
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్
పరిగి: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్ అన్నారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ కోసం మంగళవారం నస్కల్ గ్రామంలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. స్థల సేకరణ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళుతామని తెలిపారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. తద్వారా వారి కాళ్లపై వారు నిలబడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం రామ్మూర్తి, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ దివ్య, సీసీ రాంచంద్రయ్య పాల్గొన్నారు.