
కర్ణాటక ధాన్యాన్ని కట్టడి చేయండి
తాండూరు రూరల్: తెలంగాణ – కర్ణాటక సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో నిఘాను పెంచాలని ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం మండలంలోని కొత్లాపూర్ సరిహద్దులోని చెక్‌పోస్టును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతున్నందున కర్ణాటక నుంచి వడ్లు వచ్చే అవకాశం ఉందని పటిష్ట నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక ధాన్యం జిల్లాలోకి రావొద్దన్నారు. మత్తు పదార్థాలు తరలించే వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నాగేశ్, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కేసుల వివరాల గురించి ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ సూచించారు.
సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాలి
ఎస్పీ నారాయణరెడ్డి