
నిండుకుండలా కాగ్నా చెక్‌డ్యామ్
తాండూరు: వేసవి కాలం వచ్చిందంటే చాలు తాండూరు ప్రాంతంలో ఉన్న కాగ్నానది చుక్క నీరు లేకుండా ఇంకి పోతుంది. కానీ దశాబ్దకాలంగా నదిలో వరద నీరు పుష్కలంగా తొణికిసలాడుతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను తాకుతూ ప్రవహిస్తున్న ఈ నది వేల ఎకరాలకు సాగు నీరును అందిస్తుంది. దీనిపై ఎక్కువగా చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. తాండూరు శివారులోని కాగ్నా నదిపై ఉన్న చెక్‌డ్యామ్ నిండు కుండలా తలపిస్తోంది. మరోవైపు బెన్నూర్, వీర్‌శెట్టిపల్లి, జీవన్గి చెక్‌డ్యామ్‌లలో జలసిరి ఉట్టి పడుతుంది. ఈ సీజన్‌లో సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని స్థానికులు భావిస్తున్నారు.