు. ఈ మేరకు సోమవారం ఆమె తల్లి సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ్దుడి అదృశ్యం అనంతగిరి: వివాహానికి వెళ్లిన వృద్ధ్దుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం.. మోమిన్ పేట మండలం రాంనాథ్గుడుపల్లికి చెందిన చాకలి పెద్ద నర్సింలు(75) ఈ నెల 16న వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్హాల్లో బంధువుల వివాహానికి హాజరయ్యాడు. అనంతరం పూడూర్‌లోని చిన్న కూ తురు ఇంటికి వెళ్తున్నాని చెప్పి బయలుదేరాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాల్లో వాకబు చేసినా ఆచూకీ లభ్యమవ్వలేదు. ఈ మేరకు ఆయన కూతురు వర మ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
వేధింపులు తాళలేక..
అనంతగిరి: వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ భీంకుమార్ తెలిపిన ప్రకారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన వడ్ల హన్మండ్లు–చంద్రకళ దంపతుల కుమార్తె అశ్విని(39)కి వికారాబాద్‌కు చెందిన కమ్మరి శ్రావణ్‌కుమార్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ పోషణకు అశ్విని టైలరింగ్ షాప్ నిర్వహిస్తుండేది. పైళ్లెన ఐదేళ్ల తర్వాత శ్రావణ్‌కుమార్ తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడపడేవాడు. ఈ క్రమంలో ఆస్తి పంచాలని అన్నను కోరడంతో నీ భార్య ఉన్నంత వరకు పంపకాలు చేసేది లేదని చెబుతున్నారంటూ ఈ నెల 18న మధ్యాహ్నం హనుమాండ్లకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన అశ్విని అర్ధరాత్రి ఆమె బెడ్రూంలోని సీలింగ్‌ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన శ్రావణ్‌కుమార్ అదే రాత్రి 1.50గంటలకు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చే వరకు మృతదేహాన్ని వికారాబాద్ మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి తండ్రి తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత బలవన్మరణం -
మారిస్తేనే మనుగడ
● కేబుల్ లైఫ్ టైం 25 ఏళ్లలోపే! ● ఆ లోపే మార్చేయాలి..లేదంటే ప్రమాదాలు తప్పవు ● లోడుకు తగ్గ వైరింగ్, ఎంసీబీలు, ప్రాపర్ ఎర్తింగ్తోనే రక్షణ ● ‘సాక్షి’తో ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు కార్యదర్శి కాంతారావు ప్రాపర్ ఎర్తింగ్తోనే ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ.. మెజార్టీ భవనాల్లో ఎర్తింగ్ సిష్టం ఉండటం లేదు. ఒక వేళ ఉన్నా.. సరఫరాలో హెచ్చు తగ్గుల సమస్య వచ్చినప్పుడు పని చేయడం లేదు. వేసవిలో ఎర్తింగ్ పాయింట్లో తేమ శాతం తగ్గుతుంది. ప్రతి పదిరోజుకో సారి నీటిని పో యడం ద్వారా విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు తలెత్తినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించొచ్చు. అంతేకాదు పోల్ నుంచి ఇంట్లోకి కరెంట్ సరఫరా చేసే సర్వీసు వైరు వెంట సాధారణంగా జీఏవైర్ను ఏర్పాటు చేస్తుంటాం. షార్ట్ సర్క్యూట్ కారణంగా పోల్‌పై ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు హై ఓల్టేజ్ విద్యుత్ ఇంట్లోకి ప్రవేశించకుండా నియంత్రించేందుకు ఎగ్ ఇన్సులేటర్ వినియోగించాలి. విద్యుత్ లీకేజీలు లేకుండా చూసుకోవడం, ప్రతి ఇన్సు లేషన్‌కు ఎంసీబీలు, ఆర్సీసీసీబీలను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా చూసుకోవచ్చు అని కాంతారావు స్పష్టం చేశారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘సాధారణంగా ఈ కేబుల్ జీవిత కాలం 25 ఏళ్లు మాత్రమే. ఆలోపే వాటిని మార్చేయాలి. ఐఎస్ఐ ప్రమాణాల మేరకే ఈ వైర్లను రూపొందించినప్పటికీ..వాటి సామర్థ్యానికి మించి లోడు కరెంట్‌ను వినియోగించడం, అంతర్గతంగా తలెత్తే వేడికి బయటి ఉష్ణోగ్రతలు తోడవడంతో ఆయా కేబుళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనైవుతుంటాయి. జాయింట్లు, లూజు కాంటాక్ట్‌ల వద్ద తరచూ స్పార్క్‌లు వెలుగు చూస్తుంటాయి. ఇటీవల వెలుగు చూస్తున్న మెజార్టీ విద్యుత్ ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం’ అని ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు కార్యదర్శి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ టి.కాంతారావు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గృహాలు, వాణిజ్య సముదాయాల్లో తరచూ వెలుగు చూస్తున్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన మాటల్లోనే.. పాతవైర్లపైనే అదనపు లోడు.. మెజార్టీ గృహాలు, వాణిజ్య సముదాయాల్లో 1.5 స్క్వైర్ ఎంఎం, 2.5 స్క్వైర్ ఎంఎం సామర్థ్యానికి మించిన కేబుళ్ల వాడటం లేదు. ఈ కేబుళ్ల జీవిత కాలం కూడా 25 ఏళ్లకు మించి ఉండదు. అంతేకాదు ఒకప్పుడు సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పది లైట్లు, నాలుగు ఫ్యాన్లు, ఒక టీవీ, కూలర్, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, మిక్సీ, ఐరెన్ బాక్స్ మాత్రమే కన్పించేవి. తీరా ఆదాయం, ఇంటి అవసరాలు పెరిగిన తర్వాత వాటి సరసన ఏసీలు, గీజర్లు, వాషింగ్ మిషన్లు వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం రెట్టింపవుతోంది. ఆ మేరకు పాత లైన్లను తొలగించి, వాటి స్థానంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వైర్లను ఏర్పాటు చేయడం లేదు. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాతలైన్లపై మరింత భారాన్ని మోపుతున్నారు. ఫలితంగా కేబుళ్లు ఒత్తిడికి గురై...షార్ట్ సర్క్యూట్లు తలెత్తుతున్నాయి. అంతేకాదు నిర్మాణ సమయంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలను అంచనా వేయలేక పోవడం వెరసి నిర్మాణ ఖర్చును తగ్గించుకునే క్రమంలో నాసిరకం విద్యుత్ వైర్లు, స్విచ్‌లు కొనుగోలు చేస్తుండటం కూడా ఈ ప్రమాదాలకు మరో కారణం. అంతేకాదు ఒకే సాకెట్ నుంచి మల్టీపుల్ ప్లగ్ కనెక్షన్లు ఇవ్వడం కూడా ప్రమాదాలకు కార ణమవుతోంది. ఒత్తిడితోనే కంప్రెసర్లలో పేలుళ్లు.. ఇతర ఎలక్ట్రికల్ వస్తువులతో పోలిస్తే ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్, ఓవెన్లకు విద్యుత్ లోడు ఎక్కువ అవసరం. సాధారణంగా మార్కెట్లో ఒకటి, ఒకటిన్నర, రెండు టన్నుల సామర్థ్యం ఏసీలు లభిస్తుంటాయి. ఏసీ సామర్థ్యాన్ని బట్టి కేబుళ్లను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా 1.5 టన్ను ఏసీకి 4 నుంచి 6 స్క్వైర్ ఎంఎంపైగా కేబుల్స్ వినియోగించాలి. కానీ మెజార్టీ భవనాల్లో 2.5 స్క్వైర్ ఎంఎం కేబుళ్లనే వాడుతున్నారు. పాత ఏసీల్లో ఇన్వర్టర్ మోడ్ సహా పవర్ సేవింగ్‌కు అవకాశం లేదు. ఇందు కోసం ఇన్వర్టర్ మోడ్ ఉన్న ఫైవ్ స్టార్, త్రీస్టార్ రేటింగ్ ఏసీలను ఎంపిక చేసుకోవాలి. ఏసీలను రోజంతా ఆన్‌లో ఉంచడం వల్ల కంప్రెసర్‌లో హీట్ జనరేట్ అవుతుంది. ఇన్వర్టర్ బ్యాటరీలను గాలి, వెలుతురు లేని ఇరుకై న ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ఒత్తిడికి గురై..షార్ట్సర్క్యూట్లు తలెత్తుతున్నాయి. ఇన్వర్టర్ బ్యాటరీల్లో మూడు నెలలకోసారి డిస్టిలరీ వాటర్ నింపాలి. వీటి నిర్వహణ లోపం వల్ల కూ డా బ్యాటరీలు పేలుతుంటాయి. గుల్జార్‌హౌస్‌లో వెలుగు చూసిన ప్రమాదానికి ఇది మరో కారణం కూడా. -
రైతుల మనుసు గెలుచుకున్న తహసీల్దార్
బషీరాబాద్: భూ సమస్యలు పరిష్కారంలో తహసీల్దార్ వెంకటేశ్ శక్తి వంచన లేకుండా రైతుల మనుసు గెలుచుకున్నారని బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది కొనియాడారు. బషీరాబాద్ తహసీల్దార్‌గా 16 నెలలు పనిచేసిన వెంకటేశ్ సంగారెడ్డికి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం కార్యాలయం అధికారులు, సిబ్బంది ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రుక్సానాబేగం, ఆర్ఐ నాగార్జున రెడ్డి, జూనియర్ అసిస్టెంట్స్ కృష్ణకుమార్, నవీన్, అంజిలప్ప, రికార్డు అసిస్టెంట్స్ నర్సమ్మ, బిచ్చప్ప, ముణ్యప్ప కంప్యూటర్ ఆపరేటర్ అరుణ్‌కుమార్, వీఆర్ఏలు శ్యామప్ప, మాడప్ప, నర్సప్ప, రాజు, హన్మంతు, అటెండర్స్ అనంతయ్య, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో విలేకరులు నర్సింలు, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాందాస్, శ్రీనివాస్, హరిదాస్, జీవన్గీ నర్సిములు, గోపాల్‌తో పాటు మండల యువజన కాంగ్రెస్ నాయకుడు మాణిక్‌రావు తదితరులున్నారు. బదిలీపై వెళ్లిన అధికారికి ఘనంగా వీడ్కోలు -
నేటి నుంచి కెపాసిటీ బిల్డింగ్‌పై టీచర్లకు శిక్షణ
దుద్యాల్: ఐదు రోజుల పాటు ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల విద్యాధికారి విజయరామారావు తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణకు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లకు, టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దాదాపుగా 50 మందికి పైగా ఉపాధ్యాయులు శిక్షణకు హాజరవుతారని చెప్పారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు జియో ట్యాగింగ్ హాజరు ఉంటుందని, శిక్షణ కేంద్రంలోకి వచ్చిన తర్వాతే హాజరు పడుతుందని, ఈ విషయం ప్రతీ ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్ అప్పగింత కొడంగల్ రూరల్: యాలాల మండలం గిరిజాపురం గ్రామానికి చెందిన మైలారం గోపాల్ ఇటీవల కొడంగల్ వచ్చినప్పుడు తన ఫోన్ పోగొట్టుకున్నాడు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సాయంతో ఫోన్‌ను ట్రాక్ చేశారు. సోమవారం ఎస్ రాజ్‌కుమార్, కానిస్టేబుల్స్ బలరాంనాయక్, పరమేశ్ బాధితుడికి ఫోన్ అందజేశారు. -
సమాజంలో మార్పు కోసమే ఆర్ఎస్ఎస్
కుల్కచర్ల: హిందుత్వవాదాన్ని బలోపేతం చేయడం.. సమాజంలో మార్పు తెచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ప్రాంత కార్యకారిని సభ్యుడు సుబ్రహ్మణ్యం అన్నారు. మండల కేంద్రంలో వారం రోజులుగా కొనసాగుతున్న శిక్షణ సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న క్రమంలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడం, అనాగరిక చర్యల నిర్మూలన, సేవాకార్యక్రమాలు నిర్వహణ, హిందుత్వంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, జిల్లా సంఘ చాలక్ గోవర్దన్ రెడ్డి, జిల్లా కార్యావాహ సంఘమేశ్వర్, రవి, శ్రీను, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంత కార్యకారిని సభ్యుడు సుబ్రహ్మణ్యం -
వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు
నవాబుపేట: వేసవి శిబిరాలు విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తాయని మండల విద్యాధికారి అబ్దు ల్రెహమాన్ అన్నారు. మండల పరిధిలోని కడ్చర్ల ప్రాథమిక పాఠశాలలో పది రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మాట్లాడుతూ.. శిక్షణ ఫౌండేషన్, ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు సాంస్కృతిక , సృజనాత్మకత తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శిబిరంలో 50 మంది విద్యార్థులు పాల్గొనగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఎంఈఓ అబ్దుల్ రెహమాన్ -
పాముకాటుకు ఎద్దు మృతి
తాండూరు రూరల్: పా ము కాటుకు ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన సోమవారం పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని భద్రేశ్వర ఆలయం ఎదుట కాలనీలో నివాసం ఉంటున్న రైతు పొట్టు శ్రీనివాస్‌కు రసూల్పూర్ ఆలయ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎడ్లను మేపుతుండగా వరిబందంలో నాగుపాటు కాటేయడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. పిడుగుపాటుతో.. మండల పరిధిలోని అంతారంలో సోమవారం పిడుగుపాటుకు కాడెద్దు మృత్యువాత పడింది. వివరాలు.. గ్రామానికి చెందిన బొడ్డె ప్రభాకర్ కాడెద్దుతో పాటు పశువులను మేతకోసం తీసుకెళ్లాడు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పొలంలో ఉన్న కాడెద్దుపై పిడుగుపడడంతో కాడెద్దు మృత్యువాత పడింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
పరిగి: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పట్టణంలోని ఆయన నివాసంలో కుల్కచర్ల మండలం పీరంపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజానీకం కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రభుత్వం కొనసాగించేందుకు ఇబ్బంది పడుతోందని.. కొత్తగా వారు చేసిందేమీ లేదని విమర్శించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్క డి సమస్యలు అక్కడే ఉన్నాయని ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వ పట్టింపు కరువయిందన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నాయకులు త్వరలోనే సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కు వ సీట్లు గెలుచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి -
ఎద్దు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
తాండూరు టౌన్: విద్యుత్ కంచె వేసి ఎద్దు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నాయకులతో కలిసి బాధితురాలు తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 12న మండల పరిధిలోని బిజ్వార్లో పిట్ల యశోదకు చెందని ఎద్దు మేత మేస్తుండగా విద్యుధాఘాతంతో మృత్యువాత పడింది. అనుమతి లేకుండా పొలం చుట్టూ కంచె వేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, బుగ్గప్ప, అబ్దులప్ప, మొగులప్ప, బాలప్ప తదితరులు ఉన్నారు. తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు బాధితురాలి వినతి -
వికారాబాద్: లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురి మృతి
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
నిండుకుండలా కాగ్నా చెక్‌డ్యామ్
తాండూరు: వేసవి కాలం వచ్చిందంటే చాలు తాండూరు ప్రాంతంలో ఉన్న కాగ్నానది చుక్క నీరు లేకుండా ఇంకి పోతుంది. కానీ దశాబ్దకాలంగా నదిలో వరద నీరు పుష్కలంగా తొణికిసలాడుతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను తాకుతూ ప్రవహిస్తున్న ఈ నది వేల ఎకరాలకు సాగు నీరును అందిస్తుంది. దీనిపై ఎక్కువగా చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. తాండూరు శివారులోని కాగ్నా నదిపై ఉన్న చెక్‌డ్యామ్ నిండు కుండలా తలపిస్తోంది. మరోవైపు బెన్నూర్, వీర్‌శెట్టిపల్లి, జీవన్గి చెక్‌డ్యామ్‌లలో జలసిరి ఉట్టి పడుతుంది. ఈ సీజన్లో సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని స్థానికులు భావిస్తున్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మోమిన్‌పేట: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పెన్నార్, కార్తికేయ, ఓల్టాగ్రీన్ కంపెనీలలో పని చేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంపెనీలలో 12 గంటలు పని చేయించుకొంటున్నా కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. దీనిపై అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోజుకు 12 గంటలు పని చేయించుకొంటున్న యాజమాన్యం రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే అందిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలను రూ.26 వేల నుంచి రూ.32 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఈ నెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంబంధించి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మసయ్య, బాబు, ఆనందం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించండిమొయినాబాద్: గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేష్‌గౌడ్ కోరారు. ఈ మేరకు ఆదివారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ను కలిసి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గౌడ కుల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. పిడుగుపాటుకు పాడి గేదెలు మృతి కందుకూరు: పిడుగుపాటుతో మూడు పాడి పశువులు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధి రాచులూరులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నల్ల కలమ్మ పాడి పశువులతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. రోజులాగే పొలం వద్ద చెట్టు కింద నాలుగు గేదెలను కట్టేసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు, పశువుల సమీపాన పిడుగు పడటంతో మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతోంది. శంకర్పల్లివాసులకు దళితరత్న అవార్డులు శంకర్పల్లి: పట్టణానికి చెందిన కడమంచి మల్లేశ్, తూర్పాటి నరసింహ దళితరత్న అవార్డులు దక్కించుకున్నారు. ఈ మేరకు వారు ఆదివారం హైదరాబాద్‌లో బెడ బుడగ జంగం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగం, అంబేడ్కర్ ఉత్సవాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న సమక్షంలో అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, తిరుమల హరి, లక్ష్మయ్య, శ్రీను, శివ, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఆదాచేస్తేనే జీరో బిల్!
నవాబుపేట: వేసవి తాపానికి భరించలేక జనాలు ఉపశమనం కోసమని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వాడుతుంటారు. ఫలితంగా విద్యుత్ మీటర్ గిర్రున తిరుగుతుంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గృహజ్యోతి పథకం వర్తించకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తారు. 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించాల్సిందే. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ పొదుపు అయి గృహజ్యోతి పథకాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో 7,000 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. అందులో 1,000 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ఇవి పాటించాలి ● మార్కెట్లో 5స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే వినియోగించాలి. ● ఇంట్లో టీవీ అవసరం లేకపోతే రిమోట్‌తో కాకుండా పూర్తిగా ఆఫ్ చేయాలి. ● చార్జింగ్ పూర్తయ్యాక ఫోన్‌ను ఫ్లగ్ నుంచి తొలగించాలి. ● అవసరమైతేనే ఫ్యాన్లు, కూలర్లు వేయాలి. ● రిఫ్రిజిరేటర్లో కాలానుగుణంగా ఫ్రీజర్ లెవల్స్‌ను మార్చుకోవాలి. ● ఏసీల ఫిల్టర్లను తరచూ శుభ్రం చేస్తూ, టైమర్‌ను సెట్ చేసుకోవాలి. ● వాషింగ్మెషీన్లో లోడ్‌కు తగిన దుస్తులు మాత్రమే వేయాలి. ● నాణ్యమైన ఎస్ఈడీ బల్బులు వాడాలి. ● అవసరం ఉన్న గదుల్లో, అవసరమైనంత సేపే లైట్లు వేసుకోవాలి. 200 యూనిట్లు దాటితే బిల్లుల మోత ‘గృహజ్యోతి’పై వినియోగదారుల సంశయం 5 స్టార్‌తో విద్యుత్ ఆదా గృహజ్యోతి కింద 200 యూనిట్లు దాటితే మాత్రం బిల్లులు చెల్లించాల్సిందే. 5 స్టార్ రేటింగ్ ఉంటే విద్యుత్ ఆదా అవుతుంది. ఫ్యాన్, టీవీ, కూలర్లు, బల్బులు, మిక్సీ, ఐరన్ బాక్స్‌లు ఇలా ఎలక్ట్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసే ముందు రేటింగ్ తెలుసుకోవాలి. – శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ, నవాబుపేట -
భవనాల్లేక ఇబ్బందులు
దౌల్తాబాద్: మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేక కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణ కొనసాగుతుంది. స్వశక్తి సంఘాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సొంత భవనాలు లేవు. ప్రతి నెలా గ్రామాల్లోని చెట్లు, సంఘం సభ్యుల నివాసాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో అతివలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేదికలు కరువు మండలంలో 33 గ్రామపంచాయతీల్లో 46 గ్రామ సమాఖ్య సంఘాలున్నాయి. ఇందులో సుమారు 806 స్వయం సహాయక సంఘాలు ఉండగా 8,300 మంది సభ్యులు ఉన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలు జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకుంటూనే పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామ స్థాయిలో కార్యాలయాలు లేక మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల మంజూరు, వసూళ్లు, సభ్యుల్లో చైతన్యం పెంపొందించడంలో కీలకపాత్ర పోషించే గ్రామ సంఘాలకు సరైన వేదికలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. వెంటాడుతున్న సమస్యలు సొంత భవనాలు లేక సంఘాల కార్యకలాపాల నిర్వహణతో పాటు మహిళా సమాఖ్యలు, మహిళా పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, శిక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామైక్య సంఘాల వద్దకు వివిధ పనుల కోసం వచ్చిపోయే మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులకు పల్లెల్లో మౌలిక వసతులు లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల నిర్వహణ కోసం మండల కేంద్రంలో ఇందిరాక్రాంతి పథం పేరిట సొంత భవనం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సంఘ భవనాలు నిర్మిస్తే సంఘాల నిర్వహణలో తలెత్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇప్పుడైన మహిళలకు సొంత భవనాలు నిర్మిస్తారని మహిళలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కార్యకలాపాల నిర్వహణకు ఎదురవుతున్న ఇక్కట్లు తీవ్ర అవస్థల్లో మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారులకు నివేదించాం స్వయం సహాయక సంఘాల నిర్వహణ కోసం సొంత భవనాల నిర్మాణాల విషయమై ఉన్నతాధికారులకు వివరించాం. మండలంలో భవనాలు కావాలని ప్రతిపాదనలు కూడా పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే నూతన నిర్మాణాలు చేపడుతారు. – హరినారాయణ, ఇన్చార్జి ఏపీఎం, దౌల్తాబాద్ -
అన్ని మతాలకు సమన్యాయం
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని మతాలకు సమన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే టి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గం నుంచి 22 మంది ముస్లీంలు హజ్‌యాత్రకు ఆదివారం బయలు దేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే నాంపల్లిలో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లీంలకు హజ్‌యాత్ర పవిత్రమైందన్నారు. జీవితంలో ఒక్క సారైన హజ్‌యాత్రను సందర్శించాలనే కలా ఉంటుందన్నారు. అలాంటి కలను సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ అంటేనే అన్ని మతాలను గౌరవిస్తూ అందరికి సమన్యాయం కల్పిస్తుందన్నారు.ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
మిషన్ భగీరథ నీరు వృథా!
దోమ: మండల పరిధిలో శివారెడ్డిపల్లి గ్రామంలో మిషన్‌భగీరథ నీరు రావడం లేదని ఫిర్యాదు రావడంతో అధికారులు కనెక్షన్‌ను తీసి నల్లాను ఏర్పాటు చేశారు. కానీ ఆ నల్లాకు ట్యాప్ పెట్టకుండానే అధికారులు వదిలేశారు. దీంతో నల్లా నుంచి నీరు వృథాగా పోతుంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా తాగునీరు నేల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు రోడ్డుపై చేరడంతో బురదగా తయారయ్యి నడవలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అంతేకాకుండా ఆ నీరు పొలాల్లో చేరి నిండుతున్నాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులకు విషయం తెలిసినా అటు వైపుగా కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నల్లా కనెక్షన్లకు ఆన్ఆఫ్లను వెంటనే అమర్చి నీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు
కుషాయిగూడ: ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్ కు మంటలంటుకున్న సంఘటన ఆదివారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్ వద్ద చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పాటు ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ట్యాంకర్ లారీని రిపేరు చేస్తూ ట్రయల్‌రన్ చేస్తున్న క్రమంలో చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఐఓసీఎల్ వద్ద ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన మెకానిక్, ఇతర డ్రైవర్లు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ట్యాంకర్‌కు మంటలు వ్యాపించడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. పక్కనే పార్కు చేసి ఉన్న సిలిండర్ల ట్రక్కుకు మంటల వ్యాపిస్తే పెనుప్రమాదం జరిగి ఉండేదన్నారు. ఈ విషయమై చర్లపల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను వివరణ కోరగా చాలా రోజులుగా నిలిచిపోయిన ట్యాంకర్ ట్రయల్‌రన్ వేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందన్నారు. విచారణ చేపడతామని పేర్కొన్నారు. ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం తప్పిన పెను ప్రమాదం -
యాగశాల భూమిపూజ ప్రారంభం
అత్తాపూర్: హైదర్‌గూడలో ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించే శ్రీ ప్రణవ భక్త సమాజం ఏకశతపంచోత్తర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా యాగశాల కోసం ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ప్రణవ భక్త సమాజం అధ్యక్షుడు మోండ్ర నర్సింహ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రణవ భక్త సమాజం ఉపాధ్యక్షుడు బర్ల మల్లారెడ్డి, ముఖ్య సలహాదారులు నారగూడెం మల్లారెడ్డి, సాబాద విజయ్‌కుమార్, సభ్యులు సులిగె మహేందర్, విద్యాసాగర్, సాయియాదవ్, కిషన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ మహోత్సవ పత్రాల పంపిణీ శ్రీ ప్రణవ భక్త సమాజం సభ్యులు ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ మహోత్సవాల పత్రికలను పంపిణీ చేసి హాజరుకావాలని కోరారు. -
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
ధారూరు: మేతకు వెళ్లిన ఎద్దు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జీడీగడ్డ తండాకు చెందిన నెనావత్ రవీందర్‌నాయక్ ఎద్దులను మేతకోసం పొలానికి తీసుకెళ్లాడు. మేత మేస్తున్న ఎద్దు దగ్గరకి ఆవు రావడంతో దానిని వెంబడిస్తూ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. అక్కడ ఉన్న సపోర్టు తీగను తాకింది. దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో విద్యుదాఘాతానికి గురై ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు రూ.60వేల వరకు ఉంటుందని రైతు బోరున విలపించాడు. ఈ విషయంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ప్రేమ పేరుతో వేధింపులు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య శంషాబాద్ రూరల్: ప్రేమ పేరిట వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పెద్దతూప్రలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వి.జంగయ్య, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య(16)ను అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ రెండో అంతస్తులో నిద్రకు ఉపక్రమించారు. అదే రోజు రాత్రి దివ్య సెల్‌ఫోన్ తీసుకుని కింద అంతస్తులోకి వెళ్లింది. ఎంతసేపటికి పైకి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నది. దీంతో కిటికీ నుంచి లోపలికి చూడగా.. దివ్య చున్నీతో పైకప్పు ఉక్కుకు ఉరేసుకుని కనిపించింది. తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. రవి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్‌ఎఫ్‌చెక్కుల అందజేత ఆమనగల్లు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మాడ్గుల, వెల్దండ మండలాలకు చెందిన పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయనిధి పథకం పేదలకు వరమని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్‌రెడ్డి, మెకానిక్ బాబా, కృష్ణ, యాదయ్య, పోలెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీ మృతులకు కొవ్వొత్తులతో నివాళి
తాండూరు టౌన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవీ ఎయిడ్స్ (దిశ) ఆధ్వర్యంలో తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది హెచ్ఐవీ మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. ప్రతి ఏటా మే 3వ ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవి మృతులకు నివాళులర్పిస్తూ అంతర్జాతీయ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి నుంచి ఇందిరాచౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిశ క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ జి రమేశ్ మాట్లాడుతూ మనం గుర్తుంచుకుంటాం, మనం లేచి నిలుస్తాం, మనం మార్గదర్శకులు అవుదాం, హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష మానుకుందాం, వారిని సైతం అందరితో సమానంగా చూద్దాం అనే థీమ్‌తో ప్రజలంతా వారికి మద్దతు ఇవ్వాలన్నారు. ఆస్పత్రుల్లో హెచ్ఐవీ రోగుల కోసం ఉచితంగా మందులు అందజేస్తున్నారన్నారు. -
పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీ
తాండూరు రూరల్: కరన్‌కోట్ వికారాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామానికి రెగ్యు లర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో పని చేసిన ఆనంద్‌రావు బదిలీపై యాలాల మండలానికి వెళ్లారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఈ విషయాన్ని పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఓగిపూర్ కార్యదర్శి అమరేశ్వరి కొన్ని రోజులు ఇన్చార్జిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కరన్‌కోట్ గ్రామంలో 14 వేల జనాభా ఉంది. 14 వార్డులు, 7,800ఓటర్లు ఉన్నారు. గ్రామ శివారులో సీసీఐ ఫ్యాక్టరీతో పాటు నాపరాతి గనులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామంలో 16 మంది పంచాయతీ సిబ్బంది పని చేస్తున్నారు. పెద్ద గ్రామం కావడంతో ఓ వైపు పారిశుద్ధ్య పనులు చేస్తుంటే మరోవైపు చెత్త పేరుకపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ముందే వేసవికాలం కావడంతో తాగునీటి సరఫరాపై కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మిషన్ భగిరథ నీరు సరఫరా నిలిచిపోతే కొన్ని కాలనీలో తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి 110 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించాల్సి ఉంది. గ్రామంలో నిరుద్యోగ యువతి, యువకులు 280కి పైగా రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని కూడా క్షేత్రస్థాయిలో వెళ్లిలబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో పంచాయతీ కార్యదర్శి బాధ్యత కీలకంగా ఉంటుంది. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రికార్డుల నమోదు, నర్సరీ పరిశీలన, ఉపాధిహామీ పథకం పనుల పరిశీలనలో కార్యదర్శి పాత్ర ఉంటుంది. అంతేకాకుండా వివిధ సర్టిఫికెట్లకు సంబంధించి కార్యదర్శి సంతకం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు ప్రజలు వస్తుంటారు. ప్రస్తుతం కారోబార్ నర్సిములు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో సత్వరమే ఉన్నతాధికారులు స్పందించి కరన్‌కోట్ పంచాయతీ కార్యదర్శిని వెంటనే నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రెగ్యులర్ కార్యదర్శి ప్రతీ రోజు గ్రామంలోనే అందుబాటులో ఉంటే సమస్యల పరిష్కారం సులువవుతాయని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు. కరన్‌కోట్ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ గతంలో పని చేసిన వారు బదిలీ రెగ్యులర్ లేక ఇబ్బందులు పట్టించుకోని అధికారులు డీపీఓ దృష్టికి తీసుకెళ్లాం కరన్‌కోట్‌లో పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉందని డీపీఓ దృష్టికి తీసుకెళ్లాం. ఓగిపూర్ కార్యద ర్శి అమరేశ్వరి కొన్ని రోజులు ఇన్చార్జిగా పని చేసింది. ప్రస్తుతం ఆమెను నియమిద్దామంటే ఇక్కడ పనిచేయడానికి సుముఖంగా లేదు. రెండు, మూడు రోజుల్లో సీనియర్ పంచాయతీ కార్యదర్శికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలనే అంశం ఆలోచన చేస్తున్నాం. లేదంటే డీపీఓ కార్యాలయం నుంచి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది. – సుశీల్‌కుమార్, ఎంపీఓ, తాండూరు మండలం -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
యాలాల: పొలం వద్ద అకారణంగా దళిత యువకుడిపై దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య డిమాండ్ చేశారు. ఆదివారం యాలాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోకట్ గ్రామానికి చెందిన మాస్త అంజిలప్ప సర్వే నంబరు 183లోని ఐదెకరాల పొలంలో ట్రాక్టర్ కల్టివేటర్‌తో దున్నుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పురుషోత్తంరెడ్డి, బబ్లూ రెడ్డిలు తమ పొలం గట్టు దున్నుతావా అంటూ విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు తెలిపారు. గతంలో కూడా అంజిలప్పపై ఇటువంటి దాడి జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంచందర్, వెంకటయ్య, చిన్న అనంతయ్య తదితరులు ఉన్నారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
కడ్తాల్: మండల పరిధి న్యామతాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ మాత పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణంతో గ్రామాల్లో ఆధాత్మికత, భక్తిభావం మరింత పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి రూ.6 లక్షలు విరాళం అందజేసిన మహేశ్‌ను సన్మానించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయిపండుగలో నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, నాయకులు మహేశ్, రాములు పాల్గొన్నారు. -
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చు
మహేశ్వరం: గుండె పోటు మరణాలు పెరుగుతున్నాయని, సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడుకోవచ్చునని జనత హృదయాలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మల్రెడ్డి హన్మంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి తుమ్మలూరు మ్యాక్ ప్రాజెక్టు బీటీఆర్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీపీఆర్ ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఎవరైనా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర చికిత్స సీపీఆర్ అని తెలిపారు. ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చినప్పుడు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఫౌండేషన్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత శిబిరాలు నిర్వహించి, పేదలకు మేలు చేస్తున్నామని డాక్టర్ పేర్కొన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయాలనే లక్ష్యంతో భార్యతో కలిసి ఉచితంగా వైద్య శిబిరాలు, పరీక్షలు, సీపీఆర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నానని వివరించారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అంతకు ముందు నిర్వహించిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి ప్రాక్టికల్ శిక్షణ, థియరీ తరగతులను వివరించారు. కార్యక్రమంలో డెర్మటాలజీ వైద్యురాలు మేతినిరెడ్డి, బీటీఆర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కేర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ మల్రెడ్డి హన్మంత్‌రెడ్డి -
సెక్యూరిటీ గార్డు అదృశ్యం
శంషాబాద్ రూరల్: ఫాంహౌజ్‌లో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు అదృశ్యమైన ఘటన మండలపరిధిలోని కవేలిగూడలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రం కచార్ జిల్లాకు చెందిన రాజు తంతి(42) ఉపాధి కోసం వచ్చి కవేలిగూడలో దామోదర్‌రావుకు చెందిన గ్రీన్వుడ్ ఫాంహౌజ్‌లో 7 నెలలుగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు రాకేశ్ అనే వ్యక్తి కూడా పని చేస్తూ ఇద్దరు కలిసి అక్కడే నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 10న రాజు గదికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 2 రోజుల తర్వాత విషయం రాజు సోదరుడు బీజుకు తెలియడంతో పలుచోట్ల ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.3.60 లక్షల విలువైన విదేశీ మద్యం పట్టివేత ● 52 మద్యం బాటిళ్లు స్వాధీనం ● ముగ్గురి పై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్ సాక్షి, సిటీబ్యూరో: అక్రమంగా తరలిస్తున్న 52 విదేశీమద్యం బాటిళ్లను ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదర్శనగర్‌లో ఓ కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురిపైన కేసులు నమోదు చేసిన పోలీసులు కుమార్ అగ్రవాల్, రోహిత్‌కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్‌చేశారు. ఇన్నోవా కారును సీజ్ చేశారు. మెట్రోస్టేషన్లో ప్రకటనల టెలివిజన్ చోరీ సనత్‌నగర్: మెట్రో స్టేషన్లో ప్రకటనలు డిస్ప్లే చేసే టీవీ చోరీకి గురైన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ జయచందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..పరేడ్‌గ్రౌండ్స్ మెట్రో స్టేషన్లోకి గత నెల 19న ఉమామహేశ్వర్, అశోక్ అనే ఇద్దరు టెక్నీషియన్స్‌గా పనిచేసేందుకు వచ్చారు. అయితే స్టేషన్ కంట్రోలర్‌కు తెలియకుండానే స్టేషన్‌లోని ఓడీయూ గదిని యాక్సెస్ చేశారు. అందులోని స్కైవర్త్ టెలివిజన్ సెట్‌ను విప్పదీసుకుని వెళ్లారు. ఈ సంఘటన మొత్తం స్టేషన్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. టెలివిజన్ చోరీ అయిన విషయాన్ని గుర్తించిన మెట్రో అధికారులు, అంతర్గత విచారణ అనంతరం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ మెట్రో డిపోలో పనిచేస్తున్న కృషాదర్శని ఫిర్యాదు మేరకు శనివారం బేగంపేట పోలీసులు ఉమామహేశ్వర్, అశోక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ దంపతులపై దాడి వ్యక్తిపై కేసు నమోదు హస్తినాపురం: ఇంట్లో ఒంటరిగా ఉన్న వయోవృద్ధులపై భూలక్ష్మీనగర్కాలనీ సంక్షేమ సంఘం సెక్రటరీ రవికిరణ్ దాడికి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..ద్వారకామాయినగర్ కాలనీలో ఉంటున్న వయోవృద్ధులైన గుత్త లక్ష్మీతులసీ, వేణుగోపాల్ దంపతుల ఇంటికి భూలక్ష్మీనగర్కాలనీ సంక్షేమ సంఘం సెక్రటరీ రవికిరణ్ కుమారుడు వచ్చి పనులకు ఆటంకం కలిగించేవాడు. దీంతో వేణుగోపాల్ ఇంటికి రావొద్దని చెప్పడంతో నన్నుక్టొటాడని రవికిరణ్‌కు అతడి కుమారుడు చెప్పడంతో కోపోద్రికుడైన రవికిరణ్ తన అనుచరులతో కలిసి ఆ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు.బాధితుల ఫిర్యాదు మేరకు రవికిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో దేశభక్తి ర్యాలీ
మైలార్‌దేవ్‌పల్లి: ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి నేలమట్టం చేయడంపై సేవా భారతి కిశోరి వికాస్ ఆధ్వర్యంలో ఆదివారం దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. పద్మశాలీపురంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి గణేశ్‌నగర్ బొడ్రాయి, భావన బుషికాలనీ, ఆదర్శకాలనీ, టీఎస్జీఓఎస్ కాలనీ, మధుబన్ కాలనీ మార్గంలో తిరిగి స్వామి వివేకానంద విగ్రహం వద్దే ముగిసింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ.. ర్యాలీ ద్వారా యువతలో దేశభక్తి పెంపొందించడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి కిశోరి వికాస్ సమన్వయకర్త లక్ష్మి, క్లబ్ ఉపాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, సాంస్కతిక కార్యదర్శి గోంత్యాల శ్రీనివాస్, కిశోరి వికాస్ కార్యకర్తలు అడికే శ్రావణి, ఎస్.లక్ష్మి, స్వప్న, ఝాన్సీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ఆమనగల్లు: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బకాయి ఉన్న దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రీయింబర్స్మెంట్ బకాయిలు ఓటీఎస్ కింద సెటిల్‌చేసి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. సమావేశంలో టీఎస్‌ఎస్‌ఓ నాయకులు వంశీ, సుదర్శన్, చిక్కి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
‘అందాల’ డ్రెస్ డిజైనర్ మన స్వాతి..
అనంతగిరి: ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా గురువారం భూదాన్ పోచంపల్లిలో తళుక్కుమన్న ముద్దుగుమ్మలకు డ్రెస్‌లు డిజైన్ చేసింది ఎవరో కాదు మన జిల్లాకు చెందిన మఠం వైద్యనాథ్ కూతురు ఎం.స్వాతినే. ఈమె ఆరేళ్లుగా హైదరాబాద్‌లో మైరీతి, తరం పేరిట డ్రెస్ డిజైనింగ్ చేస్తోంది. విదేశీ వనితలు, నటీమణులకు, ఉన్నత స్థాయిలో ఉన్న వారికి వివిధ ఆకృతుల్లో అందమైన డ్రెస్‌లు డిజైన్ చేసి ఇస్తోంది. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 40 మంది అందగత్తెలు వారు కోరిన విధంగా డ్రెస్‌లను రూపొందించింది. పోచంపల్లి, నారాయణపేట చేనేత వస్త్రాన్ని వాడి దుస్తులు తయారు చేయడం వీరి ప్రత్యేకత. గురువారం జరిగిన కార్యక్రమంలో అందాల భామలు స్వాతి డిజైన్ చేసిన డ్రెస్‌లు ధరించి అలరించారు. దుస్తుల తయారీకి నెల రోజులు కష్టపడినట్లు తెలిసింది. స్వాతి తోపాటు మైరీతి, తరం మరో వ్యవస్థాపకులు, మితుల్ నిర్వాహకులు ఎం మహేంద్ర, ఎం మానస, వారి డిజైనర్స్ మౌనిక, రమ్య ఇతర సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. -
‘సప్లిమెంటరీ’కి పక్కాగా ఏర్పాట్లు
అనంతగిరి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్‌లోని కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని వివరించారు. జిల్లాలో 20 పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం జనరల్‌లో 5,217మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 457 ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 2,071మంది, ఒకేషనల్‌లో 314 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్ సదుపాయం కల్పి ంచాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా వైద్యాధికారి వెంకటరవణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, వివిధ శాఖల అధికారులు, జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్, జిల్లా పరీక్షల సమన్వయ కమిటీ సభ్యు లు నర్సింహారెడ్డి, సత్తయ్య, ప్రిన్సిపాల్ సురేశ్వరస్వామి, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ సజావుగా ధాన్యం సేకరణ జిల్లాలో ఇప్పటి వరకు 25వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్తో కలిసి ధాన్యం కొనుగోలు, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాల ద్వారా 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రికి వివరించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, టార్పాలిన్లు, సంచులు, తేమ శాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సరైన సమయంలో రైతులు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
ధారూరు: రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టం పని చేస్తుందని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. ధారూరు మండలం రాజాపూర్, నాగారం, కొండాపూర్‌ఖుర్దు గ్రామాల్లో శుక్రవారం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. కోర్టు పరిధిలో ఉన్న వాటిని మినహాయించి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా జిల్లా, డివిజన్, మండల స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు జాజిదాబేగం, శ్రీనివాస్, దీపక్ సాంసన్, డీటీ విజయేందర్, ఆర్ఐ స్వప్న, రెవన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
ధరాఘాతం!
భారీగా తగ్గిన ఉల్లి ధరలు వికారాబాద్: ఉల్లి ధరలు మరింత పతనమయ్యాయి. ఏకంగా క్వింటాలు రూ.1000కి పడిపోయింది. 60 కిలోల బ్యాగును రూ.500 నుంచి రూ.550 వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలికిన ఉల్లి నేడు రూ.10లకు పడిపోయింది. గతంలో వినియోగదారులకు కన్నీళ్లు తెప్పించిన ఉల్లి.. నేడు రైతును నష్టాల్లో ముంచేసింది. పంట వేసే సమయంలో ధరలు బాగుండటంతో ఎక్కువ మంది సాగు చేశారు. కానీ దిగుబడి వచ్చే నాటికి ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మాత్రం లాభపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉల్లి సాగుకు నీటి వసతి తప్పనిసరి.. పంట కాలం ఆరు నెలలు.. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చు వస్తుంది.. రవాణా ఖర్చులు అదనం. ఎకరాకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రూ.80 వేలకు మించి రాదు.. ఇలా చూసుకున్నా రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడ లేదు. ఈ సారి ఉల్లి దిగుబడి బాగానే వచ్చిందని.. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోయాయని.. పెట్టుబడి కూడా రాదని రైతులు లబోదిబో మంటున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు ఉండేదని.. చిల్లరగా కిలో రూ.50 నుంచి 60 వరకు విక్రయించేవారని తెలిపారు. ప్రస్తుతం ఆశించిన ధరలు లేకపోవడంతో నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణనీయంగా పెరిగిన దిగుబడి ఈ ఏడాది ఉల్లి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3వేల ఎకరాలు కాగా ఈ సారి 4,500 ఎకరాల్లో పంట వేశారు. గతంలో ఎకరాకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది హైబ్రీడ్ రకం ఉల్లి సాగు చేయటంతో ఎకరాకు 100 నుంచి 130 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులకే లాభాలు ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు నష్టాలు తప్పడం లేదు. పంట దిగుబడి వస్తే ధరలు లేకపోవడం.. సాగు చేయని సమయంలో విపరీతమైన ధరలు ఉండటం అన్నదాతలను కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతూనే ఉంటాయి. పంట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులు నష్టాలు చవిచూడటం సాధారణంగా మారిపోయింది. ప్రభుత్వాలు ప్రకటించే మద్దతు ధర ఏ మాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. పంట దిగుబడి బాగా వచ్చినా.. దెబ్బతిన్నా రైతులకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా దళారులు మాత్రం లాభపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు లేవంటూ తక్కువకే పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ ధరలకు విక్రయించి లాభాలు పొందుతున్నారు. ప్రతి సీజన్‌న్‌లో ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. పట్టించుకోని ప్రభుత్వాలు ధరలు పెరిగిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నాయి. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడంలేదు. ధరలు పెరిగినప్పుడు వినియోగదారులు.. పతనమైనప్పుడు రైతులు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీపై విత్తనాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఆ తర్వాత మిన్నకుండిపోయాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలు రూ.1000లోపే ఆరుగాలం శ్రమించిన రైతుకు వచ్చేది రూ.600 మాత్రమే సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరగడమే కారణం -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా బకాయి లేదన్నారు. తెలంగాణలో మాత్రం ఐదు డీఏలు బకాయి ఉన్నట్లు పేర్కొన్నారు. నిండు సభలో ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి అప్పు పుట్టడం లేదని అనడం సరికాదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గోపాల్, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, నా యకులు బస్వరాజ్, జాంప్ల, రూప్సింగ్, బాలకృష్ణ, నరేందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రెడ్డి -
విద్యార్థుల సంఖ్య పెంచండి
బంట్వారం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం కోట్‌పల్లి జెడ్పీహెచ్ఎస్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించే ఉపాధ్యాయులు విద్యార్థుల వివరాలు సేకరించాలన్నారు. వీరందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. డిజిటల్ బోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, భోజన వసతిపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇక నుంచి వారానికి ఒక్కసారి తల్లిదండ్రులతో సమావేశం ఉంటుందన్నారు. పాఠశాలల అభివృద్ధిలో స్థానికులు, తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి పేర్కొన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డీఈఓ సత్కరించారు. అనంతరం కరీంపూర్ గేటు సమీపంలో నిర్మిస్తున్న కేజీబీవీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రప్ప, పాఠశాల సిబ్బంది, కేజీబీవీ ఎస్ఓ పల్లవి, సీఆర్పీ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య డీఈఓ రేణుకాదేవి -
లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మురహరి
కొడంగల్: పట్టణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సామాజిక కార్యకర్త మురహరి వశిష్టను శుక్రవారం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సమక్షంలో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా మురహరి వశిష్ట, కార్యదర్శిగా వడ్డె భీంరాజు, కోశాధికారిగా వెంకట్‌రెడ్డి దేశ్‌ముఖ్, మెంబర్ షిప్ కమిటీ చైర్మన్‌గా ముద్దప్ప దేశ్‌ముఖ్, ఉపాధ్యక్షులుగా కేవీ రాజేందర్, దామోదర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా కానుకుర్తి రమేష్, పీఆర్ఓగా శ్రీకిషన్రావులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఆరు.గురునాథ్‌రెడ్డి, దాసప్ప యాదవ్, శ్రీనివాస్ గుప్త, కానుకుర్తి వెంకట్‌రెడ్డి, ఏన్గుల భాస్కర్, శివకుమార్ గుప్తాలు వ్యవహరిస్తారు. గతేడాది అధ్యక్షుడిగా పనిచేసిన మురహరి వశిష్ట ఆధ్వర్యంలో గతం నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గురునాథ్‌రెడ్డి కుటుంబానికి విధేయునిగా ఉన్న మురహరి వశిష్టను రెండోసారి లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎంపిక చేయడం పట్ల ఆయన మిత్రులు బాధ్యత స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
నిమ్స్‌లో స్లిట్ ల్యాంప్ ఏర్పాటు
లక్డీకాపూల్: నిమ్స్‌లో రుమటాలజీ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక స్లిట్ ల్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో సమకూర్చిన ఈ స్లిట్ ల్యాంప్‌ను శుక్రవారం డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుమటాలజీ క్లినిక్‌లో ప్రతి మంగళవారం పిల్లలకు స్లిట్ ల్యాంప్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రుమటాలజీ రోగుల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ రూ. 4 లక్షల విలువైన ఆధునిక స్లిట్ ల్యాంప్‌ను సమకూర్చిందన్నారు. క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగంలో ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో రుమటాలజీ విభాగం హెచ్ఓడీ డా.లీజా రాజశేఖర్, ఎల్వీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.ప్రసాంత్ గర్గ్, యూవైటిస్ నిపుణులు డా. బసు, పీడియాట్రిక్ రుమటాలజీ నిపుణుల డా.కీర్తి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక ఆలోచన పెరగాలి
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి మొయినాబాద్: భారత దేశ యువతలో ఔత్సాహిక ఆలోచన ధోరణిని పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న అరిస్టాటిల్ పీజీ కళాశాలలో ‘సుస్థిర ప్రపంచం కోసం ఔత్సాహిక, ఆవిష్కరణలు’ అనే అంశంపై రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత సుస్థిర అభివృద్ధిపై ఆసక్తి పెంచుకుని.. ఆ దిశగా ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచడం కోసం మేనేజ్మెంట్ విద్యలో ఆ అంశాన్ని చేర్చాలని సూచించారు. యూఎస్ఏ స్కైలైన్ యునివర్సిటీ ప్రతినిధి శ్రీమహేష్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పరిశ్రమల ఏర్పాటు వైపు యువత అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాసీ్త్రయ రచనల సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్ రాములు, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి, కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నర్సయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భక్తిభావాన్ని అలవర్చుకోవాలి
షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తిభవాన్ని అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో శ్రీ సీతారాముల, లక్ష్మణ, భరత, శత్రజ్ఞ, హనుమంతుని విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సారం లేక.. దిగుబడి రాక
పరిగి: రైతులు అధిక పంట దిగుబడి సాధించేందుకు పోటీ పడి ఎరువులు వేస్తున్నా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. భూమిలో పోషక లోపాలు గుర్తించకుండా.. వేసిన పంటలే వేయడం, అధిక మోతాదులో ఎరువులు చల్లడం వల్ల పంటలపై చీడపీడల దాడి అధికమై సస్యరక్షణ ఖర్చు పెరుగుతోంది. భూములు నిస్సారమై భవిష్యత్‌లో పంటలు వేయడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. నేలలో అంతర్లీనంగా ఉన్న పోషకాలను కాపాడుకోవాలి. భూసారం తెలుసుకోకుండా ఎలాంటి పంటలు సాగు చేసినా దిగుబడి లేక ఆర్థికంగా చతికిల పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. మరో నెల రోజుల్లో ఖరీప్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం భూసార పరీక్షలు చేయడానికి మట్టి నమూనాల సేకరణకు అనుకూలమైన సమయం. వానాకాలం పంటలు విత్తుకునే సమయానికి ఫలితాలు వస్తే అందుకు అనుగుణంగా విత్తనం, ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది భూసార పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అన్నదాతలపై భారం పరిగి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 1,32,000 ఎకరాల సాగు భూములున్నాయి. ఇందులో నల్లరేగడి, ఎర్రమట్టి, ఇసుక, చౌడు నేలలు ఉన్నాయి. జిల్లాలో అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నా రైతులు అధికంగా పత్తి, వరి, మొక్కజొన్నలనే సాగు చేస్తున్నారు. నేల స్వభావం తెలియకుండా అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు ఏ మేరకు ఎరువులు అవసరమో రైతులకు అవగాహన ఉండాలి. భూమిలో ఏయో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలంటే భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మట్టి పరీక్షలు నిర్వహిస్తే పోషక లోపాలను గుర్తించవచ్చు. తద్వారా మోతాదులో రసాయన ఎరువులు వాడితే అనవసర ఖర్చు తగ్గించుకోవచ్చు. భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. పోషక సమతుల్యత ముఖ్యం పంటలు భూమిలోని పోషకాలను ఏ మేరకు ఉపయోగించుకుంటాయో దానిపై దిగుబడులు ఆధారపడి ఉంటాయి. పోషకాలు ఎక్కువైనా ఆశించిన దిగుబడులు రావు. సాధారణంగా రైతులు భాస్వారం, పొటాష్ ఎరువులను మోతాదు కంటే తక్కువగాను, నత్రజని ఎరువును మోతాదుకంటే రెండు, మూడు రేట్లు ఎక్కువగాను వేస్తుంటారు. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. నత్రజని ఎరువును అధిక వినియోగం వల్ల పంట విపరీతంగా ఎదుగీత పడిపోతుంది. పూత ఆలస్యంగా రావడం, గింజలు ఎక్కువగా తాలురావడం వంటివి ఉంటాయి. పంట చీడపీడలకు సులభంగా లోనవుతుంది. చివరికి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏ పంటకు ఏ పోషక పరిమాణంలో అవసరమో తెలుసుకుని తగిన మోతాదులో అందించడాన్నే పోషక సమతుల్యత అంటారు. ఇది భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను వాడవచ్చు.ఆదేశాలు అందాయి మండలంలో 225 మంది రైతుల నుంచి భూసార పరీక్షలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రెండు స్కీంల ద్వారా భూసార పరీక్షలకు వీలుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో పరీక్షలు చేయాలని ఎలాంటి సూచనలు అందలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే నిర్వహిస్తాం. – డీఎస్ లక్ష్మీకుమారీ, ఏడీఏ, పరిగి భూసార పరీక్షలు చేయక రైతుల ఇబ్బందులు సరైన మోతాదులో పంటకు అందని పోషకాలు -
కల్లాల్లేక.. రోడ్లపైనే వడ్లు!
స్థానికందౌల్తాబాద్: మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పంటను ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడంతో రైతులు తారు రోడ్లను ఆశ్రయిస్తున్నారు. చేతికొచ్చిన పంట దిగుబడుల్లో తేమ శాతం తగ్గించుకునేందుకు ధాన్యం ఆరబెడుతున్నారు. రోజుల తరబడి వడ్ల కుప్పలు ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. గతంలో ప్రమాదాలు సంభవించిన సంఘటనలున్నాయి. ఏటా సీజన్ రాగానే రైతులు రోడ్లపై ఇరువైపులా పంట కుప్పలు పోయడంతో రహదారులు కల్లాలుగా మారాయి. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రాత్రి పూట వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. కలగానే కల్లాలు గతంలో ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీలకు 90శాతం సబ్సీడీపై కల్లాల నిర్మాణానికి దరఖాస్తులను స్వీకరించింది. కొన్ని గ్రామాల్లో పూర్తయినా బిల్లులు రాలేదని కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయయని రైతులు వాపోతున్నారు. మూడేళ్లుగా కల్లాల పథకం నిలిచిపోవడంతో అర్హులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు గ్రామీణుల కష్టాలు గుర్తించి పథకాన్ని పునరుద్ధరిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గుముడాల వెళ్లే దారిలో ధాన్యం కుప్పఅవస్థలు పడుతున్న వాహనదారులు -
తాగునీటి తండ్లాట!
తాండూరు రూరల్: తాగునీరు లేక గొంతెండుతుందని మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామస్తులు విలపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా నేటికి గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గొంతు తడిపేందుకు తండ్లాడుతున్నారు. సంకిరెడ్డిపల్లి గ్రామం, సంకిరెడ్డిపల్లి తండా ఉన్నాయి. రెండు గ్రామాలు కూడా తెలంగాణ–కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు గ్రామస్తులు, గిరిజనులకు కంటిమీది కునుకు లేకుండా పోతుంది. సాంకేతిక సమస్యలతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిందంటే చాలు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మిషన్ భగీరథ నీరే దిక్కు ప్రస్తుతం మిషన్ భగీరథ ట్యాంకుల నుంచి నీటి సరఫరా అవుతుంది. ప్రతి రోజు సంకిరెడ్డిపల్లి గ్రామానికి 60 వేల లీటర్లు, తండాకు 40 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోతే గ్రామస్తులు, తండావాసులకు ప్రత్యామ్నాయంగా నీటి సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామంలోని ఊరడమ్మ దేవాలయం వద్ద సింగిల్ ఫేజ్ మోటారు ఉన్నా సరిపోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వ్యవసాయ బోరు మోటార్ల వద్ద నుంచి గ్రామ పంచాయతీ ట్యాంకర్‌తో దాహార్తి తీర్చుతున్నారు. ప్రస్తుతం వేసవికాలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు, తండావాసులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. క ొత్త బోరు వేస్తున్నాం సంకిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య ఉంది. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు తండాలో వారం క్రితం బోరు వేశాం. కానీ నీళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకే మరో కొత్త బోరు వేస్తున్నాం. ఎస్డీఎఫ్ నిధులు రూ.5 లక్షలతో బోరువేసి, ట్యాంక్‌లకు కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం. దీంతో ప్రజలకు తాగునీటిని అందిస్తాం. – ప్రణయ్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, తాండూరు నిలిచిన మిషన్ భగీరథ సరఫరా సంకిరెడ్డిపల్లిలో అవస్థలు పడుతున్న గ్రామస్తులు -
భూ భారతితో సమస్యలకు చెక్
ధారూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అధికారులు గ్రామలకు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర చెప్పారు. గురువారం మండలంలోని అంతారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న ధారూరు మండలాన్ని భూ సమస్యలు లేని మండలంగా చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సదస్సుల్లో రైతుల నుంచి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే విధంగా రెవెన్యూ అధికారులు పని చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన భూ సమస్యల దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించి పరిశీలించారు. మోమిన్‌కలాన్, అంతారం, మోమిన్‌ఖుర్దు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 59 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్లు సాజిదాబేగం, శ్రీనివాస్, దీపక్సాంసన్, డీటీ విజయేందర్, ఆర్ఐ స్వప్న, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నేటి రెవెన్యూ సదస్సులు మండల పరిధిలోని కొడాపూర్ఖుర్దు, రాజాపూర్, నాగారం గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతులు భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర -
నిలిచిన పనులు.. రాకపోకలకు తిప్పలు
దుద్యాల్: అర్ధాంతరంగా మండల పరిధిలో మహబూబ్‌నగర్–చించోలి రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కల్వర్టుల కోసం తీసిన గోతులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం బిక్కుబిక్కుమంటూ వాహనదారులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు పనులు ప్రారంభమై ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి పనులు కలిగిన రహదారిపై వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సూచికలు లేవు దుద్యాల్ గేట్ నుంచి హస్నాబాద్ వెళ్లే మార్గమధ్యలో కల్వర్టుల పనులు అసంపూర్తిగా వదిలేశారు. అక్కడ రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదం పొంచి ఉన్నా కల్వర్టు దగ్గర తాత్కాలికంగా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని చోదకులు వాపోతున్నారు. దీంతో ఏ సమయంతో అయిన ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కల్వర్టుల దగ్గర వేసిన రోడ్డు వాహనాల రాకపోకలకు కొంత భాగం కూలిపోయి ప్రమాద స్థాయిని మరింత పెంచింది. అలాగే హస్నాబాద్ గ్రామంలో రోడు నిర్మాణ పనుల్లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తీసిన గుంతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పనులు పూర్తిగా నిలిపివేయడంతో గుంతల్లో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు కారణమవుతుంది. గతేడాది డిసెంబర్లో తెల్లవారుజామున పాలను తరలించే ఓ ఆటో ప్రమాదానికి గురైంది. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని వాహనదారులు తెలుపుతున్నారు.అసంపూర్తిగా మహబూబ్‌నగర్–చించోలి రహదారి నిర్మాణం కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా మారిన వైనం పట్టించుకోని అధికార యంత్రాంగం -
స్థానిక సంస్థల్లో సత్తాచాటాలి
స్థానికంపూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పూడూరు మండల కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడనిగా రాఘవేందర్, ఉపాధ్యక్షులుగా నర్సింహారెడ్డి, వెంకటేష్, ప్రభాకర్‌యాదవ్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా వడ్ల క్రిష్ణాచారి, రామచంద్రయ్య, కార్యదర్శులుగా శ్రీకాంత్‌రెడ్డి, బాలమణి, మనోహర్‌గౌడ్, ప్రభగౌడ్, కోశాధికారిగా మంజుల, కమిటీ సభ్యులుగా రాజు, శ్రీహరిచారి, శ్రీశైలం, రవి, రమేష్, సతీష్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సినిమా సెన్సార్‌బోర్డు సభ్యుడు మల్లేష్‌పటేల్, నాయకులు సుభాన్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి -
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు
మొయినాబాద్: పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూమిలో భూసారాన్ని పెంచుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త ఎస్.జి మహాదేవప్ప అన్నారు. మొ యినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో గురువారం వరిలో యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట పైర్లతోపాటు సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటమార్పిడి విధానం, చిరుధాన్యాల సాగుతో భూమి ఆరోగ్యాన్ని పెండంతోపాటు పర్యావరణ సంరక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, సహాయ వ్యవసాయ సంచాలకులు బీజే సురేష్, ఏఓ అనురాధ, ఏఈఓ సునీల్, రైతులు పాల్గొన్నారు. -
పంటల బీమా పునరుద్ధరణ!
షాబాద్: రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఆశించిన మేర పంట చేతికొచ్చి మంచి ధర పలికితే రైతులకు ఎంతో మేలు. కానీ కొన్నిసార్లు పండించిన పంట అకాల వర్షాలకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉండటంతో పంటలకు బీమా తప్పనిసరి అని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తిరిగి అమలు చేసే యోచనలో ఉంది. 2018 నుంచి నిలిపివేత పంటల బీమా పథకం రాష్ట్రంలో 2018 నుంచి అమ లు కావడం లేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎలాంటి పరిహారం అందడం లేదు. బీమాను అమలు చేస్తే ప్రీమియం చల్లించిన అన్నదాతలకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది. మండలంలో ఏటా వానాకాలం, యాసంగి లో సుమారు వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా అమ లు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పంటను బట్టి కొంత ప్రీమి యం చెల్లిస్తే మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధానం ఉండేది. ప్రస్తుతం ఎలాంటి విధివిధానాలు అమలు చేస్తారో వేచి చూడాలి. గతంలో భారీ నష్టం గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మండలంలో నాగర్‌గూడ, తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి, రుద్రారం, హైతాబాద్, సోలీపేట్ ప్రాంతాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నీరందక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలు, తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నా బీమా రక్షణ కవచంలా పని చేస్తుంది. దీంతో రైతులు ఈ పథకాన్ని అమలు చేయాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వానాకాలం నుంచి అమలుయోచనలో ప్రభుత్వం రైతుల్లో చిగురిస్తున్న ఆశలు -
ఫేక్ ఆధార్‌తో స్థలం కాజేసే కుట్ర
అబ్దుల్లాపూర్‌మెట్: చనిపోయిన వ్యక్తి స్థానంలో వేరొకరిని చూపించి.. నకిలీ ఆధార్ కార్డును సృష్టించిన కేటుగాళ్లు ఓ ప్లాటును తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కుట్ర పన్నారు. ఆధార్ కార్డుపై మార్ఫింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన ముఠా సభ్యుల తీరుపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గోషామహల్‌కు చెందిన చంద్రకాంత్‌కు మండల పరిధిలోని మజీద్పూర్లో ఉన్న 267 గజాల స్థలాన్ని మనకర్ ఆనంద్ జీపీఏ(866/2013) చేయించుకున్నాడు. కొన్ని నెలలకే ఆనంద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించి ఆ స్థలాన్ని కాజేయాలని చంపాపేటలో నివాసముండే కొసిరెడ్డి భాస్కర్‌రెడ్డి(సస్పెండ్‌కు గురైన ఆర్టీసీ ఉద్యోగి) పన్నాగం వేశాడు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా గోనకోల్కు చెందిన బోదాసు ఆంజనేయులును ప్లాట్ యజమాని ఆనంద్‌గా చూపించేందుకు నకిలీ ఆధార్ కార్డు సృష్టించాడు. అదే సమయంలో వరంగల్‌లోని బలపాలకు చెందిన జిల్లాపల్లి సంజీవరావును చంద్రకాంత్‌గా చూపించేలా మరో ఆధార్ కార్డును తయారు చేశాడు. సాక్షులుగా గోనకోల్క చెందిన దండుగల ఆంజనేయులు, చంపాపేట్‌లో ఉంటున్న కురువ శ్రీనివాసులును తీసుకెళ్లాడు. వీరందరి నుంచి భాస్కర్‌రెడ్డి కొనుగోలు చేస్తున్నట్టు డాక్యుమెంట్ రైటర్ ఉదయ్‌కుమార్‌తో పత్రాలు సిద్ధం చేసుకున్నాడు. బుధవారం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయానికి ఆధార్ కార్డుల నంబర్లు నమోదు చేసే సమయంలో బయోమెట్రిక్‌లో అసలు, నకిలీ వ్యక్తులకు సరి తూగలేదు. బయోమెట్రిక్ సమయంలో ఆనంద్ పేరుతో ఉన్న ఆధార్ కార్డు నంబరు నమోదు చేయగా ఆంజనేయులు పేరు. చంద్రకాంత్ పేరిట ఉన్న ఆధార్ కార్డును నమోదు చేయగా సంజీవ పేర్లు రావడంతో సబ్‌రిజిస్ట్రార్ సునీతా రాణి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. నిందితులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు. సబ్‌రిజిస్ట్రార్ ఫిర్యాదుతో భగ్నం పోలీసుల అదుపులో నిందితులు -
ఫ్లెక్సీ రాజేసిన చిచ్చు
మహేశ్వరం: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి కట్టిన ఫ్లెక్సీ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చిచ్చు రాజేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గులాబీ రంగు బ్యానర్‌ను ఎలా వాడతారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గేటు వద్ద ఎమ్మెల్యే సబితారెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఆహ్వానం పలుకుతూ గులాబీ రంగుతో కూడిన బ్యానర్ కట్టారు. అధికారిక కార్యక్రమం వద్ద పార్టీ ఫ్లెక్సీ ఎందుకు కట్టారని బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నాయకులు మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కారు దిగగానే కాంగ్రెస్ నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఇరువర్గాలను చెదరగొట్టి నచ్చజెప్పారు. పరస్పరం ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం 180 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫ్లెక్సీ విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. తులం బంగారం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని చురకలంటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ సైదులు, ఎంపీఓ రవీందర్‌రెడ్డి, ఆర్ఐలు స్వర్ణకుమారి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాగ్వాదం -
‘సన్నాల’ సాగును ప్రోత్సహించండి
అనంతగిరి: జిల్లాలో సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్, కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకం వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ గురించి రైతులకు వివరించి సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాజీవ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని 54 నంబర్ రేషన్ దుకాణాన్ని గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, కార్డుదారులు బియ్యం తీసుకెళ్తున్నారా తదితర విషయాలను డీలర్‌ను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి కొడంగల్: పట్టణంలో కొత్తగా చేపట్టిన ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం నిర్మణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసవాల సంఖ్యను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పట్టణంలోని హరే కృష్ణ సంస్థ ద్వారా పాఠశాలలకు అల్పాహారాన్ని సరఫరా చేసే కిచెన్ షెడ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, కడా ప్రతేకాధికారి వెంకట్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీమేరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, తహసీల్దార్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు పరిగి: రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. గురువారం పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూర్ సబ్‌కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్ఓ మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, అధికారులు సారంగపాణి, తహసీల్దార్ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు -
అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన
పరిగి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగి పట్టణంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గణపతిరెడ్డితో బుధవారం భూ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు సంబంధించి విద్యార్థులు ఒకే చోట విద్యనభ్యసించాలని ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తుంకుల్‌గడ్డలో అన్ని వసతులతో పాఠశాల భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, ఏ బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, వైస్ చైర్మన్ అయూబ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు ఆంజనేయులు, చిన్న నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి సీఎం సహాయ నిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సూచించారు. మండలంలోని రాపోల్ గ్రామానికి చెందిన తిరుపతి అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేస్తుకున్నాడు. బాధితునికి రూ.1.28 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాపోల్ గ్రామ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కృషి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
కర్ణాటక ధాన్యాన్ని కట్టడి చేయండి
తాండూరు రూరల్: తెలంగాణ – కర్ణాటక సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో నిఘాను పెంచాలని ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం మండలంలోని కొత్లాపూర్ సరిహద్దులోని చెక్‌పోస్టును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతున్నందున కర్ణాటక నుంచి వడ్లు వచ్చే అవకాశం ఉందని పటిష్ట నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక ధాన్యం జిల్లాలోకి రావొద్దన్నారు. మత్తు పదార్థాలు తరలించే వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నాగేశ్, ఎస్ఐ విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కేసుల వివరాల గురించి ఎస్ఐ శ్రీధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ సూచించారు. సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాలి ఎస్పీ నారాయణరెడ్డి -
17లోగా దరఖాస్తు చేసుకోండి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ అనంతగిరి: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అన్ని మీ సేవ కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఇంటర్లో గణితం ఒక అంశంగా ఉండాలన్నారు.(కనీసం 60శాతం మార్కులు సాధించిన వారు), ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మే 26 నుంచి జూలై 26వ తేదీ వరకు పని దినాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
5,235
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025మూడేళ్లుజిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న కుక్కకాట్లు తాండూరు: కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన నీలం మధు, లావణ్య దంపతులు. ఉపాధి కోసం తాండూరుకు వలస వచ్చి పట్టణ శివారులోని ఓ పాలిషింగ్ యూనిట్లో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరికి ఆరు నెలల బాలుడు సాయినాథ్ ఉండేవాడు. గతేడాది నాపరాతి పాలిషింగ్ యూనిట్లో పని చేస్తున్న భర్తకు తాగునీరు ఇచ్చేందుకు లావణ్య కొడుకును నిద్రపుచ్చి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి వీధి కుక్క ఇంట్లోకి చొరబడి చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. పెళ్లయిన నాలుగేళ్లకు పుట్టిన కొడుకు ఊర కుక్క దాడితో మరణించడంతో ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతం. ఇలాంటి ఘటనలు జిల్లాలో సర్వసాధారణమైపోయాయి. చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా కనిపిస్తే చాలు కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. వాటి నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. రికార్డు స్థాయిలో కేసులు జిల్లాలో వీధి కుక్కల బెడద రోజు రోజుకూ పెరిగిపోతోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా కుక్కలు రెచ్చిపోతూ దాడులకు తెగబడుతున్నాయి. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. 2023 నుంచి 2025 ఏప్రిల్ నెల వరకు 5,235 కుక్కకాటు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తప్పని తంటాలు గతంలో కుక్కకు ఉన్నంత విశ్వాసం మనిషికి లేదు అనే నానుడు వినిపించేది. ఇటీవల కుక్కలు అంటేనే జనాలు దూరంగా పరిగెడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం వరకు ప్రతి ఇంట్లో కుక్క కనిపించేది. ప్రస్తుతం వాటి ఆదరణ పూర్తిగా పడిపోయింది. అందుకు బొచ్చు కుక్కలు, హచ్ కుక్కలు, పలు రకాల హైబ్రిడ్ కుక్కలు మార్కెట్లోకి వచ్చాయి. చూడటానికి అందంగా కనిపించడంతో రూ.వేలు – లక్షలు వెచ్చించి పేద, గొప్ప అనే తేడా లేకుండా పెంచుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న కుక్కలన్నీ వీధి శునకాలుగా మారిపోయాయి. అవి కరిచినా, గొళ్లతో రక్కిన ప్రమాదమే. కుక్కలను దగ్గరకు తీసుకునే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు శబ్దం చేయకూడదు, కుక్కలు పోట్లాడుకునే సమయంలో దగ్గరకు వెళితే ప్రమాదం తప్పదు. వాహనాలపై ప్రయాణించేటప్పుడు సైరన్, హారన్ మోగిస్తే మీదకు వచ్చి కరుస్తాయి. పెరుగుతున్న రేబిస్ కేసులు జంతువుల కాటుతో రేబిస్ వ్యాధి సంక్రమిస్తోంది. ఈ వైరస్ ప్రధానంగా కుక్క, కోతి, పిల్లి కరిస్తే సోకుతోంది. పెంపుడు జంతువైనా, వీధి జంతువైనా వైరస్ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో ప్రతి నెలా సుమారు 250 నుంచి 280 మంది కుక్కకాటుకు గురై చేరుతున్నారు. మరోవైపు పీహెచ్సీ, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. శునకాల దాడితో రేబిస్ వైరస్ బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్న జిల్లా యంత్రాంగం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం. తాండూరు మున్సిపల్ పరిధిలో 1,200 కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటికోసం షెల్టర్ హోమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. సంతాన నియంత్రణ కోసం 450 మగ కుక్కలను పట్టి ఆపరేషన్ చేయించినట్లు మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి తెలిపారు. ఆపరేషన్ అనంతరం కుక్కలను అవి ఉన్న నివాస ప్రాంతాల్లో కాకుండా ఇతర చోట్ల వదిలేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. న్యూస్‌రీల్ ఆస్పత్రి పాలవుతున్న బాధితులు తాజాగా పరిగి మండలంలో పిచ్చికుక్క దాడి ఐదుగురు చిన్నారులకు గాయాలు నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం మెరుగైన వైద్యం అందిస్తున్నాం కుక్క కాటుకు గురైన వారు వచ్చిన వెంటనే ప్రాథమిక వైద్యం అందిస్తాం. కాటు తీవ్రతను బట్టి వైద్య సేవలు చేస్తాం. రేబీస్ వైరస్‌కు సంబంధించిన వాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్క కరిచిన వెంటనే గాయంపై నీటి ధార కింద ఉంచి సబ్బుతో శుభ్రం చేయాలి. గోరు వెచ్చని నీటిని 10 నిమిషాల పాటు గాయంపై పోయాలి. రక్తం కారకుండా తుడవాలి. గాయంపై స్టైరెల్ బ్యాండేజీ చుట్టాలి. యాంటి బయోటిక్ క్రీమ్ ఉంటే రాయాలి. వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలి. కరిచిన కుక్క మంచిదా.. పిచ్చిదా అని గుర్తించి వైద్య సేవలు పొందాలి. – డాక్టర్. డీ.రవిశంకర్, సూపరింటెండెంట్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి -
పంట మార్పిడితో లాభాలు
శాస్త్రవేత్తలు లక్ష్మణ్, రాజేశ్వర్‌రెడ్డి కొడంగల్ రూరల్: వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు అందించే సూచనలు పాటిస్తూ రైతులు అధిక దిగుబడులు సాధించాలని తాండూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త టి.లక్ష్మణ్, వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త టి.రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని రుద్రారం గ్రామ రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు అధికంగా యురియా వాడడంతో మట్టిలో జీవశక్తి తగ్గిపోతుందని, దీర్ఘకాలికంగా ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే క్రమంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటలు నష్టపోయే క్రమంలో పరిహారం పొందేందుకు వీలుంటుందన్నారు. అధిక దిగుబడులు సాధించాలంటే ముందుగా పంట మార్పిడి పద్ధతులు పాటించాలని, దీంతో భూమిలో పండించే శక్తి మెరుగు పడుతుందన్నారు. వ్యవసాయాధికారుల సూచనలను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ తులసి, ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్, గ్రామస్తులు ఆనంద్‌రెడ్డి, సాయిలు, హన్మయ్య, వెంకటయ్యగౌడ్, ఏఈఓలు శ్రీపతిరెడ్డి, సుమ, పావని, అశ్విని, రాజు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. యువత చేతుల్లోనే భవిష్యత్ మైనారిటీ గురుకులాల జిల్లా రీజనల్ లెవల్ కన్వీనర్ వినోద్ ఖన్నా తాండూరు టౌన్: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేయ డం అభినందనీయమని మైనారిటీ గురుకులాల జిల్లా రీజనల్ లెవల్ కన్వీనర్ వినోద్ ఖన్నా అన్నారు. బుధవారం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 90 మంది ఎస్ఎస్సీ, ఇంటర్లో ఉత్తమ మా ర్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ అంతా యువత చేతుల్లోనే ఉందన్నారు. విద్య, ఉద్యో గ, ఉపాధి రంగాల్లో యువత తాము ఎంచు కున్న రంగంలో రాణించాలన్నారు. ఎండబ్ల్యూఎస్డీఎస్ ఆధ్వర్యంలో యువతులకు టైలరింగ్, మెహిందీ డిజైన్లలో శిక్షణ, విద్యార్థులకు ఎప్‌సెట్, టెట్, డీఎస్సీ వంటి వాటిలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం హర్షణీయమన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేయడం వల్ల వారిలో ప్రోత్సాహాన్ని నింపిన వారవుతారన్నారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమాల్ అతర్, ఎండబ్ల్యూఎస్డీఎస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ యూనస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అబ్దుల్ ఖయ్యూం అతర్, నాయకులు అబ్దుల్ రవూఫ్, ఫారూఖ్ సాహిల్, బాబర్, అబ్దుల్ ఘని, పలు పాఠశాలల ప్రతినిధులు అజార్, షకీల్ ఉమ్రి, ప్రశాంత్ పాల్గొన్నారు. పీఎస్‌కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి కడ్తాల్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించడంతోపాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ సూచించారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. అఽధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను పాటిస్తూ విధులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ సమాజంలో పోలీసుల గౌరవాన్ని పెంచాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ గస్తీ పెంచాలని ఆదేశించారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్ఐ శివశంకర వరప్రసాద్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
పరిష్కరించండి
ఆధ్యాత్మికతతో.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని మానసిక ప్రశాంతత పొందాలని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు.భూ సమస్యలు11లోuధారూరు: భూ భారతి అవగాహన సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కేరెళ్లి, కుక్కింద గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. భూముల వివరాల్లో తప్పులు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించుకోవచ్చని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తే చాలన్నారు. అధికారులు రైతులు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. భూ భారతి చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు, రైతులు పాల్గొన్నారు. ధాన్యం సేకరించాలి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు విధిగా ఉండాలని, నిర్వాహకులు రైతులను వేధించకుండా చూడాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి గట్టెపల్లి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో జాప్యం చేయరాదని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా వడ్లు సేకరించాలన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇంటి పనుల పరిశీలన మండలంలోని అవుసుపల్లిలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పరిశీలించారు. గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయని, ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయని ఎంపీడీఓ నర్సింహులును అడిగారు. గ్రామానికి 117 ఇళ్లు మంజూరు కాగా ఏడు పునాదుల పనులు పూర్తయినట్లు వివరించారు. మరో ఐదు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. తనకు పింఛను వస్తున్నందున హౌసింగ్ డీఈ ఇంటి నిర్మాణ పనులను ఆపేశారని గ్రామానికి చెందిన సోమారం అశోక్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వెంటనే బిల్లు మంజూరు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో పాత ఇళ్ల వద్ద ఫొటోలు దిగామని, అయితే తమకు మరోచోట స్థలాలు ఉన్నందున అక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని పలువురు కలెక్టర్‌ను అభ్యర్థించగా సానుకూలంగా స్పందించారు. గ్రామ పంచాయతీ నుంచి స్థలానికి సంబంధించిన పత్రాలు తీసుకొని ఎంపీడీఓకు అందజేయాలని సూచించారు. తాను పునాది పనులు పూర్తి చేసుకున్నా పాత గోడ ఉన్న కారణంగా బిల్లు ఆపేశారని న్యాయం చేయాలని ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. బిల్లు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ కేరెళ్లి, కుక్కింద గ్రామాల్లో భూ భారతి అవగాహన సదస్సులు -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
మిట్టకోడూర్ గ్రామంలో విషాదం పరిగి: ఈత సరదా ఓ కుంటుబాన్ని దుఃఖసాగరంలో ముంచింది. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మిట్టకోడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఐనాపురం శ్రీనివాస్, రేనమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు వినయ్(9) నాలుగో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లారు. అందులో గుంతలు ఉండడం, వినయ్‌కి ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. తోటి స్నేహితులు గమనించి బయటకు వెళ్లి ఇంటికి పరుగులు తీశారు. దారిన ఓ వ్యక్తి వెళ్తుంటే వినయ్ చెరువులో మునిగిపోయాడని చెప్పారు. దీంతో గ్రామస్తులు చెరువు దగ్గరకు వెళ్లి వెతకగా అప్పటికే మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య తాండూరు రూరల్: బావిలో దూకి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంతబాసుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోతు రమేష్(36) కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం పెద్ద భార్య, కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత దేవిబాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. కొంతకాలంగా ఇద్దరు బాగానే ఉన్నారు. నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దేవిబాయి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఎటో వెళ్లిపోయాడు. బుధవారం మిట్టబాసుపల్లి గ్రామ శివారులో బావిలో మృతదేహం లభ్యమైన విషయాన్ని రమేష్ కుటుంబ సభ్యులకు స్థానికులు చెప్పారు. వారు వచ్చి రమేష్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి నర్సింగ్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
భార్యను కడతేర్చిన భర్త
పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతు రు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్న జాకీర్ తన మకాంను ఈనెల 1న బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు. మంగళవారం అర్ధరాత్రి భార్య తో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానంతో హత్య -
యువకుడి బలవన్మరణం
హిమాయత్‌నగర్ : ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బాల్యతండాకు చెందిన ధరావత్ రాందాస్ కుమారుడు ధరావత్ ప్రవీణ్ కుమార్(20) నారాయణగూడలోని అభ్యశ్రీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ జేఈఈ మెయిన్స్‌కు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండుసార్లు ప్రయత్నించినా ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి లోనైన అతను ఈనెల 12న తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధపడగా వారు అతడికి సర్దిచెప్పారు. మంగళవారం తల్లిదండ్రులు ప్రవీణ్‌కు ఫోన్ చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు బుధవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
రైతుకు ‘గుర్తింపు’
దౌల్తాబాద్: రైతు(ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియను వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. ఆధార్‌తో ప్రతి అన్నదాతకు 11 నంబర్లతో యూనిక్‌కోడ్(యూసీ) కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్రం రూపొందించిన ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5న శ్రీకారం చుట్టింది. మండల వ్యాప్తంగా ఉన్న భూ యజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో పొందుపర్చనున్నారు. రైతులకు డిజిటల్ కార్డు ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు కింద అర్హులైన ప్రతీ రైతుకు 11 నంబర్ల యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. ఇది వారికి అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఆధార్‌తో లింకు అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడీలో రైతు పేరు, ఆధార్, మొబైల్ నంబరు, పట్టాదారు పాసు పుస్తకం వివరాలు, భూమి రకం, సర్వే నంబర్లు, సాగు చేసిన పంటల తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడీ ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది. ప్రస్తుతం భూ యజమానులకే మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాల్సిందే. కాగా తమకు అవకాశం ఇవ్వలేదని కౌలు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రయోజనాలెన్నో ప్రతీ రైతుకు జారీ చేసే యూనిక్ ఐడీకి ఆయా రైతులు సీజన్లో పొందే సబ్సీడీలు, రుణాలు పంటబీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, బకాయిలు ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఫార్మర్ ఐడీ ద్వారా కేంద్ర పథకాల ప్రయోజనాలు వేగంగా పారదర్శకంగా అందుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి. మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రారంభం 11 అంకెలతో ఫార్మర్ ఐడీ కేటాయింపు -
అక్కడ ట్రైనింగ్... ఇక్కడ యాక్షన్!
1993 నుంచి లింకులు... ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థ 1987లో ప్రారంభమైంది. దీని ఛాయలు నగరంలో 1993 నుంచీ ఉన్నాయి. ముంబైకి చెందిన జలీస్ అన్సారీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ కరీం టుండా, కోల్‌కతాకు చెందిన అబ్దుల్ మసూద్, వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీ తన్జీమ్ ఇస్లాహుల్ ముస్లిమీన్ (టీఐఎం) పేరుతో ఓ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు. 1993లో నగరంలోని అబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్, హుమాయున్‌నగర్, మౌలాలీల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆజం ఘోరీతో (2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు) పాటు మిగిలిన ముగ్గురూ మర్కజ్ తోయిబాలో శిక్షణ పొందిన వారే. 1998లో పాకిస్తాన్ నుంచి పాతబస్తీకి వచ్చి, ఇక్కడి యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ సలీం జునైద్ పట్టుబడ్డాడు. ఇతడూ అదే టెర్రర్ క్యాంప్‌లో శిక్షణ పొందిన వాడే. మరో సంస్థ ఏర్పాటు చేసిన ఆజం ఘోరీ... టీఐఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆజం ఘోరీ 1999లో ఇండియన్ ముస్లిం మహ్మదీయ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) ఏర్పాటు చేశాడు. నగరంలోని ఆరు ప్రాంతాలతో పాటు విజయవాడ, బోధన్, నిజామాబాద్‌ల్లోనూ విధ్వంసాలు సృష్టించిన ఈ మాడ్యుల్లోని అనేక మంది మురిద్కే వరకు వెళ్లి శిక్షణ పొంది వచ్చిన వాళ్లే. 2001లో గణేష్ నిమజ్జనంలో పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్, 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబ దేవాలయం వద్ద పేలుడుకు పాల్పడిన ఆజం, అజీజ్ తదితరులు, 2004లో సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర పన్నిన నసీరుద్దీన్ మాడ్యుల్, 2005లో నగర వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నిన నవీద్ మాడ్యుల్... వీటన్నింటి వెనుక ఎల్ఈటీనే ఉంది. ఈ విధ్వంసాలు, కుట్రలకు పథక రచన చేసి, పాల్గొన్న వారిలో అత్యధికులు మురిద్కే వరకు వెళ్లి మర్కజ్ తోయిబాను ‘చూసి’ వచ్చిన వాళ్లే. సౌదీలో ఉద్యోగాల పేరుతో ఎర వేసి... నగర యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ఎల్ఈటీ, దాని అనుబంధ సంస్థల నిర్వాహకులు వారిని నేరుగా మర్కజ్ తోయిబాకు చేర్చలేదు. ఎల్ఈటీ స్లోగన్స్‌లో ‘హైదరాబాద్ లిబరేషన్’ కూడా కీలకం కావడంతో నగరం, కాన్పూర్లకు చెందిన యువతనే ఎక్కువగా ఆకర్షించే వాళ్లు. వీరిని ఉద్యోగాల పేరుతో సౌదీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి మురిద్కే పంపేవాళ్లు. ఉగ్రవాద శిక్షణ పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా హైదరాబాద్ చేర్చేవాళ్లు. మర్కజ్ తోయిబాలో ఉన్న ట్రైనర్లకూ నగరంపై మంచి పట్టు ఉండేది. శిక్షణ కోసం వెళ్లిన యువతతో ఉర్దూలో మాట్లాడటం, సిటీలో ఉన్న కీలక ప్రాంతాల వివరాలు అడగటం చేసే వాళ్లు. చిక్కిన ముష్కరులు, వారి సానుభూతిపరుల విచారణలో ఈ విషయం గుర్తించిన నిఘా వర్గాలు ఆ ట్రైనర్లు ఇక్కడ సంచరించి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత బలగాలు ధ్వంసం చేసిన తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల్లో మురిద్కేలో ఉన్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టెర్రర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. లాహోర్ సమీపంలో నియంత్రణ రేఖకు 30 కిమీ దూరంలో ఉన్న ఈ కీలక క్యాంప్‌ను మర్కజ్ తోయిబా అని పిలుస్తారు. దీనితో హైదరాబాద్‌కు అనేక లింకులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్లిన, ఇక్కడ పట్టుబడిన అనేక మంది ఉగ్రవాదులు, సానుభూతిపరులు మర్కజ్ తోయిబాలో శిక్షణ పొందడమో, అక్కడ జరిగే వార్షిక సమావేశాల్లో పాల్గొనడమో చేసిన వాళ్లే. 1993 నాటి జలీస్ అన్సారీ, 1998లో చిక్కిన పాకిస్థానీ సలీం జునైద్ నుంచి ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న కుర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ వరకు ఈ కోవకు చెందిన వాళ్లే. – సాక్షి, సిటీబ్యూరో●ఫర్హాతుల్లా పాత్ర అత్యంత కీలకం... ఎల్ఈటీతో పాటు మర్కజ్ తోయిబాలోనూ కూర్మగూడ వాసి ఫర్హాతుల్లా ఘోరీ పాత్ర అత్యంత కీలకమని నిఘా వర్గాలు చెప్తున్నాయి. 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లిన ఇతగాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ధామ్ దేవాలయంపై జరిగిన దాడి కేసుతో ఇతని వ్యవహారాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. 2004లో నగరం కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది. ఘోరీ అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌కు (జేఈఎం) సానుభూతిపరుడిగా ఉండి ఈ కేసులోనూ నిందితుడిగా మారాడు. ఆ తర్వాత 2005లో టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. 2022లో దసరా నేపథ్యంలో విధ్వంసాలకు కుట్రపన్ని ఽహ్యాండ్ గ్రెనేడ్స్తో సహా చిక్కిన ‘ఉగ్ర త్రయం’లో కీలకమైన జాహెద్తోనూ సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇతను గత ఏడాది వరకూ మర్కజ్ తోయిబాలో జరిగే వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు. మురిద్కేలో ధ్వంసమైనఎల్ఈటీ ‘టెర్రర్ ఫ్యాక్టరీ’ ‘సిటీ ఉగ్రవాదుల్లో’ పలువురికి అది సుపరిచితం జలీస్ అన్సారీ నుంచిఫర్హాతుల్లా ఘోరీ వరకు... నగరంలో జరిగిన విధ్వంసాలకు అక్కడే కుట్రలు -
కల్తీ సరుకుల తరలింపు
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు కొడంగల్ రూరల్: కల్తీ సరుకులతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి తనిఖీ చేస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి రావులపల్లి వైపు వెళ్తున్న వాహనంలో అక్రమంగా 1500 కేజీల అల్లం పేస్ట్, 1500 లీటర్ల మంచినూనెను తరలిస్తున్నారని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం సరుకులను పరిశీలించగా అవి దుర్వాసన కలిగి ఉన్నాయని తెలిపారు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భూ బాధితులకు పరిహారం చెల్లించండి పీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ తాండూరు టౌన్: తాండూరు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకున్న భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్ రోడ్డు కోసం అంతారం, కోకట్ తదితర ప్రాంతాల పరిధిలో భూసేకరణ చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే ఈనెల 19వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి చేపలు పట్టేందుకు వెళ్లిన ఒడిశావాసి దుర్మరణం అనంతగిరి: చేపలు పట్టేందుకు వెళ్లిన వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతిచెందాడు. సీఐ భీంకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ బిష్టుపూర్కు చెందిన సుశాంత్ మంగరాజ్(47) శివారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 12న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. తెలిసిన వారివద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శివారెడ్డిపేట చెరువులో గుర్తుతెలియని శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు సుశాంత్‌గా గుర్తించారు. మృతుని కుమారుడు రాకేశ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు. ‘పోలీసులతో ప్రాణభయం’ హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు మొయినాబాద్: ‘పోలీసులతో నాకు ప్రాణభయం ఉంది.. భూ వివాదంలో తలదూర్చి దగ్గరుండి ప్రీ కాస్ట్ గోడను తొలగించారు. అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు నాపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని నాగిరెడ్డిగూడకు చెందిన సంతపురం అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. తన తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్నారు. దీంతో తనకు సగం వాటా ఇస్తూ 2024 జూన్ 6న కోర్టు ఫైనల్ డిక్రీ ఇచ్చిందని తెలిపారు. దీని ప్రకారం 2025 మార్చి 13న కొత్త పట్టాదారు పాసుపుస్తకం వచ్చిందన్నారు. కోర్టు ద్వారా వచ్చిన భూమి చుట్టూ నెల రోజుల క్రితం ప్రీకాస్ట్ వాల్ నిర్మించుకున్నామన్నారు. ఏప్రిల్ 21న అర్ధరాత్రి సుమారు 30 మంది పోలీసులు, కొంత మంది వచ్చి గోడను ధ్వంసం చేశారని, తనపై తప్పుడు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారని వివరించారు. పోలీసుల తీరును తప్పుపడుతూ జడ్జి మందలించడంతో 41 నోటీసులు ఇచ్చి పంపించారని తెలిపారు. ఇటీవల మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ వేధిస్తున్నారన్నారు. ఇది భరించలేక మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనిపై మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా.. భూమిని కొనుగోలు చేసిన వారు ఇరవై ఏళ్లుగా కబ్జాలో ఉన్నారని, వారు నిర్మించిన ప్రహరీ, చెట్లను ధ్వంసం చేయడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. -
కౌన్సెలింగ్‌కు వచ్చి గుండెపోటుతో మృతి
రాజేంద్రనగర్: భార్యభర్తల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... కిస్మత్పూర్ దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (35) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి ఇద్దరూ భార్యలు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా అతను మరో మహిళతో ఉంటున్నాడు. ఈ విషయమై రెండో భార్య ఇషాద్ బేగం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భార్యభర్తలను మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ఇంటికి వెళ్లాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇర్ఫాన్ రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని అత్తాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించచిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
దారి కాసిన మృత్యువు
అనంతగిరి: ప్రమాదంలో దెబ్బతిన్న డీసీఎం ఆ యువకుడి పాలిట యమపాశమైంది. ఆగి ఉన్న వాహనాన్ని గమనించక బైక్‌తో ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులోని కొత్రెపల్లి సమీపంలో రాత్రి 11 గంటలకు ఓ కారు, డీసీఎం ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతినడంతో అక్కడే వదిలి పెట్టారు. డీసీఎం కొంతభాగం రోడ్డుపైనే నిలిపారు. గంట వ్యవధిలోనే నవాబుపేట మండలం ఎక్‌మామిడికి చెందిన కార్తీక్ ముదిరాజ్ తన బుల్లెట్ బండిపై మన్నెగూడ వైపు వెళ్తున్నారు. కాగా కొత్రెపల్లి సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను గమనించక పోవడంతో వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కార్తీక్ తలకు తీవ్ర గాయాలై కొట్టు మిట్టాడుతూ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా ముందుగా జరిగిన ప్రమాదంలో వాహనాన్ని రోడ్డుపై నిలపడంతోనే ఈ ఘోరంజరిగిందని స్థానికులు వాపోతున్నారు. డీసీఎంను ఢీకొని యువకుడి దుర్మరణం -
ప్రైవేటుకే మొగ్గు!
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 20258లోuవికారాబాద్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు కావస్తున్నా పంట దిగుబడిలో కేవలం పది శాతం మాత్రమే విక్రయించారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, కొర్రీల కారణంగా బహిరంగ మార్కెట్, కళ్లాల వద్ద దళారులకు విక్రయిస్తున్నారు. మరో వైపు వరుణు గండం పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమై కళ్లాల్లోకి ధాన్యం నిల్వలు చేరాయి. వడ్లు ఆరబెట్టి విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు భయపెడుతున్నాయి. 15 రోజులుగా అడపదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలో వరి దిగుబడిని అంచనా వేసిన అధికారులు 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 85 సెంటర్లను ప్రారంభించారు. తాలు, తేమ శాతం పేరిట కేంద్రాలకు వచ్చిన వడ్లను నిర్వాహకులు తిప్పి పంపుతుండటం రైతులకు ఇబ్బందిగా మారింది. లక్ష్యం.. లక్ష మెట్రిక్ టన్నులు జిల్లాలో 93 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని భావిస్తున్నారు. అయితే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి 25రోజులు కావస్తున్నా కేవలం 17 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. ఇందులో 424 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు కాగా, 13.44 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.40 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.18 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ. 22 కోట్లు చెల్లించాల్సి ఉంది. న్యూస్‌రీల్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపని రైతులు సకాలంలో డబ్బు జమకాకపోవడం, కొర్రీలే కారణం 25 రోజులు కావస్తున్నా వచ్చింది పది శాతం వడ్లే పొంచివున్న వరుణ గండం రోడ్లపై ఆరబోసిన ధాన్యం ఆందోళనలో అన్నదాతలుకేంద్రాల కుదింపు రెండేళ్ల క్రితం 60 వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా 167 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగినా (92 వేల ఎకరాల్లో) 128 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయిచారు. ప్రస్తుతం 85 సెంటర్ల ద్వారానే ధాన్యం సేకరిస్తున్నారు. ఈ నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష మెట్రిక్ టన్నులు రావచ్చని చెబుతున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం ఆరబోసుకునేందుకు సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 93వేల ఎకరాలు దిగుబడి అంచనా 2.25లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సేకరించింది 17వేల మెట్రిక్ టన్నులే రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.40 కోట్లు జమ చేసింది రూ.18 కోట్లే పక్కాగా ఏర్పాట్లు జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు పక్కా ఏర్పాట్లు చేశాం. తాలు, తరుగు, తేమ శాతం, మట్టి పెల్లలు ఎంత మేర ఉంటే కొనుగోలు చేయాలనే దానిపై కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. ప్రస్తుతం వర్షాలు పడుతుండటం కొంత మేర ఇబ్బంది కలిగిస్తోంది. అయినా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ధాన్యం మిల్లులకు చేరగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి. దళారులను నమ్మి మోసపోరాదు. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్ భయపెడుతున్న వరుణుడు పది రోజుల నుంచి అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కళ్లాలు, రోడ్లపై ఆరబోశారు. ఈ సమయంలో వర్షాలు పడితే వడ్లు తడిసి గిట్టుబాటు ధర రాదని భయాందోళన చెందుతున్నారు. చాలా మంది రైతుల వద్ద టార్పాలిన్లు లేవు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థలాలు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సేకరించిన వడ్లను రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. -
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ సంస్థ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు కోల్పోయిన బాలికల నుంచి, అక్రమ రవాణాకు గురైన, దివ్యాంగ బాలికల నుంచి మూడు సంవత్సరాల టెక్నికల్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి జయసుధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు. అమ్మాయిలు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. దరఖాస్తుకు కులం, ఆదాయం (అనాధబాలికలకు అవసరం లే దు), తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం, బోనాఫైడ్ సర్టిఫికెట్లను జతచేసి ఈ నెల 20వ తేదీలోపు వికారాబాద్‌లోని బాలరక్ష భవన్లో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ల 9640863896, 9849672296లోసంప్రదించాలన్నారు. ప్రశాంతంగా పాలిసెట్ అనంతగిరి: పాలిసెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది. వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాల, ఏసీఆర్ భృంగీ పాఠశాలలో సెంటర్లు ఏర్పాట్లు చేశారు. గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 1,400 మందికి గాను 1,282 మంది విద్యార్థులు హాజరైనట్లు పాలీసెట్ జిల్లా కన్వీ నర్ రవీందర్ తెలిపారు. ఆటోనగర్ ఏర్పాటు చేయాలని వినతి తాండూరు: పట్టణ శివారులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని తాండూరు మెకానిక్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కోరారు. కోకాపేట్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లారీ మెకానిక్ అసోసియేషన్, స్టోన్, క్వారీ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందించారు. పట్టణంలో ఆటోనగర్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే తాండూరు – హైదరాబాద్ మార్గంలో అధునాతన వసతులతో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, పట్లోళ్ల నర్సింహులు, జుబేర్‌లాల, మసూద్ తదితరులు పాల్గొన్నారు. రైతులు అధిక దిగుబడితో ఆదర్శంగా నిలవాలి రంగారెడ్డి వ్యవసాయాధికారి నర్సింహారావు యాచారం: కూరగాయలు, ఆకుకూరల దిగుబడి సాధించి ఆదర్శంగా నిలవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండల పరిధిలోని చౌదర్పల్లిలో మంగళవారం రైతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలెట్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు రాయితీపై అందజేసే వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు నమోదు ప్రక్రియను తెలియజేశారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్‌కుమార్ వ్యవసాయ, పండ్లతోటల పెంపకం గురించి వివరించారు. డ్రిప్ పద్ధతి ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడి పొందొచ్చని తెలిపారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, మండల వ్యవసాయాధికారి రవినాథ్, ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి నవీన తదితరులు పాల్గొన్నారు. -
వీర జవాన్లకు ఘన నివాళి
అనంతగిరి: భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మన సైనికుల కోసం మంగళవారం వికారాబాద్ పట్టణంలో అశ్రునివాళి పేరిట సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఆలంపల్లి నుంచి ప్రధాన రోడ్ల మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, వ్యాపారులు, మాజీ సైనికులు, కుల సంఘాల నాయకులు, పైవేటు స్కూళ్ల అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, వైద్య కళాశాల విద్యార్థులు, యువకులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. సైన్యానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీర జవాన్ల కుటుంబాలకు, దేశానికి అండగా ఉంటామన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా చిన్నారులు, పెద్దలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించి పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు సత్తయ్య, లింగమయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్. సాధు సత్యనాధన్, ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఆయా పార్టీల నాయకులు వడ్లనందు, అశోక్, అమరేందర్‌రెడ్డి, దేవదాసు, శివరాజు, సుభాష్, సుభాన్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్, పాండుగౌడ్, శ్రీధర్‌రెడ్డి, రమేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు. సంఘీభావ యాత్రకు భారీగా తరలివచ్చిన జనం ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీ దేశం నుంచి బహిష్కరించాలి పరిగి: పాకిస్తానీయులను దేశం నుంచి బహిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పరిగి పోలీస్ స్టేషన్, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిగి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో పాకిస్తానీయులు ఉన్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అలాగే దేశ సంపద తింటూ వ్యాపార సంస్థలకు శత్రు దేశం పేర్లు పెట్టుకోవడం దారుణమన్నారు. అలాంటి పేర్లను వెంటనే తొలగించి ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్, కార్యదర్శి పెంటయ్య గుప్తా, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యాన్ని మిల్లులకు తరలించండి
ధారూరు: కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించి రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. మండలంలోని గట్టేపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 17,459.920 మెట్రిక్ టన్నులు వడ్లు సేకరించినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోరాదని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్‌బాబు, డీటీసీఎస్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని దోర్నాల్ గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సులో పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
ఎల్లమ్మ జాతరకు సహకరించాలి
తాండూరు రూరల్: మండలంలోని కోత్లాపూర్‌లో వెలసిన రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరకు ప్రతి ఒక్క రూ సహకరించాలని, ఎవరైనా గొడవలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల పాటు జరిగే జాతరకు తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. సీసీ కెమెరాల నీడలో జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 30న రథోత్సవం ఉంటుందని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జాతరలో గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఎస్ఐ విఠల్‌రెడ్డిని ఆదేశించారు. గొడవలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ● బిక్కరెడ్డి గూడెంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన ● పలు గ్రామాల్లో సీసీ రోడ్లు ప్రారంభంమోమిన్పేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో రూ.8.15 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. బిక్కరెడ్డి గూడెంలో రూ.3 కోట్లతో బీటీ రోడ్డు పనులకు, మల్లారెడ్డిగూడెం చెరువు, ఎన్కతల పెద్ద చెరువు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. మోమిన్‌పేటలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన పేదలందరికీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు దశల వారీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదట సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేశామన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఎన్నో ఏళ్లుగా బిక్కరెడ్డిగూడెంకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.3 కోట్లతో బీడీ రోడ్డు వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, పీఆర్ ఏఈఈ ప్రణీత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు నరోత్తంరెడ్డి, సురేందర్, శుభాష్గౌడ్, సిరాజొద్దీన్, మహంత్‌స్వామి, ఎజాస్, ఎరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం
ఆర్డీఓ వాసుచంద్ర ధారూరు: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందేని ఆర్డీఓ వాసుచంద్ర తెలిపారు. మంగళవారం మండలంలోని దోర్నాల్, గురుదోట్ల, కుమ్మర్‌పల్లి గ్రామాల్లో కొత్త చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ, కలెక్టర్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కొత్త చట్టం ద్వారా గ్రామంలోనే సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతుల నుంచి 35 దరఖాస్తులు స్వీకరించారు. త్వరలో వీటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాస్, సాజిదాబేగం, దీపక్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం
కుల్కచర్ల: ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అల్లాపూర్, రాంరెడ్డిపల్లి, ముజాహిద్పూర్, పటెల్చెరువు తండా, కామునిపల్లి, కుల్కచర్ల గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు, మౌలిక వసతులు ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, మొక్కల పెంపకం చేపట్టి కాలుష్య రహితంగా గ్రామాలను తీర్చిదిద్దుతామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ సదుపా యం కల్పించినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కార్య క్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్ బీ అధ్యక్షుడు భరత్‌కుమార్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యదర్శి యాదయ్య, నాయకులు చంద్రభూపాల్, రవి, భరత్‌కుమార్ రెడ్డి, సోమలింగం, షర్పొద్దీన్, భాస్కర్, కృష్ణయ్య పాల్గొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దోమ: అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శివారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇళ్లు రాని వారు ఆందోళన చెందరాదని, రెండో విడతలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి,ౖ డైరెక్టర్ శాంతుకుమార్, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఈడిగి రమేశ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ బంగ్ల యాదయ్యగౌడ్, మాజీ సర్పంచ్ నరేందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చెన్నయ్య, నాయకులు రాఘవేందర్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, మొగులయ్యగౌడ్, భీంరెడ్డి, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నర్సింహులు, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
పిడుగుపాటు.. ముందే తెలిసేట్టు
షాబాద్: అకాల వర్షాలకు పిడుగులు పడి ప్రజలు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి వైఫరీత్యాలైన ఉరుములతో కూడిన వర్షాలతో పాటు పిడుగు పాటుతో ప్రాణ, ఆస్తినష్టం జరుగుతూనే ఉంది. ఏటా పిడుగుపాటుకు గురై అధిక సంఖ్యలో మూగజీవాలు, చాలా మంది ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే పిడుగు పాటుపై పరిశోధనలు చేసిన భారత వాతావరణ శాఖ ముందే పసిగట్టేందుకు ఓ యాప్‌ను ఆవిష్కరించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) ‘దామిని’ యాప్‌ను రూపొందించింది. యాప్ డౌన్లోడ్ ఇలా ప్రతి పౌరుడు తన స్మార్ట్ ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి దామిని యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను తెరిచి పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్‌కోడ్ నమోదు చేయాలి. అనంతరం జీపీఎస్ లొకేషన్ కోసం యాప్‌ను వినియోగించే సమయంలో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో మూడు రంగుల్లో చూపిస్తుంది. ఎరుపు రంగు: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి వస్తుంది. పసుపు రంగు: మీరు ఉన్న ప్రాంతంలో 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడేలా ఉంటే ఆ సర్కిల్ పసుపు రంగుగా మారుతుంది. నీలం రంగు: 18 నుంచి 25 నిమిషాలలోపు పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ నీలం రంగులో కనిపిస్తుంది. ఇవి పాటించాలి ● నల్లటి మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాల్లోకి లేక తాము ఉన్న స్థానంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను చేతులతో మూసుకోవాలి. ● బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొబైల్ సిగ్నల్స్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువగా కల్పిస్తుంది. పంట పొలాల్లో వాడకూడదు. ● విద్యుత్ స్తంభాలు, సెల్‌ఫోన్ టవర్లు, బోర్‌పంప్ సెట్లకు దూరంగా ఉండాలి. బోరు మోటార్ల నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో వినియోగించవద్దు. ● పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి. ● పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు. -
అభివృద్ధి పనులకు భూమిపూజ
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ప్రతి పల్లె, తండాల్లోని వీధులన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తుంకిమెట్లలో సీఆర్ఆర్ నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రానున్న వర్షాకాలంలో పారిశుద్ధ్యం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్, నాయకులు జయకృష్ణ, వెంకట్రాములుగౌడ్ రాంచంద్రారెడ్డి, మల్లేశం, మల్లికార్జున్, అంజిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై విరిగిపడిన చెట్టు మోమిన్‌పేట: మోమిన్‌పేటలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి రోడ్డుపై చెట్టు విరిగిపడింది. మోమిన్‌పేట–శంకర్పల్లి వెళ్లే దారిలో చిలకవాగు వద్ద వృక్షం విరిగి రోడ్డుపై పడటంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్క నుంచి బురదలో వాహనాలు వెళ్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు బంట్వారం: హత్య కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సున్నం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తీర్పు వెల్లడించారని ఎస్పీ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోట్‌పల్లి మండలం ఇందోల్ గ్రామానికి చెందిన బాసుపల్లి పెంటప్ప, హన్మంతు అన్నాదమ్ములు. వీరి దాయాదులు బాసుపల్లి అంజిలప్ప కుటుంబంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2014 డిసెంబర్ 4న రాత్రి హన్మంతు తన ఇంటికి వెళ్తుండగా అంజిలప్ప ఘర్షణకు దిగాడు. అదే సమయంలో అంజిలప్ప కుమారులు శ్రీనివాస్, పాండు అక్కడికి చేరుకున్నారు. తండ్రీకొడుకులు కలిసి హన్మంతు తలపై రాయి, కర్రతో దాడి చేయగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి సోదరుడు బాసుపల్లి పెంటప్ప ముగ్గురిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ రమేశ్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరణ్‌కోట్ సీఐ శివశంకర్ సమగ్రంగా దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. పీపీలు నారాయణగౌడ్, రవికుమార్, సుధాకర్‌రెడ్డి, అప్పటి దర్యాప్తు అధికారులు శివశంకర్, రమేష్, ప్రస్తు త సీఐ రఘురాములు, ఎస్ఐ గఫార్, సీడీఓ మహేష్‌రెడ్డి, బ్రీఫింగ్ అధికారి వీరన్నలను ఎస్పీ నారాయణరెడ్డి అభినందించారు. -
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మ ండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటు ంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన నాగిళ్ల అంజయ్య(50) వ్యవసాయం చేసుకుంటూ భార్యతో కలిసి ఉండేవాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమ్తితం షాద్‌నగర్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. అటునుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య అంజమ్మ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు. కాగా అంజయ్య మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలను వెలిబుచ్చారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
తాండూరు టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఈనెల 20న సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ యూనియన్ సభ్యులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యవస్థకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల చట్టాలను మార్చి వారికి అనుకూలమైన చట్టాలను అమలు చేస్తోందన్నారు. కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి హక్కులను తుంగలో తొక్కిందన్నారు. వెట్టిచాకిరీ నుంచి బయట పడేందుకు కార్మికులంతా కలిసి సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి కార్మిక చట్టాల ప్రకారం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ సమ్మె నోటీసు అందజేత -
జాతరకు వెళ్లొస్తూ.. అనంత లోకాలకు
కందుకూరు: పక్కన ఊరిలో జరుగుతున్న జాతరకు వెళ్లొస్తూ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గూడూరుకు చెందిన పోలదాస్ రాజు(40) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సోమవారం సాయంత్రం ఊట్లపల్లిలో జరుగుతున్న జాతరకు బైక్‌పై వెళ్లి తిరిగి రాత్రి వేళలో స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో కందుకూరు సమీపంలో ఏఎస్ దాబా ఎదుట శ్రీశైలం హైవేపై వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతని బైక్‌తో పాటు ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఫౌల్ట్రీఫారమ్లో పని చేసే ఒడిశాకు చెందిన మను, జగన్‌లను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో బైక్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మనుకు గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమారై ఉన్నారు. ఈ మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వాహనంఢీకొని వ్యక్తి దుర్మరణం -
సాగులో రసాయనాలు నియంత్రించాలి
తాండూరు రూరల్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి సూచించారు. మంగళవారం మండలంలోని బెల్కటూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు యూరియాను అధికారులు సూచించిన మోతాదులోనే వాడాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు శేఖరర్, యమున పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ కొమరయ్య, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి -
ఐస్‌క్రీం కేంద్రంపై దాడులు
కుల్కచర్ల: కాలం చెల్లిన పదార్థాలతో ఐస్‌క్రీంలు తయారు చేస్తున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేసిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన ఎండీ అజీం, యూపీకి చెందిన అనిల్, రాంపాల్ అనే ఇద్దరితో కలిసి కుల్కచర్ల మండల కేంద్రంలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని క్లాసిక్ అనే కంపెనీ పేరుతో ఐస్‌క్రీంలు తయారు చేసి విక్రయిస్తున్నారు. కాగా మంగళవారం టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మికంగా ఐస్‌క్రీం బండ్లపై దాడులు చేసి, తయారీ స్థావరాన్ని పరిశీలించారు. ఇందులో అన్నీ కాలం చెల్లిన పదార్థాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాలం చెల్లిన ముడిపదార్థాలతో తయారీ ముగ్గురిపై కేసు నమోదు -
సత్యసాయి సేవాకేంద్రంలో ఉచిత ‘స్పోకెన్ ఇంగ్లిష్’
కేంద్రం వ్యవస్థాపకుడు వెంకట్‌రెడ్డి పరిగి: శ్రీసత్యసాయి సేవాకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగాపూర్ శ్రీసత్యసాయి సేవాకేంద్రం వ్యవస్థాపకుడు సోలిపేట వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువత కోసం మంగళవారం ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఆంగ్ల భాష తప్పనిసరిగా మారిందన్నారు. గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబడి ఉన్నారన్నారు. వారికి ఆంగ్ల భాషపై పట్టు పెంచేందుకే తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి తాండూరు టౌన్: రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన తాండూరు, రుక్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి ముంబాయి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం వచ్చిందన్నారు. సదరు వ్యక్తి వయసు 50 ఏళ్లకు పైబడి ఉంటుందని, ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృత దేహాన్ని గుర్తు పట్టిన వారు 87125 13854 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు. ఇసుక టిప్పర్ పట్టివేత యాలాల: ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఓ టిప్పర్‌ను యాలాల పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి విధుల్లో భాగంగా కానిస్టేబుళ్లు జగదీష్, నరేష్ గస్తీ నిర్వహి స్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి బాగాయిపల్లి శివారులో గల పౌల్ట్రీ ఫారం సమీపంలో ఇసుక లోడ్‌తో ఓ టిప్పర్ వెళుతుండగా గమనించి పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పీఎస్‌కు తరలించారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నన్ను క్షమించు అన్నయ్య మనస్తాపంతో యువకుడి బలవన్మరణం బంట్వారం: కుటుంబ కలహాలతో వేర్వేరుగా తన అన్నావదినలు ఉండడంతో అవమానంగా భావించిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం బంట్వారం మండలంలోని తొర్మామిడిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తొర్మామిడికి చెందిన పోచారం గోవర్ధన్‌రెడ్డి (32)కు వివాహం కాలేదు. వ్యవసాయం చేస్తూ తల్లితో కలిసి ఉండేవాడు. తన అన్న నర్సింహారెడ్డి నగరంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో నర్సింహారెడ్డి, భార్య నవనీత దూరంగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ‘వదిన తీరుతో కుటుంబం పరువు పోతోంది.. నన్ను క్షమించు అన్నయ్య’ అంటూ సూసైడ్ నోట్ రాసి పొలం దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని గోవర్ధన్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం జరిపించినట్లు ఎస్ఐ చెప్పారు. -
దప్పిక తీరుస్తున్న దాతృత్వం
షాద్‌నగర్: సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకుసాగుతున్నారు పట్టణానికి చెందిన పలువురు వ్యక్తులు. ఏటా వేసవిలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన వాసవి చిట్ ఫండ్ అధినేత, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర కోశాధికారి బండారి రమేశ్ తన తల్లిదండ్రులైన దివంగత లక్ష్మమ్మ, రాజయ్యల జ్ఞాపకార్థం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట 20 ఏళ్లుగా చలివేంద్రం ఏర్పాటు చేసి, బాటసారులు, స్థానికులు, ప్రయాణికులకు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. పదేళ్లుగా అంబలి సైతం అందజేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం షాద్‌నగర్ వచ్చే ప్రజలు ఇక్కడ మంచినీళ్లు, అంబలి తాగి ఉపశమనం పొందుతున్నారు. అలాగే న్యూసిటీ కాలనీకి చెందిన శ్రీనివాస్‌చారి పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న పోచమ్మ దేవాలయం ఎదురుగా చలివేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత మూడేళ్లుగా నిత్యం వందలాది మందికి మంచినీళ్లు, మజ్జిగ అందజేస్తున్నారు. షాద్‌నగర్‌లో చలివేంద్రాలు, అంబలి కేంద్రాల నిర్వహణ వేసవిలో ఉపశమనం పొందుతున్న బాటసారులు, స్థానికులు -
ఫిర్యాదులు అందితే చర్యలు
● వైద్యాధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి ● కలెక్టరేట్లో వైద్యాధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం అనంతగిరి: వైద్యాధికారులు బాధ్యతాయుతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఉన్నతాధికారులు, అధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల, వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్‌బ్యాంక్, వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వికారాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి 45 రోజుల్లో మెడికల్ ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందజేస్తామన్నారు. వికారాబాద్ జీజీహెచ్‌కు ఎంఆర్ఐ స్కాన్‌ను మంజూరు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన, ప్రజలకు దూరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పునఃపరిశీలించి రోడ్డు భద్రత సమావేశాలను నిర్వహించి బ్లాక్ స్పాట్లను గుర్తించాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో సత్వర వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.5.5కోట్ల నిధులను వెచ్చిస్తామని వివరించారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో అధికారులు అందుబాటులో లేరని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ, డిప్యూటీ డీయంహెచ్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పీహెచ్సీ, సబ్ సెంటర్లలో వైద్య సేవలను మెరుగుపర్చాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వేతర ఆస్పత్రులను ఎప్పటికపుడు తనిఖీ చేయాలన్నారు. నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగిరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రాధాన్యత క్రమంలో వసతిగృహాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ అజయ్‌కుమార్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరవణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంచంద్రయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు. -
నేడు స్పీకర్ పర్యటన
మోమిన్‌పేట: మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుద్దోడ్కతండా బీటీ రోడ్డు, ఏన్కతల పెద్ద చెరువు మరమ్మతులు, మల్‌రెడ్డిగూడెం చెరువు మరమ్మతులు, మొరంగపల్లి, ఎన్కేపల్లి, కేసారం, సయ్యద్‌అల్లిపూర్, ఇజ్రాచిట్టంపల్లి, వెల్చాల్, దుర్గంచెర్వు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పార్టీ శ్రేణులు సకాలంలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.క్రికెట్ పోటీలు ప్రారంభందుద్యాల్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం మండలస్థాయి క్రికెట్ పోటీలు(దుద్యాల్ క్రికెట్ ప్రిమియర్ లీగ్) ప్రారంభమయ్యాయి. కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, ఎస్ఐ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులు, ఉద్యోగుల కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.7 వేలు, రెండో స్థానంలో నిలిచే జట్టుకు రూ.5 వేలు నగదు బహుమతి అందజేయనున్నట్లు నిర్వాహకులు నరేందర్, శ్రీకాంత్, అనిల్, కేశవులు, గాంధీ, సంతోష్, ఫరీద్ తెలిపారు.భూ భారతికి 43 దరఖాస్తులుధారూరు: మండలంలోని ఎబ్బనూర్, హరిదాస్‌పల్లి, చింతకుంట గ్రామాల్లో సోమవారం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు 43 అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఇకపై గ్రామాల్లోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు సాజిదాబేగం, శ్రీనివాస్, దీపక్ సాంసన్ పాల్గొన్నారు. మంగళవారం కుమ్మర్‌పల్లి, దోర్నాల్, గురుదోట్ల గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనునున్నట్లు అధికారులు తెలిపారు.ర్యాంకుల ‘కమ్మదనం’షాద్‌నగర్ రూరల్: ప్రభుత్వం ప్రకటించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గురుకుల విద్యార్థినులు సత్తాచాటారు. బైపీసీ విభాగంలో సిరి 2,234 ర్యాంకు, శ్రీహర్షిత 4,643, శిరీష 4,907, సౌమ్య 7,586, కీర్తన 8,741 ర్యాంకు, ఎంపీసీ విభాగంలో శైలజ 22,990 ర్యాంకు, సాయికీర్తన 25,903, మానస 27,493, సాయిప్రియ 28,577 ర్యాంకులు సాధించారు. 77 మంది ఇంటర్ పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపల్ విద్యుల్లత తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు సిబ్బందిని అభినందించారు. -
పరిగిలో రెండేళ్లలో వంద పడకల ఆస్పత్రి
పరిగి: పేదలకు ఆత్మస్థైర్యం నింపేలా ప్రభుత్వ వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన పరిగి పట్టణ కేంద్రంలో రూ.27 కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో పరిగిలో వంద పడకల ఆస్పత్రి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను విస్తరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఎప్పుడు కలిసిన నియోజకవర్గ అభివృద్దిపైనే మాట్లాడుతారన్నారు. డయాలసిస్ సెంటర్లో బెడ్లు, మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు. జాతీయ ప్రధాన రహాదారులపై ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 213 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో 400 మంది విద్యార్థులకు అదనంగా సీట్లు వస్తున్నాయన్నారు. పరిగిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరారని పరిశీలించి ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. బీపీ, షుగర్, క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని వీరికి వైద్యం అందించేందుకు అన్ని జిల్లాలో ఎన్సీడీ క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో నాలుగు దిక్కుల నాలుగు రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఫెడరేషన్ చైర్మన్ కల్వ సుజాత, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులుముదిరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కానరాని క్వాలిటీ
రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించక మూణ్నాళ్లకే పాడవుతున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా పర్యవేక్షణ లోపంతో అవి దుర్వినియోగం అవుతున్నాయి. అధికారులను పర్సెంటేజీల పేరిట ప్రసన్నం చేసుకుంటున్న కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేపట్టడంతో అవిఅధ్వానంగా మారుతున్నాయి. ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్న కాంట్రాక్టర్లు ● చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ● పర్సెంటేజీల మాటున పర్యవేక్షణ కరువు ● మంజూరవుతున్న నిధుల్లో 50 శాతమే పనులకు ● మూణ్నాళ్ల ముచ్చటగా అభివృద్ధి పనులు వికారాబాద్: ఫొటోలో కనిపిస్తున్న పెద్దేముల్ మండలం గాజీపూర్–బుద్దారం వంతెన నిర్మాణానికి రూ.3.30 కోట్ల నిధులు వెచ్చించారు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పనులు 2023 ఏడాది చివరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏడాది తిరక్కుండానే వంతెనపై సిమెంట్ పెచ్చులూడి చువ్వలు తేలాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇలా అన్ని విభాగాల్లోనూ నాణ్యతను విస్మరించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నాణ్యత నేతిబీర చందమే.. అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పూర్తిగా కంట్రోల్ తప్పుతోంది. పనులు నిర్వహించే శాఖ ఏదైనా నా ణ్యత మచ్చుకై నా కనిపించడం లేదు. కోట్లు వెచ్చించి చేపడుతున్న అభివృద్ధి పనులు ఏడాది తిరక్కుండానే పాడవుతున్నాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ గాడితప్పింది. పనులేవైనా పర్సెంటేజీలే పరమావధిగా వ్యవహారం కొనసాగుతుందనే అపవాదు ఉంది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ ఇలా శాఖ ఏదైనా పనుల పర్యవేక్షణ పట్టించుకునే వారు కరువయ్యారు. వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డీఈ, ఈఈ, జిల్లా స్థాయి అధికారులు, క్యూసీ(క్వాలిటీ కంట్రోల్) అధికారులు అంతా మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారం పనులు చేపట్టడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన కలెక్టర్ పనుల నాణ్యతపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 50 శాతమే నిధుల వినియోగం అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేపట్టినా.. సర్పంచ్ లు, ఎంపీటీసీలు చేపట్టినా అధికారుల వాటా ముట్టజెప్పాల్సిందే అనే చర్చలు వినిపిస్తున్నాయి. ఏఈకి ఐదు శాతం,డీఈకి మూడు శాతం, ఈఈకి రెండు శాతం,సెక్షన్లో రెండు శాతం,క్యూసీకి రెండు శాతం ఇలా మొత్తంగా ప్రతీ పనికి 14 నుంచి 15 శా తం వరకు పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారనే ఆ రోపణలు ఉన్నాయి.కాంట్రాక్టర్లకు పనులు ఇప్పించే ప్రజాప్రతినిధులు ప్రతీ పనికి 15 శాతం వరకు తీసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా కాంట్రాక్టర్లు 30శాతం పర్సెంటేజీలు ఇస్తూ.. మరో 20 శాతం వారి లాభాలను కలుపుకొని ప్రభు త్వం మంజూరు చేసిన నిధుల్లో 50శాతం మాత్రమే పనులకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. వందల కోట్లతో పనులు ప్రతీ ఏడాది జిల్లాకు మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏలో మెటీరియల్ కంపోనెంట్ కింద ప్రభుత్వం రూ.50–రూ.60 కోట్ల నిధులు కేటాయిస్తోంది. సీడీ పీ, జెడ్పీ, సెంట్రల్ నిధులు, ప్రజా ప్రతినిధుల చొర వతో మంజూరు చేయించే నిధులు కలుపుకొంటే మొత్తంగా జిల్లాలో పంచాయతీ రాజ్ విభాగం ద్వా రానే రూ.వంద కోట్ల వరకు పనులు జరుగుతున్నా యి. మరో రూ.వంద కోట్లకుపైగా ఆర్అండ్బీ, మున్సిపాలిటీలకు మంజూరయ్యే నిధులు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా వివిధ రకాల నిధులతో ప్రతి ఏటా పనులు చేపడుతుండ గా నాణ్యత పాటించడం లేదు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీ, భవన నిర్మాణాల పనులు చేపడుతుండగా ఇంజనీరింగ్ అధికారుల నిర్వాకంతో పనులు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. ఇసుకకు బదులు డస్ట్ కాంట్రాక్టర్లు సిమెంట్ పనుల్లో ఇసుకకు బదులుగా డస్ట్ వినియోగిస్తున్నారు. 20 శాతం ఇసుకకు 80 శాతం డస్ట్ కలుపుతున్నారు. మార్కెట్లో ఒక లారీ ఇసుకకు రూ.50వేల వరకు ఉంటుండగా డస్ట్‌కు రూ.10 వేలలోనే లభిస్తుంది. దీంతో కాంట్రాక్టర్లు డస్ట్ వినియోగిస్తూ.. అధికారులు ఇస్తున్న అంచనాల్లో ఇసుక వాడుతున్నట్లు చూపుతున్నారు. బిల్లులు దండుకుంటున్న కాంట్రాక్టర్లు డస్ట్ వాడుతుండడంతో చేపట్టిన పనులు వెంటనే పాడవుతున్నాయి. చర్యలు తీసుకుంటాం నాణ్యత విషయంలో రాజీ ఉండదు. నిబంధనల ప్రకారమే పనులు చేయించేలా చూస్తాం. ఎక్కడయినా అలాంటివి ఉంటే పర్యవేక్షిస్తాం. అవసరమైతే మళ్లీ వేయిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వివరణ ఇవ్వాల్సిందే. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. పెద్దెముల్ సమీపంలో పాడై న వంతెనను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం. – లాల్‌సింగ్, ఈఈ, ఆర్అండ్బీ -
ప్రజావాణికి 68 అర్జీలు
అనంతగిరి: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 68 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీలో అడ్మిషన్లకు ‘దోస్త్’లో రిజిస్ట్రేషన్ చేసుకోండి షాద్‌నగర్ రూరల్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ కోసం వెంటనే దోస్త్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె సూచించారు. ఈనెల 21 వరకు అవకాశం ఉందని తెలిపారు. 29న అడ్మిషన్ల కేటాయింపుపై తొలి జాబితా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వరకు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. వివరాలకు 6305051490, 9885003390, 9703441345 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్రహీంపట్నం కళాశాలలో.. ఇబ్రహీంపట్నం: 2025–26 విద్యాసంవత్సరానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.రాధిక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 89199 96725, 94417 05076, 93810 6920 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
● త్వరలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ సదుపాయం ● వచ్చే విద్యాసంవత్సరంలో వైద్య విద్యార్థులకు హాస్టల్స్ నిర్మాణం ● వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ● వికారాబాద్‌లో 300 పడకల జనరల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతగిరి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ పట్టణంలో రూ.30 కోట్లతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణ, అన్ని విభాగాలను, తరగతి గదులను పరిశీలించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి సీనియర్ నర్సులు శంకరమ్మ, శాంతమ్మలను సత్కరించారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగిలో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, వికారాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామన్నారు. వికారాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన 300 పడకలు ప్రారంభించుకున్నామని, 50 పడకల క్రిటికల్ కేర్, పాత ఆస్పత్రిలో 70 పడకలు మొత్తం 420 పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాల విద్యార్థులకు బాలుర, బాలికలకు వేర్వేరుగా పక్కా వసతి గృహ భవన నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ సదుపాయాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంచంద్రయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, డీఎంహెచ్ఓ వెంకటరవణ, డీసీసీబీ మెంబర్ కిషన్‌నాయక్, ఆర్టీఏ సభ్యుడు జాఫర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, మాజీ లైబ్రరీ చైర్మన్ ఎండీ హఫీజ్, ఏయంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, జిల్లా అధికారులు, వైద్యులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి దుక్కులతో చీడపీడల నివారణ
శంషాబాద్ రూరల్: వేసవి దుక్కులతో పంటలకు ఆశించే చీడపీడల నివారించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేల ఆరోగ్య యాజమాన్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.పవన్‌చంద్రారెడ్డి సూచించారు. పెద్దగోల్కొండలో సోమవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు వాతావరణ ఆధారిత సలహాలు, సూచనలు పాటించి సాగు చేసుకుంటే నష్టాలు రాకుండా చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలకు తగు మోతాదులోనే ఎరువులు వాడాలని సూచించారు. పంట మార్పిడి, సేంద్రియ ఎరువులతో పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ జి.వినయ్ మాట్లాడుతూ... రైతులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంభిస్తూ ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పశువుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రతలను మండల పశువైద్యాధికారి డాక్టర్ జి.శేఖర్ వివరించారు. ఇందుకు సంబంధించి రూపొందించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎ.శ్రీకాంత్‌గౌడ్, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, సొసైటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, రైతులు భాస్కర్‌గౌడ్, భోజిరెడ్డి, పాండురంగారెడ్డి, నర్సింహారెడ్డి, ఏఈఓ రాఘవేందర్‌గౌడ్, వ్యవసాయ కళాశాల పరిశోధన విద్యార్థిని వి.వర్షిత తదితరులు పాల్గొన్నారు. నేల ఆరోగ్య యాజమాన్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్‌చంద్రారెడ్డి పెద్దగోల్కొండలో‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ -
పరిశ్రమల సహకారంతో నైపుణ్యాల వృద్ధికి కృషి
శంషాబాద్ రూరల్: మండలంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నాస్కామ్ ఆధ్వర్యంలో అనుభవాత్మక ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పాఠ్యాంశంలో కలిపే అంశాలతో పాటు సహకార నమూనాలు, పట్టభద్రుల నైపుణ్య లక్ష్యాలకు అనుసంధానం, అమలుకు తగిన వ్యూహాల వాటిపై చర్చించారు. నాస్కామ్తో కళాశాల చేసుకున్న ఎంఓయూలో భాగంగా విద్యార్థులకు పరిశ్రమ అనుభవం, ఉపాధికి అనుగుణమైన నైపుణ్యాలు అందించడానికి దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.ఆర్.రవీంద్ర అన్నారు. పరిశ్రమల సహకారంతో నైపుణ్యాల అభివృద్ధికి ఇది ఒక మార్గదర్శక మోడల్‌గా నిలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ఈపీ 2020 అనుగుణంగా క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌లను పాఠ్యాంశంలో సమగ్రంగా ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాస్కామ్ ప్రతినిధులు షీబా థామస్, కమ్రాన్ అష్రఫ్, సీనియర్ కన్సల్టెంట్, కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపిటెన్సీస్ వై.రామ్మోహన్రావు, కళాశాల కంప్యూటర్ సైన్ డీన్ డాక్టర్ జి.వేంకటరామిరెడ్డి, పరిశోధన డీన్ డాక్టర్ జె.కృష్ణచైతన్య, విద్యా వ్యవహారాల డీన్ డాక్టర్ ఎస్.రాజేందర్, మూక్స్ అండ్ ఐఐఐసీ ఇంచార్జి డాక్టర్ ఎస్.వి.వసంత, ఎంఓఓసీఎస్ హెడ్ డాక్టర్ డి.కృష్ణ, పాల్గొన్నారు. -
కారు అదుపు తప్పి యువకుడి మృతి
మరో ఇద్దరికి గాయాలు ఆమనగల్లు: విఠాయిపల్లి సమీపంలో సోమ వారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన అజయ్‌కుమార్(30) మృతిచెందాడు. ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన స్నేహితులు మనోజ్, అజయ్‌కుమార్, గణేశ్, త్రిముర్తులు స్విఫ్ట్ కారులో శ్రీశైలం వెళ్తున్నారు. విఠాయిపల్లి సమీపంలో పంది అడ్డు రావడంతో అజయ్‌కుమార్ కారును ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. వాహనం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం మహేశ్వరం: వైద్య సేవల్లో నర్సుల పాత్ర ఎంతో కీలకమని అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్‌జీ అన్నారు. మండల పరిధిలోని భగవతిపురంలో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి, నర్సులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవేర్ సంస్థ డీజీ రాజవర్ధన్‌రెడ్డి, అవేర్ ఆస్పత్రి ఎండీ, ప్రొఫెసర్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు పౌల్ట్రీ యజమాని మృతి కేశంపేట: కోళ్లకు దా ణా పంపిణీ చేసే యంత్రం పైన పడటంతో పౌల్ట్రీ ఫాం యజ మాని మృతిచెందిన ఘటన కాకునూర్ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లీల్యానాయక్ (48) ఊరి శివారులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో ఫాంలోని దాణా యంత్రం పక్కకు జరిగింది. బీహర్ చెందిన కూలీలు కమల్‌సాదా, చింటూసాదాతో కలిసి సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా మిషన్ ఒక్కసారిగా ముగ్గురిపైనా పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా లీల్యానాయక్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయాలపాలైన చింటూ, కమల్‌సాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. ఉద్యమకారుడిని కోల్పోయాం. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న లీల్యానాయక్ మృతి బీఆర్ఎస్కు తీరని లోటని మాజీ ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్ అన్నారు. పీఏసీఎస్ చైర్మెన్ గండ్ర జగదీఽశ్వర్గౌడ్ తదితరులు లీల్యా మృతిపై సంతాపం వ్యక్తంచేశారు. బస్సు ఢీకొని మహిళలకు తీవ్ర గాయాలు షాద్‌నగర్ రూరల్: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన పట్టణ సమీపంలోని పరిగి రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం అంతారానికి చెందిన శివకుమార్ తన భార్య అనూషను ఆస్పత్రిలో చూపించేందుకు బైక్‌పై షాద్‌నగర్ వచ్చాడు. తిరిగి వెళ్తుండగా పరిగి రోడ్డులోని విష్ణు గ్రానైట్ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు వీరిని ఢీకొట్టింది. బస్సు చక్రాలు అనూష కాలిపైనుంచి వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై.. ప్రమాదంలో మా తప్పేమీ లేదని, శివకుమార్ మద్యం తాగి ఉన్నాడని, బైక్ అదుపు తప్పడంతో బస్సును ఢీకొన్నాడని యజమాని ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు కడ్తాల్: ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గానుగుమార్లతండాకు చెందిన మూడవత్ సోమ్లా ద్విచక్రవాహనంపై సోమవారం రాత్రి తండా నుంచి కడ్తాల్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో రామస్వామి అనే వ్యక్తి కడ్తాల్ నుంచి అన్మాస్‌పల్లి బయలుదేరాడు. మార్గమధ్యలో కడ్తాల్– అన్మాస్‌పల్లి రహదారిపై ఇద్దరి బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
మొయినాబాద్ రూరల్: హిమాయత్‌నగర్‌లోని పల్లవి ఇంటర్నేషనల్ పాఠశాలలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు రుద్రకుమార్, అల్లి దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌తో కలిసి సోమవారం పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైవర్లు, క్లీనర్లు, ఆయాలుగా పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చెల్లించకుండా యాజమాన్యాం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. వీరందరికీ వెంటనే గుర్తింపు కార్డులు, నెలాంతర, సాధారణ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు ముంజగళ్ల ప్రభుదాస్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట సీఐటీయూ నాయకుల ధర్నా -
గోశాలకు 48 గోవుల తరలింపు
కుల్కచర్ల: నగరానికి అక్రమంగా తరలిచేందుకు సిద్ధంగా ఉంచిన గోవులను హిందూ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని బండవెల్కిచర్లలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అన్వేశ్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మోహన్ గోవులను నగరానికి తరలిస్తున్నాడనే సమాచారం తెలసుకున్న హిందూ సంఘాలు, గోసంరక్షణ సంఘాలు అక్కడకు చేరుకున్నారు. వారు మోహన్‌ను ప్రశ్నించడంతో గోవులు నగరానికి చెందిన ఖాసీం అనే వ్యక్తివని వాటిని సంరక్షిస్తున్నందుకు గాను తనకు వేతనం ఇస్తున్నాడని చెప్పారు. విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. 48 గోవులను కరణ్‌కోట్ గోశాలకు తరలించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెంచు హన్మంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు, మండల అధ్యక్షుడు వెంకటయ్యముదిరాజ్, ప్రధాన కార్యదర్శి హన్మంతు, రఘోత్తమస్వామిజీ, కాంగారి ఆంజనేయులు, రాజేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం
తాండూరు: కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సీహెచ్‌సీ, పీహెచ్సీ ఆస్పత్రులు అప్‌గ్రేడ్ కానున్నాయి. పట్టణంలో రెండున్నర దశాబ్దాలుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఆస్పత్రిలో మైనర్ సర్జరీలే జరుగుతున్నాయి. గుండె, న్యూరో సంబంధిత సర్జరీలు ఆస్పత్రిలో నిర్వహించేందుకుగాను కావాల్సిన పరికరాలను తీసుకురానున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరగడంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ బెడ్లను పెంచనున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సత్వర వైద్య సేవలు అందించేందుకుగాను ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీల అప్‌గ్రేడ్ నియోజవకర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విన్నవించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి వారం రోజుల వ్యవధిలో తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ పీహెచ్సీలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించేలా ఉత్తర్వులు అందిస్తానని ఎమ్మెల్యే బీఎంఆర్‌కు హామీ ఇచ్చారు. బషీరాబాద్ మండలంలో ఉన్న రెండు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌తో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని వెంటనే వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. త్వరలో గుండె, న్యూరో సంబంధిత సర్జరీలు పీహెచ్‌సీల అప్‌గ్రేడ్‌కు ఉత్తర్వులివ్వాలని వైద్యారోగ్య కార్యదర్శికి మంత్రి ఆదేశం త్వరలో ఐసీయూ సేవలు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ప్రాణాపాయ స్థితిలో వచ్చే వారికి సత్వర వైద్య సేవలు అందించేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. అందుకోసం వైద్యారో గ్యశాఖ మంత్రిని అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారు. కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో జిల్లా ప్రభు త్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నాం. – బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు -
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడపోత
తాండూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల జాబితా సిద్ధమవుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి దరఖాస్తుల వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు కింద చెన్‌గేస్‌పూర్ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరవ్వగా తాండూరు మండలంలోని 33 గ్రామాలకు 722 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. మరో రెండు రోజుల్లో లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేయనున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. దరఖాస్తుల వడపోత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాను అందజేశారు. నాయకులు ఇచ్చిన జాబితాను మండల వెరిఫికేషన్ కమిటీ సభ్యులు ఎంపీడీఓ, ఎంఈఓ, పీఆర్ ఏఈలు దరఖాస్తులను వడపోత ప్రక్రియను ప్రారంభించారు. మల్కాపూర్ గ్రామంలో 55 ఇళ్లకు గాను 25 తిరస్కరించినట్లు సమాచారం. ఐదు ఎకరాలకు పైన భూమి కారు, ట్రాక్టర్, ప్రభుత్వ ఉద్యోగం, ఆర్సీసీ స్లాబ్ ఉన్న దరఖాస్తులను అధికారులు రిజక్ట్ చేస్తున్నారు. తమవారి పేరుండాల్సిందే ఇందిరమ్మ ఇళ్ల జాబితా సిద్ధం అవుతున్న తరుణంలో నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమ వారి పేర్లు లబ్ధిదారుల లిస్టులో కచ్చితంగా ఉండాలని కోరుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేతో మాట్లాడిస్తామంటున్నారని సమాచారం. ఒక్కో గ్రామంలో కాంగ్రెస్‌లో రెండు వర్గాలుంటే ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చి జాబితాను సిద్ధం చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇళ్లు కేటాయించండి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని పలువురు అర్జీలు పెట్టుకున్నారు. కరన్‌కోట్ గ్రామానికి చెందిన శ్రీహరి, చంద్రవంచ గ్రామానికి చెందిన రాములు తమ పేర్లను జాబితాలో చేర్చాలని కోరారు. రెండు రోజుల్లో జాబితా సిద్ధం తిరస్కరించిన వారి స్థానంలో కొత్తవారికి కేటాయించాలని విజ్ఞప్తి -
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
8లోu9లోuకరుణామయి అమ్మసృష్టికి మూలం అమ్మ.. అనురాగం, ఆప్యాయతను పంచే కరుణామయి. తల్లి పేగుబంధం విడదీయని అనుబంధం. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా వికారాబాద్ రామయ్యగూడ ఎంఐజీలోని ఇమాన్యుయేల్ ఏజీ చర్చిలో వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. – అనంతగిరి న్యూస్రీల్జవాన్ల కోసం జలాభిషేకం ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం, సైన్యానికి మద్దతుగా ఆదివారం బుగ్గ రామలింగేశ్వరాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత సైనికులకు మరింత బలాన్ని చేకూర్చాలని స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. – అనంతగిరి -
ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి
చేవెళ్ల: కార్మికులకోసం పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం తీసుకు వచ్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి డిమాండ్ చేశారు. ఏఐటీయుసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను ఆదివారం చేవెళ్లలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మికులపై దాడి మొదలు పెట్టిందని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను పెట్టుబడి దారి వర్గానికి కొమ్ము కాస్తూ నాలుగు కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్త ంచేశారు. కార్మికులు పోరాడి 8 గంటల పని దినాలను సాధించుకున్నారని, కాని మోదీ ప్రభుత్వం 12 గంటల పనిదినాలు తీసుకు వస్తోందని మండిపడ్డారు. దీనిని కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని చెప్పారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి కనీస వేత్తనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమ్మెను కార్మికులు, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ప్రభులింగం పాల్గొన్నారు. ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి -
గొప్ప పోరాటయోధుడు ఠానునాయక్
మీర్‌పేట: భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడిన గొప్పయోధుడు ఠానునాయక్ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్టపై ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జటోత్ ఠానునాయక్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఠానునాయక్ చరిత్రను, పోరాట స్ఫూర్తిని నేటి యువత, విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, స్థానిక బంజారా నాయకులు జటావత్ శ్రీనివాస్ నాయక్, హామునాయక్, రవీందర్‌నాయక్, సికిందర్నాయక్, డా.లక్ష్మణ్‌నాయక్, దేవానంద్ నాయక్, దీప్‌లాల్‌నాయక్, బాలునాయక్, లక్ష్మణ్‌నాయక్, మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీజేపీ నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అర్కల భూపాల్‌రెడ్డి, అర్కల కామేశ్‌రెడ్డి, దిండు భూపేష్‌గౌడ్, అనిల్‌యాదవ్, రాజ్‌కుమార్, మాదరి రమేష్, బాలరాజ్, సునీత, రజాక్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
‘ఉపాధి’కి కత్తెర
నాలుగేళ్ల కాలంలో కోటి పనిదినాల తగ్గింపు ● పనులు దొరక్క కూలీల అవస్థలు ● శరాఘాతంగా మారిన కొత్త నిబంధనలు ● ఉదయం, సాయంత్రం ఫొటోలు అప్లోడ్ చేస్తేనే వేతనంమొత్తం జాబ్ కార్డులు 1.83లక్షలు కూలీల సంఖ్య 3.77లక్షలు ప్రస్తుతం పనులు చేస్తున్న వారు 60 వేలు వికారాబాద్: ఏటా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పని దినాల్లో భారీ కోత విధిస్తోంది. సంస్కరణల పేరుతో నిబంధనలను కఠినతరం చేస్తూ పేదలను పనులకు దూరం చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కల్పించాల్సిన పని దినాల్లో దాదాపు కోటి పని దినాలకు కోత పెట్టింది. దీంతో పేదల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వ్యవసాయ పనులులేని కాలంలో వలసల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. ఈ పథకం ద్వారా ఏటా లక్షలాది మంది పేదలు ఉపాధి పొందుతూ వస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా పనిదినాల్లో కోత విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన కొత్త నిబంధనలు కూడా ఉపాధి పనులకు కూలీలను దూరం చేస్తోంది. పథకం ప్రారంభమైన సమయంలో కొన్ని పనులకే పరిమితం కాగా ప్రస్తుతం 266 రకాల పనులు చేర్చారు. కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేపట్టాలనే నిబంధన ఉండటం ఇబ్బందిగా మారింది. గతంలో కూలీలు ఉదయం 6గంటలకే పనులకు వెళ్లి వారికి ఇచ్చిన పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్న సమయానికి ఇళ్లకు చేరుకునే వారు. ప్రస్తుతం ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం తర్వాత మరోసారి పనులకు సంబంధించిన ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉండటంతో కూలీలు మండుటెండలోనే గంటల తరబడి అధికారుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఈ కారణంగా కూడా కొంత మంది కూలీలు పనులకు దూరమవుతున్నట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే.. జిల్లాలో 1,86,197 జాబ్‌కార్డులు.. 3,77,087 మంది కూలీలు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుత వేసవిలో కేవలం 60వేల మంది కూలీలే ఉపాధి పనులకు వస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో లక్షమందికి పైగా కూలీలు పనులకు రాగా ఈ సారి వారి సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కేంద్రం ఉపాధి కూలీల వేతనం పెంచడంతో రోజువారి కూలి రూ.307కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో సగటున రోజుకు రూ.270 చెల్లిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కోటి పనిదినాల తగ్గించడంతో ఈ ప్రభావం పేదల జీవన స్థితిగతులపైనే కాకుండా గ్రామీణాభివృద్ధిపై కూడా పడింది. గత ఆర్థిక సంవత్సరంలో 67,37,496 పనిదినాలు కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకొని పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఏటా తగ్గుతున్న పని దినాలు ఇలా.. ఆర్థిక సంవత్సరం జిల్లాకు కేటాయించిన పని దినాలు 2021 – 22 1.3 కోట్లు 2022 – 23 71.58 లక్షలు 2023 – 24 62 లక్షలు 2024 – 25 59.85 లక్షలు 2025 – 26 33 లక్షలు ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా నీడకరువైంది. గతంలో నెట్ షెడ్లు, ప్రాథమిక చికిత్స కిట్లు పంపిణీ చేసేవారు. మూడేళ్లుగా వీటి పంపిణీ ఆగిపోయింది. కూలీలకు గ్రామ పంచాయతీలే వసతులు కల్పించాలని అధికారులు చెబుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వేతన పాట్లు జిల్లాలో డీఆర్డీఏ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్న 200 మంది ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందడంలేదు. అటెండర్లు, సీసీలు, ఏపీఓలు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఎంలు వేతన వెతలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు నెలలకు ఒక్కసారి వేతనాలు ఇస్తుండటంతో అప్పులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది నుంచి ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా తమను క్రమబద్ధీకరించడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని, బయటి పనులకు వెళ్తే రోజుకు రూ.600నుంచి రూ.800ల వరకు వస్తున్నట్లు పలువురు కూలీలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధి పని దినాలను పెంచడంతోపాటు వసతులు కల్పించాలని, అలాగే వేతనం కూడా పెంచాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. -
మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేవారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ రూ.27 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించానన్నారు. ప్రస్తుతం ఆస్పత్రి అప్‌గ్రేడ్, భవన నిర్మాణం చేయించడం సంతృప్తినిచ్చిందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయ కులు ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తు న హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, ఎ–బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
నేడు మంత్రి పర్యటన
అనంతగిరి: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 12న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు సూచించారు. పరిగి, వికారాబాద్ పర్యటనలో చేపట్టాల్సిన అంశాలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆదివారం మధ్యాహ్నం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు పరిగి పట్టణ కేంద్రంలో వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు భూమి పూజ, వికారాబాద్ కలెక్టరేట్లో వైద్యాధికారులతో ఆస్పత్రుల పనితీరు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష ఉంటుందన్నారు. అనంతరం వికారాబాద్‌లో నిర్మించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంట రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి బషీరాబాద్: వానాకాలం పంటలకు రైతులకు రూ.50 లక్షలతో కొత్తగా పంట రుణాలు ఇస్తున్నామని నావంద్గీ(బషీరాబాద్) సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. సొసైటీలో ఉంటూ రుణం పొందలేని వారు సోమవారం నుంచి కొత్త రుణాలను తీసుకోవచ్చన్నారు. మొదటి విడతగా జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ ఈ రుణాన్ని నావంద్గీ సొసైటీకి మంజూరు చేసిందని చెప్పారు. గతంలో సొసైటీ నుంచి రుణమాఫీ పొందిన రైతాంగానికి సైతం కొత్త రుణాలను అందజేస్తామని వివరించారు. కొత్తగా రుణం పొందే రైతులు భూమికి సంబంధించి తాజా పహానీ, వన్‌బీ, నో డ్యూస్ సర్టిఫికెట్, నాలుగు రైతు ఫొటోలు నావంద్గీ సొసైటీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నేడు 50 వసంతాల స్ఫూర్తి సభ కొడంగల్ రూరల్: అరుణోదయ సాంస్కృతిక విజ్ఞాన సమాఖ్య 50 వసంతాల స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం 10గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఉదయం 9గంటల ర్యాలీతో ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా సంస్కృతి, ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణంపై చర్చ, రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయని వివరించారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివాహ వేడుకలో స్పీకర్ తాండూరు రూరల్: తన చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఆదివారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్‌లో గౌతపూర్ మాజీ సర్పంచ్ రాజప్పగౌడ్ కుతూరు అంజలిగౌడ్ వివాహం బషీరాబాద్ మండలం గోట్టిగ ఖుర్ధుకు చెందిన మహేష్‌కుమార్ గౌడ్‌తో నిర్వహించారు. ఈ వివాహానికి హాజరైన స్పీకర్ ప్రసాద్‌కుమార్ నూతన దంపతులను ఆశీర్వదించి చిన్ననాటి స్నేహితులతో సరదగా గడిపారు. తప్పుల తడకగా ఇందిరమ్మ ఇళ్ల జాబితా ● రీసర్వే చేయించి అర్హులకు కేటాయించాలి ● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ తాండూరు టౌన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా తప్పులతడకగా ఉందని.. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రీసర్వే చేయించి పారదర్శకంగా అర్హులకే దక్కేలా చూడాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు లేని అభాగ్యులకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి అర్హులకు దక్కేలా చూడాలని లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
పత్తి రైతుకు విత్తన భారం
నవాబుపేట: ఆరుగాలం శ్రమించి తీసిన పంటకు గిట్టుబాటు రాక నష్టపోతుంటే ఏటేటా పెరుగుతున్న విత్తనాలు, ఎరువుల ధరలతో రైతులకు అదనపు భారం పడుతోంది. గతేడాది పత్తిసాగు సమయంలో వర్షాలు లేక దిగుబడి తగ్గింది. ఈ ఏడాది తాజాగా బీటీ–2 పత్తి విత్తనాలు రూ.38 పెంచడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పంటగా.. కొంత కాలంగా రైతులు వానాకాలం సాగు ప్రధాన పంటగా పత్తి సాగుచేస్తున్నారు. నవాబుపేట మండలంలోనే గతేడాది 21,539 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి సైతం అంతే మొత్తంలో సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఒక ఎకరాకు రెండు నుంచి మూడు పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయి. అర కిలో బీటీ పత్తి ప్యాకెట్ ధర గతేడాది రూ.835 ఉండగా ఈ సారి రూ.901కి పెంచారు. ఇప్పటికే రైతులు వానాకాలం సాగుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక వానాకాలంలో నవాబుపేట మండలానికి 1,200 మెట్రిక్ టన్నుల యూరియా, 820 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,380 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 110 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు, 50 టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు అవసరం అవుతాయని మండలాధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. రైతులను నమ్మబలుకుతున్న డీలర్లు డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతులు అడిగన కంపెనీ విత్తనాల మార్కెట్లో తక్కువ మొత్తంలో లభిస్తున్నాయని.. తాము బ్లాక్‌లో తెస్తున్నామని రైతులను నమ్మబలికి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించడం సరికాదంటున్నారు. ఏటా పెరుగుతున్న ధరలు ఆందోళనలో కర్షకులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే ఎరువులు, విత్తనాలు విక్రయించాలి. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవు. రైతులు తప్పని సరిగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తీసుకోవాలి. ప్రభుత్వం గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. – జ్యోతి, మండల వ్యవసాయాధికారి, నవాబుపేట -
447వ ర్యాంకు సాధించిన తాండూరు విద్యార్థి
తాండూరు టౌన్: పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ఎప్‌సెట్‌లో 447 ర్యాంకు సాధించాడు. మండలంలోని చిట్టిఘనాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న గర్గుపల్లి నర్సిరెడ్డి, భ్రమరాంబ దంపతుల కుమారుడు అభినవ్‌రెడ్డి ఇంజనీరింగ్ విభాగంలో ఆదివారం విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లో 100.27 మార్కులతో రాష్ట్రస్థాయిలో 447వ ర్యాంకు సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్‌లోనూ 97 శాతం మార్కులు సాధించాడు. ఎప్‌సెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించిన అభినవ్రెడ్డిని తాత మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, తల్లిదండ్రులు, తాండూరు వాసులు అభినందించారు. -
అనుమతి లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగం
మొయినాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగిస్తున్న ఫాంహౌస్‌పై ఎకై ్సజ్ పోలీసులు దాడి చేశారు. ఢిల్లీ, గోవా రాష్ట్రాలకు చెందిన రూ.4 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తోలుకట్టలో నగరానికి చెందిన తేజా రెడ్డి ఫాంహౌస్ ఉంది. శనివారం రాత్రి ఇక్కడ ఓ ఫంక్షన్ నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షన్లో మద్యం వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ ఎకై ్సజ్ పోలీసులు అర్థరాత్రి ఫాంహౌస్‌పై దాడి చేశారు. ఫంక్షన్లో వినియోగిస్తున్న ఢిల్లీకి చెందిన 50 బ్లాక్ లేబులు బాటిళ్లు, గోవాకు చెందిన నాలుగు యివాస్రీగల్ బాటిళ్లు, తెలంగాణకు చెందిన 3 లిక్కర్ బాటిళ్లు, 12 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసి పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు -
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని..
దుండిగల్: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన సమ్మర్ క్యాంపు
అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు పది రోజులుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపు ఆదివారంతో ముగిసింది. శిక్షణలో భాగంగా విద్యార్థులకు గేమ్స్, స్పోర్ట్స్‌తో పాటు ఖురాన్ పఠనం, నైతిక విలువలు తదితర అంశాలలో తర్ఫీదునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు అంజద్ హుస్సేన్, యూనిట్ అధ్యక్షుడు రఫీయొద్దీన్, ఆర్గనైజేషన్ వికారాబాద్ ఇంచార్జి అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
దుద్యాల్: అదుపుతప్పిన కారు విద్యుత్ సం్తభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఈర్లపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. బొంరాస్‌పేట్ మండలం చౌదర్‌పల్లికి చెందిన కావలి రాజు, సిద్ధు పని నిమిత్తం నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈర్లపల్లి సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం మూడు ముక్కలయింది. కారు నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తప్పిన పెను ప్రమాదం -
సేవాభావాన్ని అలవర్చుకోవాలి
తాండూరు టౌన్: ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాండూరులో ఏఎస్జీఎంకే ట్రస్టు చైర్మన్ ముజీబ్ఖాన్తో కలిసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, వైద్య, కంటి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సంపాదించిన దానిలో కొంత మొత్తం పేదలను ఆదుకునేందుకు ఉపయోగించాలన్నారు. తాండూరు ప్రాంతంలో పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ ముజీబ్‌ఖాన్ అభినందనీయుడున్నారు. అనంతరం ముజీబ్‌ఖాన్ మాట్లాడుతూ.. స్వార్థ చింతనను వదిలి పేదలకు ప్రతి ఒక్కరూ తోచిన సహాయ సహకారాలు అందించాలన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రవూఫ్, డాక్టర్ సంపత్‌కుమార్, రవి, భగవాన్, రఘు, శివానంద్, సంకేత్, తేజ్ అబ్దుల్లా, మసూద్, గపూర్ తదితరులు పాల్గొన్నారు. రైతు జితేందరెడ్డిని ఆదుకుంటాం తాండూరు రూరల్: విద్యుదాఘాతంతో చెరుకు పంట దగ్ధమైన రైతు జితేంధర్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని మండలి చీఫ్ విప్ పట్నం మహేంద్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పెద్దేముల్ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. విద్యుదాఘాతంతో దగ్ధమైన జితేందర్‌రెడ్డి చెరుకు పంటను పరిశీలించారు. వెంటనే తహసీల్దార్‌కు ఫోన్ చేసి ప్రభుత్వం నుంచి రైతుకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొలాల్లో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ డీఈ భాను ప్రకాశ్‌ను ఆదేశించారు. అనంతరం పెద్దేముల్ మండల కేంద్రంలోని చిట్టెపు లక్ష్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బషీరాబాద్ మండలంలో ధాన్యం కోనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట నాయకులు కరణం పురుషోత్తంరావు, డీవై నర్సింలు, బలవంత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అజంఖాన్, సిబ్లి, బుజ్జమ్మ, బాలప్ప, రవీందర్ ఉన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి -
సైన్యానికి మద్దతుగా పూజలు
అనంతగిరి: యుద్ధ వాతావరణ పరిస్థితులలో భాగంగా భారత్ సైన్యానికి మద్దతుగా వికారాబాద్ పట్టణంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం వికారాబాద్ (అనంతగిరి) జిల్లా గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదానంద రెడ్డి, ఆలయ పూజారి అనంతగిరి పంతులు, ముక్తా రెడ్డి, శ్రీరాములు, మాణిక్ రెడ్డి, నారాయణ రాథోడ్, పాపయ్య, రమేష్ గౌడ్, రవిశంకర్, మొణిగారి లావణ్య, జయశ్రీ, వరలక్ష్మి, విజయ, సరిత, అనురాధ, సరళ, రజిత తదితరులు పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు?
కేశంపేట: గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన మండల పరిఽధిలోని వేములనర్వ గ్రామ శివారులోని పాత బీరప్ప దేవాయలం సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములనర్వ గ్రామం నుంచి అల్వాల వైపు వెళ్లే దారిలో పాత బీరప్ప దేదాలయం సమీపంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం జేసీబీ సాయంతో గుంతను తీసి పూడ్చివేశారు. ఆదివారం సమీపంలోని రైతులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గుంత సమీపంలో పూజా సామగ్రితో పాటు నిమ్మకాయలు, గుమ్మడికాయలు కన్పించాయి. ఓ కుండను పగులగొట్టిన ఆనవాళ్లు కన్పించాయి. గతంలో పాత బీరప్ప గుడి సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ నరహరి సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంత తీసి మళ్లీ పూడ్చిన ఆనవాళ్లు ఉన్నట్టు తెలిపారు. -
అమ్మ కష్టం వృథా కాలే..
పరిగి: భర్త మృతితో కుంగిపోకుండా పిల్లల ఎదుగుదలే ధ్యేయంగా కష్టపడింది. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివించింది. అమ్మ కష్టాన్ని గుర్తించిన ఆ బిడ్డలు బుద్ధిగా చదువుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊటుపల్లి గ్రామానికి చెందిన కావలి పోచమ్మ, అనంతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే అనారోగ్యం బారిన పడి అనంతయ్య మృతిచెందాడు. సెంటు భూమి కూడా లేని నిరుపేద కుటుంబం వీరిది. ఇంటి పెద్ద దిక్కు కూలిపోవడంతో ఆతల్లి రెక్కలు విరిగినట్లయింది. తిండికి కూడా లేని పరిస్థితిలో అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వీటన్నింటినీ ఎదుర్కొని, పిల్లల కోసమే పరితపించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారి చదువును ముందుకు నడిపింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, చిన్న కొడుకు రాఘవేందర్ కానిస్టేబుల్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా పోచమ్మను పలకరించగా.. నేను పడ్డ కష్టానికి తగ్గట్లుగా పిల్లలు వృద్ధిలోకి రావడం సంతోషాన్నిస్తోందని భావోద్వేగం వ్యక్తంచేసింది. -
దేవుడు పంపిన ‘అమ్మ’
మీర్‌పేట: వివాహమైన కొన్నేళ్లకు కూడా పిల్లలు కాకపోవడంతో అనాథ పాపను దత్తత తీసుకుంది. చిన్నారికి అనారోగ్య సమస్య ఉందని తెలిసినా, భర్త సహకారంతో పాపను పెంచి పెద్దచేసింది. అమ్మా అనే పిలుపు కోసం ఆతల్లి పడిన వేదన మాతృత్వంలోని మమకారాన్ని చాటిచెప్పింది. తన బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పించి, సొంతకాళ్లపై నిలబడేందుకు ఎంతో కృషి చేసింది. అనంతరం ఆమెకు వివాహం చేయడంతో పాటు పుట్టిన ఇద్దరు మనవరాళ్ల ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమే నందిహిల్స్‌కు చెందిన విజయలక్ష్మి. వివాహమైన కొన్నేళ్లు గడిచినా పిల్లలను పుట్టకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఆడపిల్లనే కావాలని కోరింది. స్టేట్ హోమ్ నుంచి ఓ పాపను దత్తత తీసుకుంది. ఇంటికి తెచ్చుకున్న తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఆస్పత్రుల చుట్టూ తిప్పింది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడింది. భర్త యాదయ్య సహకారంతో తన కూతురుకు విద్యాబుద్ధులు నేర్పించి, నచ్చిన రంగంలో ఆమెను ప్రోత్సహించింది. అనంతరం తగిన వరున్ని చూసి వివాహం చేసింది. అల్లుడు, కూతురిని తనవద్దే పెట్టుకుంది. ప్రస్తుతం విజయలక్ష్మి బిడ్డకు ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. వీరిని కూడా ఆమే చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. -
కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం
అబ్దుల్లాపూర్‌మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నిలిపి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిఽధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని తాడ్బన్ బహదూర్‌పూర ప్రాంతం హెచ్‌బీ కాలనీలో నివాసముండే రితేష్‌కుమార్ కుమారుడు దీపేష్కుమార్ (23) శుక్రవారం రాత్రి 11గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో తన స్నేహితులైన హైదరాబాద్ వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్‌కు చెందిన ప్రియాన్ష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. పెద్దఅంబర్‌పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాట చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులుతేరుకునే లోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనం కాగా, కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్మిఠల్ను అతికష్టంగా బయటకు తీసిన స్థానికులు ఎల్బీనగర్లోని కామినేమి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి ఓఆర్ఆర్పై ఆగిఉన్న బొలేరోనుఢీకొట్టడంతో ప్రమాదం -
అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది
ఆతల్లి పిల్లలు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే బొంరాస్‌పేట: మండల పరిధిలోని గౌరారానికి చెందిన ఎర్రోళ్ల రాములు, అంజిలమ్మకు ఆనందం, సురేఖ, రాజేందర్, విజయ్, వసంత ఐదుగురు సంతానం. వ్యవసాయ కూలీలుగా పనిచేసే భార్యాభర్తలు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. పిల్లలు ప్రాథమిక విద్యలో ఉండగానే తండ్రి అకాలమరణం చెందాడు. దీంతో అన్ని బాధ్యతలు అంజిలమ్మపై పడ్డాయి. భర్తను కోల్పోయిన బాధ వేధిస్తున్నా.. తన పిల్లలను బతికించుకోవడమే ధ్యేయంగా సాగింది. కూలీ పనులు చేస్తూనే వారిని బడికి పంపింది. పిల్లలను బాగా చదివించింది. కట్ చేస్తే.. పెద్ద కొడుకు ఆనందం పంచాయతీ కార్యదర్శిగా, సురేఖ ప్రభుత్వ ఉపాధ్యాయినిగా(ఎస్ఏ ఇంగ్లిష్), రెండో కొడుకు రాజేందర్ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా, చిన్న కొడుకు విజయ్ ఎస్ఐగా, చిన్నకూతురు వసంత ఎస్ఐగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కలలు నిజమయ్యాయి నాభర్త 2010లో చనిపోయాడు. 15 ఏళ్ల నుంచి నా కొడుకులు, కూతుళ్లకు తండ్రిలేడనే లోటు లేకుండా పెంచా. ఆయన ఆలోచన ప్రకారం అందరు బాగా చదవాలని కోరుకున్నా. అలాగే చదివించాను. అందరికీ సర్కారు కొలువులు రావడం చాలా ఆనందంగా ఉంది. – ఎర్రోళ్ల అంజిలమ్మ, గౌరారం అమ్మే.. నాన్నలా.. ఇబ్రహీంపట్నం: భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని పిడుగుపడింది. విధి వక్రీకరించి భర్త మరణించడంతో దిక్కులేని స్థితిలో బతుకు భారంగా మారింది. అయినా పిల్లలను పోషించుకునేందుకు లాండ్రీ షాపు నిర్వహిస్తూ అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తోంది. పట్టణంలోని గోల్కొండ శ్రీలతకు బీఎన్‌రెడ్డిలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే రాజుతో 2007లో వివాహం జరిగింది. వీరికి వైష్ణవి, సాయికార్తీక్ సంతానం. పెళ్లయిన నాలుగేళ్లకే రాజు మరణించాడు. అత్తవారి ఇంటి వదవ్ద ఆస్తిపాస్తులు కూడా లేకపోవడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తన పిల్లలను అనాథలుగా మార్చేందుకు ఇష్టం లేక.. కన్నీటిని దిగమింగుకుని తన కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంది. స్థానికంగా లాండ్రీషాపు ప్రారంభించి ఇద్దరు పిల్లను చదివిస్తోంది. ఆరుగురు కూతుళ్ల ‘ఆరోగ్య’ లక్ష్మి కొడంగల్: ఆరుగురు ఆడ పిల్లలు ఉన్నారని ఆ తల్లి ఏనాడూ చిన్నబుచ్చుకోలేదు. కొడుకులైనా, బిడ్డలైనా ప్రయోజకులైతే చాలని భావించింది. అందరినీ బాగా చదివించింది. ప్రస్తుతం వీరందరూ వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. రావులపల్లికి చెందిన లక్ష్మి, అంజయ్యగౌడ్ గీత కార్మికులు. కులవృత్తే వీరి జీవనాధారం. ఆడ పిల్లలకు చదువెందుకు అనుకోకుండా రెక్కల కష్టంతో బిడ్డలను చదివించారు. మొదటి కూతురు జయమాల, రెండో కూతురు అనురాధ అంగడిరాయ్చూర్ పీహెచ్సీలో ఏఎన్ఎంలుగా, మూడో కూతురు అరుణజ్యోతి జీఎన్ఎమ్గా, నాలుగో కూతురు ఉమలత ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా, ఐదో కూతురు రాధిక తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బీఎస్సీ నర్సింగ్, ఆరో కూతురు శిరీష జీఎన్ఎమ్ స్టాప్ నర్స్‌గా పనిచేస్తున్నారు. నలుగురు పెద్ద కూతుళ్లకు వివాహం చేశారు. ఆయన ఆకాంక్ష నెరవేరింది పిల్లలను బాగా చదివించి, టీచర్లుగా చేయాలనేది నా భర్త ఆకాంక్ష. ఆయన అప్పటికే కవి, రచయిత. ఆయన ఆశయం మేరకు పిల్లలను చదివించా. నా ముగ్గురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక తల్లిగా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. – నూర్జహాన్‌బేగం, రిటైర్డ్, అటెండర్ ముగ్గురు ఉపాధ్యాయుల తల్లి అనంతగిరి: బషీరాబాద్ మండలం పర్వత్‌పల్లికి చెందిన మహబూబ్, నూర్జహాన్‌కు దంపతులకు నస్రీన్‌బేగం, యాసిన్, మోసిన్ ముగ్గురు సంతానం. ప్రభుత్వ పాఠశాలలో నైట్ వాచ్‌మన్‌గా పనిచేసే మహబూబ్ 1987లో జరిగిన రైలు ప్రమాదంలో అకాల మరణం చెందారు. అప్పటికీ పిల్లల వయసు ఏడేళ్లలోపే. భర్త మృతితో కారుణ్య నియామకం కింద నూర్జహాన్‌కు మైల్వార్ ప్రభుత్వ పాఠశాలలో (1988) అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఏకై క లక్ష్యంతో ముందుకు సాగింది. అనేక కష్టాల మధ్య తల్లిని అనుసరిస్తూ పెరిగిన పిల్లలు కష్టపడి చదివారు. ముగ్గురూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. పెద్దమ్మాయి నస్రీన్‌బేగం ప్రస్తుతం బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో, ఉపాధ్యాయుడైన యాసిన్ ఎస్సీఆర్టీలో ఫ్యాకల్టీగా, మోసిన్ మర్పల్లి మండలం పిల్లగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శివారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ 2020లో నూర్జహాన్ విరమణ పొందారు. ప్రస్తుతం వికారాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ‘మాతృ’భూమికి ఇద్దరు సైనికులు దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్‌కు చెందిన గొల్ల ఎల్లమ్మ, అనంతయ్య దంపతులకు రాములు, మల్లేశ్, సంతోష్ ముగ్గురు సంతానం. అనంతయ్య అకాల మృతితో పిల్లల భారం ఎల్లమ్మపై పడింది. తన బాధను గుండెల్లోనే దాచుకుని ముగ్గురు కొడుకులను చదివించింది. పెద్ద కుమారుడు రాములు సైన్యంలో సేవలందించి, పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం బ్యాంకులో గార్డుగా ఉద్యోగం చేస్తున్నారు. 2016లో ఇండియన్ ఆర్మీలో చేరిన రెండో కొడుకు మల్లేశం సైనికుడిగా దేశరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నకొడుకు మల్లేశం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దేశానికి ఇద్దరు సైనికులను అందించిన ఎల్లమ్మకు మదర్స్ డే సెల్యూట్. హ్యాపీ మదర్స్ డే అందరి జీవితంలోనూ అమూల్యమైన వ్యక్తి అమ్మ. బిడ్డల కోసం ఆమె పడే ఆరాటం అంతాఇంతా కాదు. మా అమ్మానాన్నలకు మేం నలుగురం ఆడపిల్లలమే. అమ్మ ప్రోత్సాహమే నన్ను నిలబెట్టింది. ప్రస్తుతం నాకు కూడా ఓ కూతురు (మైరా) ఉంది. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – సుశీల ఎస్ఐ, షాద్‌నగర్. షాద్‌నగర్ రూరల్: మహేశ్వరం మండలం పెద్దమ్మతండాకు చెందిన మంగ్యానాయక్, మోతీ దంపతులకు జ్యోతి, సుశీల, రుక్మిణి, అరుణ నలుగురు ఆడపిల్లలు. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వీరికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. తండాలో పుట్టిన తన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మోతీ నిర్ణయించుకుంది. తామెన్ని ఇబ్బందుల్లో ఉన్నా బిడ్డల చదువుల విషయంలో ఏనాడూ వెనకడుగు వేయలేదు. ఈక్రమంలో జ్యోతి ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా, సుశీల ఎస్ఐగా, రుక్మిణి టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2020 బ్యాచ్‌కు చెందిన సుశీల ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కరాన్కోట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
గ్రామాలకు కార్యదర్శులే పట్టుకొమ్మలు
అబ్దుల్లాపూర్‌మెట్: పంచాయతీ కార్యదర్శుఽలే గ్రామాలకు పట్టు కొమ్మలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలోని వీఆర్సీ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు ఆత్మీయ సమ్మేళనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెరెడ్డి, ఎమ్మెల్సీలు మహేఽశ్గౌడ్, కోదండరాంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కార్యదర్శులు లేని వ్యవస్థను ఊహించలేమన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేర్చడంలో వీరి పాత్ర కీలకమన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. పంచాయతీ అధికారులు, సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈక్రమంలో మానసిక ఒత్తిడికి గురై సుమారు 50 మంది పంచాయతీ కార్యదర్శులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టంచేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో ఇలాంటి సమస్యలన్నీ దూరమై పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆనందంగా ఉన్నారన్నారు. ఇంకా కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన అమరవీరుల ఆత్మకుశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించి, అంజలి ఘటించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన పీర్ల వెంకన్న భార్యకు రూ.3 లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్, సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎం.సందీప్, కోశాధికారి ఎం.శశింద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్,సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పంచాయతీ సిబ్బంది సమస్యలపరిష్కారానికి హామీ -
మహిళల అభ్యున్నతికి కృషి
పరిగి: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళల రాజ్యం నడుస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారి పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో విరివిగా ఉపాధి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఆ దిశగా ఆలోచన చేసి వృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోసెప్, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీల చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో అమరులైన వీర సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్‌కు నివాళులర్పించారు. ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మైపాల్ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్‌లో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ కొడంగల్: పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శనివారం ఆర్అండ్బీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మార్కింగ్ ఇచ్చారు. ఈ పనులకు రూ.45 కోట్లు మంజూరైనట్లు అధికారులు చెప్పారు. 4 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నాలుగు లేన్లుగా విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేయనున్నారు. వినాయక చౌరస్తాను విస్తరించనున్నారు. పట్టణంలోని తాండూరు మహబూబ్‌నగర్ జాతీయ రోడ్డును విస్తరించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయనున్నారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, దుకాణాదారులు సహకరించాలని అధికారులు కోరారు. భాస్కరయోగికి పాత్రికేయ విశిష్ట పురస్కారం పరిగి: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి రచయిత డాక్టర్ భాస్కరయోగికి సమాచార భారతి.. నారద జయంతి సందర్భంగా కాలమిస్టుగా పాత్రికేయ విశిష్ట పురస్కారం అందజేసింది. నగరంలోకి కోఠిలో వైఎంఐఎస్లో పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారులు చామర్తి ఉమామహేశ్వరరావు, సాయి ప్రసాద్, సమాచార భారతి అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి యాలాల: వాహనాలకు నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యాలాల ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలకు నంబర్ ప్లేట్లు, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్‌పై అవగాహన కల్పించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్‌కు లోబడి వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో పీఎస్ఐ వినోద్ పాల్గొన్నారు. వీర సైనికులకు ఘన నివాళి అనంతగిరి: పాక్ దాడుల్లో మృతి చెందిన వీర సైనికులకు శనివారం వికారాబాద్‌లోని కొత్తగంజ్ హనుమాన్ మందిరం వద్ద కాలనీవాసులు ఘనంగా నివాళులర్పించారు. ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని..
ఇబ్రహీంపట్నం: ఓ బీటెక్ విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురునానక్ కాలేజీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెళ్లికి చెందిన అలూరి భావన(22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ ఇదే హాస్టల్లో ఉంటోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యార్థినులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన ఒక్కతే ఉంది. ఏమైందో తెలియదు కానీ శనివారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కొద్ది సేపటికి ఇది గమనించిన మిగిలిన విద్యార్థులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భావన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలానికి తరలించే అవకాశం ఉందని తెలిసింది. కాలేజీ వద్ద ఉద్రిక్తత విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు గేట్లు దూకి లోనికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏసీపీ రాజు, సీఐ జగదీశ్‌లు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలకు అడ్డాగా.. గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఇబ్రహీంపట్నంలోని గురునానక్ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన విద్యార్థి సంఘాల ఆందోళన మృతురాలిది ఖమ్మం జిల్లా